Dr. Somanchi (Tangirala) Visalakshi
VP (SANAATANA DHARMA), VSS
Dr. Somanchi (Tangirala) Visalakshi
B.A., M.A.(Philosophy), MA (Samskrutam), M.Phil & Ph D, Vis’aaradaa – D.B.H.P.S.M
W/o Sri.Somanchi RadhaKrishna,
Flat No 301, Block A, AMSRI RESIDENCY Apartments, 1-7-38, Sham Karam Road, Ameerpet., Hyderabad 500016, Telangana State, India
-
Vice President (Sanaatana Dharma), VSS,
Senior Faculty at VSS and teaching students of Certificate Courses on Sanaatana Dharma.
She has delivered more than 100 Webinars to the members of VSS.
Adviser for Sree Sreenivaasa KalyaaNam Trust,
Member for Akhila BraahmaNa Samkshema Samaakhya,
-
"Vis'istha MaatruMurthy", awarded by Raksha International Foundation.
Recently she was awarded and honoured with the Title - "Aadhyaatmika Sanaatana Dharma Parirakshana Jyoti", by Lalitakalaa Samaakhya and Rudraaksha Vaibhavam.
She is a Senior Faculty at Dept.of Samskrutam, O.U. – retired from Govt Degree college, as Professor in Samskrutam.
She is Adhyaatmikavetta, Vidyaavetta.
She is senior faculty teaching Samskrutam to the students appearing for various examinations conducted by Samskrita Bhaarati and also Sikshakaa, Kaarya karta, Samskruta Bhaarati.
Ex Chief Managing Trustee for One World University Foundation Trust, Hyderabad.
Detailed Profile of Dr. Somanchi (Tangirala) Visalakshi
డా. సోమంచి (తంగిరాల) విశాలాక్షి – ఆధ్యాత్మిక వేత్త, విద్యావేత్త, “వాట్సాప్ కథల అక్కయ్య”, “విశిష్ట మాతృమూర్తి”, “ఆధ్యాత్మిక సనాతనధర్మ పరిరక్షణ జ్యోతి” బిరుదాంకితురాలి పరిచయము —
సెల్ నంబర్ – 9963964033
ఫిలాసఫీ ఎమ్.ఏ., సంస్కృతం ఎమ్.ఏ., రాష్ట్రభాషా విశారద, దక్షిణ భారత హిందీ ప్రచారసభ.
ఎమ్.ఫిల్. “ఉపనిషత్తులలో తత్త్వమసి మహావాక్యము” –
పిహెచ్.డి – “ఉపనిషత్తులలో మహావాక్యముల సారము.”
“The Concept of Mahaavaakyaas in Upanishats.”
విశ్రాంత సంస్కృతాచార్య, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్
“వేద సంస్కృతి సమితి” అనే గౌరవప్రదమైన సంస్థలో “సనాతన ధర్మ విభాగము”నకు “ఉపాధ్యక్షురాలి”గా పని చేస్తున్నారు.
సనాతన ధర్మము సర్టిఫికెట్ కోర్సు అసోసియేట్ డైరెక్టర్, సీనియర్ సబ్ ఎడిటర్ మరియు బాస్ మెంబర్, వేదవాణీ త్రైమాసిక పత్రిక, వేద సంస్కృతి సమితి. ఆమె వ్యాసములను వ్రాసి ప్రతి సంచికకు సమర్పిస్తున్నారు.
వేద సంస్కృతి సమితి సముదాయంలో “సనాతన ధర్మము” మీద, వివిధ అంశముల మీద వందల ప్రసంగములను అందించారు.
వేద సంస్కృతి సమితి మరియు విశ్వ యోగ విద్యాపీఠము వారు సంయుక్తముగా నిర్వహిస్తున్న – నాలుగు నెలల సనాతన ధర్మము కోర్సులో “సనాతన ధర్మము గురించి, శ్రీమద్భగవద్గీత గురించి, షోడశ సంస్కారములను గురించి, ఉపనిషత్తులను గురించి తెలుగు , ఇంగ్లీష్, హిందీ మాధ్యమములలో బోధించారు, బోధిస్తున్నారు. ఇప్పటికి 15.బ్యాచ్ లు అయ్యాయి.
ఆ కోర్స్ అసోసియేట్ డైరెక్టర్ గా, ఫాకల్టీ మెంబర్ గా పని చేస్తున్నారు.
సంస్కృత భారతి వారికి ‘కార్యకర్త’గా 40 సంవత్సరాలుగా పని చేస్తున్నారు. గత ఆరు సంవత్సరములుగా వేద సంస్కృతి సమితి పక్షాన సంస్కృత భారతి వారు నిర్వహిస్తున్న – ప్రవేశ, పరిచయ, శిక్షా, కోవిద పరీక్షలకు వెళ్ళేవారికి ఆన్లైన్లో పాఠాలు బోధిస్తున్నారు.
ఫిలాసఫీ ఎమ్.ఏ.డిగ్రీ పొంది, సంస్కృతము ఎమ్.ఏ.విద్యార్థినిగా ఉన్నప్పుడే ఈవిడను *”బ్రహ్మవిద్యాలంకార” బ్రహ్మశ్రీ ముదిగొండ వెంకట్రామ శాస్త్రి గారు – “ఈ చిరంజీవి అస్మద్ విజ్ఞాన పుత్రిక” అని పరిచయం చేసి, ఈమెతో విజయవాడలోని త్రిలింగపీఠములో (ఇప్పటి శంకరమఠం) లో మూడు రోజులు – ఉపనిషత్తుల పరిచయము, కఠోపనిషత్తు, మాండూక్యోపనిషత్తుల మీద మాట్లాడించి, శాలువా, పూలు పళ్ళతో ఆశీర్వదించి, వృద్ధిచేశారు.
ఆంధ్ర మహిళా సభ కళాశాలలో, “గాంధీభవన్”లో అనేక పర్యాయములు అనేక సాహిత్య, వేదాంత పరమైన అంశాలపై ఈమె ప్రసంగించారు, గౌరవనీయులైన శ్రీ చింతామణి దేశ్ ముఖ్ గారు, శ్రీమతి దుర్గాబాయి దేశ్ ముఖ్ గార్ల అభినందనలను, ఆశీస్సులను పొందారు. వారి కరకమలముల మీదుగా ప్రశంసాపత్రమును పొందారు.
రక్ష ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వారు ‘విశిష్ట మాతృమూర్తి’ బిరుదుతో సత్కరించారు.
2.8.2026.న సికింద్రాబాద్ లోని హరిహర కళాభవన్ లో – *లలితకళా సమాఖ్య (సేవా సామాజిక సాంస్కృతిక సంస్థ) మరియు రుద్రాక్ష వైభవం ఆధ్యాత్మిక పీఠం వారు – నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ సువర్ణ కంకణ అవార్డు ప్రదానోత్సవాలలో డా.సోమంచి(తంగిరాల) విశాలాక్షి గారికి – “ఆధ్యాత్మిక సనాతనధర్మ పరిరక్షణ జ్యోతి” బిరుదునిచ్చి, స్వర్ణ కంకణముతో, మెడలుతో, దుశ్శాలువలతో, రెండున్నర అడుగుల మెమెంటోతో సత్కరించారు.
“ఆరాధన – భక్తి తరంగం” అనే ఒక వాట్శాప్ గ్రూప్ వారు ఈమెను సన్మానించి “వాట్శాప్ కథల ఆక్కయ్య” అనే బిరుదునిచ్చి గౌరవించారు.
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వారు నిర్వహించిన సెమినార్ లో ఈమెను “Guest of Honour” గా పిలిచి, సత్కరించారు.
డా.విశాలాక్షి గారు, శ్రీ యజ్ఞ నారాయణ మూర్తి గారు స్థాపించిన “One World University Foundation Trust” కు “Chief Managing Trustee, Functions గా ఏడు సంవత్సరాలు వివిధ సాంఘిక, సాంస్కృతిక, సాహిత్య సేవా కార్యక్రమాలను నిర్వహించారు.
శ్రీ బి.కృష్ణంరాజు గారు స్థాపించిన “శ్రీ శ్రీనివాస కల్యాణం ట్రష్టు” కు సలహాదారుగా పని చేస్తున్నారు.
అఖిల బ్రాహ్మణ సంఘ సేవా సమాఖ్యలో సభ్యురాలిగా పని చేస్తున్నారు.
సంస్కృత భాషా ప్రచార సమితి వారు నిర్వహిస్తున్న సంస్కృతం ఎమ్.ఏ.విద్యార్ధులకు, నెట్ విద్యార్థులకు ఆన్లైన్ లో పాఠాలు బోధిస్తున్నారు. ఆ సందర్భంలో గౌరవనీయులైన డి.జి.పి.శ్రీ కరణం అరవిందరావుగారు ఈమెను శాలువాతో సత్కరించారు.
కంచి జగద్గురువుల శిష్యగణమైన”శంకర సేవా సమితి” వారు ఈమెను ఆ సమితికే మాతృమూర్తిగా, ఈ దంపతులను సమితికి అమ్మనాన్నలుగా గౌరవిస్తారు, గౌరవిస్తున్నారు. డా.విశాలాక్షి గారు ఈ సముదాయంలో అనేకమైన ఆధ్యాత్మిక, ధార్మిక అంశాల మీద సముదాయంలో బోధించారు. “శ్రీ శివానందలహరి” శ్లోకార్థములను చెప్పినప్పుడు, ఇంకా ఇతర అనేక సందర్భాలలోను ఈమెను ఈ సంస్థ వారు సన్మానించారు, ఈ దంపతులను సత్కరించారు, జగన్మాతాపితరుల శేష వస్త్రములను అనుగ్రహించి బ్రాహ్మణాశీర్వచనములనిప్పించారు.
అఖిల బ్రాహ్మణ సేవా సంఘం వారి పక్షాన అనేకమార్లు ఈమె వేదికలపై ప్రసంగించారు. వారు ఈవిడను సత్కరించారు.
ఉపనిషత్తులను బోధించినందుకు బ్రాహ్మణ్యం సముదాయం వారు ఈమెను సత్కరించారు.
శ్రీవేదభారతీ వారు మోతీనగర్ శంకరమఠంలో శ్రీమహాభారత శతాబ్ది ఉత్సవాలను నిర్వహించినప్పుడు డా.విశాలాక్షిగారు “సభాపర్వము” గురించి ఉపన్యసించారు. వీరిని డా.రేమెళ్ళ అవధానులు గారు సత్కరించారు.
కళాశాలలో అధ్యాపకురాలిగా పని చేస్తున్నప్పటి నుంచి అనేక డిష్ట్రిక్ట్ లెవెల్, ష్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్ మరియు ఇంటర్నేషనల్ లెవెల్ సెమినార్ లలో అనేక పేపర్లు సమర్పించారు, ఇప్పటికీ సమర్పిస్తున్నారు.
విద్యార్ధినిగా ఉన్నప్పుడు, అధ్యాపకురాలిగా పనిచేస్తున్నప్పుడు కూడా విద్యారంగంలో వ్యాసరచన పోటీలలో, ఉపన్యాసముల పోటీలలో అనేక బహుమతులు, రోలింగ్ కప్, కాష్ అవార్డ్స్ పొందారు.
ఉస్మానియా యూనివర్సిటీ సంస్కృత ఆచార్య బృందం వారు – డా.బి.ఆర్.శాస్త్రి గారు , డా.పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, డా.ప్రమోద్ గణేశ్ లాలేగారు స్థాపించిన “సురభారతీ సమితి” ప్రారంభించినప్పుడు అక్కడ ఎమ్.ఏ.చదువుతూ ఉండి మొట్టమొదటిసారిగా సురభారతీసమితిలో విద్యార్థినిగా మాట్లాడి, పేపర్ సబ్మిట్ చేసి, తమ ప్రొఫెసర్ లతో, ఆ సభలో – “She is an asset to our Department,” “She is an ornament of our Department”, అనే ప్రశంసలను అభినందనలను పొందిన డా.విశాలాక్షి గారు, సురభారతీ సమితి సెక్రెటరీ ప్రొఫెసర్ రాములు గారి ఆహ్వానము వలన అనేక పర్యాయములు అక్కడికి ముఖ్య అతిథిగా వెళ్ళారు, పుస్తకావిష్కరణలు చేశారు, ముఖ్య వక్తగా వెళ్ళి ప్రసంగించారు.
జన్మభూమి కార్యక్రమంలో పాల్గొని, రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలో కాంస్య పతకము, రజత పతకము పొందారు. నేషనల్ ఒలింపియాడ్ కి విద్యార్ధులను తీసుకుని వెళ్ళి, అప్పటి సి.ఎమ్.శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రశంసా పత్రము పొందారు.
ఆర్యసమాజ్ వారు నిర్వహించిన – “పంచమహాయజ్ఞముల ద్వారా సామాజిక శాంతి” – అనే అంశము మీద జరిగిన అంతర్జాతీయ వ్యాసరచనాపోటీలో ద్వితీయ బహుమతిని, కాష్ అవార్డును గెలుచుకున్నారు.
తన విద్యార్ధినీ విద్యార్ధుల నుంచి ఎనలేని గౌరవాన్ని, అభిమానాన్ని పొందారు, పొందుతున్నారు. ఈవిడ ఏ కళాశాలలో పని చేసినా, ఆమె సబ్జెక్ట్ లో – సంస్కృతములో – విద్యార్ధులు ఎప్పుడూ నూటికి నూరు శాతం పాసయ్యేవారు. నూటికి తొంభైఎనిమిది, తొంభైతొమ్మిది మార్కులు చాలా మంది విద్యార్థులకు వచ్చేవి. ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహిస్తూ అనేక కాంపిటేషన్స్ కి తయారుచేసి ఈవిడ పంపితే, వాళ్ళు ప్రైజెస్ తెచ్చుకునేవారు. సంగీతంలో ఆసక్తి కలిగిన, బాగా పాడగలిగే విద్యార్ధులను సంబంధిత రేడియో అధికారులకు పరిచయం చేశారు, రేడియోలో పాటలు పాడే అవకాశం కలిగించారు.
బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మగారు చేసిన సహస్రావధానంలో, ద్విసహస్రావధానంలోను, బ్రహ్మశ్రీ దోర్బల ప్రభాకర శాస్త్రిగారు సంస్కృతంలో చేసిన అష్టావధానంలోను పృచ్ఛకురాలిగా డా.విశాలాక్షి గారు వ్యవహరించారు.
1972 నుంచి 2006 వరకు రేడియోలో “వివిధ భారతి” లోను, హైదరాబాద్ ఏ లో “స్త్రీల కార్యక్రమం” లోను చాలా సంవత్సరాలు వివిధ సాహిత్యాంశముల మీద, ఆధ్యాత్మికాంశముల మీద ప్రసంగించారు.
మద్యపాన నిషేధం, కుటుంబ నియంత్రణ, వితంతు పునర్వివాహం లాంటి సాంఘిక అంశాల మీద నాటకాలు, కథానికలు, కవితలు వ్రాశారు. రేడియో కళాకారులు వాటిని వినిపించేవారు, ప్రదర్శించేవారు. కళాశాల విద్యార్ధినీ విద్యార్ధులతోను, మహిళా మండలి ద్వారాను ఆల్.ఇండియా రేడియోలో, హైదరాబాద్ ఏ లో కదంబ కార్యక్రమాలు నిర్వహించారు. తరువాత చాలా సంవత్సరాల గాప్ తరువాత మళ్ళీ 2016 నుంచి రెగ్యులర్ గా ఆల్ ఇండాయా రేడియోలో హైదరాబాద్ ఏ లో స్రవంతి కార్యక్రమంలోను, స్త్రీల కార్యక్రమంలోను వివిధ అంశముల మీద, ప్రసంగించారు.
సర్వీస్ లో ఉన్నప్పుడు, రిటైరయ్యాక కూడా చాలా సార్లు టి.వి.లలో – సిటీకేబుల్, భారత్ టి.వి., సివిఆర్.స్పిరిట్యువల్ ఓం. టి.వి.లలో లైవ్ టెలికాష్ట్ లో రెగ్యులర్ గా మాట్లాడారు.
ఇ.టి.వి.లో, సుమన్ టి.వి.లలో ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నారు.
సి.వి.ఆర్. స్పిరిట్యువల్ ఓం టి.వి.లో అనేక అంశాల మీద ప్రసంగించారు. “ధర్మసందేహాలు” , “ధర్మపథం” లైవ్ టెలికాష్ట్ కార్యక్రమాలలో కొన్ని నెలలు పృచ్ఛకుల సందేహాలకు సమాధానాలు చెప్పారు. ఆధ్యాత్మిక కథలు చెప్పారు. “వినాయక నిమజ్జనం” రోజున వ్యాఖ్యానించారు.
చాలా సార్లు బహిరంగ సభలలో ఆధ్యాత్మిక అంశాల మీద ప్రసంగించారు. ఒకసారి వైకుంఠ ఏకాదశి రోజున ఈమె జగద్గురువులు పుష్పగిరి పీఠాధిపతుల సమక్షంలో ప్రసంగించి, స్వామి వారి అభినందన ఆశీస్సులు పొందారు.
2015 సెప్టెంబర్ నుంచి – *”ఆరాధనా – భక్తి తరంగం”, “బ్రాహ్మణ్యం”, “శ్రీ శంకర సేవా సమితి”, “రసజ్ఞ భారతి”, “తత్త్వమయి”, “మన సంస్కృతి”, “శ్రీ శంకర సేవా సమితి” మొదలగు అనేక వాట్శాప్ గ్రూప్స్ (25) లలో అనేకమైన ధార్మిక అంశాల మీద వాయిస్ మెసేజెస్ లలో ప్రసంగించారు. వాయిస్ మెసేజెస్ లలో సంస్కృత పాఠాలు చెప్పారు, సంస్కృత శ్లోకాలు, భావాలు, శతక పద్యాలు, రఘువంశం, కుమార సంభవం వంటి మహాకావ్యాలను, ఉత్తర రామ చరిత్ర, మృచ్ఛకటికము వంటి నాటకాదులను, బాణభట్టు కాదంబరి వంటి వాటిని చెప్పారు. శ్రీమద్రామాయణము, భాగవతములలోని కొన్ని అంశాల అంతరార్ధాలను వివరిస్తూ ప్రసంగించారు. శ్రీమద్భాగవతములో నుంచి గజేంద్ర మోక్షణము, క్షీరసాగర మథనము, వామనావతార చరిత్ర వంటి కొన్ని ఘట్టాలు అంతరార్థాల వివరణతోను, ఈశావాస్యోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, మాండూక్యోపనిషత్తు, శ్రీ సూర్యోపనిషత్తు వంటి కొన్ని ఉపనిషత్తులను ప్రవచనములలా చెప్పారు. సాంబసదాశివుని అనుగ్రహంతో జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యులవారు రచించిన శివానందలహరి శ్లోకముల భావార్ధాలను వివరించారు. సంస్కృత గేయాలు, వాటి భావాలు, సంప్రదాయ గీతాలు, దసరా పాటలు సమర్పించారు. “రోజుకో సమర్పణ” పేరుతో వందల చాటువులను, పద్యాలను, కథలను చెప్పారు. పంచతంత్రం, హితోపదేశం, అక్బర్ బీర్బల్ కథలు, పరమానందయ్య శిష్యుల కథలు, కాశీమజిలీ కథలు, నమ్మలేని నిజాల కథల వంటివి, పౌరాణిక కథలు, సాంఘిక కథలు, ఇంచుమించుగా రెండు వేల పైన కథలు చెప్పారు. “వాట్సాప్ కథల అక్కయ్య” అనే బిరుదు పొందారు. “గణపతి తత్త్వము” ను గురించి, “అమ్మ ఎవరు?” “శ్రీ రుద్రుడెవరు?”, “రుద్ర నమకచమకాలు”, “దేవీ మాహాత్మ్యము”, “శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత అంతరార్థము”, మొదలగు అనేక శీర్షికలతో దేవీ దేవతల గురించి అనేక మార్లు ప్రసంగించారు.
అనేక పండుగలను, వాటిని పాటించటం వెనుక ఉన్న అనేక అంశాలను, ఆంతర్యాలను గురించి వివరించారు.
“చండీసప్తశతీ సార వివరణ”, “శ్రీ గరుడమహాపురాణము” లను బోధించారు.
శ్రీమన్నారాయణీయం, శ్రీకృష్ణకర్ణామృతం, శ్రీకృష్ణ శతకం లోని కొన్ని శ్లోకాల భావాలు చెప్పారు.
“ప్రకృతి నియమాలను ఉల్లంఘిస్తే ఏమౌతుంది!!”, కరోనాను నివారించటమెలా ! వంటి అనేక అంశాలను గురించి వివరించారు.
2015 సెప్టెంబర్ నెల నుంచి మూడు సంవత్సరములు ఋషిపీఠం మాసపత్రికకు – “మహావాక్యముల సారము” ను – ధారావాహికగా సమర్పించారు.
శ్రుతిదర్శిని మాసపత్రికకు ఏడాది పాటు ప్రతి నెల ఒక వ్యాసము, ఒక కథ చొప్పున వ్రాసి ఇచ్చారు. వారు వాటిని ప్రచురించారు.
“కంచి కామకోటి వాణి” మాసపత్రికకు “బ్రాహ్మణ విజయము”, “హైందవ ధర్మము”, “శ్రీవాణి” , “ఓమ్ మాగజైన్” , “స్వర్ణపుష్పము” వంటి పత్రికలలో, ” “సాక్షి దినపత్రిక”లో కొన్ని వ్యాసములు ప్రచురితమయ్యాయి, అవుతున్నాయి.
ప్రస్తుతం “ఋషిపీఠం” మాసపత్రికలో, “శ్రీ కంచి కామకోటి వాణి” మాసపత్రికలోను, “బ్రాహ్మణ విజయం” మాసపత్రికలో, “శ్రీవాణీ”మాసపత్రికలో, వేద సంస్కృతి సమితి వారు నిర్వహిస్తున్న “వేదవాణీ” ఇ జర్నల్ లోను, రెగ్యులర్ గా వ్యాసములు వ్రాస్తున్నారు.
“వాఙ్మయి ఛానల్”, “తెలుగు రథం” వాట్సాప్ యూట్యూబ్ సముదాయము, ” సౌగంధినీ యుట్యూబ్ ఛానల్”, “సంస్మృత అకాడమీ” వంటి, ఇతర వాట్సాప్ సముదాయములలో, “ఏకదంత యుట్యూబ్ ఛానల్” లో అనేక మార్లు పాల్గొని, ప్రసంగించారు.
“ఏకదంత యుట్యూబ్ ఛానెల్ ప్రారంభోత్సవానికి ఈమెను “విశిష్ట అతిథిగా” ఆహ్వానించారు.
శ్రీ చైతన్య కళాశాల, శ్రీ శ్యామలా డిగ్రీ కళాశాల, లయోలా కళాశాల, సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాల వంటి చాలా కళాశాలల విద్యార్థులకు, శ్రీ మాడపాటి హనుమంతరావు కన్యా పాఠశాల మొదలైన పాఠశాలలలో సనాతన ధర్మము గురించి, భగవద్గీత గురించి బోధిస్తూ ప్రసంగించారు. ఆయా కళాశాలల, పాఠశాలల వారు ఆమెను సత్కరించారు.
ఈమె ఇంకా చాలా చోట్ల ప్రసంగించారు. చిలుకూరు బాలాజీ ఆలయానికి సమీపంలో ఉన్న ఒక ఆలయంలో కళాశాల విద్యార్థులకు సనాతన ధర్మము గురించి బోధిస్తూ మాట్లాడారు.
సెయింట్ జోసెఫ్స్ డిగ్రీ మరియు పి.జి కళాశాలలో ఐ.కే.ఎస్.గురించి, సాహిత్యం గురించి, డా.సి.నారాయణ రెడ్డి గారి శతజయంత్యుత్సవ సందర్భంగా డా.సి.నారాయణ రెడ్డి గారి గురించి మాట్లాడినందుకు వారు సత్కరించారు.
అలకాపురిలోనున్న శ్రీ జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో వేద సభలు జరుగున్న సమయంలో ఈమె వ్రాసిన “సనాతన ధర్మము” గురించిన చిన్న పుస్తకమును 11.2.2023న పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ బ్రహ్మానంద స్వామి వారు తమ కరకమలములతో ఆవిష్కరించారు. శ్రీ హంపీ స్వామివారు ఆశీర్వదించారు. డా.రేమెళ్ళ అవధానులు గారు ఆ పుస్తకం గురించి ప్రసంగించారు. శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయ నిర్వాహకులు ఈ దంపతులను అమ్మవారి నామాంకితమైన ఆలయ దుశ్శాలువలతో సత్కరించారు.
శ్రీ జనార్దనానంద్ సంస్మృతి ట్రష్ట్ వారు మంత్రపురిలో నిర్వహించిన 23వ తెలంగాణ వేద విద్వన్ మహాసభలలో, శ్రీ సీతారామ సేవాసదన్ మరియు మంథని బ్రాహ్మణ సేవా సంఘము వారు సంయుక్తంగా మంథనిలో నిర్వహించిన వేద సభలలో 2.11.2023 న ఈమె “సనాతన ధర్మములో స్త్రీ – వేదములలో, ఉపనిషత్తులలో ఋషికలు” అనే అంశంపై ప్రసంగించారు.
డా.సోమంచి (తంగిరాల) విశాలాక్షి గారు అధ్యయన భారతి శివపరివారంలో ప్రారంభంలో ఫాకల్టీ మెంబర్ గా ఉండి – *కొన్ని ఉపనిషత్తులను, మహావాక్యములను బోధించారు. (ఈశావాస్యోపనిషత్, కేనోపనిషత్, కఠోపనిషత్)
(నాలుగు మహావాక్యములు సంక్షిప్తంగా.)
వారు నిర్వహించిన వెల్నెస్ మీటింగ్స్ లో –
1.ప్రణవము
2.గజేంద్రమోక్షణము.
3.క్షీర సాగర మథనము.
4.వామనావతార చరిత్ర
5.శ్రీ శంకర భగవత్పాదుల మంత్రమాతృకా పుష్పమాలా స్తోత్రము.
6.అద్వైత పంచరత్నము – అద్వైత పంచకం – ఆత్మ షట్కం – అనే అంశములపై ప్రసంగించారు.
అనేక పర్యాయములు ఉపనిషత్తుల మంత్రములను సమీక్షించారు, శ్రీ ఆదిశంకర భగవత్పాదుల గురించి ప్రసంగించారు.
అధ్యయన భారతి – శివపరివారము వారు 2018 లో బెంగుళూరులో నిర్వహించిన జాతీయ సదస్సులో “సర్వం ఖల్విదం బ్రహ్మ” అన్న అంశము గురించి, అద్వైత అధ్యయన భారతి వారు బెంగుళూరులో – 1.2.24 నుంచి 6.2.24 వరకు నిర్వహించిన జాతీయ సదస్సులో “వైశ్వానరాత్మ విద్య- విరాడుపాసన” అనే అంశము గురించి, “ప్రజాపతి బోధించిన ఆత్మవిద్య” అనే అంశముల గురించి ప్రసంగించారు. ఒంగోలులో నిర్వహించిన జాతీయ సదస్సులో “శ్రీ శుకరహస్యోపనిషత్తు” గురించి ప్రసంగించారు. అక్కడ వారు ఈ దంపతులను ఘనంగా సత్కరించారు.
25, జనవరి 2026 న బెంగుళూరులో అంతర్జాతీయ సదస్సులో – డా.విశాలాక్షి గారు “ఛాందోగ్యోపనిషత్తులో భూమా విద్య” గురించి ప్రసంగించారు.
బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య, తెలంగాణా వారు 8.03.2024న ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా ఈమెకు సన్మానం చేశారు.
ఏకదంత యుట్యూబ్ ఛానల్ రిలీజ్ ఫంక్షన్ కి ఈమెను గౌరవ అతిథిగా ఆహ్వానించారు. వారి యుట్యూబ్ ఛానల్ లో ఈవిడ ప్రసంగిస్తున్నారు.
శ్రీ వంశీ టి.వి.లో ఆధ్యాత్మిక అంశాల గురించి, భక్తి తత్త్వం గురించి ప్రస్తావించారు.
సంస్కృత ఎకాడమీ వారు సంస్కృత దినోత్సవ సందర్భంగా డా.విశాలాక్షి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
హిట్ టి.వి.యుట్యూబ్ ఛానల్ లో ఆడపిల్లలకు సంబంధించిన అనేక అంశముల గురించి ఈవిడ అనేక మార్లు మాట్లాడారు. గణపతి తత్త్వం గురించి, శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవార్ల తత్త్వాల గురించి ప్రసంగించారు. అనేక ఇతర అంశాల గురించి ప్రస్తావిస్తున్నారు.
మహర్షి సాందీపనీ రాష్ట్రీయ వేదవిద్యా ప్రతిష్ఠాన్, ఉజ్జయిని వారి సౌజన్యంతో సంస్కృత ఎకాడమీ, ఉస్మానియా విశ్వవిద్యాలయము వారు నిర్వహించిన వేద విజ్ఞాన శత వ్యాఖ్యాన సుమ మాలికలో- తైత్తిరీయ ఉపనిషత్తులోని శిక్షా వల్లి గురించి, కఠోపనిషత్తులో యమనచికేత సంభాషణ రూపంలో బోధింపబడిన బ్రహ్మ జ్ఞానము గురించి, మరియు సనాతన ధర్మము, గురించి ప్రసంగించినందుకు 1.10.2024న సంస్కృత ఎకాడమీలో సమాపనోత్సవములో సత్కరించారు. తరువాత “బ్రహ్మాండ పురాణం” గురించి వివరించినందుకు సత్కరించారు.
ఉగాది కవి సమ్మేళనం సందర్భంగా హృదయ భారతి సంస్థ వారు 28.3.2025న సన్మానించారు.
ఇంకా అనేక వెబినార్ లలో ప్రసంగిస్తున్నారు.
కంచి జగద్గురువుల ఆదేశముతో రెండు సంవత్సరాల నుంచి “లఘున్యాసము” మహిళలకు సనాతన ధర్మము గురించి చెప్తున్నారు, ప్రవేశ మొదలైన పరీక్షలకు తయారుచేస్తూ సంస్కృత పాఠాలు బోధిస్తున్నారు. 30.5.25.న లఘున్యాసము శిష్యగణముతో వెళ్ళి తిరుపతిలో కంచి జగద్గురువులను దర్శించినప్పుడు, ఈవిడ సనాతన ధర్మమునకు, సంస్కృత భాషకు చేస్తున్న సేవకు సంతోషించి, జగద్గురువులు పూలదండను ఆమె భర్త మెడలో వేయించి, ఆమె భర్తతో ఆమెకు పెద్ద గులాబీ పూలమాల వేయించి, ఆమె ఒడిలో తమ స్వహస్తములతో కుంకుమ, పళ్ళు ప్రసాదములను అనుగ్రహించి ఆ దంపతులను ఆశీర్వదించారు.
“లఘున్యాసము” శిష్యబృందము ఈ దంపతులను, కొండాపూర్ లోని శ్రీకోదండరామస్వామి ఆలయములో ఎంతో భక్తి శ్రద్ధలతో సత్కరించి, మంగళహారతులిచ్చారు.
అచలపీఠము వారు హైదరాబాద్ మిట్టపల్లిలో రజతోత్సవ వేడుకల సందర్భంగా నిర్వహించిన వేదాంత విజ్ఞాన సభలలో ఈమెను గురువుగా 27.4.25 న సన్మానించారు. ఈమె అక్కడ “అష్టావక్రమహర్షి జనకమహారాజుకు చేసిన బ్రహ్మ జ్ఞానబోధ” గురించి ప్రసంగించారు. మరొక్కమారు 17.8.25.న “గురు ప్రాముఖ్యత – గురుశిష్య సంబంధము” గురించి ప్రసంగించినందుకు సత్కరించారు.
25.4.26. న జీడిమెట్లలోని అచలాశ్రమములో “మరణించాక జీవుడు ఏమౌతాడు ?” అనే అంశముపై ప్రసంగించారు. అచలాశ్రమ నిర్వాహకులు ఈమెను వారి పతిదేవులతో కలిపి సత్కరించారు.
19.8.26.న జీడిమెట్లలోని అచలాశ్రమములో – “ఉపనిషత్తులలో విద్యలు – భూమా విద్య” అనే అంశముపై ప్రసంగించారు. ఆశ్రమ నిర్వాహకులు ఈ దంపతులను సత్కరించారు.
శ్రీ సత్యశాయి సేవా ఆర్గనైజేషన్, గాంధీనగర్ వారు 7.9.25.న మహిళా దినోత్సవమును నిర్వహించి, ఈమెను ముఖ్య అతిథిగా, ముఖ్యవక్తగా ఆహ్వానించారు. అక్కడ మహిళల గురించి ప్రసంగించినందుకు సన్మానించారు.
చేయూత ఫౌండేషన్ వారు లాలాపేట గవర్నమెంట్ స్కూల్ లో 18.9.2025న నిర్వహించిన సభలో డా.విశాలాక్షి గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు.
“తెలంగాణ సారస్వత పరిషత్తులో” – “ఆర్షధర్మము – వేదవిజ్ఞానము – సంపుటి 1” పుస్తక పరిచయము సభలో, పుస్తక సంకలన కర్త, రచయిత, చేయూత ఫౌండేషన్ అధినేత, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి పరమ భక్తులు, “సనాతన ధర్మము కోర్సులోను, ప్రవేశ నుంచి కోవిద” వరకు సంస్కృత తరగతులను బోధించిన డా.సోమంచి(తంగిరాల) విశాలాక్షి గారి శిష్యులు డా.కేతరాజు కామేశ్వరరావు గారు సనాతన ధర్మము కోర్సు పాఠములను, సంస్కృతమును బోధించినందుకు డా.విశాలాక్షిగారిని సత్కరించారు.
సంస్కృత ఎకాడమీలో పురాణములలో భారతీయ జ్ఞాన పరంపర గురించి నిర్వహించిన సాప్తాహిక కార్యశాలా సమాపనోత్సవమునకు డా.విశాలాక్షి గారిని ఆత్మీయ అతిథిగా ఆహ్వానించారు. అక్కడ రిసోర్స్ పర్సన్ గా “భవిష్య పురాణం” గురించి మాట్లాడినందుకు సంస్కృత ఎకాడమీ వారు ఈమెను సత్కరించారు.
సంస్కృత అకాడమీ వారు ధర్మశాస్త్రముల మీద నిర్వహించిన సాప్తాహిక కార్యశాలలో 6.2.2026 న రిసోర్స్ పర్సన్ గా “ధర్మశాస్త్రములలో వ్రతధర్మములు” అనే అంశంపై ఈవిడ మాట్లాడారు.
భాజపా సమర్ధక్ మంచ్ తెలంగాణ రాష్ట్రము వారు, భాజపా సమర్ధక్ మంచ్ అధ్యక్షులు శ్రీ పురుషోత్తమ నారాయణ శ్రీవాస్తవ్ గారి నాయకత్వములో 14.6.2025న ఎస్.ఆర్.నగర్ లోని శ్రీనివాస కాలనీ కమ్యూనిటీ హాలులో నిర్వహించిన సభలో డా.సోమంచి(తంగిరాల) విశాలాక్షి గారు, “సనాతన ధర్మమును గురించి, మనం ఎలా మన సనాతన ధర్మమును రక్షించుకోవాలి” అనే అంశమును గురించి ముఖ్యవక్తగా ప్రసంగించారు.
ఆ సభకు ముఖ్య అతిథిగా బిజెపి ప్రెసిడెంట్ శ్రీ ఎల్.దీపక్ రెడ్డి గారు, విశిష్ట అతిథులుగా బిజెపి ఆర్గనైజింగ్ సెక్రెటరీ శ్రీ చంద్రశేఖర్ తివారి గారు, భాజపా సమర్ధక్ మంచ్ జాతీయ అధ్యక్షులు (నేషనల్ ప్రెసిడెంట్) శ్రీ పి.చిన్న సుబ్బారావు గారు ఏతెంచారు.
10.5.26. న ఆర్.ఎస్.ఎస్. వారు నిర్వహించిన “హిందూధర్మ సమ్మేళనము” లో డా.విశాలాక్షిగారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. “సనాతన ధర్మము – కుటుంబ వ్యవస్థ” అనే అంశంపై వక్తగా ఆవిడ ప్రసంగించారు.
బద్రుక కాలేజ్ ఆఫ్ కామర్స్ లో 31.8.26 న సంస్కృత భాషా దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా, వక్తగా ఆహ్వానించారు. సంస్కృతభాషా మహత్వమును, ప్రాముఖ్యతను గురించి ఆవిడ అక్కడ ఉపన్యసించారు.
1.11.26.న వేదశ్వాస సంస్థ వారు సనాతన ధర్మ వ్యాప్తికి చేస్తున్న కృషికి డా.సోమంచి(తంగిరాల) విశాలాక్షి గారిని సత్కరించారు.
డా.సోమంచి(తంగిరాల) విశాలాక్షి.
విశ్రాంత సంస్కృతాచార్య.
ఉపాధ్యక్షురాలు, వేద సంస్కృతి సమితి, సనాతన ధర్మము.
సనాతన ధర్మము సర్టిఫికెట్ కోర్సు అసోసియేట్ డైరెక్టర్, సీనియర్ సబ్ ఎడిటర్ మరియు బాస్ మెంబర్, వేదవాణీ త్రైమాసిక పత్రిక, వేద సంస్కృతి సమితి.
9963964033
