Categories
OM

Ayurvedam

वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ। निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा॥

సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి | విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా 

జ్ఞానానందమయం దెేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహె

सदाशिव समारम्भाम् शंकराचार्य मध्यमाम् अस्मद् आचार्य पर्यन्ताम् वंदे गुरु परम्पराम्

Ayurveda – for lay man Ayur or Ayush or life span in Vedas.

The term Āyurveda (Sanskritआयुर्वेद) is composed of two words, āyus, आयुस्, “life” or “longevity”, and veda, वेद, “knowledge”, translated as “knowledge of longevity or “knowledge of life and longevity”.  Yes, the knowledge of Ayurveda emanated from Vedas as Sruthi. Ayurveda is part of Adharvana Veda.  Ayurveda is assigned a place as a subsidiary Veda (upaveda).

Ayurveda is one of the few systems of medicine developed in ancient times that is still widely practiced in modern times

The main classical Ayurveda texts begin with accounts of the transmission of medical knowledge from the gods to sages, and then to human physicians. First Ayurveda Vidya , was received in the form of hymns  or slokas or sutras  by Dhanvantari (or Divodasa) from Brahma.

Dhanvantari is the physician of the devas in Hinduism. He is regarded to be an avatar of Vishnu. He is mentioned in the Puranas as the God of Ayurveda

DHANWANTARI GOD

Some of the  ancient works on Ayurvedic medicine are the Charaka Samhita, the Sushruta Samhita and the Bhela Samhita

80 percent of people in India use Ayurveda exclusively or combined with conventional Western medicine. A Ayurveda is part of  the Indian System of Medicine or AYUSH (Ayurveda, Yoga and naturopathy, Unani, Sidha, and Homeopathy) .

According to Ayurveda, the human body is composed of tissues (dhatus), waste (malas), and humoral biomaterials (doshas).[36] The seven dhatus are chyle (rasa), blood (rakta), muscles (māmsa), fat (meda), bone (asthi), marrow (majja), and semen (shukra). Like the medicine of classical antiquity, the classic treatises of Ayurveda divided bodily substances into five classical elements (panchamahabhutaviz. earthwaterfireair and ether(Akash). There are also twenty gunas (qualities or characteristics) which are considered to be inherent in all matter. These are organized in ten pairs: heavy/light, cold/hot, unctuous/dry, dull/sharp, stable/mobile, soft/hard, non-slimy/slimy, smooth/coarse, minute/gross, and viscous/liquid.[

The three postulated elemental bodily humors, the doshas or tridosha, are vata (air, which some modern authors equate with the nervous system), pitta (bile, fire, equated by some with enzymes), and kapha (phlegm, or earth and water, equated by some with mucus). Contemporary critics assert that doshas are not real, but are a fictional concept.[39] The humours (doshas) may also affect mental health. Each dosha has particular attributes and roles within the body and mind; the natural predominance of one or more doshas thus explains a person’s physical constitution (prakriti) and personality.  Each human  being possesses a unique combination of the doshas which define this person’s temperament and characteristics. As such,  each person need to  modulate their behavior or environment to increase or decrease the doshas and maintain their natural state.

Ayurveda has eight ways to diagnose illness, called Nadi (pulse), Mootra (urine), Mala (stool), Jihva (tongue), Shabda (speech), Sparsha (touch), Druk (vision), and Aakruti (appearance).[

The vast majority (90%) of Ayurvedic remedies are plant based. Plant-based treatments in Ayurveda may be derived from roots, leaves, fruits, bark, or seeds.

This post is designed to publish Ayurvedam remedies from the Ayurvedam experts.

Brief Prifle of Ayurveda Expert Dr. CA Kishore

Post your Questions in the comments box, Dr. CA Kishore will give you the answers

Ayurveda and Astrology by Sri PS Murthy

72 replies on “Ayurvedam”

Ayurvedic Dietetics – Need of an hour!
The era of modern medicine changed with the discovery of viruses and bacterias in late 19th century. And from that time, approach towards health and relative research was centered on organisms, which is termed as ‘reductive approach’. After late 1970s, as prevalence of Non communicable diseases (NCDs) including cancer went on increasing and this started changing the viewpoint of medical scientist, seeking for better understanding of human body and nature of diseases. This has lead us to what we call a ‘personalized medicine’ and holistic approach, highly emphasize by Ayurvedic medicine.
Change in the disease spectrum needs change in the ways we address the health issues. Lifestyle modifications play an instrumental role in this. And Ayurveda considers diet as an integral part of our lifestyle, both as a cause of health as well as disease. Ayurveda rules out all the aspects of diet holistically including, what-when-how-where etc, so that no stone remains unturned. Ayurveda provides comprehensive guidelines concerning one’s diet and nutrition. This will prove as a strategic edge while fighting the ever rising NCDs. Diet is said to be the ‘best medicine’ by ancient Ayurveda physicians which emphasizes how crucial it is for us to be aware of our dietary habits.

Vd. Neelesh Patil
MD (AYU), Ph.D (SCH)
Ayurvedic Physician & Consultant

“C:\Users\akell\Documents\VSS\Ayurveda\Ayurvedic Dietetics _ Need of an Hour!.pdf”
Vd. Neelesh Patil
MD (AYU), Ph.D (SCH)
Ayurvedic Physician & Consultant

Namaskaram
In 24 hours of a day, during what time periods the vatha pittha and kapha doshas prevail or more dominant. ? Kindly clarify 🙏🏻

అజీర్ణవ్యాధి నివారణా యోగాలు –

* వస, సైన్ధవ లవణములను నీటిలో కలిపి తాగి తరువాత ధనియాలు , శొంటి కషాయం తాగుచున్న అజీర్ణవ్యాధి నివారణ అగును.

* ఇంగువ, శొంటి, పిప్పళ్లు, మిరియాలు , సైన్ధవ లవణం వీటిని నీటితో నూరి పొట్ట మీద పట్టు వేయుచున్న అజీర్ణవ్యాధి నివారణ అగును.

* సైన్ధవ లవణం, కరక్కాయ పైపెచ్చుల చూర్ణం , పిప్పళ్లు, చిత్రమూలం వీటి పొడిని ఆహారం తీసుకున్న అర్ధగంట తరువాత ఉదయం , సాయంత్రం వేడినీటితో తీసుకొనుచున్న అజీర్ణవ్యాది నశించును.

* శొంటి, పిప్పళ్లు, మిరియాలు , వాము , సైన్ధవ లవణం , నల్లజీలకర్ర, జీలకర్ర, పొంగించిన ఇంగువ సమాన భాగాలుగా తీసుకుని చూర్ణం చేసి భోజనంలో మొదటి ముద్ద తో ఒక స్పూన్ చూర్ణం , కొంచం నెయ్యి వేసుకొని కలుపుకొని తినవలెను . 40 రొజుల పాటు ఉదయం , సాయంత్రం తీసుకున్నచో అజీర్ణరోగం మాయం అగును. ఇక్కడ పొంగించిన ఇంగువ అనగా ఇంగువని ఒక గుంట గంటె లో వేసి వేడిచేస్తే పొంగును.

* ద్రాక్షాను చక్కర , తేనెతో కలిపి గాని ఎండించిన కరక్కాయ చూర్ణంను చక్కెర , తేనెతో గాని కలిపి తీసుకొనుచున్న కడుపులో ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వలన వచ్చు పుల్లటి తేపులు , అజీర్ణదోషాలు నివారణ అగును.

* చిత్రమూలం, చవ్యము, శొంఠి , పిప్పళ్లు, వాము వీటితో తయారుచేయబడిన గంజిని తాగుచున్న అజీర్తిని , శరీరంలోని వాతాన్ని నివారిస్తుంది. పొట్టని శుద్ది చేస్తుంది.

అజీర్ణరోగమునకు ఔషదాలు తీసుకొనే ముందు ఉదరమును శుద్ది చేయు ఔషదాలను ముందుగా సేవించి ఉదరమును శుద్ది చేసుకుని అటు పిమ్మట అజీర్ణాన్ని పోగొట్టే ఔషధాలను మొదలుపెట్టవలెను.

ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .

గమనిక –

నేను రాసిన ” ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు ” మరియు ” ఆయుర్వేద మూలికా రహస్యాలు ” రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.

నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .

ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

కాళహస్తి వేంకటేశ్వరరావు

అనువంశిక ఆయుర్వేద వైద్యులు

9885030034
ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్

9885030034

మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

కాళహస్తి వేంకటేశ్వరరావు .

అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

9885030034

ప్రాచీన భారత దేశము నందలి రచించబడిన అరుదైన శిల్ప మరియు వాస్తు శాస్త్ర గ్రంధాలు –

ఇప్పుడు మీకు వివరించబోవు గ్రంధాల పేర్లు అత్యంత అరుదైనవి. ఇవి ఎక్కడన్నా మీకు దొరికితే వాటిని ఏ మాత్రం విడిచిపెట్టవద్దు. వీటిలో అత్యంత నిగూఢమైన ప్రాచీన భారతీయ విజ్ఞానం దాగి ఉంది. ఇవి మీకు సంస్కృత భాషలో లభ్యం అగును.

గ్రంథాల పేర్లు –

* ఆది సారము .

* విశాలాక్షము .

* తాపదృక్ .

* కాశ్యపము – కాశ్యపుడు.

* నామసంగిల్యము .

* ఆయతత్వము – విశ్వకర్మ.

* అంశుమాన బేధ కల్పము – కశ్యపుడు .

* గౌతమము – గౌతముడు.

* నారాయణశిల్పము – నారాయణుడు.

* ప్రబోధకము – ప్రభోధకుడు.

* భోజమతము – భోజుడు.

* మహాసారము .

* వాసిష్ఠ శిల్పం – వసిష్ఠుడు.

* సౌరము – సూర్యుడు .

* పరావ చిత్రకము .

* ఉలూక కల్పము .

* కేసరి రాజము .

* కుండ మండ పదర్పణము.

* గార్గేయయాగమము – గర్గుడు.

* గృహవాస్తు సారము – మండవ సూత్రధారుడు

* తారాలక్షణము – మండవ సూత్రధారుడు .

* దారు సంగ్రహము – మండవ సూత్రధారుడు .

* నిర్దోష వాస్తు – మండవ సూత్రధారుడు .

* ప్రాసాద మండవము – మండవ సూత్రధారుడు

* ప్రాసాద కల్పము – మండవ సూత్రధారుడు .

* విశ్వేశము .

* వాస్తుబోధము .

* విస్తారకము .

* కల్పశిల్పము .

* సృష్టి శిల్పము .

* మహాతంత్రము .

* చైత్రికము .

* బహుశ్రుతము .

* ఆత్రేయశిల్పము – అత్రి.

* అగస్త్య సంహిత – అగస్త్యుడు.

* కార్పార్యము – కృపుడు.

* ప్రాజాపత్య శిల్పము – ప్రజాపతి.

* నారదీయము – నారదుడు.

* భృగుమతము – భృగువు .

* మహావిశ్వకర్మీయము – విశ్వకర్మ.

* మార్కండేయము – మార్కండేయుడు .

* శౌనక శిల్పము – శౌనకుడు.

* ఆయాది లక్షణము .

* ఉద్విష్టానయనము .

* కేసరీవాస్తువు .

* కుండ మార్తాండము .

* గోపాసవము .

* నగ్నసిద్ధ కల్పము – నగ్నజితుడు.

* బ్రాహ్మ్మేయము – బ్రహ్మ.

* మనుతంత్రము – మనువు.

* మానవిజ్ఞానం .

* వాల్మీక శిల్పము – వాల్మీకి .

* సాధక శిల్పము .

* ఇంద్రవరుణి కల్పము .

* కలానిధి – గోవిందస్థపతి .

* నానావిధ కుండ ప్రకాశము – నకులశిల్పి.

* ప్రాసాద కర్తనము .

* ప్రాసాద కేసరి .

* విశ్వబోధము .

* గాంధర్వ విద్య .

* చిత్రశాలము .

* ఛాయాపురుష లక్షణము .

* దైవజ్ఞ శిల్పము – దైవజ్ఞాచార్యుడు .

* నిర్దోషముక్త వాస్తువు .

* ప్రమాణ మంజరి .

* మల్ల శిల్పము – భానురాజా శ్రితుడు .

* ప్రతిష్టాసారా సంగ్రహము .

* విశ్వసారము .

* విరంత .

* విశ్వశిల్పము .

* కపిల కాలయూపము – కపిల ఋషి .

* మనోబోధము .

* పాద్మీయ శిల్పము .

* ఔశానస శస్త్ర శిల్పము .

* ఈశాన శిల్పము – శుక్రాచార్యుడు.

* వజ్రశిల్పము .

* విశ్వకర్మీయము – విశ్వకర్మ.

* భానుమతము – భానువు .

* మానసారము – మనసార ఋషి .

* సాద్దికము .

* అపరాజిత పృచ్ఛా – భువనదేవాచార్యుడు .

* కశ్యప సంహిత ( యంత్ర శిల్పం ) – కశ్యపుడు .

* చిత్రబాహుళ్యము .

* ప్రబోధ శిల్పము .

* ప్రయోగ శిల్పము .

* భారద్వాజ శిల్పము – భరద్వాజుడు.

* మానుసారము – మనువు.

* యమశిల్పము – యముడు.

* విశ్వామిత్ర శిల్పము – విశ్వామిత్రుడు.

* సింధువు .

* జలార్గళము – వరాహమిహిరాచార్యుడు .

* కాష్ఠశాల .

* కాష్ఠ సంగ్రహము .

* కుండ ప్రదీపము.

* గద్య చింతామణి .

* చిత్ర లక్ష్మణ .

* జయమధ్వా మానము .

* ధాతుకల్పము .

* నంది ఘనము .

* నల తంత్రము – నలుడు.

* పద్మసంహిత .

* ప్రాసాద లక్ష్మణము .

* పాషాణ విచారము .

* విశ్వధర్మము .

* ఆరుటిక .

* పారాశర్య శిల్పము – పరాశరుడు.

* మయాశిల్పము – మయుడు.

* ఐంద్ర మతము – ఇంద్రుడు.

* సౌమము – సోముడు.

* నక్షత్ర కల్పము .

* ప్రయోగ మంజరి.

* ప్రాసాద దీపిక .

* ప్రాసాదాలంకార మాల.

* ప్రాసాద విచారము .

* ప్రాసాద నిర్ణయము .

* భువనదీపిక .

* మానవసూత్రము .

* మూర్తి ధ్యానము – మండవ సూత్రధారుడు .

* విశ్వకర్మ విద్య.

* విశ్వకర్మ ప్రకాశ

* విశ్వకర్మ శిల్పము .

* విశ్వకర్మ రహస్యము .

* విశ్వకర్మ సిద్ధాంతము .

* విశ్వకర్మ సంహిత .

* విశ్వకర్మ వాస్తు .

* విశ్వకర్మాగామము – విశ్వకర్మ .

* వాస్తు మంజరి.

* అనిరుద్ద శిల్పము – అనిరుద్ధుడు.

* కాలయూపము .

* కుమారశిల్పము – కుమారస్వామి.

* త్వష్ట్రు తంత్రము – త్వ ష ట .

* ప్రశుద్ధ శిల్పము .

* పాణి శిల్పము

* బృహస్పతీయము – బృహస్పతి.

* లానజ్ఞము .

* సాకము .

* వాసుదేవ శిల్పము – వాసుదేవుడు

* ఉద్ధార ధోరణి – గోవింద స్థపతి.

* కుండతత్వ ప్రదీపము .

* కపింజల సంహిత – కపింజలుడు.

* గ్రహ పీఠ మాల .

* చిత్రకర్మ శిల్పము .

* తత్వమాల.

* ధ్యానపద్ధతి.

* వాస్తు విచారము .

* వాస్తు సముచ్ఛయము.

* విహార కారిక.

* వాస్తు పద్ధతి.

* వాస్తు శాస్త్రము – భోజదేవుడు.

* వాస్తు తంత్రము.

* విమానాదిమానము .

* శిల్ప సంహిత – కశ్యపుడు.

* శిల్పజ్ఞానము .

* శిల్ప ప్రకాశము .

* శిల్ప సంగ్రహము .

* సనత్కుమార శిల్పము – సనత్కుమారుడు.

* సారస్వత శిల్పము .

* జ్ఞానరత్న కోశము .

* తంత్ర సముచ్చయము – నారయణుడు.

* పాంచరాత్రాగమము .

* బృహత్సంహిత – వరాహమిహిరుడు.

* మయజయము – మయుడు.

* మయ విద్య ప్రకాశము – మయుడు.

* మయాదీపిక – మయుడు.

* మయ సంగ్రహము – మయుడు.

* మాన సంగ్రహము .

* వాస్తు మండనము .

* వాస్తు సారము .

* వాస్తు మహత్యము .

* వాస్త్వాధికారము .

* వాస్తు కోశము .

* వాస్తు రత్నావళి.

* వాస్తు ప్రకాశము.

* విశ్వాసారోద్ధారము .

* కళాదీపిక – అగస్త్యుడు .

* శిల్పసాహిత్యము .

* శిల్ప రత్నాకరం .

* వర్ణ సంగ్రహము.

* శిల్పవతంసం – గోవిందానందుడు.

* శిల్పశాస్త్ర విఙ్ఞానం.

* శిల్పశాస్త్ర విధి – మయుడు .

* సార సంహిత .

* సిద్ధాంత శిరోమణి.

* సుప్రభేధ ప్రతిష్టా తంత్రము.

* కామినీ దీప్తము .

* రత్నవన సారము .

* పాద్మ తంత్ర ప్రక్రియ.

* మనశ్శిల్పము .

* మనుసార వాస్తువు .

* యంత్ర చింతామణి.

* రాజ వల్లభము .

* రుద్రయామళ వాస్తు తంత్రము.

* వాస్తు నిర్మాణము.

* వాస్తు శిరోమణి.

* వాస్తు వేధ్య .

* శత్రుఘ్నీయము .

* సాతక సారము .

* సమరాంగణము .

* జ్ఞానప్రకాశ దీపిక .

* భాస్కరీయము – భాస్కరాచార్యుడు.

* ప్రతిష్టా మంత్రము.

* కుండమండప సిద్ధి.

* మంజుశ్రీ సాధనము.

* యుక్తి కల్పతరువు.

* రూపమండకము .

* వాస్తు చక్రము – వీక్షాచార్యుడు

* వాస్తు శాస్త్రము.

* వాస్తు రాజము – రాజసింహ శిల్పి.

* వాస్తు కరణము .

* వాస్తు పురుషము.

* వాస్తు విధి.

* వాస్తు తిలకము.

* వాస్తు శాస్త్రము – విశ్వకర్మ.

* వ్యధ్యావాసము .

* విశ్వంభర వాస్తువు .

* శిల్పసర్వ సంగ్రహము.

* శిల్పార్ధ సారము .

* క్షీరార్ణవము.

* సూత్రధారము .

* సూత్ర సంతానము.

* హేమాద్రి ప్రతిష్టా తంత్రము – హేమాద్రి .

* రత్న పరీక్ష .

* మహా వజ్ర భైరవ తంత్రము.

* ప్రతిమాలక్షణము – నగ్నజిత్తు.

* మూలస్థంభ నిర్ణయము.

* మృత్సంగ్రహము .

* రూపవిధి.

* రాజగృహ నిర్మాణము.

* విశ్వకర్మావతారము.

* లగ్నశుద్ధి.

* వాస్తు లక్షణం.

* వాస్తు సంగ్రహము.

* వాపీ చక్రము .

* వాస్తు ప్రదీపము.

* వాస్తు విద్యావతి.

* వాస్తు భోధము .

* శిల్పసారము.

* విమానవిద్య.

* శిల్ప లేఖ .

* శిల్ప గ్రంధము .

* శిల్పదీపిక .

* శిల్పవిషయము .

* సకలాధికారము.

* సూర్యసిద్ధాంతం.

* గురుదేవ పద్దతి.

* హరి సంహిత .

* శిల్ప తంత్రము – కుమారి బట్టు .

* సుఖానంద వాస్తువు .

* కౌమార సంహిత .

* హనుమత్కల్పము .

* రూపావతారము.

* గోబిల గృహ్య సూత్రము .

* వాస్తు విధానము – నారదుడు .

* నారదశిల్పము .

* సమరాంగణ సూత్రధారము – భోజుడు .

పైన చెప్పినటువంటి వాస్తు శాస్త్ర మరియు శిల్పశాస్త్ర గ్రంథాల పేర్లు అత్యంత కష్టసాధ్యముగా సేకరించాను . దీనికి కారణం ఇది చదివినవారిలో కొంతమందైనా అంతరించిపోతున్న మన అపూర్వ గ్రంధాలను కొన్నింటినైనా సేకరించి భద్రపరుస్తారని చిన్న ఆశ. అదేవిధముగా ఆ గ్రంధాలలోని అద్భుతమైన విజ్ఞానాన్ని తరువాతి తరాలకు అందచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.

ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .

గమనిక –

నేను రాసిన ” ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు ” మరియు ” ఆయుర్వేద మూలికా రహస్యాలు ” రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.

నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .

ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

కాళహస్తి వేంకటేశ్వరరావు

అనువంశిక ఆయుర్వేద వైద్యులు

9885030034
ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్

9885030034

మెస్సేజిస్ , కామెంట్ల రూపంలో పెట్టవద్దు .

కాళహస్తి వేంకటేశ్వరరావు .

అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

9885030034

భోజనం చేయుటకు ఉపయోగపడే ఆకులు – వాటిలోని ఔషధ గుణాలు –

కొంతకాలం క్రితం ఒక గ్రామము నందలి బాలురు తీవ్రమైన అతిసార వ్యాధితో బాధపడుతున్నారు. వారికి ఎంత మంచి చికిత్స అందించినను వ్యాధి తీవ్రత తగ్గటం లేదు . వారిని పరిశీలించుటకు వచ్చిన శాస్త్రవేత్తలు వారు ఆహారం తీసికొనుటకు ఉపయోగించుచున్న అల్యూమినియం పాత్రలను ప్రయోగశాలకు పంపినప్పుడు వారి రోగానికి కారణం వారు భుజించు ఆహారం కాదు వారు ఆహారాన్ని వండటానికి ఉపయోగించుచున్న అల్యూమినియం పాత్రలే కారణం అని నిర్దారణకు వచ్చారు. ఈ అల్యూమినియం పాత్ర యందు వండబడిన ఆహారం విషపూరితం అగును. అది శరీరం పైన ఒక్కసారిగా తన ప్రభావాన్ని చూపించదు. కొంచం కొంచంగా మనిషి యొక్క ఆరోగ్యాన్ని దెబ్బ తీయును .

అల్యూమినియం పాత్ర యందు ఆహారాన్ని ఉడికించడం మూలాన ఆహారం నందలి ఆమ్లములు , అల్యూమినియం లోహము పైన ప్రభావం చూపి అనేక విషసంభంధ రోగాలకు ప్రధానకారణం అగును. ముఖ్యంగా చర్మ సంబంధ , నరాల సంబంధ సమస్యలు అధికంగా వచ్చును. శరీరం నందు కేన్సర్ కూడ వృద్ధిచెందును.

పైన చెప్పినటువంటి సమస్యలు రాకుండా ఉండుటకు ముందుగా మనం ఆహారాన్ని వండే వంట పాత్రలను మార్చవలెను. అదేవిధముగా మనం ఆహారాన్ని భుజించుటకు విస్తరాకులు వాడటం ఎంతో మంచిది . ఇప్పుడు మీకు ఎటువంటి ఆకులతో చేసిన విస్తరాకులలో తింటే ఎటువంటి ఫలితాలు వస్తాయో వివరిస్తాను.

* అరటి ఆకు –

ఇందు భుజించటం మిక్కిలి శ్రేష్టం. కఫవాతములను హరించును . బలమును , ఆరోగ్యమును పెంచును. శరీరకాంతిని , సంభోగ శక్తిని పెంచును. ఆకలిని , దంతకాంతిని కలిగించును. పైత్యశాంతిని కలుగచేయును . శ్లేష్మ సంబంధ దోషాలు పోవును . శరీరం నొప్పులు తగ్గించును . ఉదరము నందలి పుండ్లు అనగా పెప్టిక్ అల్సర్ ను నయం చేయును .

* మోదుగ విస్తరి –

ఇందులో భుజించుటచే గుల్మరోగం , మహోదరం , క్రిమిరోగం , రక్తసంబంధ రోగాలు , పిత్తరోగములు నశించును. బుద్దిని పెంచును.

* మర్రి ఆకు విస్తరి –

దీని యందు భుజించిన క్రిమి రోగ నివారణ , జఠరాగ్ని వృద్ది , కుష్ఠు వ్యాధి నివారణ అగును. నేత్రదోష నివారణ అగును. వీర్యవృద్ధి కలుగును.

* పనస –

దీని విస్తరి యందు భుజించిన అగ్నివృద్ధి , పిత్తహర గుణములు ఉండును.

* రావి –

ఇది పిత్తశ్లేష్మ నివారణ , అగ్నివృద్ది కలిగించును. వీర్యవృద్ధి కలుగచేయును . విద్యార్జనకు మనసు కలుగచేయును .

* వక్క వట్ట –

ఇది అగ్నివృద్ధిని కలుగచేయును . వాత,పిత్త రోగాలని హరించును .

పైన చెప్పిన ఆకులలో భోజనం చేయడం వలన ఆయా ఆకులలో ఉండు ఔషధ గుణాలు అన్నియు మన శరీరం నందు చేరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చును.

మరింత విలువైన సులభ ఔషధ చికిత్సల కొరకు నేను రచించిన గ్రంథాలు చదవగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు .

అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

9885030034

ఆయుర్వేదం నందు త్రివిధోపాయములు –

ఆయుర్వేదం నందు త్రివిధోపాయములు అనగా

* దర్శనము .
కాళహస్తి వేంకటేశ్వరరావు .

అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

9885030034

* స్పర్శ .

* ప్రశ్న .

పైన చెప్పిన మూడు విధాలుగా రోగిని పరీక్షించవలెను . వీటిని త్రివిధోపాయాలు అంటారు.
ఇప్పుడు మీకు వాటి గురించి వివరిస్తాను .

* దర్శనము –

నేత్రములతో రోగి యొక్క ఆకారము , నాలుక , కండ్లు , మలమూత్రాదులను పరీక్షించి రోగమును గుర్తించవలెను .

* స్పర్శ –

రోగి శరీరంను చేతితో తాకి నాడి , ఉష్ణత్వము , కడుపుబ్బరము మున్నగు వాటిని పరీక్షించి రోగము గురించి తెలుసుకొనవలెను .

* ప్రశ్న –

రోగిని ప్రశ్నించి నిద్ర , ఆకలి , బలము , తాపము , బరువు , శరీరము యొక్క మలమూత్ర ప్రవృత్తి మున్నగునవి తెలుసుకొనవలెను .

స్త్రీలైనచో పైన చెప్పిన ప్రశ్నలతో పాటు ఋతుప్రవృత్తి , రుతుశూల , కుసుమాది రోగముల గురించి ప్రశ్నించి తెలుసుకొనవలెను .

ఈ మూడు పరీక్షలు చేయనిచో వ్యాధి వైద్యుడను తప్పుదోవ పట్టించును. కావున మూడు పరీక్షలు సంపూర్ణముగా చేసి వ్యాధిని సరిగ్గా అంచనావేసి సరైన ఔషధం ఇవ్వవలెను .

సాలగ్రామము గురించి సంపూర్ణ వివరణ –

సాలగ్రామము ఒకవిధమైన శిలాజాతికి చెందినది. యావత్ ప్రపంచము నందు ఈ విధమైన శిలలు రెండు స్థలముల యందు తప్ప ఇంక ఎక్కడా దొరకవు. ఒకటి నేపాల్ నందు ఖాట్మండు నగరమునకు ఉత్తరమున గండకీ నది తీరమున ముక్తినాధమను పేర ప్రసిద్ధమై ఉన్నది సాలగ్రామక్షేత్రం. ఈ నది నుండి సాలగ్రామములు తీయుదురు. దీనిని నారాయణీనది అని అందురు. రెండోవది హిందూ దేశము నందలి నర్మదా నది యందు దొరుకును.

ముత్యము ఏ విధముగా ఒక పురుగు నుండి తయారగునో అదేవిధముగా ఈ సాలగ్రామం కూడా ఒక పురుగు నుండి తయారగును. 1000 సంవత్సరములు గడిచిన తరువాత ఇది గట్టిపడి శిల వలే తయారగును. ఈ విధముగా శిల వలె తయారైన తరువాత దీనికి చెకుముకి రాయి గుణములు వచ్చును. ఈ గుణము రావడానికి ముందు ఇది సున్నపు (calcium ) అంశమును కలిగి ఉండును.

సాలగ్రామము నిజమునకు రాయిగా మారిన సముద్రజీవి . ఇది ” జురాసిక్ టెతీన్ ” కాలమునకు చెందినది. సంస్కృత భాషలో సాలగ్రామం అను మాటకు “శిలగా మారిన శలభము” అని అర్థం కూడా ఉన్నది. రుద్రాక్ష ఎంత పెద్దది అయితే అంత మంచిది . సాలగ్రామము ఎంత చిన్నదైన అంత మంచిది . ఇట్లు అనేక సంవత్సరముల అనంతరం ఇది ఒక ఆకారమునకు వచ్చిన పిదప దీనికి ఔషధ గుణములు వచ్చును. దీనికి ఉదాహరణగా టెంకాయ గురించి చెప్తాను. టెంకాయ లేతకొబ్బరి నీరు నందు ఒక గుణం ఉండును. కాయ అయిన తరువాత మరియొక గుణం వచ్చును. ఇది ప్రకృతి నియమం. ఇదేవిధముగా సాలగ్రామమునకు కూడా అనేక వేల , లక్షల సంవత్సరాల తరువాత ఈ ఔషధోపయుక్త గుణములు వచ్చును.

ఈ గుణమును నీటితో అభిషేకించు సమయము నందు ఎలక్ట్రోమ్యాగ్నటిక్ ఆక్టివిటీ నీటియందు ప్రవేశించును. ఆ అభిషేకపు నీటిని మనము తీర్థపు నీటిగా స్వీకరిస్తాము. దీనితో సాలగ్రమము నందు గల ఔషధోపయుక్త గుణము కలిగిన నీటిని మనము స్వీకరించినట్లుగా అగును.

సాలగ్రామము పూజ చేయుటకు పెద్దపెద్ద మంత్రాలు పాటించవలసిన అవసరం లేదు . కేవలం ” ఓం నమో నారాయణాయ నమః ” అను మంత్రము పఠిస్తూ అభిషేకం చేయవచ్చు. శుభ్రముగా స్నానం ఆచరించిన పిదప రెండు చిన్న పాత్రలలో నీరు నింపి ఉంచుకొనవలెను. వాని యందు తులసీదళములను వేసి భక్తిశ్రద్ధలతో “ఓం నమో నారాయణాయ నమః” అంటూ మట్టిపాత్రలను ముట్టి జపించవలెను. తర్వాత శంఖంతో ఆ నీటిని తీసుకుని నారాయణ మంత్రంతో సాలగ్రామమును అభిషేకించవలెను . మొదటిపాత్రతో అభిషేక తీర్థమును పారబోయవలెను. రెండోవమారు రెండొవపాత్రలోని నీటితో అభిషేకమాచరించిన నిర్మల తీర్ధం అగును. దానిని శంఖముతో దేవునికి అర్పించి తాను స్వీకరించవలెను.

తర్వాత మరలా రెండుపాత్రల యందు నీరు నింపి ఒకదానిలో గంధం , పుష్పములు , తులసి మొదలగు వానిని వేయవలెను. మరియొక దానియందు తులసి మాత్రమే వేయవలెను . గంథం వేసిన నీటిని గంధోదకం అందురు. మరియొకటి శుద్ధోదకం. మొదట సంకల్పము ” భారతీరమణ ముఖ్యప్రాణాంతర్గత లక్ష్మీనారాయణ స్య పూజాఖ్యంకర్మ కరిష్యే” అని చెప్పి పూజను ప్రారంభించవలెను. ఘాంటానాదము గావించి శంఖము నందు నీరు నింపి పుష్పములు , తులసి ఉంచి 8 మార్లు ” ఓం నమో నారాయణాయ ” అని జపించి నీటిని ప్రతిమలకు , తనకు మొదలు అన్నింటికి ప్రోక్షణం చేసుకొనవలెను . దీనితో మనం పవిత్రులమగుదుము .

నల్లగా నిగనిగా మెరిసే ఈ అతినున్నటి రాళ్లకు చిన్నరంధ్రం ఉంటుంది. ఆ రంధ్రం నుంచి చూచినప్పుడు లొపల కొన్ని యంత్రాల వంటి గీతలు ఉంటాయి. ఆ రాళ్లను అడ్డంగా సమంగా రెండుచెక్కలుగా కోసి చూస్తే ఆయా దేవతలకు సంబంధించిన యంత్రాలు స్పష్టంగా కనిపిస్తాయని , కొంత బంగారం కూడా ఉంటుందని పెద్దలు చెప్తారు. లోపలనున్న యంత్రాలను బట్టి ఆయా సాలగ్రామాలను ఆయాదేవతలకు మూర్తులుగా భావించి ఆరాధిస్తారు. మిక్కిలి బరువుగాను , బలిష్టంగానూ ఉండే ఈ శిలలను పగలగొట్టకుండానే లోపలి యంత్రాలను గుర్తిస్తారు. ఈ సాలగ్రామాలకు అడుగున పైనా రాగిలోహాన్ని ఉంచితే గనుక అవి నిజమైన సాలగ్రామ శిలలు అయితే ప్రదిక్షణ క్రమంలో కదులుతాయి.

ధనుర్మాసం నందు సాలగ్రామ పుజ చేయుట వలన సర్వపాపాలు హరిస్తాయి.
కాళహస్తి వేంకటేశ్వరరావు .

అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

9885030034

పక్షవాతం హరించుటకు సులభ యోగం –

నీరుల్లి రసం 20ml , అల్లం రసం 20ml , తేనె 20ml కలిపి ఉదయాన్నే పరగడుపున , సాయంత్రం ఆహారానికి గంట ముందు లోపలికి తీసుకోవలెను .

పైపూతగా ఒక స్పూన్ నువ్వుల నూనె తో రెండు చిటికెల మిరియాల పొడి బాగుగా కలిపి గోరువెచ్చగా చేసి ఆ నూనెతో పై నుంచి క్రిందకి చచ్చుబడిన అవయవానికి బాగుగా మర్దన ( మసాజ్ ) చేయవలెను .

వాతాన్ని కలిగించే గడ్డ కూరలు , మాంస పదార్థాలు , పెరుగు , చల్లని నీరు , వంకాయ , గొంగూర , మినప పదార్దాలు , పాతపచ్చళ్లు తినకూడదు .

ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు .

అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

9885030034

చిన్న పిల్లల కాలేయ సమస్యల నివారణ కొరకు –

ఒక కప్పు నీటిలో పది తులసి దళాలు వేసి అరకప్పు మిగిలేలా మరిగించి వడపోసి గోరువెచ్చగా తాగిస్తూ ఉంటే లివర్ ఆరోగ్యం అయ్యి లివర్ సమస్యలు తొలగిపోతాయి.

గమనిక – అతివేడి పదార్థాలు , మాంసాహారం వాడకూడదు .
కాళహస్తి వేంకటేశ్వరరావు .

అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

9885030034

వాస్తు శాస్త్రము నందు భూపరీక్ష విధానం – సంపూర్ణ వివరణ .

గృహనిర్మాణం చేయవలసిన భూమిని మొదట బాగుగా పరీక్ష చేయవలెను . భూపరీక్ష చేయక గృహనిర్మాణం చేసినచో సర్వము నిష్ఫలమగును. భూమి అంతయు ఒకేవిధముగా లేదు . కొన్ని స్థలములు చవిటినేలలు గాను , కొన్ని ఊట భూములుగాను , కొన్ని రాతి భూములుగాను ఉండును. అందుకే గృహనిర్మాణం చేయవలసిన భూమి అందుకు తగిన లక్షణములు కలిగి ఉన్నదో లేదో పరీక్షించి తరువాత గృహనిర్మాణం చేయవలెను అని మహర్షులు తెలియచేసారు. అందుకే మొదట స్థలపరీక్ష అవసరం.

* స్థలపరీక్ష మొదట పద్దతి. –

గృహము కట్టదలచిన స్థలములో ఒక హస్త ప్రమాణం ( మూరెడు ) లోతున చిన్న గొయ్యిని తవ్వి ఆ గోతినిండా సూర్యాస్తమయం అయిన తరువాత నీరుపోసి తరువాత ఉదయం చూసినయెడల కొంచెమైనను నీరు ఆ గోతిలో ఉన్న ఆ భూమి ఆ గృహనిర్మాణానికి ప్రశస్తమైనది. నీరు నిలవక బురద మాత్రమే ఉన్న ఆ భూమి మధ్యమమైనది , నీరు పూర్తిగా ఇంకిపోయి మన్ను పొడిపొడిగా లేదా భూమి నెర్రెలు కొట్టిన ఆ భూమి గృహనిర్మాణానికి పనికిరాదు . ఇదే పద్దతి భూమి యందు భూగర్భజలాన్ని కనుగొనుటకు కూడ వాడవచ్చు.

* స్థలపరీక్ష రెండొవ పద్దతి. –

గృహనిర్మాణం చేయదలచిన భూమి మధ్యభాగమున హస్తము లోతున ఒక గొయ్యి తవ్వవలెను . ఆ తవ్విన మన్నుతోనే మరలా ఆ గొయ్యిని పూడ్చవలెను . అలా పూడ్చగా మన్ను మిగిలినచో ఆ భూమి గృహనిర్మాణమునకు ప్రశస్తమైనదిగా తెలియును. మన్ను తక్కువ అయినచో ఆ స్థలము గృహనిర్మాణమునకు అనువైనది కాదు అని తెలుసుకోవలెను . మన్ను సరిపోయిన మధ్యమము .

పైన తెలిపిన రెండు పద్ధతులు అందరు మహర్షులు అంగీకరించి ఉన్నారు.

అలా గొయ్యి తవ్వుచున్న సమయంలో వివిధరకములు అయిన పురుగులు , కప్పలు , కీటకములు , ఊక , ఎముకలు , భస్మము మొదలైనవి కనపడుట యజమానికి మంచిది కాదు. బొగ్గులు , కాలిపోయిన కర్రలు , గవ్వలు మొదలైనవి కనపడిన స్థలము నందు గృహనిర్మాణం చేసి అందు నివసించుచున్న రోగములచేత , దరిద్రముచేత భాధలు పడుదురు. శల్యము ( ఎముక ) భూమి యందు ఆరు అడుగులకు పైగా లోతులో ఉన్నచో ఎటువంటి కీడూలేదని పురాతన వాస్తుశాస్త్ర గ్రంధాలలో ఉన్నది.

దర్భలతో కూడుకొని ఉన్న భూమి గృహనిర్మాణానికి శుభప్రదమైనది. రక్తవర్ణం గల భూమి రాజ్యసంపదలు , వాహనయోగం కలిగించును. కాశిగడ్డివలె పచ్చటి భూమి విశేష ధనయోగమైనది. సాధారణ గడ్డితో కూడి ఉండు నల్లటి భూమి గృహనిర్మాణానికి యోగ్యమైనది కాదు.

వాస్తుశాస్త్రం నందు భూపరీక్ష విధానం – సంపూర్ణ వివరణ – 2 .

అంతకు ముందు పోస్టులో భూపరీక్షా విధానం గురించి తెలియచేసాను . ఇప్పుడు ఎటువంటి ప్రదేశాలలో గృహనిర్మాణం చేయవలెనో , ఎటువంటి ప్రదేశాలలో గృహనిర్మాణం చేయకూడదో , భూములలో రకాల గురించి సంపూర్ణంగా వివరిస్తాను.

* మద్ది , రావి , తులసి , గరికె , విష్ణుక్రాంత , కొండగోగు , బూరుగ , సుగంధి , చిలుకలు , పావురములు , హంసలు మొదలైనవి కలిగి ఉండిన భూమి శైలభూమి అనబడును. ఈ భూమికి తూర్పు , ఉత్తరములలో నదీప్రవాహములు , చెరువులు , నూతులు , నీటితో ఉన్న గుంటలు ఉన్నచో శ్రేష్టము . అట్టి నీటివనరులు దక్షిణ పశ్చిమములలో ఉండరాదు. ఇట్టి భూమిలో ముండ్లతో ఉన్న చెడ్డ వృక్షములను తీసి గృహనిర్మాణం చేయుట ఐశ్వర్య ప్రదము.

* బీటలు బారిన భూమి మరణము కలుగచేయును. పాముపుట్టలు కలిగిన భూమి ధననాశనము కలుగచేయును. శల్యములు కలిగిన భూమి నిత్యము నష్టములను కలుగచేయును. విషమాకారముగా ఉన్న భూమి శత్రుభయము కలుగచేయును.

* పుర్రెలు , రాళ్లు , పురుగులు , పాముపుట్టలు , బొరియలు , గోతులు , ఎలుకలు , ఇసుక , పొట్టు , బొగ్గులు , వృక్షముల వేళ్ళు , బురద , పెంకు ముక్కలు , బూడిదతో ఉన్న భూములు , ముండ్లచెట్లు , కోట సమీప ప్రదేశములు , దుష్టమృగములు సంచరించు ప్రదేశములు , ఇనుము కరిగించి పనులు చేయు స్థలములు , నాలుగు వీధుల మధ్యస్థలము , వీధి శూలలు గల ప్రదేశములు గృహనిర్మాణానికి పనికిరావు. ధనక్షయం , కులక్షయం , నానావిధములు అయిన కష్టాలను కలుగచేయును .

* బొంతజెముడు , ఇరుగుడు మొదలైన చెట్లతో , చిన్న ఇసుకరాయి గల భూములు , ఎక్కడ తవ్వినను నీటిజలాలు లేని భూములు ఆగ్నేయ భూములు అనబడును. ఇవి దరిద్రము కలుగచేయును .

* నక్కలు , కంకరరాళ్ళు గల భూమి వాయువ్యభూమి అనబడును. ఇది గృహనిర్మాణానికి పనికిరాదు. దరిద్రము కలుగచేయును.

* వృక్షములు కల భూమి వారుణ భూమి అనబడును. ఇందు గృహనిర్మాణం చేసి నివసించువారలకు సకల సంపదలు కలిగి అభివృద్ది దాయకంగా ఉండును.

* ముండ్లు గల వృక్షములు , దొంగలు సంచరించు ప్రదేశములు , కారము , తీపివాసన గల భూములు , ఎక్కడ నిలబడిన తలనొప్పి వచ్చునో అట్టి భూములలో మానవులు గృహనిర్మాణం చేయరాదు . వాటిని రాక్షస భూములు అని పిలుస్తారు.

* బూరుగచెట్టు , పొగడ , తాండ్ర, సరుగుడు చెట్లు , గాడిదలు , ఒంటెలు , పందులు , చండాలురు , చౌడునేలలు , దుర్వాసన కల భూములు పిశాచ భూములు అనబడును. ఇవి గృహనిర్మాణమునకు యోగ్యములు కావు. సర్వనాశనం కలుగచేయును .

* చింత, బూరుగు , గానుగ , వెదురు , పత్తి , జిల్లేడు , దాసాని , ముళ్ళులేని వృక్షములు , హంసలు , సాధుజంతువులతో ఉన్న భూములు వైష్ణవభూములు అనబడును. ఇట్టి భూములకు ఉత్తరదిక్కున నదీప్రవాహములు , తటాకములు , నూతులు ఉండటం శ్రేష్టము .

* అరటి , పనస, మామిడి , పొన్న , పొగడ , నెల్లి , వావిలి , పొదరి , నల్లకలువ , మొదలగు వృక్షములు ఉండి సువాసన గల భూములు ధన , ధాన్య సమృద్ధిని కలుగచేయును.

* వావిలి , వసంత, గరిక , మోదుగ , తెల్లగన్నేరు , మల్లిక , ఉడుగ , ఇప్ప మొదలగు వృక్షములతో ఉండి బూడిద వాసన గల భూములయందు గృహనిర్మాణం చేసినచో అన్నవస్త్రములు , సుఖం , ఐశ్వర్యము కలుగును.

* ఉడుగ చెట్లు , పిల్లులు , ముంగీసలు , కుందేళ్లు , చక్రవాక పక్షులు , తోడేళ్ళు గల భూములు , శౌర్య , వీర్య , సకలసంపదలు కలుగచేయును .

వాస్తు శాస్త్రం అనేది మూఢనమ్మకం కాదు. మానవుడు తాను నిర్మించుకున్న గృహము నందు సుఖముగా , సంతోషముగా సరైన గాలి , వెలుతూరు వచ్చే విధముగా ఒక పద్దతి ప్రకారం ఎలా గృహనిర్మాణం చేయాలో మన పూర్వీకులు మనకు తెలియచేసిన గొప్పవరం ఈ వాస్తుశాస్త్రం.
కాళహస్తి వేంకటేశ్వరరావు .

అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

9885030034

🔰కరోన విస్తృతంగా విస్తరిస్తున్న సమయంలో నా [NV Reddy] స్వంత అనుభవం … చిన్న చిట్కా.
[ముఖ్య సమాచారం..]

నాకు గత 12 సంవత్సరాలుగా ప్రతి మూడు నెలలకు ఒకసారి జలుబు గొంతు నొప్పి దగ్గు లాంటివి రెగ్యులర్ గా వచ్చేవి. తిరగని హాస్పిటల్ లేదు చేయని టెస్ట్ లేదు వాడని మందులు లేవు.

ఫిబ్రవరి 2020 అప్పుడే కరోన మహమ్మారి దేశంలో వ్యాప్తి చెందుతుంది అనుకోకుండా నాకు తీవ్రమైన దగ్గు స్వల్పంగా జ్వరం దగ్గులో రక్తం పడటం లాంటి సమస్యలు, ముందు x-Rey అందులో ఏం తేలలేదు. ఆ తరువాత CT Scan చేసి, ఊపిరి తిత్తులలో ఫంగస్ మరియు ఇన్ఫెక్షన్ మందులు ఇచ్చారు, తగ్గలేదు. ఆ తరువాత హైదరాబాదు చెస్ట్ హాస్పిటల్ లో చూయించాను. TB టెస్ట్ తో సహా అన్ని టెస్ట్ లు చేసారు మెడిసిన్ ఇచ్చారు but no use. అప్పుడప్పుడే కరోన పేషెంట్స్ చేరుతున్నరు.

అనుకోకుండా నా కూతురుకీ తీవ్రమైన దగ్గు జ్వరం SR Nagar sowmya hospital లో వారం తరువాత కోలుకుంది. కాని నాకు మాత్రం దగ్గు తగ్గలేదు. దాదాపు ప్రాణాల మీద ఆశ వదులుకున్న అప్పుడు జరిగింది ఒక అద్బుతం. నా బాధ మొత్తం చాల రోజుల తరువాత ఫోనులో మాతాతగారితో చెప్పాను.

ఆయన, నాకు 10 సంవత్సరాల వయసులో one side తలనొప్పి (పార్శపు నొప్పి) వస్తే కేవలం మూడు తమలపాకులతో శాశ్వతంగా తగ్గించాడు. ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ లో ఖరీదైన వైద్యం అది. ఆయన నా సమస్యకు ఒక్క చిట్కా చెప్పాడు. విన్నప్పుడు హైదరాబాదులో ఇంగ్లీషు వైద్యానికి అలవాటు పడ్డ నాకు, ఆహ్ ఏం పనిచేస్తుందిలే అనిపించింది. కాని తప్పదు మరో మార్గం లేదు. ఆయన చెప్పిన వైద్యం మొదలు పెట్టాను.

అది ఏమిటంటే ఒక్క వెల్లుల్లి పాయ గడ్డను తీసుకుని మెత్తగా నూరి ఒక్క పల్చటి బట్టలో కట్టుకొని రాత్రి మొత్తం వాసన చూస్తు నోటి ద్వారా ఊపిరితిత్తుల నిండా పీల్చడం.

అదే‌ నా జీవితంలో జరిగిన అద్భుతం. మూడు రోజులలో ఊపిరితిత్తులలో ఉన్న ఇన్ఫెక్షన్ మొత్తం బయటకు వచ్చింది. ఇప్పటిదాకా మరల జలుబు, జ్వరం, దగ్గు లాంటివి రాలేదు. చాలామందికి చెప్పగా వాడిన ప్రతీ ఒక్కరికీ కచ్చితంగా అద్భుతంగా పనిచేసింది.

ఫ్రెండ్స్, కరోన మరల విజృంభించే సమయంలో కార్పొరేట్ హాస్పిటల్ దోపిడీకి గురికావద్దు. మన ఇంట్లో లేక బంధువులు, స్నేహితుల కుటుంబాలలో ఎవ్వరికైన జలుబు, దగ్గులాంటి లక్షణాలు వచ్చిన వెంటనే వెల్లుల్లి గడ్డ మెత్తగా నూరి ముక్కు ద్వారా, నోటి ద్వారా గట్టిగా పీల్చమని చెప్పండి. కరోన కూడా మనను ఏం చెయ్యదు. ఇది నా సొంత అనుభవం. వాడిన తరువాత నాకు thanks చెప్పడం, పదిమందితో మీ అనుభవం పంచుకోవడం మరువకండి.

మీ
మర్రి విష్ణువర్ధన్ రెడ్డి, LL B
9059119195.
Dr. Purushotham
9700675350.
N V Reddy :

ఒక్క నాటు వైద్యుడి సలహాతో నేను వెల్లుల్లి రెమ్మల వాసన చూడడం వల్ల కేవలం మూడు రోజులలో కరోన నుండి బయట పడ్డాను. దానికి సైంటిఫిక్ కారణాలు వెతికే ప్రయత్నంలో చాలా విషయాలు మరియు ఆనందయ్య మందుపై కొందరు మేధావులు అడిగిన చాలా ప్రశ్నలకు ‌సమాధానాలు దొరికాయి. వెల్లుల్లి వాసనచూడటం గురించి కొన్ని ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో ఉంది.

పచ్చి వెల్లుల్లిలో చాలా బలమైన యాంటీ బ్యాక్టీరియా యాంటీ వైరస్ మరియు యాంటీ పంగల్ గుణాలే కాకుండా రక్తం గడ్డ కట్టకుండా చేసే కాంపౌండ్స్ పుష్కలంగా ఉన్నాయి. పచ్చి వెల్లుల్లి తినడం ద్వారా కొన్ని యాసిడ్ ల వల్ల కడుపులో మంట లాంటి లక్షణాలు వస్తాయి. అలాగే వెల్లుల్లి జీర్ణం అయ్యి రక్తంలో కలిసే సరికి కొంత శక్తి తగ్గడం మరియు చాలా సమయం పడుతుంది. వండి తినడం వల్ల కూడా వెల్లుల్లి ఆయుర్వేద గుణాలను కోల్పోతుంది. ఆశ్చర్యం ఏమిటి అంటే 1968లో వచ్చిన influenza నుండి కాట్మాండ్ లాంటి కొన్ని ప్రాంతాలలో ఈ పచ్చి వెల్లుల్లి వాసన చూడడం వల్లనే బయటపడటం. పచ్చి వెల్లుల్లి వాడటం రెండు రకాలు :

1). ఐదు పచ్చి వెల్లుల్లి రెమ్మలను మెత్తగా దంచి పలుచని బట్టలో కట్టి రెండు మూడు గంటలు వాసన చూడడం వల్ల కరోన రాకుండా కాపాడుకోవడమే కాకుండా జలుబు దగ్గు గొంతునొప్పి లాంటి లక్షణాల నుండి మరియు కరోన నుండి కూడా కేవలం నాలుగు గంటల నుండి రెండు రోజులలో కచ్చితంగా కోలుకుంటారు.

2). ఏడు వెల్లుల్లి రెమ్మలు తీసుకుని ముక్కలు చేసి మీ అరికాల్లలో నాలుగు రెమ్మలు (షూ సాక్స్ సహాయంతో‌) ఉంచుకొని మరో రెండు రెమ్మల ముక్కలు రెండు సంకలలో పెట్టుకుని ఒక్క రెమ్మ నాలుక కింద పెట్టుకొని రెండు తోక మిరియాలు ఒక్కదాని వెనక ఒక్కటి నోట్లో వేసుకొని నమలడం (రెండు కలిపి అరగంట నమలాలి) ద్వారా కేవలం నాలుగు గంటల‌ నుండి రెండు రోజులలో కరోన నుండి ఎలాంటి మందులు లేకుండా 100% బయట పడవచ్చు. మానవ పాదాల అరికాళ్లలో రంద్రాల సాంద్రత ఎక్కువగా ‌ఉంటుంది. మీరు పాదాల అరికాళ్లలో వెల్లుల్లి ‌ముక్కలు ఉంచిన పది నిమిషాలలో మీ నోట్లో నుండి వెల్లుల్లి వాసన రావడం మీరే గమనించవచ్చు. కంట్లో మందు వేస్తే ఊపిరితిత్తులలో ఆక్సిజన్ ఎలా పెరుగుతుంది అనే మేధావులకు ఇదీ సమాధానం. సంవత్సరం పాప నుండి అందరూ వాడే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని గొప్ప ఔషధం కచ్చితంగా నాలుగు గంటల నుండి రెండు రోజుల్లో కరోన నుండి కోలుకుంటారు. మీకు ఇంకా ఆధారాలు కావాలి అంటే యీ ఆర్టికల్ చదవండి.

https://thehimalayantimes.com/opinion/opinion-raw-garlic-smell-therapy-for-covid-19
దయచేసి యీ అమూల్యమైన మెసేజ్ ను అందరికీ చేరేలా షేర్ చెయ్యండి. కరోన నుండి దేశాన్ని కాపాడుకుందాం.

సిరిధాన్యాలు గురించి సంపూర్ణ వివరణ – ఔషధ గుణాలు .

కొర్రలు యొక్క ఉపయోగాలు –

* కొర్రలు విరిగిపోయిన అంగములను అత్యంత వేగముగా అతుకొనునట్టు చేయును .

* శరీరానికి అమితమైన పుష్టిని ఇచ్చును.

* కొర్రలు నాలుగు రకాలుగా ఉండును. పసుపు, ఎరుపు, తెలుపు, ఎరుపు రంగుల్లో ఉండును. నలుపు , తెలుపు రంగులు శ్రేష్టమైనవి.

* శరీరం నందు వేడిని కలిగించును.

* జ్వరమును, కఫమును హరించును .

* జీర్ణశక్తిని పెంచును.

* రక్తమును వృద్దిచేయును.

* నడుముకు మంచి శక్తిని ఇచ్చును.

* అతిగా తినిన వాతమును పుట్టించును . దీనికి విరుగుళ్లు నెయ్యి, పంచదార.

* గర్భస్రావం అయిన స్త్రీకి కొర్రగంజి ఇచ్చిన మంచి మేలు చేయును . బలము కలిగించును.

* కొర్రబియ్యపు అన్నం గేదె పెరుగుతో తినుచున్న ఎప్పటి నుంచొ ఉండి మానని మొండి వ్రణాలు సైతం మానును .

* కొర్రబియ్యపు అన్నం తినటం వలన రక్తపైత్య రోగం మానును .

* కొర్రబియ్యముతో పరమాన్నం చేసుకుని తినుచున్న అజీర్ణశూలలు (నొప్పి ) మానును .

* కొర్ర బియ్యములో 11.2 % తేమ , 12.3 % మాంసకృత్తులు , 4.7% కొవ్వులు , 3.2% సేంద్రియ లవణాలు , 8% పిప్పి పదార్థం , 60.6 % పిండిపదార్ధం ఉండును. ఇందు మాంసకృత్తులు , సేంద్రియ లవణములు, పిప్పి పదార్ధములు , కొవ్వులు ఎక్కువుగా ఉన్నందువల్ల ఆహారవిలువ ఎక్కువుగా ఉన్నది. జిగురు పదార్దాలు అత్యల్పముగా ఉండును.

* కఫ సంబంధ వ్యాధులు , మధుమేహం కలవారు , ఆరోగ్యవంతులు ఈ ధాన్యముతో వండిన అన్నాన్ని తగినంత కూరలు మరియు మజ్జిగని కలుపుకుని తినవచ్చు.

* కడుపులో అల్సర్ , జిగట విరేచనాలు , రక్తప్రదరం , శుక్రనష్టం, శ్వేతకుసుమ, కుష్టు , క్షయ మొదలయిన ఉష్ణసంబంధ వ్యాధులతో బాధపడేవారు కొర్రలు ఉపయోగించరాదు.

సామలు యొక్క ఉపయోగాలు –

* సామలు తో చేసిన అన్నం చమురు కలిగి మృదువుగా , తియ్యగా , వగరుగా ఉండును.

* చలవ , వాతమును చేయును .

* మలమును బంధించును .

* శరీరము నందు కఫమును , పైత్యమును హరించును .

* ఈ బియ్యముతో పరమాన్నం చేసిన అద్భుతమైన రుచితో ఉండును.

* గుండెల్లో మంటకు మంచి ఔషదం.

* కీళ్లనొప్పులు మరియు ఆర్థరైటిస్ సమస్యతో ఇబ్బంది పడేవారికి మంచి ఔషధం .

రాగుల యొక్క ఉపయోగాలు –

* వీటికి మరొక్క పేరు తవిదెలు , చోళ్ళు అని కూడా పిలుస్తారు .

* రాగులను ఆహారముగా తీసుకోవడం వలన వెంట్రుకలకు బలమును ఇచ్చును.

* శరీరంలో పైత్యమును పెంచును. ఎక్కువుగా తీసుకోవడం వలన తలతిప్పుట చేయును .

* మేధోరోగం అనగా అధిక కొవ్వు సమస్యతో ఇబ్బందిపడేవారు ఆహారంలో రాగులను చేర్చుకోవడం వలన దేహములోని కొవ్వుని బయటకి పంపును .

* రాగులను జావలా చేసిన అంబలి అని అంటారు. దీనిని లోపలికి తీసుకోవడం వలన మేహరోగాన్ని అణుచును.

* రాగులను లొపలికి తీసుకున్నచో పైత్యమును పెంచును. రాగులను జావలా చేసి తీసుకున్నచో శరీరంలో పైత్యాన్ని హరించును . రాగిజావలో మజ్జిగ కలుపుకుని సేవించినచొ ఎక్కువ ఫలితం ఉండును.

* కఫాన్ని పెంచును. చలవ చేయును .

* శరీరంలో పైత్యం వలన కలుగు నొప్పులను పొగొట్టును.

* ఆకలిదప్పికలను అణుచును.

* విరేచనం చేయును . రక్తంలోవేడిని తీయును.

* రాగుల్లో పిండిపదార్ధాలు 72.7 గ్రా , కొవ్వుపదార్ధాలు 1.3 గ్రా , మాంసకృత్తులు 7 గ్రా , క్యాల్షియం 330 మీ.గ్రా , భాస్వరం 270 మి.గ్రా , ఇనుము 5 .4 మి.గ్రా , పొటాషియం 290 మి.గ్రా , పీచుపదార్థం 3.6 మి.గ్రా . శక్తి 331 కేలరీలు .

* రాగులలో ఇనుము అధికంగా ఉండటం వలన మలమును సాఫీగా బయటకి వెళ్లేవిధముగా చేయును .

* మెరకభూముల్లో పండే రాగులు మంచిరుచిని
కలిగించును. రాగుల్లో ఎరుపు, నలుపు రంగులు కలవు.

* రాగులు నానబెట్టి ఎండబెట్టి దోరగా వేయించి మెత్తగా విసిరి ఆ పిండిని పాలల్లో కలుపుకుని తాగడం గాని లేదా జావలా కాచుకొని తాగుచున్న అతిమూత్రవ్యాధి హరించును .

* రాగిజావలో మజ్జిగ కలుపుకుని తాగుచున్న శరీరంలో వేడి పోవడమే కాదు మూత్రబంధన విడుచును.

ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .

గమనిక –

నేను రాసిన ” ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు ” మరియు ” ఆయుర్వేద మూలికా రహస్యాలు ” రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచి.
కాళహస్తి వేంకటేశ్వరరావు .

అనువంశిక ఆయుర్వేద వైద్యులు .

9885030034

ఆహారపు రుచులు మరియు వాటివలన మానవ శరీరముకు కలుగు ఉపయోగాలు –

రుచులు మొత్తం 6 రకాలు . అవి

తీపి , పులుపు , ఉప్పు , చేదు , కారము , వగరు అని 6 రకాలుగా ఉంటాయి. మనం తీసుకునే ప్రతి ఆహార పదార్థంలో ఈ ఆరు రుచులు అంతర్లీనంగా ఉంటాయి. మనుష్య శరీరం నందు రోగాలు పుట్టుటకు మరియు రోగాలు తగ్గుటకు మనకి ఈ ఆరు రుచులు సమ్మిళితమైన ఆహారమే ప్రధాన కారణం .

ప్రథమంగా ముందు మన ప్రాచీన ఆయుర్వేదం లో మానవ శరీరం గురించి మీకు వివరిస్తాను. మానవశరీరం నందు ఏడు చర్మములు , ఏడు ధాతువులు , ఏడు ఆశయాలు , ఏడు వందల శిరలు , అయిదు వందల పేశిలు , తొమ్మిది వందల స్నాయువులు , మూడు వందల ఎముకలు కాని చరకుడు వివరించిన దానిప్రకారం ఎముకలు మూడువందల ఆరు. పాశ్చాత్త్యా సిద్ధాంతం ప్రకారం రెండువందల పదియే కలవు. రెండు వందల పది సంధులు , నూట ఏడు మర్మస్థానములు , ఇరవైనాలుగు ధమనులు , మూడు దోషములు , మూడు మలములు , తొమ్మిది స్రోతస్సులు , పదహారు కండరములు , పదహారు సన్నని జాలములు అనగా సన్నని నరముల అల్లికలు , ఆరు కూర్చములు అనగా ఎముకల కట్టలు నాలుగు మరియు శిరల కట్టలు రెండు రకాలు . నాలుగు పెద్దతాళ్లు , ఏడు కుట్లు , పదనాలుగు ఎముకల కూటములు , పదనాలుగు సీమంతములు , ఇరువది రెండు శ్రోతస్సులు , రెండు ప్రేవులు , మూడున్నరకోట్ల రోమకూపములు. ఇంత ఉత్క్రుష్టమైనది మానవశరీరం . నిద్రాహార విహారాలలో మార్పులు మరియు హెచ్చుతగ్గుల వలన శరీరంలో రోగాలు సంభవిస్తాయి.

కొన్ని రకాల ద్రవ్యములను తినిన యెడల శరీరంలో రోగాలు నశించగలవు. కొన్నిరకాల ఆహారపదార్థాలను తినిన యెడల శరీరం నందు కొత్తకొత్త రోగాలు పుట్టును . అసలు రోగం అంటే ఏంటో మీకు తెలియచేస్తాను .శరీరధారకములు అగు వాత, పిత్త, శ్లేష్మములలో ఉండవలసిన ప్రమాణం కంటే హెచ్చుతగ్గులు ఉండుటయే రోగం .

మనం తీసుకునే ప్రతి ఆహారం 6 రకాల రుచులతో సమ్మిళతం అయి ఉంటుంది అని చెప్పాను కదా . ఇందులో మొదటివగు తీపి , పులుపు , ఉప్పు ఇవి వాత దోషమును పోగొట్టును . చేదు , కారం , వగరు ఇవి కఫాన్ని హరించును . వగరు, చేదు , తీపి రసములు పిత్తదోషమును హరించును . ఆహారం జీర్ణం అయిన తరువాత వేడిచేయుట , చలువచేయుట అను రెండు విధాలుగా మాత్రమే ఉండును.

ఇప్పుడు మీకు రుచులు వాటి యొక్క గుణాలు తెలియచేస్తాను .

మధురరస గుణములు –

* తీపిగా ఉన్న పదార్థాలను తినటం వలన , పుట్టినప్పటి నుండి అలవాటు పడిన సప్త ధాతువులకు బలం కలుగును.

* చిన్నపిల్లలకు , ముసలివారికి , దెబ్బలు తగిలిన వారికి , బలం క్షీణించినవారికి , రక్తమాంసములు క్షీణించినవారికి తీపి పదార్థాలు చాలా హితకరం అయినవి.

* శరీరవర్ణం పెరుగుటకు , వెంట్రుకల వృద్ధికి , ఇంద్రియ బలం పెరుగుటకు , ఓజస్సు వృద్ది చెందుటకు ఈ మధుర రసం ఉపయోగపడును.

* శరీరంకి మంచి పుష్టిని ఇచ్చును.

* కంఠస్వరం పెరుగును .

* బాలింతలగు స్త్రీలకు ఎండిపోయిన పాలను వృద్ది పరుచును.

* ఆయుష్షుకు కారణం , ప్రాణరక్షణకరమైనది .

* వాత, పిత్త, విషాలను హరించును .

గమనిక –

ఈ మధుర రసమును అధికంగా వాడిన మేధస్సుతో కూడిన కఫ వ్యాధులను పుట్టించును .శరీరం లావెక్కును . అగ్నిబలం తగ్గును అనగా జఠరాగ్ని తగ్గును. ఇరువది అగు మేహరోగాలు జనించును. అర్బుదం అనగా గడ్డతో కూడిన కేన్సర్ వచ్చును.

ఆమ్లరసం గుణములు –

* ఈ ఆమ్లరసం ( పులుపు ) అగ్నిదీప్తి అనగా జఠరాగ్ని పెంచును.

* హృదయముకు బలమునిచ్చును.

* ఆహారాన్ని అరిగించును.

* రుచిని పుట్టించును .

* శరీరం నందు వేడి కలుగచేయును .

* మలాన్ని విడిపించును.

* తేలికగా జీర్ణం అగును.

* కడుపులో బిగిసి ఉన్న వాయువుని బయటకి వెడలించును.

గమనిక –

దీనిని అధికంగా వాడినచో కఫమును పెంచును , రక్తపిత్త వ్యాది అనగా నోటివెంట రక్తం పడువ్యాధిని పుట్టించును , శరీర అవయవాల పట్టు సడలించును , తిమ్మిరి , భ్రమ , దురదలు , పాండురోగం , విసర్పవ్యాధి , శరీర భాగాల్లో వాపు , దప్పిక, జ్వరం వంటి వ్యాధులను పుట్టించును .

లవణ రస గుణాలు –

* ఈ లవణ రసం శరీరంలో స్తంభించిన దోషాన్ని విడిపించి బయటకి పంపును .

* జఠరాగ్ని పెంచును.

* చమురు కలది.

* చెమట పుట్టించును .

* తీక్షణమైనది , రుచిని పుట్టించును .

* వ్రణములు అనగా గడ్డలు పగిలేలా చేయును .

* శరీరం నందు మలినపదార్థాలు విడగొట్టి బయటకి పంపును

గమనిక –

ఈ లవణ రసాన్ని అధికంగా వాడటం వలన వాతారక్త వ్యాధిని కలిగించును . బట్టతలను తగ్గించును . వెంట్రుకలు నెరిసిపోవును , శరీరం ముడతలు పడును. దప్పికను కలిగించును , కుష్టు రోగము కలుగును. విసర్పి రోగం కలుగును. బలమును హరించును .

తిక్త ( చేదు ) రస గుణాలు –

* ఇది అరుచిని హరించును .

* శరీరం నందలి క్రిములను , దప్పిక , విషమును , కుష్టు , మూర్ఛని హరించును .

* మూర్చ, జ్వరాలను , శరీరం నందలి మంటలను, వేడిని , కఫాన్ని హరించును .

* శరీరం నందలి వ్రణాల నుండి కారు దుష్టజలాన్ని , మాంసం నందలి కొవ్వుని కరిగించును. ఎముకల్లో మూలుగను , శరీరంలో మలమూత్రాలను హరించును .

* తేలికగా జీర్ణం అగును.

* బుద్దిని పెంచును.

* చమురు హరించును .

* స్త్రీల పాలు యందు మరియు కంఠం నందలి దోషాలు పొగొట్టును.

గమనిక –

అధికంగా తీసుకున్న ధాతువులను క్షీణింపచేసి వాత రోగాల్ని పుట్టించును .

కటు ( కారం ) రసం గుణాలు –

* ఈ కటు రసం కంట రోగం , కుష్టు , వాపు పోగొట్టును .

* వ్రణములు తగ్గించును

* శరీరం నందలి దుష్ట జలాన్ని , కొవ్వుని హరించును .

* జఠరాగ్ని పెంచును.

* అన్నమును జీర్ణింపచేయును .

* రుచిని పుట్టించును .

* సన్నని నరములలోని దోషాలు కూడా శోధించి వ్యర్థాలను బయటకి పంపును .

* నవరంధ్రాలు ను తెరిపించును.

* కఫాన్ని హరించును .

గమనిక –

దీనిని అతిగా తీసుకున్నచో దప్పిక పుట్టించును . శుక్రమును , బలాన్ని నశింపచేయును. మూర్చని కలిగించును. అంగములు ముడుచుకున్నట్లు చేయును . వణుకు పుట్టించును .నడుము , వీపు నందు నొప్పి కలుగచేయును .

కషాయ ( వగరు ) రస గుణములు –

* వగరు పదార్థం పిత్తశ్లేష్మాలని హరించును .

* రక్తాన్ని శుద్దిచేయును .

* నొప్పిని కలిగించును.

* వ్రణాలను మాన్చును.

* శరీరం నందలి దుష్ట జలాన్ని తీసివేయును .

* ఆమమును స్తంభింపచేయును .

* మలాన్ని గట్టిపరుచును.

* చర్మాన్ని నిర్మలంగా చేయును .

గమనిక –

దీనిని అతిగా సేవించిన మలబద్దకం , కడుపు ఉబ్బరం , గ్యాస్ , గుండెజబ్బులు , దప్పిక, లివరు చిక్కిపోవుట, సంభోగ శక్తిని నశింపచేయును . మలబద్దకం కలిగించును.

పైన చెప్పిన విధంగా మనం తీసుకునే ఆహార పదార్థం యొక్క రుచిని బట్టి మన ఆరోగ్యం అధారపడి ఉండును.

ఏయే సమస్యలకు ఎటువంటి ఆహారాలు తీసుకోవాలి మరియు రోగములకు చేయవల్సిన చికిత్సలలో అత్యంత సులభమైనవి అన్నింటిని నేను రచించిన గ్రంథాలలో సంపూర్ణముగా ఇవ్వడం జరిగింది. వాటిని పరిశీలించగలరు.

గమనిక –

నేను రాసిన ” ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు ” మరియు ” ఆయుర్వేద మూలికా రహస్యాలు ” రెండు గ్రంథాలలో ఎన్నొ రహస్య చిట్కాలు , మా కుటుంబపరంగా గత 250 సంవత్సరాల నుంచి మా పెద్దవారు మాకు అందించిన ఎంతో అనుభవసారాన్ని ఈ గ్రంథాలలో అందరి అర్థం అయ్యే విధంగా సామాన్య బాషలో వివరించాను. ఇంట్లో ఉండి మరియు అందుబాటులో ఉన్న వాటితోనే పెద్ద పెద్ద రోగాలు నయం చేసుకునే విధంగా అత్యంత సులభయోగాలు మన ప్రాచీన భారతీయులు రచించిన చెట్లను బట్టి భూమిలో నీటిని కనుక్కునే విధానాలు , వృక్షాలకు ఆయుర్వేద మూలికల ఉపయోగించి దిగుబడి పెంచే వృక్షాయుర్వేద చిట్కాలు , రైతులకు ఉపయోగపడే విధంగా ఏయే నక్షత్రాలలో పంటలు వేస్తే ఫలితాల ఎక్కువుగా ఉంటాయో తిథి, నక్షత్ర, వారాలతో సహా ఇవ్వడం జరిగింది. ఆయుర్వేదం నేర్చుకోవాలి అనుకునేవారికి ఇది మంచి దిక్సూచిలా ఉపయోగపడును.

నా మూడొవ గ్రంథము నందు 50 రకాల మొక్కల గురించి అత్యంత విపులంగా ఇవ్వడం జరిగింది . ఈ మొక్కలన్నియు ప్రతి ఒక్కరికి తెలిసినవి మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటివే . ఈ గ్రంధములలో మీకు లభ్యమయ్యే సమాచారం మరే గ్రంథములలో లభ్యం అవ్వదని చెప్పగలను . మొక్కలను సులభముగా గుర్తించుటకు రంగుల చిత్రములు కూడా ఇవ్వడం జరిగినది . ఏయే జబ్బులకు ఎటువంటి ఆహారపదార్థాలు తీసుకోవలెనో , తీసుకోకూడదో కూడా సంపూర్ణముగా మీకు ఇందులో లభ్యం అగును . ఔషధాలు మరియు తీసుకోవాల్సిన ఆహారవిహారాలు ఒకేదగ్గర లభ్యం అగును .

ప్రాచీన ఆయుర్వేద ఔషధాలు గ్రంథము 288 పేజీలతో ఉండును . దీని విలువ 400 రూపాయలు , ఆయుర్వేద మూలికా రహస్యాలు గ్రంథము 384 పేజీలతో ఉండి 500 రూపాయలు , సర్వమూలికా చింతామణి గ్రంథము 352 పేజీలతో ఉండును . దీని విలువ 550 రూపాయలు . అందరికి అర్ధమయ్యేలా సులభ బాషలో ఉండును. గ్రాంథిక భాష ఉపయోగించలేదు .

ఈ గ్రంథములు కావలసిన వారు 9885030034 నంబర్ కు Phonepay or Googlepay or Paytm కు డబ్బు పంపించి ఇదే నంబర్ కు Whatsup నందు screenshot పెట్టి మీ పూర్తి Adreass ఇవ్వగలరు . కొరియర్ చార్జీ 100 రూపాయలు అదనం .

కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు

ఈ గ్రంథాలు కావలసినవారు డైరెక్టుగా ఫొన్ చేయండి . సంప్రదించవలసిన నెంబర్

అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ – 1 .

ఆయుర్వేదం నందు వ్యాధుల గురించి తెలుసుకొనుటకు కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు ఉన్నాయి. ఈ రకమైన పద్ధతులు ద్వారా వ్యాధినిర్ధారణ చేయుటకు అనుభవం కూడా ప్రధానమైంది . ముందు అసలు ఆయా పద్దతుల గురించి మీకు సంపూర్ణముగా వివరిస్తాను . సమస్త వ్యాధుల గురించి తెలుసుకోవడానికి 8 స్థానాలను మొదట పరీక్షించవలెను . అవి

* నాడి .

* స్పర్శ . ( తాకుట ) .

* రూపము .

* శబ్దము .

* నేత్రములు .

* పురీషము .

* మూత్రము .

* జిహ్వ ( నాలుక ) .

ఈ 8 రకాల స్థానాలను ముందుగా పరీక్షించిన తరువాత మాత్రమే రోగనిర్ధారణ చేయవలెను . ఇప్పుడు మీకు ఒక్కొక్కదాని గురించి సంపూర్ణముగా వివరిస్తాను .

* నాడి –

దీనిని ఆంగ్లము నందు Pulse అని పిలిచెదరు . చరక , సుశ్రుతాది గ్రంథముల యందు ఎక్కడ కూడా నాడీవిషయము చెప్పబడలేదు . అయినాకూడా రోగములను గుర్తించుటకు కాని , వాటికి చికిత్స చేయుటకు గాని ఈ నాడీపరిక్షే ప్రథమస్థానం ఆక్రమించుచున్నది . మనిషి యొక్క ఒక ఉచ్చ్వాస నిశ్వాసమునకు ( Respiration ) 4 సార్లు నాడి స్పందనము ( Beating of the pulse ) కలుగును .

వయస్సును అనుసరించి నాడీ స్పందన –

గర్భములో పిండము – నిమిషానికి – 150 – 130 .

పుట్టగానే – నిమిషానికి – 140 – 130 .

1 సంవత్సరం లోపు – నిమిషానికి – 130 – 115 .

2 సంవత్సరాల లోపు – నిమిషానికి – 115 – 100

3 సంవత్సరాల లోపు – నిమిషానికి – 100 – 90 .

7 – 14 సంవత్సరాల వరకు – ” – 90 – 75 .

14 – 20 సంవత్సరాల వరకు – ” – 85 – 75 .

21 – 60 సంవత్సరాల వరకు – ” – 75 – 65 .

60 సంవత్సరాల పైన – ” – 85 – 75 .

జీర్ణజ్వరము , రక్తక్షీణము , దౌర్బల్యము , భోజనానంతరం , మలవిసర్జన అనంతరం నాడి క్షీణించును . ఎంతవ్యాధి యున్నను వయస్సులో ఉండువానికి 120 కంటే నాడీస్పందన మించరాదు . నాడీస్పందన 150 సంఖ్య సమీపించిన అపాయము .

ఈ నాడీ పరీక్ష శరీరంలో 8 ప్రదేశాలలో చేయవలెను .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు

అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ – 2 .

ఆయుర్వేద శాస్త్రము అనుసరించి నాడిని 8 చోట్ల పరీక్షించవలెను . అవి

* హస్తము .

* పాదము .

* కంఠము .

* నాస 2 వైపులా .

* 2 చేతుల మణి బంధనముల యందు .

* 2 పాదముల చీలమండల యందు .

* ముక్కు రెండుప్రక్కల యందును కంఠము నందలి ఉండకు రెండు వైపులా నాడీపరీక్ష తెలుసుకొనవలెను .

హస్తనాడి –

శరీరము అంతయు వ్యాపించి ఉండు ఈ నాడి వాత,పిత్త , కఫములను , రసరక్తములకు సంబంధించి ఉండును . ఇది బ్రొటనవేలి మూలము నందు 3 వ్రేళ్లు పట్టుచోట ధాన్యపుగింజ పరిమితిన చరించుచుండును . దీని ద్వారా ఉచ్చ్వాస , నిశ్వాసముల గమనము బాగుగా తెలియును .

ఇది జీవసాక్షిలా శరీరము యొక్క ఆరోగ్య అనారోగ్యములను తెలుపుచుండును . ఉచ్ఛ్వాస నిశ్వాసములు నాసిక ద్వారా శరీరమంతయు వ్యాపించుచుండెను . అలా వ్యాపించునప్పుడు ఎటువంటి ఆటంకము లేకుండా సరిగా వ్యాపించుచుండిన యెడల ఈ నాడి ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సమముగా ఉండును . అలా జరగకుండా ఈ ఉచ్చ్వాస నిశ్వాసముల వ్యాప్తి చెందుతున్నప్పుడు త్రిదోషముల ( వాత పిత్త కఫ ) లలో ఏదైనా దోషము అడ్డువచ్చిన యెడల ఉచ్ఛ్వాసనిశ్వాసములు కంగారుపడి జలగ , పాము మున్నగు వాటి నడక ఎలా ఉండునో అలా కష్టముగా లేక నెమ్మదిగా లేక త్వరత్వరగా ఎగురుచున్నట్లు నాడి యొక్క గమనంలో తేడా వచ్చును .

హస్తనాడి వలన అజీర్ణము , ఆమదోషము , జ్వరము రాబోవు సంగతి , ఆకలిగొనుటను , చెడిపోయిన వాత , పిత్త , కఫముల గురించి తెలియచేయును . వైద్యులు ప్రధానముగా దీనినే
పరీక్షించెదరు .

పాదనాడి –

పాదనాడి వలన ఎంతకాలము జీవించునది , శరీరము బరువు లేక తేలికగా ఉండుటయు , జ్వరము తగ్గిన సంగతి తెలియును . ఆరోగ్యవంతునికే ఇది చూడవలెను

కంఠనాడి –

గాయములు , భయము మున్నగు బాహ్య కారణముల మూలముగా వచ్చు జ్వరము , తృష్ణ , ఆయాసము , స్త్రీసంగమము , అలయిక , దుఖఃము , కోపము అనువాటి గురించి కంఠనాడి తెలుపును . దీనిని నాడీపరీక్ష యందు నిపుణులు మాత్రమే ఈ నాడిని ప్రత్యేకముగా పరీక్షించి ఫలితాలు తెలుసుకోగలరు .

నాసా నాడి –

చనిపోవుటయు , జీవించిఉండుటయు , కామము , నేత్రవ్యాధులను , తలనొప్పిని , కర్ణముఖరోగములు ముక్కునందలి నాడి తెలియచేయును .

నాడిని పరీక్షించు విధానము –

వైద్యుడు నాడిని ఉదయము పూట పరగడుపున పరీక్షించవలెను . ముందు రోగి యొక్క మోచేతి భాగము పట్టుకొని పిసికి తన కుడిచేతి 3 బ్రొటనవ్రేళ్ళతో బ్రొటనవేలి మొదటి భాగమున నాడిని చక్కగా పరీక్షించవలెను .

స్త్రీపురుషుల నాడి బేధము –

పురుషులకు కుడిచేతి యందు కనిపించు నాడి , స్త్రీలకు ఎడమచేతి యందు కనిపించును . కారణమేమన పురుషులకు నాభి కూర్మ అధోముఖముగా ఉండును . స్త్రీలకు నాభి కూర్మ ఊర్ధ్వముఖముగా ఉండును . ఈ భేదము చేతనే స్త్రీ పురుషుల హస్తనాడులు భేదించుచున్నవి .

అనుభవమును బట్టి శాస్త్రము నందు చెప్పబడిన చేతి యొక్క నాడిని పరీక్షించి అనంతరము రెండోవ చేతి యందలి నాడిని కూడా పరీక్షించుట మంచిది .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు

అష్టస్థాన పరీక్ష గురించి సంపూర్ణ వివరణ – 3 .

నాడి చూడకూడని వారు –

అప్పుడే స్నానం చేసినవారికి , భుజించిన వారికి , ఆకలిగొన్నవానికి , దప్పికతో ఉన్నవానికి , నిద్రనుండి లేచినవారికి నాడిని పరీక్షించిన ఫలితం స్పష్టముగా తెలియదు . కావున ఆ సమయములలో నాడిని పరీక్షించరాదు .

నాడుల పేర్లు – వాటి స్థానములు .

నాభికందము నందు ఉండు నాడి సుషుమ్న . ఇది బ్రహ్మరంధ్రము వరకు వ్యాపించి ఉండును . మానవుని స్థూల సూక్ష్మ నాడులు అన్ని కలసి మొత్తం 3 1/2 కోట్లు . ఇవి అన్నియు నాభికూర్మము నుంచి 10 నాడులు పైకి , 10 నాడులు కిందకి , 4 నాడులు అడ్డముగా బయలుదేరి శరీరము అంతయు మితిమీరిన సంఖ్యగలవై వ్యాపించుచున్నవి .

ఈ సుషమ్న నాడి యందే జీవుని నివాసము . ఈ సుషమ్న నాడి యందలి జీవునకు ఇ ళ , పింగళ నాడులచే తృప్తి కలుగుచుండును . వాటికి సరస్సులు అని పేరు . శరీరమునందు త్రిదోషములు ఎలా ప్రధానమో అదే విధముగా ఈ నాడులు కూడా ప్రధానములు . మన ఉచ్చ్వాస నిశ్వాసమునకు హంస యని పేరు .

ఈ మూడు నాడులు వేణి బంధము వలే కలిసిమెలిసి త్రివేణి సంగమము పేరుతో లలాటం నందు కలిసి ఉండును . నాడి యందలి హంస యొక్క గతిని బట్టి మనము త్రిదోషముల హెచ్చు తగ్గులుగా ఉండు సంచారములను తెలుసుకోగలము .

సుషమ్న నాడి వెన్నుపూసలో నుండి మెడమార్గములో బ్రహ్మ రంధ్రము చేరును . వెన్నుపూసకు బ్రహ్మదండము అని పేరు కలదు . అందులో ఉండు సుషమ్న నాటికి బ్రహ్మ నాడి అని పేరు కలదు . బ్రహ్మనాడి యందు ఉన్న జీవుడు షట్చక్రముల యందు తిరుగుతూ ఇళ , పింగళ నాడులతో తృప్తిపొందుచుండును .

ఇళ నాడి నాభికూర్మము నుండి హృదయము వద్దకు వచ్చి మెడమార్గముగా ఎడమ ముక్కు రంధ్రము వద్దకు వచ్చును . అదేవిధముగా పింగళ నాడి కుడి ముక్కు రంధ్రమును ఆశ్రయించి ఉండును . పంచభూతాలు , లోకములు , నదులు , కులములు , గుణములు మొదలగునవన్ని సుషమ్న నాడి యందు ప్రతిష్ఠములు అయి ఉన్నవి .

తరవాతి పోస్టు నందు మరింత విలువైన సమాచారం మీకు అందిస్తాను . ఆయుర్వేదములోని ఎన్నొ రహస్య మూలికల అనుభవ యోగాల గురించి నా గ్రంథాల యందు సంపూర్ణముగా , అందరికి అర్థమయ్యే సులభ భాషలో వివరించాను . వాటిని చదివి మరింత విజ్ఞానాన్ని పొందగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు

రక్తహీనత గురించి సంపూర్ణ వివరణ –

మనుష్యునికి రక్తహీనత ఉన్నప్పుడు పూర్తి బలహీనం అవుతారు . ముఖ్యంగా ఆడవారిలో ఈ సమస్య ఎక్కువుగా ఉండును. ఇప్పుడు దీని గురించి మీకు సంపూర్ణంగా వివరిస్తాను.

* ముఖం పాలిపోయినట్లు , త్వరగా అలసిపోవడం , చిరాకు , కోపం , అసహనం ఎక్కువుగా ఉంటుంది.

* ఆయాసం , ఙ్ఞాపకశక్తి తగ్గిపోవటం , మతిమరుపు ఎక్కువుగా ఉండును. నాలుక మంటగా ఉండును.

* ఐరన్ లోపించటం వలన వచ్చే రక్తహీనత ఎక్కువుగా ఉండును.

* సరైన ఆహారం తీసుకోకపోవటం , సరైన వ్యాయామం చేయకపోవటం వలన కూడా వ్యాధినిరోధక శక్తి తగ్గిపోవును .

* వ్యాధినిరోధక శక్తి తగ్గటం వలన అంటువ్యాధులు వీరికి త్వరగా వచ్చే అవకాశం కలదు. అందువలన ఆహారం నందు ఐరన్ ఎక్కువుగా ఉన్నవి తీసికొనవలెను.

* శరీరానికి కావలసిన ఐరన్ లభించుటకు పండ్లు , పుట్టగొడుగులు , ఆకుకూరలు , తీగకు కాసే కాయగూరలు , ఖర్జురము , తేనె , సోయాబీన్స్ , బీన్స్ సమృద్దిగా తీసుకోవాలి .

* వైట్ బ్రెడ్ , స్వీట్స్ , పంచదార , వేపుళ్లు , నిల్వపచ్చళ్ళు , మైదాపిండి మొదలగునవి వాడరాదు.

* కూరలలో నిమ్మకాయ పిండుకోవాలి. ఐరన్ శరీరం గ్రహించాలి అంటే C విటమిన్ అవసరం ఉంటుంది. ఐరన్ టాబ్లెట్స్ వాడటం కంటే ఆహారం ద్వారా సహజంగా ఐరన్ శరీరానికి అందించడం ఉత్తమం .

* తేనె వాడితే కొద్దిరోజుల్లొనే మార్పు వస్తుంది. ఖర్జురములో ఐరన్ బాగా ఉంటుంది. కాబట్టి వీటిని రోజుకి 10 నుంచి 12 వరకు తినాలి.

* రక్తహీనత ఉండటం వలన మెడనొప్పి , తలనొప్పి వస్తుంది.

* మద్యపానం , ధూమపానం ఈ సమస్యను మరింతగా ఎక్కువుగా చేస్తాయి .

రక్తహీనత కొరకు నేను ప్రయోగించిన అనుభవయోగం –

ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్ నందు ఒక స్పూన్ గోధుమగడ్డి చూర్ణం కలిపి ఉదయం మరియు సాయంత్రం ఆహారానికి గంట ముందు ఇవ్వడం జరిగింది . ఆహారం తీసుకున్న గంటన్నర తరువాత ఒక ఆపిల్ పండు తినిపించడం చేశాను . కేవలం నలభై రోజులలోనే శరీరం నందు సంపూర్ణంగా రక్తం వృద్ది అయ్యినది. దానిమ్మ జ్యూస్ కొరకు ఉపయోగించే కాయలు తియ్యగా పెద్ద సైజు తో ఉండేవి తీసుకోండి . దానిమ్మ జ్యూస్ తాగలేనివారు ఆపిల్ జ్యూస్ నందు కూడా గోధుమగడ్డి చూర్ణం కలుపుకుని తాగవచ్చు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు

శారీరక బలాన్ని పెంచే సులభ ఆయుర్వేద యోగం –

ఇప్పుడు నేను చెప్పబోవు ఈ ఆయుర్వేద యోగం శరీరానికి అమితమైన బలాన్ని చేకూర్చును . బూస్ట్ , హార్లిక్స్ వంటి వాటిని పిల్లలకు పాలల్లో కలిపి ఇచ్చినను ఎటువంటి ఉపయోగము లేదు .

నేను వివరించబోయే ఈ ఆయుర్వేద చిట్కా మీకు , మీ పిల్లలకు ,వృద్దులకు అత్యంత ఉపయోగకారిగా ఉండును .

బాదం 250 గ్రాములు .

సోంపు 250 గ్రాములు .

పటికబెల్లం 250 గ్రాములు చిప్స్

బాదం రాత్రి నీటిలో నానబెట్టి ఉదయాన్నే పొట్టు తీసి ఎండించాలి . బాగా ఎండిన తరువాత మెత్తటి పౌడర్ కొట్టవలెను.

సోంపు కొంచం వేయించి మెత్తగా పౌడర్ కొట్టవలెను.

పటికబెల్లం మెత్తటి పౌడర్ కొట్టవలెను.

మూడింటిని కలిపి ఉదయం , సాయంత్రం ఒక గ్లాసు పాలలో కలుపుకుని తాగవలెను.

చిన్నపిల్లలకి 1 స్పూన్ , పెద్దవారికి 2 స్పూన్స్ చొప్పున వాడవలెను.

షుగర్ లేనివారు పటికబెల్లం 50 గ్రాములు పెంచుకొన్నా పర్వాలేదు .

శరీరంలో నీరసం, నిస్సత్తువ పోయి శరీరానికి చాలా బలం కలుగును . 6 నెలలు విడవకుండా వాడిన అద్భుత ఫలితాలు వస్తాయి. ఇది నా అనుభవ యోగం

కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు

సైనసైటిస్ కొరకు కొన్ని సులభ యోగాలు –

* రోజు మంచి పలుచటి వేపనూనె రెండు ముక్కు రంధ్రాలలో ఒక్కో బొట్టు వేస్తుంటే క్రమంగా సైనస్ దూరం అవుతుంది.

* తులసి ఆకులని నీడలో ఎండబెట్టి తరువాత బాగా దంచి చూర్ణం చేయాలి . ముందు జల్లెడ పట్టి ఆ తరువాత వస్త్రగాలితం చేయాలి . అంటే పలుచని నూలుబట్టలో వేసి మెత్తటి చూర్ణం కిందికి దిగేలా చేతితో కలబెట్టాలి. ఈ చూర్ణం ని కొద్దికొద్దిగా నస్యం లాగా పీలుస్తుంటే ముక్కుకి సంబందించిన సైనసైటిస్ , వూపిరి ఆడకపోవడం , తుమ్ములు , శ్లేష్మం , నీరు , రక్తం ధారగా కారడం , దగ్గు , పడిశం, రొంప , విపరీతమైన తలనొప్పులు కంటి మసకలు ఇలాంటి వ్యాధులు అన్ని ఎంతకాలం నుంచి మనలని వేధిస్తున్నా కొద్దిరోజులలోనే మటుమాయం అయిపొతాయి.

గమనిక –

కఫాన్ని కలిగించే ఆహారపదార్థాల అయిన చల్లని నీరు , కూల్ డ్రింక్స్ , మినుములు , బచ్చలికూర, గొంగూర, పనసకాయ , ఖర్జూరం , కొబ్బరినీరు , తీపి , పులుపు , ఉప్పు పదార్థాలు, అజీర్తి కలిగించేవి వంటి పదార్థాలు నిషిద్దం .

పెసరపప్పు , ఉలవలు , బార్లీ , పొట్లకాయలు, కాకరకాయలు, నక్కదోసకాయలు, అరటిపువ్వు , శెనగలు, కంద, వాము , బూడిదగుమ్మడి , దాల్చినచెక్క, నిమ్మపండు, పసుపు,మిరియాలు , మునగాకులు తప్పక ఆహారం లో ఉండేలా చూసుకోండి.

నీరు తాగినప్పుడల్లా గోరువెచ్చని నీరు తాగండి.

పై నియమాలు పాటించటం వల్ల వీలయినంత తొందరలో సైనసైటిస్ సమస్య తీరును .

కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు

భూచక్రగడ్డ విశేషాలు –

సకల చరాచర సృష్టికి ఆధారభూతమైన ఈ భూమి మీద ఎన్నో వింతలు , విశేషాలు ఉన్నాయి. అవి నిగూఢముగా ఉన్నాయి. వాటిలో వృక్షజాతిలో ఎన్నో విచిత్రాలు కలవు. నేను ఛత్తీస్ గడ్ అడవులలో వెదురుబొంగులు కొట్టిన తరువాత భూమి యందు ఉండు బొంగు ముక్క నుంచి తెల్లటి వెలుగు రావటం గమనించాను. అలా కొన్ని ప్రదేశాలలో మాత్రమే కనిపించింది. సూర్యోదయం అయ్యేప్పుడు పూర్తిగా సూర్యునివైపు తిరిగే చెట్లు ఉన్నాయి అని అక్కడి కొండజాతివారు చెప్పారు . వారి వైద్యవిధానం కూడా బహుచిత్రంగా ఉన్నది. చెయ్యి విరిగినవారికి కేవలం మూడురోజుల్లో చెయ్యి ఎముక అతుక్కునే విధంగా చెయ్యగలరు. వారు ఉపయోగించే మొక్కని మాత్రం నాకు చూపించలేదు. నా కాలుకి దెబ్బతగిలి రక్తం పోతున్నప్పుడు వెంటనే అక్కడ ఉన్న వెదురుబొంగు పైన పచ్చరంగులో ఉన్నది చాకుతో గీకి మెత్తటి చూర్ణం చేసి దానికి సున్నం కలిపి నా గాయం పైన చల్లి అద్దడం జరిగింది.వెంటనే రక్తస్రావం ఆగిపోయింది. ఆ తరువాత ప్రతినిత్యం దానిపైన వేయుటకు మరికొంత చూర్ణం ఇచ్చారు . ప్రతినిత్యం ఉదయం , సాయంత్రం దానిపైన చల్లడం వలన అది ఒక చెక్కు మాదిరి గట్టిగా అయ్యి గాయం నయం అయ్యాక ఊడి వచ్చింది. అక్కడివారు చెప్పినదాని ప్రకారం గాయం అయినపుడు ఎటువంటి ఇంజెక్షన్స్ తీసుకోరు. కేవలం దీనితోనే వారు ఎటువంటి గాయాన్ని అయినా మాన్పుకుంటారు. ఇదంతా మీకు చెప్పడానికి ప్రధాన కారణం ఎమిటంటే ప్రకృతిలోని వృక్షజాతుల్లో అంత గొప్ప ఔషధవిలువలు ఉన్నాయి.

ఇలాంటి వృక్షవిచిత్రాలలో ఒకటైన భూచక్రగడ్డ గురించి మీకు వివరిస్తాను. ఇప్పుడు రహదారుల పక్కన భూచక్రగడ్డ పేరు చెప్పి అడివి లో దొరికే కొన్ని గడ్డలను అమ్ముతున్నారు. అసలైన భూచక్రగడ్డ అనేది పాత ఎద్దులబండి చక్రం అంత వెడల్పుగా ఉంటుంది. ఇది అత్యంత దట్టమైన కీకారణ్యాలలో మాత్రమే లభించును. కొన్ని చోట్ల ఈతచెట్ల కింద అత్యంత అరుదుగా ఉంటుంది. ఇది ఏ వృక్షం కింద అయితే ఉంటుందో ఆ వృక్షం పైన బంగారు రంగులో ఒక తీగ అల్లుకుని ఉంటుంది. భూమిలో ఉన్న గడ్డకు చెట్టు పైన ఉన్న తీగకు మధ్య ఎటువంటి సంబంధం ఉండదు. ఆ రెండు గొప్ప అయస్కాంత శక్తితో సంబంధం ఏర్పరచుకొని ఉంటాయి.

భూమిలో గడ్డ ఉన్న ప్రదేశాన్ని సరిగ్గా గుర్తించుటకు ఆ ప్రదేశం మొత్తం రెల్లుగడ్డి పరిచి నిప్పు అంటించండి. కేవలం గడ్డ ఉన్న ప్రదేశంలో రెల్లుగడ్డి ఏ మాత్రం చెక్కుచెదరదు. మిగిలిన గడ్డి కాలిపోవును. కాలని ప్రదేశం ఉన్న భాగం అంతా ఆ గడ్డ ఉన్నది అని నిర్ధారించుకొని ఆ ప్రదేశాన్ని శుభ్రపరచి ఇష్టదైవాన్ని ప్రార్ధించి చాలా జాగ్రత్తగా తవ్వడం ప్రారంభించాలి . ఇది అత్యంత జాగ్రత్తగా చెయ్యవలసిన పని. తవ్వే సమయంలో ఏ మాత్రం భూమి అదిరినను ఆ గడ్డ ఆ ప్రదేశం నుంచి జరిగిపోవును. కావున అత్యంత జాగ్రత్తగా చెయ్యవలసిన పని.

ఈ గడ్డ లభించడం అంటే అమృతం లభించడంతో సమానం . ఈ గడ్డ మందం 4 అంగుళాల నుండి 20 అంగుళాల వరకు ఉంటుంది. ఇది తీపిగాను మరియు వగరు , చిరుచేదు మిశ్రమముగా ఉండును. దీని మోతాదు 30 గ్రాముల ముక్క తిని స్వదేశీ ఆవుపాలు తాగవలెను. దీనిని జాగ్రత్తగా నిలువచేసికొని మండలం (40 ) రోజులపాటు వాడిన శరీరము నందలి సర్వరోగములు నివారణ అగును. దేహము అత్యంత కాంతివంతం అయ్యి బంగారు రంగులో మారును . నరములు శక్తిమంతం అయ్యి మెదడుకు అమితమైన బలం కలిగి ఏకసంథాగ్రాహి అవుతాడు. ముసలితనాన్ని పోగొట్టగల శక్తి దీనికి ఉన్నది. దీనిని ఆయుర్వేదంలో ” కాయసిద్ది ” అని పిలుస్తారు . దీర్గాయుష్షును ప్రసాదించును.

పైన చెప్పినవన్నీ అసలయిన భూచక్రగడ్డని సాధించి వాడినప్పుడు మాత్రమే కలుగుతాయి.

పిప్పి పన్ను బాధ హరించుటకు సిద్దయోగాలు –

* కర్పూర తైలం ( టర్పంటైన్ ) లో దూది తడిపి ఆ దూదిని పిప్పిపన్ను పైన పెట్టి నొక్కి పట్టి ఉంచిన పిప్పిపన్ను బాధ తగ్గును .

* జిందా తిలిస్మాత్ రెండు చుక్కలు దూది పైన వేసి పిప్పిపన్ను రంధ్రములో పెట్టిన పిప్పిపన్ను బాధ తగ్గును.

* కుప్పింటాకు చెట్టు ఆకు పసరు పిప్పిపన్ను రంధ్రములో వేసిన పిప్పిపంటి లోని పురుగు చచ్చి ఉపశమనం కలుగును.

* జిల్లేడు పాలు రెండు చుక్కలు దూదికి అంటించి పిప్పి పన్ను రంధ్రము నందు ఉంచిన పిప్పిపన్నులోని పురుగు చచ్చిపడిపోవును.

గమనిక –

దంతములు వదులుగా అవ్వడం , దంతముల తీపి , తీవ్రమైన నొప్పి , చిగుళ్లు బలహీనత , చీము , రక్తం కారడం వంటి సమస్యలు ఉన్నవారికి ఒక దంత చూర్ణం తయారుచేసి ఇస్తాను. 40 రోజుల్లోపే సమస్య చాలావరకు నయం అగును. ఇది పూర్తిగా మూలికలు , భస్మాలు ఉపయోగించి చేయడం వలన ఎటువంటి చెడుఫలితాలు కలగవు. దంతసమస్యలు అన్ని సంపూర్ణంగా నయం అగును.
చిగుళ్లు మరియు దంతాలు బలంగా తయారయ్యి గట్టిగా ఉండును.

సైనసైటిస్ కొరకు కొన్ని సులభ యోగాలు –

* రోజు మంచి పలుచటి వేపనూనె రెండు ముక్కు రంధ్రాలలో ఒక్కో బొట్టు వేస్తుంటే క్రమంగా సైనస్ దూరం అవుతుంది.

* తులసి ఆకులని నీడలో ఎండబెట్టి తరువాత బాగా దంచి చూర్ణం చేయాలి . ముందు జల్లెడ పట్టి ఆ తరువాత వస్త్రగాలితం చేయాలి . అంటే పలుచని నూలుబట్టలో వేసి మెత్తటి చూర్ణం కిందికి దిగేలా చేతితో కలబెట్టాలి. ఈ చూర్ణం ని కొద్దికొద్దిగా నస్యం లాగా పీలుస్తుంటే ముక్కుకి సంబందించిన సైనసైటిస్ , వూపిరి ఆడకపోవడం , తుమ్ములు , శ్లేష్మం , నీరు , రక్తం ధారగా కారడం , దగ్గు , పడిశం, రొంప , విపరీతమైన తలనొప్పులు కంటి మసకలు ఇలాంటి వ్యాధులు అన్ని ఎంతకాలం నుంచి మనలని వేధిస్తున్నా కొద్దిరోజులలోనే మటుమాయం అయిపొతాయి.

గమనిక –

కఫాన్ని కలిగించే ఆహారపదార్థాల అయిన చల్లని నీరు , కూల్ డ్రింక్స్ , మినుములు , బచ్చలికూర, గొంగూర, పనసకాయ , ఖర్జూరం , కొబ్బరినీరు , తీపి , పులుపు , ఉప్పు పదార్థాలు, అజీర్తి కలిగించేవి వంటి పదార్థాలు నిషిద్దం .

పెసరపప్పు , ఉలవలు , బార్లీ , పొట్లకాయలు, కాకరకాయలు, నక్కదోసకాయలు, అరటిపువ్వు , శెనగలు, కంద, వాము , బూడిదగుమ్మడి , దాల్చినచెక్క, నిమ్మపండు, పసుపు,మిరియాలు , మునగాకులు తప్పక ఆహారం లో ఉండేలా చూసుకోండి.

నీరు తాగినప్పుడల్లా గోరువెచ్చని నీరు తాగండి.

పై నియమాలు పాటించటం వల్ల వీలయినంత తొందరలో సైనసైటిస్ సమస్య తీరును .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు

ఆహార సేవన విధి –

ప్రాణుల చేత ఆహారణము చేయబడును కావున ఆహారము అనబడును . సృష్టి యందలి ప్రతి ద్రవ్యము పంచభూతముల నుండియే ఏర్పడుచుండును . ఆకాశము నుండి వాయువు , వాయువు నుండి అగ్ని , అగ్ని నుండి జలము , జలము నుండి పృథ్వి , పృథ్వి నుండి ఔషధాలు , ఔషధముల నుండి అన్నము , అన్నము నుండి మనుష్యులు మొదలగు జీవకోటి ఏర్పడినట్లుగా ఉపనిషత్తుల యందు చెప్పబడినది . అందువలనే ఈ శరీరము ఆహారం నుండి ఏర్పడినదిగాను అటులనే రోగములు కూడా మనం తినే అహితములు ( మంచివి కానట్టి ) అయిన , అధిక ప్రమాణములో భుజించుచుండు , చెడిపోయిన ఆహారసేవన వలన కలుగును అని ఆయుర్వేదం నందు చెప్పబడినది.

ఈ విధమైన కారణముల వలెనే మన ప్రాచీనులు మనం తినే ఆహారం మితముగా , హితముగా ఉండాలని నిర్ణయం చేశారు . ఆహారము శరీరముకు పుష్టిని , బలమును , ధారణశక్తిని , ఆయుష్షును , ఉత్సాహమును , సుఖమును , తృప్తిని ఇచ్చును . శాస్త్రవిరుద్ధముగా భుజించు ఆహారం మానవులకు వివిధ వ్యాధులను చివరికి మరణాన్ని కూడా కలుగచేయును . మానవులు రోజూ 2 సార్లు మాత్రమే ఆహారాన్ని తీసుకోవాలి . ఈ నియమం బాలురకు , రోగులకు వర్తించదు . ఉదయము మరియు సాయంత్రం సూర్యోదయం తరువాత సూర్యాస్తమయం లోపునే ఆహారం తీసుకోవాలి .

వేడిగా ఉండు , తాజాగా ఉండు ఆహారాన్ని సేవించాలి . ఆయా ఋతువులకు మరియు ఆయా ప్రాంత వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆహారాన్ని సేవించాలి . ఉదాహరణకు ఉత్తర ప్రాంతం వారు గోధుమను , దక్షిణ ప్రాంతం వారు వరి ఆహారంలో భాగంగా తీసుకోవాలి . త్వరపడి ఆహారాన్ని తినరాదు .

భోజన ప్రారంభమున తియ్యని పదార్దాలు తరువాత పుల్లని పదార్దాలు తరువాత కారము గల పదార్ధాలను తినాలి . చివర మజ్జిగతో తినవలెను . భోజనం చివర అరటిపండు గాని ఆయా ఋతువులలో దొరుకు పండు కాని తినవలెను . ప్రతిపూటా భోజనం చేసే ముందు 5 అల్లం ముక్కలను ఉప్పు అద్దుకొని తినాలి దీనివలన ఆకలి పుట్టును మరియు రుచిని కలిగించును .

మనం నిత్యం వాడే ఆహారాలలో ధాన్యాలైన బియ్యం , గోధుమలలో బియ్యం పథ్యకరమైనవి అనగా తినదగినవి త్వరగా జీర్ణం అగును . గోధుమలు తేలికగా జీర్ణం అవ్వవు .

పప్పు ధాన్యములను శింబీ ధాన్యములు అనెదరు . పప్పులు అన్నియు బలకరములైనను తేలికగా జీర్ణం కావు . అపానవాయువును కలుగచేయును . మలమూత్రాలను బంధించును . బాగా జీర్ణశక్తి కలిగినవారు మాత్రమే ఎక్కువుగా వాడాలి . ముద్దపప్పుగా వాడుట కంటే వానిలో దోషములు పోగొట్టుటకై దాని యందు పులుపు , పోపు వస్తువులు కలిపి పప్పుచారు మొదలగునవి చేసివాడుట మంచిది . పప్పు ధాన్యాలలో పెసర్లు అన్నిటికంటే మంచిది .

మరింత విలువైన సమాచారం , ఆహారం మరియు జలపాన నియమాలు , ఔషధ నియమాల గురించి సమస్త సమాచారం , సంపూర్ణముగా నేను రచించిన గ్రంథాలలో వివరించాను .

నిద్ర పట్టనివారికి నిద్రని కలిగించు సులభ ఔషధ యోగము –

ఒక ఇనుప పాత్రలో 100 గ్రాముల స్వచ్చమైన నువ్వుల నూనెని తీసుకుని బాగా మరిగించాలి . దాని యందు 10 గ్రాముల ముద్ద కర్పూరం పొడి చేసి నువ్వులనూనె లో కలిపి బాగా కలిసేంత వరకు తిప్పి పొయ్యి మీద నుంచి క్రిందికి దింపి చల్లారాక ఒక బాటిల్ నందు నిలువ చేసుకుని ప్రతిరోజూ రాత్రిపూట ఆ నూనెతో అరికాళ్లుకు మర్దన చేసుకొనుచున్న సుఖవంతమైన నిద్రపట్టును .

పైన చెప్పిన యోగముతో పాటు రాత్రి సమయములో ఆహారం తీసుకొనిన అర్థగంట తరువాత అశ్వగంధ చూర్ణమును ఒక స్పూన్ మోతాదులో ( 3 గ్రా ) గోరువెచ్చని పాలతో కలిపి తీసుకొనుచున్న త్వరగా నిద్రపట్టును .

అల్ప రక్తపోటు ( Low BP ) సమస్య నివారణ కొరకు సులభ చిట్కా –

ఆయుర్వేద పచారీ షాపులలో జటామాంసి అనే మూలిక దొరుకుతుంది . దానిని చూర్ణం చేసి పూటకు 2 గ్రాముల మోతాదుగా మంచినీటితో కలిపి తీసుకొనుచున్న అత్యంత త్వరగా low bp సమస్య తీరును .

జ్వరం హరించు సులభ ఆయుర్వేద యోగం –

6 నిమ్మకాయల రసం , 300 గ్రాముల గోరువెచ్చని నీటిలో కలిపి 3 స్పూనుల పటిక బెల్లం చూర్ణం లేదా పంచదార కలిపి ఆ రసాన్ని రోజు మొత్తం మీద కొంచం కొంచం మోతాదులో జ్వరంతో బాధపడుతున్న వారికి ఇచ్చుచున్న జ్వరం , వాంతులు , అతిసారం , విరేచనాలు నివారణ అగును .

తగ్గేవరకు నిత్యం చేయవలెను .

కుండలినీ శక్తి జాగరణ – సంపూర్ణ వివరణ .

కుండలిని అంటే యోగవిద్య నేర్చుకునే వారికి అత్యంత పరిచయం అయిన పేరు . కుండలిని అనే శక్తి వెంట్రుక కంటే సన్నని రూపంలో చుట్టలు చుట్టుకుని వెన్నుపాము కిందిభాగంలో ఉంటుంది అని కొంతమంది చెబుతారు. ఇది నిద్రావస్థలో ఉంటుంది. ఎప్పుడైతే నిద్రావస్థలో ఉన్న కుండలి సరైన గురుప్రసాదం వలన మేలుకొని సకల పద్మాలు అనగా చక్రాలను చీల్చుకొని పోవుతుందో అప్పుడు కుండలిని నిద్రావస్థ నుంచి జాగరణావస్థ లోనికి వచ్చింది అని తెలుసుకొనవలెను.

ఈ కుండలినికి అనేక నామములు కలవు. కుటిలాంగి , భుజంగి, శక్తి, ఈశ్వరి, కుండలిని , అరుంధతి , కుండలి అను పేర్లతో వివిధ యోగ గ్రంథాలలో పిలుస్తారు . కుండలిని శక్తి మేల్కొనని యెడల సర్వయోగ సాధనలు వ్యర్ధములు అగును. ఈ కుండలిని అనేది వెన్నుపాము కిందభాగములో సర్పాకృతిని పొంది నిద్రావస్థలో ఉన్న ఒక సూక్ష్మ నాడి . ఇది సమస్త శక్తి మహిమలకు , సమస్త జ్ఞాన , విజ్ఞానములకు ఆధారభూతం అయిన కేంద్రస్థానం . ఈ కుండలినీశక్తి మేల్కొననంత వరకు మానవుడు అజ్ఞానిగానే ఉంటాడు. కుండలిని జాగరణ అయిన కొద్దికాలంలోనే పూర్ణమైన ఙ్ఞానమును , సమస్త మహిమలు కలుగును.

కుండలిని శక్తిని ప్రాణాపానైక్యము అను సాధన ద్వారా మేల్కొనపవచ్చు . ఈ సాధన సద్గురువు యొక్క శక్తిపాతము వలన కలిగే ధ్యానావస్థ యందు సహజముగా కలిగే భస్త్రికా ప్రాణాయామం వలన కలుగును. ఈ సాధన యోగమార్గ రహస్యాలు తెలిసిన సద్గురువు వలన నేర్చుకుని చేయవలెనే కాని సొంతప్రయత్నముతో చేయరాదు . అలా చేసినచో చాలా అపాయకరమైన పరిస్థితులను కలిగించును. నాజీవితములో అలా ప్రయత్నించి కుండలిని శక్తి మేల్కొనిన తరువాత దానిని అదుపు చేయలేక పిచ్చివారు అయిన వారిని మరియు తీవ్రంగా మలబద్దకం సమస్య పొందిన వారిని చూశాను .

కుండలిని జాగరణ సరైన పద్దతిలో జరిగినవాడు గొప్ప లాభమును , శక్తిని ఎలా పొందునో అలానే కుండలిని జాగరణ సవ్యముగా జరగక ఏమైనా విషమ సమస్య కలిగినచో మనోమయ , విజ్ఞానమయ కోశములు ఈ జన్మలోనే కాకుండా ఇంకా కొన్ని జన్మల వరకు సాధన చేయుటకు నిరుపయోగము అగుటయే కాకుండా సాంసారిక కార్యక్రమాలకు కూడా పనికిరాకుండా అనేక విధములు అయిన మానసిక , భౌతిక దోషముల చేత ఉన్మాదాది రోగములచేత పీడితుడు అగును. కావున పూర్ణపురుషుడు అయి సరైన సద్గురువు దొరికినప్పుడే కుండలిని జాగరణ సాధనలు చేయవలెను . మంత్రజపముల వలన కూడా కొన్ని ఙ్ఞాన నాడుల మీద ప్రత్యేకమైన ప్రభావము కలిగి తద్వారా కుండలిని జాగరణ కలిగినప్పుడే మంత్రసిద్ది , ఇష్ట దేవతా సాక్షాత్కారము కలుగును. ఇటువంటి సాధనలు చేయుటకు ఆరోగ్యముగా ఉండటం కూడా అత్యంత ప్రధానం

కుండలిని శక్తి గురించి చెప్పేటప్పుడు శక్తిచాలనము గురించి కూడా తెలుసుకోవాలి . పరిపూర్ణుడు అయినటువంటి మనుష్యుడు యోగసాధన ద్వారా ఈ కుండలిని శక్తిని మేల్కొలపాలి. ఈ విధానం గురించి యోగులు ఈ విధంగా చెబుతారు . నిద్రచేయునట్టి సర్పమైన కుండలిని యొక్క తోకను పట్టి దానిని మేలుకొలపవలెను . కుండలిని శక్తి నిద్రను విడిచి హఠము చేత మీదికి లేచుచున్నది. ఈ కుండలిని శక్తి పాము వలే వంకరగా చుట్టుకుని ఉండుననియు కందము మీద బ్రహ్మ ద్వారము నందు ముఖమును ఉంచి ద్వారమును మూసుకొని నిద్రించుచుండునని యోగులు చెప్పుదురు.

లింగమునకు మీదుగాను , నాభికి క్రిందగాను , గుదస్థానమునకు పన్నెండు అంగుళముల పైన , నాలుగు అంగుళముల వెడల్పును , అదే పొడుగును కలదై గుడ్డు వంటి కందము ఉండును. ఈ కంద స్థానం నుండియే 72000 వేల నాడులు బయలుదేరుతున్నవి . వజ్రాసనమున ఉండి రెండు చేతులతో కాలి మడమలకు సమీపమున రెండు పాదములను దృఢముగా పెట్టి ఈ రెండు పాదముల చేత కంద స్థానమునందు ఉండు కందమును చక్కగా పీడించవలెను . ఇట్లు పీడించుటచే కుండలిని చాలనం అగును. ఇక్కడ చాలనం అనగా నిద్రపోవుచుండెడి కుండలిని శక్తిని మూలాధారం నుండి ఊర్ధ్వముఖమునకు చలింపచేయుట లేక తీసుకొనిపోవుట . ఈ రహస్యము గురుముఖంగా తెలుసుకొనదగినది. ఈ కుండలిని శక్తిని చాలనము చేయుటకు అనేక మార్గములు కలవు. ఇట్టి విధానములు అన్నియు రహస్యముగా గురుసన్నిధిలోనే నేర్చుకొనవలెను.

ఏకాగ్రత చిత్తముతో గురుపదేశమగు రీతిని ప్రాణాయామము చేయుటచే గూడ కుండలిని శక్తిని చాలనము చేయవచ్చు . ఈ శక్తిని చాలనము చేసి ప్రాణశక్తిని తన స్వాధీనము నందు ఉంచుకొనిన యోగి అణిమాది సిద్ధులను సాధించుచున్నాడు. ఇట్టి కుండలిని శక్తిని సాధించిన కాస , శ్వాస , జ్వరాదిరోగములు ఎప్పటికి బాధించవు . ఇట్టి మహాముద్రాది కరణముల చేత , నానావిధములగు ఆసనముల చేత , కుంభకముల చేత కుండలి మేల్కొన్నప్పుడు ప్రాణవాయువు శూన్యం అనెడి బ్రహ్మరంధ్రమునందు లయమగుచుండెను .

కుండలిని శక్తి గురించి సంపూర్ణంగా మీకు వివరించాను . తరవాతి పోస్టులో మీకు శరీరము నందు గల చక్రాల గురించి వివరిస్తాను.

మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు

సృహ తప్పి పడిపొయిన వారికి సృహ తెప్పించేందుకు నేను ప్రయోగించిన సిద్ధయోగం –

తులసి ఆకు రసంలో చిటికెడు సైంధవ లవణం కలిపి కరిగించి వడపోసి రెండు ముక్కుల్లో మూడు చుక్కలు వేస్తే ఏ విధముగా నైనా సృహ తప్పినా వెంటనే తెలివిలోకి వస్తారు.

గమనిక – సృహ నుంచి బయట పడ్డాక తేలికగా జీర్ణం అయ్యే పదార్దాలు ఇవ్వాలి . అజీర్ణ కరమైన పదార్ధాలు ఇవ్వరాదు.

ఇది నా అనుభవ యోగం .

నిద్ర పట్టనివారికి నిద్రని కలిగించు సులభ ఔషధ యోగము –

ఒక ఇనుప పాత్రలో 100 గ్రాముల స్వచ్చమైన నువ్వుల నూనెని తీసుకుని బాగా మరిగించాలి . దాని యందు 10 గ్రాముల ముద్ద కర్పూరం పొడి చేసి నువ్వులనూనె లో కలిపి బాగా కలిసేంత వరకు తిప్పి పొయ్యి మీద నుంచి క్రిందికి దింపి చల్లారాక ఒక బాటిల్ నందు నిలువ చేసుకుని ప్రతిరోజూ రాత్రిపూట ఆ నూనెతో అరికాళ్లుకు మర్దన చేసుకొనుచున్న సుఖవంతమైన నిద్రపట్టును .

పైన చెప్పిన యోగముతో పాటు రాత్రి సమయములో ఆహారం తీసుకొనిన అర్థగంట తరువాత అశ్వగంధ చూర్ణమును ఒక స్పూన్ మోతాదులో ( 3 గ్రా ) గోరువెచ్చని పాలతో కలిపి తీసుకొనుచున్న త్వరగా నిద్రపట్టును .

విరేచనాల నివారణ కొరకు ఆయుర్వేద ఔషధ యోగాలు –

* కరివేపాకును కషాయముగా కాచి పుచ్చుకొనుచున్న విరేచనములు తగ్గును . ఇది వాంతులను కూడా తగ్గించును .

* బొప్పాయి పండు తినిన నీళ్ల విరేచనములు తగ్గును .

* సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలలో 5 గ్రా మెంతులు ,రెండు గచ్చకాయలు అంత వెన్నను కలిపి రోజుకు రెండు పర్యాయములు లోపలికి తీసుకొనుచున్న రక్తవిరేచనములు , జిగురు విరేచనములు తగ్గును .

* ఒక కప్పున్నర పెరుగులో 20 గ్రా మోతాదులో మెంతులు చేర్చి లోపలికి తీసుకున్నను విరేచనాలు కట్టును .

* వేడివేడి జిలేబి గాని సగ్గు బియ్యపు పాయసం గాని సేవించుచున్న అతిసార విరేచనాలు తగ్గును .

విరేచనాలు అగుచున్నప్పుడు తగ్గేంతవరకు ఉప్పు మరియు కారపు పదార్దాలు నిషిద్దం . చప్పిడి పథ్యం ( పదార్దాలు ) తినుట చాలా మంచిది .

ఋతుశూల హరించుటకు నేను ప్రయోగించిన సులభ ఔషధ యోగం –

ఈ ఋతుశూల అనునది చాలామంది స్త్రీలలో కనిపిస్తుంది. దీనిని ముట్టునొప్పి అనికూడా అంటారు. ఇది చాలా భయంకరమైన నొప్పితో కూడుకొని ఉంటుంది. ఇది కేవలం బహిష్టు సమయంలో వస్తుంది. కొంతమంది తట్టుకోలేక పెయిన్ కిల్లర్స్ వాడతారు. మరికొంతమందికి ఈ ముట్టునొప్పి ఉండటం వలన సంతానం ఉండదు.

ఇప్పుడు మీకు నేను చెప్పబోయే చికిత్స నా అనుభవపూర్వకం . మరియు అతి సులువు అయినది. దీనిని ఉపయోగించి చాలమంది సమస్య నివారించగలిగాను .

ముట్టునొప్పి ఉన్నవారు తెల్లజిల్లేడు పాలు 5 చుక్కలు చక్కెరకేళి అరటిపండులో గుంటలా చేసి అందులో వేసుకొని ఉదయం పూట మాత్రమే 4 రోజులు సేవించినచో ఋతుశూల తగ్గిపోవును .

ఆయుర్వేద వైద్యంలో పేరుగాంచిన గొప్ప ఔషధం మొమ్మాయి గురించి సంపూర్ణ వివరణ –

మొమ్మాయి అనే ఈ ఔషధానికి ఆయుర్వేదంలో చాలా గొప్ప పేరు ఉంది. ఈ ఔషదానికి మరొక పేరు “గోమూత్ర శిలజిత్” మార్కెట్ లో పచారీషాపుల్లో అమ్ముతుంటారు కాని అది అంత స్వచ్ఛమైనది కాదు. ఇది అసలైనది తెప్పించి నేను ప్రయోగించాను . చాలా జబ్బులలో మంచి ఫలితాలు ఇచ్చినది. మనకి దొరికిన మొమ్మాయి అసలైనదా కాదా అని తెలుసుకొవడానికి ఒక చిన్న పరీక్ష ఉన్నది.

మొమ్మాయిని ఒక కందిగింజ అంత ఒక చిన్నగ్లాస్ నీటిలో వేయాలి . అప్పుడు నీరు ఎర్రగా మారుతుంది. అందులో ఒక పొడవాటి గుడ్డముక్కని వేసి నానబెట్టి ఒక కోడి కాలు విరగగొట్టి విరిగిన కాలుకు దీనిని చుట్టవలెను . కేవలం 15 నిమిషాలలో కాలు అతుక్కొని అది పరిగెత్తును . ఈ విధంగా పరీక్షించిన తరువాత మాత్రమే మొమ్మాయిని ఔషధంగా వాడవలెను .

ఒకసారి ఈ మొమ్మాయిని వాడితే అది శరీరంలో 44 సంవత్సరాలపాటు నిలిచి ఉంటుంది. ఇది ఎక్కువుగా ఇరాన్ దేశములోని కొండలలో దొరుకుతుంది. శిలాజిత్ కీలువలే నల్లగా కాంతి వలే మైనము వలే కొంచం ఎర్రగా ఉంటుంది . ఇది శరీరంలో అత్యంత త్వరితముగా వ్యాపించి తన ప్రభావాన్ని చూపును . దీని మోతాదు ఒక వడ్లగింజ నుంచి రెండు వడ్లగింజల ఎత్తువరకు వాడవచ్చు . శిలాజిత్ చూర్ణములలో కలుపవలసి వచ్చినపుడు పన్నీటితో ఎండబెట్టి కలుపుకొనవలెను. లేహ్యములలో కలుపవలసివచ్చినప్పుడు ఆవునేతితో శిలజిత్ ని కలిపి కాచి చల్లార్చి కలుపవలెను గాని ప్రత్యేకంగా కలుపకూడదు.

మొమ్మాయి ఉపయోగాలు –

* హృదయానికి బలమును ఇస్తుంది.

* మనస్సుకు సంతోషాన్ని ఇస్తుంది.

* పొట్ట, జీర్ణకోశం , రక్తం తదితర వాటిని శుభ్రపరచును .

* శరీరంలోని సమస్త అవయవాలకు , నరాలకు బలాన్ని ఇస్తుంది.

* శ్లేష్మాన్ని హరించును .

* విరిగిన ఎముకలను , కీళ్ళని బాగుచేయును .

* గాయములను మాన్పును .

* వ్రణాలను నయంచేయును .

* ఎక్కిళ్లు , కడుపులో మంట, గుండెల్లో దడ నివారించును.

* అజీర్ణం , పరిణామశూల మొదలగు శూలలను తగ్గించును .

* కీళ్లనొప్పులు హరించును .

* అన్నిరకాల జ్వరాలను తగ్గించును .

* పక్షఘాతము , పక్షవాతము , సర్వాంగవాతములను హరించును .

* అతిమూత్రవ్యాది మరియు సమస్త మూత్రవ్యాధులను హరించును .

* ఉబ్బు , శ్వాస సంబంధ సమస్యలు , మతిచాంచల్యం , మూర్చ, ముక్కుకి వాసన తెలియకపోవడం , ముక్కులోపల పుట్టెడు వ్రణం నివారించును.

* జీర్ణకోశమును అంటి ఉండే పేగు గట్టిపడు రోగం కూడా తగ్గును.

* ఒక చెయ్యి , ఒక కాలి యొక్క కీలులో పుట్టి అలా నిలిచి ఎంతకీ తగ్గని నొప్పిని కూడా తగ్గించును .

* స్త్రీల గర్భాశయం నందు జనించెడి పురుగులను చంపును.

* సుఖరోగాలను , చర్మవ్యాధులను నయం చేయును .

* బోధకాలు వ్యాధి , నాలిక మందం అయ్యే సమస్య , గొంతుకవ్యాధులను నయం చేయును .

* దవడనొప్పి , నాలుకలో నొప్పి సమస్యలకు వడ్లగింజ అంత మొమ్మాయి నీళ్లతో కలిపి ఆయా స్థలముల యందు పట్టువేసిన బాగు అగును.

* పిచ్చితనం ప్రారంభదశలో ఉండగా వడ్లగింజ ఎత్తు మొమ్మాయి గాడిదపాలతో కలిపి అరగదీసి లోపలికి ఇచ్చిన పిచ్చి తగ్గును.

* కొండనాలుక వాపుకు కాని గొంతుక వాపుకు మొమ్మాయి ఇప్పపువ్వు సారాయి తో కలిపి అంగిట పట్టించిన పై సమస్యలు తగ్గును. ఇప్పపువ్వు సారాయి దొరకనప్పుడు పెసరపప్పు కషాయం వాడవచ్చు .

పైనచెప్పినవే కాకుండా మరెన్నో రోగములకు ఈ మొమ్మాయి అమృతం వలే పనిచేయును . ఈ మొమ్మాయి వాడే సమయమున బెండకాయ కూర, ఆవాలు వాడకూడదు. అదే విధముగా మొమ్మాయి అవునేయ్యితో కలిపి ఇచ్చేప్పుడు స్వచ్చమైన దేశవాళీ ఆవునెయ్యిని మాత్రమే వాడవలెను. మార్కెట్లో దొరికే మొమ్మాయిని పరీక్షించి మాత్రమే వాడవలెను. నకిలీలు చాలా ఉన్నాయి .

తేళ్ల గురించి సంపూర్ణ వివరణ – చికిత్సలు .

తేళ్లు కీటకముల జాతికి చెందినవి . అన్ని రకముల కీటకాలకు ముఖము నందు ఉండును. తేళ్లకు మాత్రం తోకచివర ఉండు కొండి యందు విషం ఉండును. శుశ్రుతుడు తేళ్ళలో మరొక రెండు రకాల జాతుల గురించి కూడా వివరించాడు. అందులో మొదటిది పత్ర తేలు రెండోవది మండ్రగబ్బ . మండ్రగబ్బ తేలు కంటే రెట్టింపు పరిమాణంలో ఉండును. అయితే తేలు తోక చివర కొండితో కాటువేయును కాని మండ్రగబ్బ నోటితో కరుచుట వలన విషాన్ని వదులును.

తేళ్ళలో పుట్టిన ప్రదేశం మరియు విషం యొక్క తీవ్రతని బట్టి మన ప్రాచీన వైద్యులు మూడు రకాలుగా విభజించారు . అవి

1 – మంద విషము కలిగినవి.

2 – మధ్యవిషము కలిగినవి.

3 – తీవ్రవిషము కలిగినవి.

* మంద విషం కలిగిన తేళ్ల లక్షణాలు –

ఈ జాతిలో 12 రకాలు కలవు. ఇవి ఎక్కువుగా ఆవులు , గేదెలు మొదలగువాని మలములు బాగా కుళ్లిపోయిన వాని యందు పుట్టును . ఇవి కుట్టినచో బాధ , వణుకు , శరీరం మొద్దుబారుట , కుట్టిన ప్రదేశములో రక్తస్రావం కలుగును. కుట్టిన ప్రదేశము నుండి విషము పైకి ఎక్కును . మంట , వాపు , జ్వరం కలుగును. చమట పట్టును . వీటి పొట్ట కింద భాగములో పసుపు , నలుపు , నీలం , పొగ రంగు , గోమూత్రపు రంగు , ఆకుపచ్చ రంగు , తెలుపు రంగు కలిగి ఉండును. పొట్ట కింద మెరియుట , రోమములు కలిగి ఉండును. వీని తోక యందు కణుపులు ఎక్కువుగా ఉండును. మూడు కణుపుల కంటే ఎక్కువ కణుపులు కలిగి ఉండును.

* మధ్య విషం కలిగిన తేళ్ల లక్షణములు –

ఈ జాతిలో 3 రకాల తేళ్లు కలవు. ఇవి ఎక్కువుగా , వాములు , కర్రల గుట్టల యందు ఉండును. విషము కలిగిన ఆయుధములు చే కొట్టబడటం వలన గాని లేక విషజంతువుల చే కరవబడటం వలన గాని చనిపోయిన జంతువుల శరీరముల నుంచి ఇవి పుట్టును . ఇవి కుట్టినచో నాలిక వాయుట , భోజనము చేయలేకపోవుట , మూర్చ కలుగును. కుట్టిన ప్రదేశము నుండి విషము పైకి ఎక్కును. వీటి పొట్ట కింద భాగము నందు పసుపు , నలుపు , ఎరుపు రంగు కలిగి ఉండును. వీని తోక యందు మూడు కణుపులు ఉండును.

* తీవ్ర విషము కలిగిన తేళ్ల లక్షణములు –

ఈ జాతిలో 15 రకాలు ఉండును. ఇవి ఎక్కువుగా చనిపోయిన పాములు మొదలగు విష జంతువుల శరీరములు బాగా కుళ్లిపోయిన తరువాత ఆ శరీర భాగాల నుంచి పుట్టును .

ఈ తేళ్లు కుట్టిన వెంటనే సర్పవిషము వలనే వేగముగా పైకి ఎక్కును . శరీరము నందు బొబ్బలు , జ్వరం కలుగును. అతి నీరసము వచ్చును. ఇంద్రియాల నుండి నల్లని నెత్తురు స్రవించి ప్రాణములు పోవచ్చును.వీటి పొట్ట కింద ఎరుపు , తెలుపు , పొగ రంగు , నీలము , గులాబీ మొదలగు రంగురంగులు కలిగి ఉండును. దీని తోక యందు ఒక కణుపు గాని , రెండు కణుపులు గాని , లేక అసలు కణుపుల లేకుండా గాని ఉండును.

పైన చెప్పినవాటితో పాటు శుశృతుడు వివరించిన రెండు రకాల తేళ్ల గురించి కూడా వివరిస్తాను.

* పత్ర వృశ్చిక లక్షణాలు –

ఇది ఆకువలనే పలచని ఆకారం కలిగి ఉండును. ఇది కుట్టినచో ఆ ప్రదేశము నందు ఎర్రబడి , బొబ్బలు పొక్కి , నిప్పుతో కాల్చినట్లుగా బాధ పెట్టును.

* మండ్రగబ్బ లక్షణములు –

ఇది చూడటానికి తేలు వలే ఉండును కాని పరిమాణంలో పెద్దదిగా ఉండును. ఇవి నలుపు , ఎరుపు రంగులు కలిగి ఉండును. వీటికి విషము నోటి యందు ఉండును. ఇవి కరిచినచో రోగి రోమములు నిక్కబొడుచుకొని ఉండును. శరీరం చల్లబడును చమటలు కారును . పురుషాంగం స్థంభించును. కరిచిన గాయం నుండి నల్లగా రక్తం కారును .

* తేలు యొక్క విషం వ్యాపించు విధం –

తేలు కుట్టిన వెంటనే సూదితో గుచ్చినట్లు ఉండి కొండి యందలి రంధ్రము ద్వారా విషము శరీరంలోనికి ప్రవేశించి ఆ ప్రాంతము అంతా నిప్పుతో కాల్చినట్లు మంట కలుగును. కాళ్ళు , చేతుల యందు కుట్టినచో విషము గజ్జలు , చంకల వరకు వ్యాపించి కొంతసేపు ఉండి మరలా కాటు ప్రదేశమును చేరును . అచ్చట 24 గంటల కాలము పోటు , నొప్పి , పగలగొట్టుచున్నట్లు బాధ కలుగును. దీని విషము పూర్తిగా రక్తములోకి ప్రవేశించక పోయినప్పటికీ తేలు విషము నందు ఆమ్ల ,తీక్ష , ఉష్ణ గుణములు ఉండుటచేత చర్మము కిందనే ఉండి మంట, పోటు కలిగించును.

తేలు కుట్టినప్పుడు చేయవలసిన చికిత్సలు –

* ఎటువంటి తేలు కుట్టినను , మండ్రగబ్బ కరిచినను కుట్టిన ప్రదేశము నందు తడిపి జీలకర్ర , సైన్ధవ లవణం కలిపి నూరి నేతిలో వేయించి దానిని ఒక గుడ్డలో పోసి కుట్టిన ప్రదేశము నందు కాపడం పెట్టి ఆ గుడ్డతోనే కట్టు కట్టవలెను . ఆ తరువాత పసుపు , నీరుల్లిపాయ కలిపి ఆ ప్రదేశము నందు నెమ్మదిగా రుద్దవలెను . ఆ తరువాత తులసి , వెన్న , గోమూత్రము కలిపి నూరి కుట్టినచోట లేపనం చేయవలెను .

* కప్పు వేడినీటిలో చెంచాడు ఉప్పు కలిపి తాగితే బాధ త్వరగా తగ్గును.

* గచ్చకాయ పగలగొట్టి దానిలోని పప్పును రెండు నీటిచుక్కలు వేసి అరగదీసి ఆ గంధాన్ని కుట్టినచోట రాసి నిప్పు వేడి చూపిస్తే విషాన్ని లాగివేస్తుంది. ఇదేవిధంగా కుంకుడుకాయ పై గుజ్జు గంధాన్ని వ్రాసి సెగ చూపించినా బాధ పోవును .

* ఎండిపోయిన గుమ్మడికాయ ముచ్చిక నీటితో అరగదీసి కుట్టినచోట రాయుచున్న బాధ తగ్గును. వసకొమ్మును అరగదీసి రాయుచున్న కూడా పనిచేయును .

* గుగ్గిలం పొడి కుట్టినచోట పెట్టి నిప్పువేడి చూపించుతున్న విషాన్ని లాగివేయును.

* తేలు కుట్టిన వెంటనే ఉత్తరేణి ఆకులను నలిపి కుట్టిన ప్రదేశములో రుద్దిన విషం విరుగుతుంది.

* జీలకర్రను నూరి కుట్టినచోట అంటించి నిప్పు వేడి చూపించుతున్న విషాన్ని బయటకి లాగును .

* పసుపును చిక్కగా నీటితో కలిపి కుట్టినచోట పెట్టి సెగ చూపించుతున్న అది ఆరుతున్న కొద్ది బాధ తగ్గును.

* రుద్రజడ ఆకులు నలిపి కుట్టినచోట రుద్దితే విషం తగ్గుతుంది . కుట్టిన వెంటనే నిప్పుని కుట్టినచోట నొక్కిపెట్టి వెంటనే తీసివేసిన బాధ వెంటనే తగ్గును. దీనికి కారణం నిప్పు తడిని అతివేగముగా లాక్కుంటుంది. తేలు విషం కూడా అతిస్వల్ప తడి ద్రవం.

* నేపాళం గింజలొని పప్పు జిల్లేడు పాలతో కలిపి నూరి కుట్టినచోట అంటించుతున్న విషాన్ని గుంజివేయును . ఈ పద్ధతితో నేను చికిత్స చేశాను . ఇది నా అనుభవయోగం .

ఇప్పుడు మీకు తేలు కుట్టినప్పుడు ఏయే లక్షణాలు కనిపిస్తే రోగి మరణించునో తెలియచేస్తాను.

కన్నులు , ముక్కు, నాలుక ఇవి వాని యొక్క సహజ గుణములు పొగొట్టుకొని విపరీత గుణములు అనగా కన్నులు సరిగ్గా చూడలేకపోవుట , ముక్కు వాసనని గుర్తించలేకపోవుట , నాలిక రుచిని గ్రహించకపోవుట , శరీరము నందు కాలినట్లు బొబ్బలు , వాపు కలుగుట , నొప్పి , జ్వరం , వాంతి కలిగి గాయము నందలి మాంసము ఊడిపడిపోవుట వంటి లక్షణాలు తేలు కుట్టిన రోగికి కలిగినచో ఆ రోగికి చికిత్స చేసినను బ్రతకడు . ఈ లక్షణాలు చికిత్స సమయానికి అందకుండా ఆలస్యం అవుతున్నకొలది మొదలై చివరకు ప్రాణాలు హరించును .

శరీరంలో నీరసం , నిస్సత్తువ హరించుటకు సులభయోగాలు –

* వేసవికాలంలో మంచిరకం మరియు తియ్యటి మామిడిపండ్లు పూటకు ఒకటిచొప్పున రోజూ తినుచున్న త్వరలో శరీరంలో నీరసం పోవును .

* రోజుకో కొబ్బరిబోండం తాగుచూ అందులోని లేతకొబ్బరి తినుచున్న నీరసం పోయి బలం కలుగును.

* అప్పుడప్పుడు కొంచం దాల్చిన చెక్క బుగ్గన పెట్టుకుని దాని రసం మింగుచున్నా శరీరం లొని నీరసం తగ్గును.

* రోజుకొకసారి నేలవేము సమూల కషాయాన్ని పావుకప్పు చొప్పున ప్రతినిత్యం తాగుచున్న నీరసం , నిస్సత్తువ హరించును . జబ్బు వలన శరీరం నీరసపడినవారు దీనిని వాడటం వలన మంచి ఫలితాలు వస్తాయి.

* రాత్రి సమయంలో నాలుగు ఎండు ఖర్జూరాలు ఒక రాగిచెంబులో నానబెట్టి ఉదయాన్నే విత్తనాలు తీసివేసి ఆ ఖర్జూరాలు తిని ఆ రాగిచెంబులోని నీరు తాగుచున్న శరీరము నందలి నిస్సత్తువ హరించును .

* తుమ్మజిగురు ఉశిరికాయ అంత తీసుకుని ఒక కప్పు నీటిలో వేసి కొంచం పంచదార చేర్చి ప్రతినిత్యం తాగుచున్న నీరసం పోయి బలం కలుగును.

* ప్రతినిత్యం పులవకుండా తియ్యగా ఉన్న తాటికల్లు ఒక గ్లాసు చొప్పున తీసుకొనుచున్న శరీరానికి మంచి పుష్టి కలుగును.

పైన చెప్పిన వైద్య యోగాలలో మీకు సులభమైన యోగాన్ని ఎన్నుకుని దానిని పాటించండి.

జలుబు హరించుటకు సులభ ఆయుర్వేద యోగాలు –

* అల్లం , మిరియాలు , తులసి దళాలు సమభాగములుగా తీసుకుని దంచి కషాయం కాచి పూటకు గిద్దెడు (టీ గ్లాసు ) మోతాదులో తీసికొనవలెను .

* పండు జిల్లేడు ఆకు రసం మరియు నువ్వుల నూనె కలిపి శరీరముకు మర్దన చేయుచున్న జలుబు హరించును .

* 10 గ్రాముల శొంఠి చూర్ణమును 50 గ్రాముల వేడి నీటిలో కలిపి నిద్రపోయే ముందు పుచ్చుకొనుచుండిన యెడల జలుబు హరించును .

* నల్ల జీలకర్ర చూర్ణమును గుడ్డలో మూటకట్టి వాసన చూచుచుండిన జలుబు త్వరగా తగ్గును .

* వేడి వేడి మినప గుగ్గిళ్లను ఉప్పు కలిపి భోజనము చేసిన పిమ్మట తినుచుండిన యెడల రెండు మూడు రోజుల్లో జలుబు తగ్గిపోవును .

పైన వివరించిన ఆయుర్వేద చిట్కాలలో మీకు అనువుగా ఉన్న ఒకదానిని ఎంచుకొని పాటించి సమస్య నుంచి బయటపడగలరు .

జలుబు , పడిసం వంటి సమస్యలతో ఇబ్బంది పడున్నప్పుడు చల్లటి పదార్దాలు , పచ్చళ్లు , పాలు మరియు పాల సంబంధ ఉత్పత్తులు , ఫ్రిజ్ నీరు , కూల్డ్రింక్స్ వంటివి సేవించరాదు .

Dr Kishore Mahoday,
Can we use Ayurveda medicine along with Allopathy for a specific ailment, say fever – will there by any side effects

Ayurveda is not an alternative therapy but a native therapy does it is well occustomed by the body for the well being hence it can be taken along with allopathy for many indications and especially for fever it is recommended for a faster recovery devoid of side effects and boasting of immunity.

Dear Viewers,

I noticed that in the Article, in PDF Document, posted above in this Page under the caption “Ayurveda and Astrology” in the first Para of the 1st Page, the following sloka has not come properly, which shall read as :

“Vadas say vedangas are six limbs, i.e. ” छन्दः पादौ(FEET) तु वेदस्य :: हस्तौ(Hands) कल्पोऽथ पठ्यते ;ज्योतिषामयनं चक्षु (EYES)::
र्निरुक्तं श्रोत्र(EARS) मुच्यते ।। शिक्षा घ्राणं (NOSE) तु वेदस्य;मुखं(MOUTH) व्याकरणं स्मृतम्; तस्मात्साङ्गमधीत्यैव ब्रह्मलोके महीयते ।।” of Veda Purusha

This sloka – ज्योतिषामयनं चक्षु (EYES) means Astrology is the EYES of Veda Purasha”

I regret inconvenience

I further request the viewers to kindly provide their comments and suggestion on this Article, to enable me to improve the same so that it will be more useful and knowledgeable.
With regards,

ఆయుర్వేదం నందు వివరించబడిన భోజన నియమాలు –

“అన్నం పరబ్రహ్మ స్వరూపం” కావున నియమనిష్టలతో భోజనం చేయవలెను . ప్రస్తుత పరిస్థితుల్లో ఎటువంటి నియమ నిబంధలు పాటించకుండా మనుషులు తమ ఇష్టానుసారం ప్రవర్తిస్తున్నారు. మనం చేసే ప్రతిపని కొన్ని నియమానుసారాల ప్రకారం చేసినప్పుడే ఆ పని సత్ఫలితాన్ని ఇస్తుంది. ఇటువంటి నియమనిబంధనలు మన పూర్వీకులు ఎంతో దూరదృష్టితో ఆలోచించి కొన్ని , తమ అనుభవ పూర్వకంగా కొన్ని ఏర్పరిచారు. వాటిని పాటించటం వలన మనకి మంచి ఆరోగ్యం , ఆయష్షు కలుగును. కొన్ని పురాతన గ్రంథాలు పరిశీలించి వాటిలో మీకు కొన్ని తెలియచేస్తున్నాను .

భోజన నియమాలు –

* భోజనం చేయటానికి ముందే స్నానం ఆచరించి దేవతార్చన చేసి మంచి మనసుతో మంగళకరమైన వస్తు దర్శనం చేయవలెను . సూర్యుడు , అగ్ని, గోవు మొదలగు మంగళకరం అయిన వాటిని దర్శించుకొనవలెను . ఆ తరువాత చల్లని నీటితో బాగుగా కాళ్లు , చేతులు , ముఖం పరిశుభ్రం చేసుకుని తెల్లని వస్త్రం ధరించవలెను
ఎందుకనగా యోగశాస్త్రం నందు మనుషుని యొక్క శ్వాస గతి 12 అంగుళములు అనియు భోజనకాలం నందు మనుష్యుని యొక్క శ్వాసగతి 20 అంగుళములు అని తెలుపబడినది. అతిశ్వాస ఆయుఃయుక్షీణం .శ్వాసగతి తగ్గిన యొడల ఆయుర్వృద్ధి అగును. కావున భోజనకాలం నందు హస్త, పాద , ముఖప్రక్షాళన చేయనిచో శ్వాసగతి ఎక్కువ అగును. అందుకే చల్లని నీటితో ప్రక్షాళన చేసుకుని ప్రశాంత మనస్సుతో భోజనశాల కు చేరవలెను .

* తడిసిన పాదములతో భోజనం చేయవలెను దీనివల్ల ఆయుర్వృద్ధి కలుగును. తడిసిన పాదములతో శయనించిన ఆయష్షు క్షీణించును. దీనికి ముందు పితృదేవతలను , అతిధులను , శిశువులకు , గర్భిణి స్త్రీలకు , పెంచుకున్న పశుపక్ష్యాదులకు మొదట ఆహారం మొసంగి తృప్తిపరుచుట మరువకూడదు .

* ఆహారము మనస్సుకి, తృప్తిని , బలం, ఆయష్షు , తేజస్సు , ఉత్సాహం , జ్ఞాపక శక్తి , రోగనిరోధక శక్తి కలిగించును.

* ఆయష్షు కోరువాడు భోజనం తూర్పుముఖంగా , యశస్సు కోరువాడు దక్షిణముఖంగా కూర్చొని భుజించవలెను .

* ఉత్తరాభిముఖంగా కూర్చుని భుజించిన యెడల విద్యుత్ శక్తి నరముల ద్వారా అత్యంత తీవ్రంగా ప్రవహించును. అందువలన ఉత్తరాభిముఖంగా కూర్చుని భుజించరాదు .

* పితృదేవతలు దక్షిణదిశ యందు ఉండుటచే దక్షిణదిశకు అభిముఖంగా కూర్చుని భుజించటం వలన యశస్సు లభించును.

* భోజనం పగలు దినములో ఎనిమిదో వంతు కాలం అనగా ఉదయం 9 గంటల నుంచి 12 గంటల మధ్య చేయవలెను .

* ఉదయం 9 గంటలలోపు భుజించినచో ధాతువులు పూర్తిగా జనించవు . 12 గంటల తరువాత భుజించినచో బలం క్షీణించును. కావున ఉదయం 9 నుంచి 12 గంటల మధ్యనే భుజించవలెను .

* రాత్రి భోజనం 8 గంటల లోపు ముగించవలెను . అదికూడా తేలికైన సులభంగా జీర్ణం అయ్యే విధంగా ఉండును.రాత్రి సమయాన మన శరీరంలో మెటబాలిజం రేటు బాగా తగ్గును. కావున తిన్న ఆహారం శక్తిగా మారక కొవ్వుగా మారును . రోగులు ముఖ్యంగా
ఆస్తమా రోగులు 7 గంటలకే ఆహారాన్ని భుజించవలెను .

* భోజన విషయంలో సమయపాలన గురించి నీతిశాస్త్రం చెప్తున్న విషయం మీకు తెలియచేస్తున్నాను . ” నీకోసం వందమంది కాచుకుని కూర్చున్నను సమయం అయితే వారిని విడిచి భోజనం చేయాలి . వెయ్యి మంది కూర్చున్నను వదిలివెళ్ళి స్నానం చేయవలెను . లక్షమంది వద్దన్నా వెళ్లి దానం చెయ్యాలి . కోటిమంది కాదన్నా వెళ్లి భగవంతుడి ధ్యానం చేయాలి ” అన్నది నీతిశాస్తం వివరించింది.

* మలమూత్రములు బాగుగా వెడలి , హృదయం నిర్మలమై , వాతాది దోషములు చక్కగా ప్రవర్తించుచు లోగడ భుజించిన ఆహారం జీర్ణమైనట్టు త్రేపులు వచ్చి బాగుగా ఆకలిపుట్టి , వాతం క్రిందివైపు పయనించి సంచరిస్తూ జఠరాగ్ని బాగా ప్రజ్వరిల్లుతూ ఇంద్రియములు వినిర్మములై శరీరం తేలికగా ఉన్నప్పుడు కాలం అతిక్రమించకుండా నియమం ప్రకారం ఆహారం భుజించవలెను .

* ఆకాలంలో అతిస్వల్పంగా భుజించినను అది విషంగా మారి రోగాలకు కారణం అవుతుంది. ఎల్లప్పుడు సకాలంలోనే భుజించవలెను .

* ఉదయం , సాయంకాలం నందు మాత్రమే మనుష్యులు భోజనం చేయాలని వేదం చెప్తుంది .ఆయుర్వేదం ప్రకారం “ఏకభుక్త్తోమహాయోగి , ద్వీభుక్తో మహాభోగి, త్రిభుక్తో మహారోగి ” అనగా రోజుకి ఒకసారి భోజనం చేసేవాడు మహాయోగి , రోజుకి రెండు సార్లు భోజనం చేసేవాడు మహాభోగి , రోజుకి మూడుసార్లు భోజనం చేసేవాడు మహారోగి అని అర్థం .కావున రోజుకి రెండుసార్లు మాత్రమే భోజనం చేయడం శ్రేష్టం అని మన సాంప్రదాయం చాటుతుంది.

* రెండు భోజనాల మధ్య ఫలహారం అనగా పండ్లు తినవచ్చు. జీర్ణక్రియ అయ్యే సమయంలో మరలా భుజించరాదు . అది రోగాలకు ముఖ్యకారణం . అప్పుడప్పుడు జీర్ణ అవయవాలకు విశ్రాంతి ఇవ్వవలెను.లేనిచో అవి బలహీనం చెందును

* చిన్నపిల్లలకు అన్నకోశం పెరిగి ఉండదు కనుక వారు శరీరంకి కావలసిన ఆహారం ఒక్క మారు తీసుకొనలేరు . వారు ఆటపాటలతో ఎగురుచుందురు. వారు ఒకటికి రెండు సార్లు తినినను తప్పులేదు . కష్టం చేయు శ్రామిక వర్గం వారు జఠరాగ్ని ఎక్కువుగా ఉండును. కావున వారు మూడొవసారి భోజనం చేయవచ్చు .

* మీరు తినవలసినంత మాత్రమే తినవలెను .ఎక్కువ తిన్నచో అజీర్ణం రోగం కలుగును. ఒకపూట ఎక్కువుగాను ఒకపూట తక్కువుగాను సేవించుటయు ఒక దినం తిని మరుదినం నిరాహారంగా అనగా ఏమి తినకుండా ఉండరాదు.

* మానవుడు తన పొట్ట యందలి స్థలముని నాలుగు భాగాలుగా విభజించి అందు రెండు భాగములు ఘనద్రవ రూపములు భక్ష్యములు
అనగా నమిలి తినదగినవి , భోజ్యమనగా నమలాక చప్పరించి తినతగినవి . లేహ్యం అనగా నాలుకతో చప్పరించి తినదగినట్లు కొంచెం ద్రవరూపంగా ఉండునది , పేయం అనగా మిక్కిలి ద్రవరూపం అయి త్రాగదగినది ఈ విధంగా నాలుగు రకాల ఆహారముల చేత ఒక భాగం నీటిచేత నింపి మిగిలిన ఒక భాగం వాయు సంచారం కొరకు అనగా జీర్ణక్రియ జరుగుటకై వదిలినచో ఆహారం బాగుగా జీర్ణం అగును.

* ప్రత్యేక పర్వదినములలో తీపి , నెయ్యి, నూనె పదార్దములు , సెనగ పిండితో తయారగునవి ఉపయోగించినప్పుడు మిగతా
భోజనం తగ్గించి చివర పెరుగును వాడకుండా ముఖ్యంగా చారు, మజ్జిగలతో భోజనం ముగించుట ఉత్తమం .

* భోజనం చేయుటకు తూర్పు ముఖం అలా వీలుకానిచో దక్షిణాభిముఖంగా ఉన్నతంగా , సమప్రదేశమున పీట లేక చాప మీద కూర్చొనవలెను. ఆకులమీద , ఇనుపమేకులు వేసిన పీటల మీద కూర్చుని భోజనం చేయకూడదు . ఇత్తడి మేకులు వేసిన పీటల మీద కూర్చుని తినటం ఆచారం .

* ఒక వస్త్రంని మాత్రమే ధరించి భోజనం చేయరాదు . కావున ఉత్తరీయం పైన కప్పుకొనవలెను . దానివలన శరీరం నకు బాహ్యవాయువులు తగలక సురక్షితంగా ఉండును.అది పట్టువస్త్రం అయితే మరింత మంచిది . తలపాగా ధరించి భోజనం చేయరాదు . టేబుల్ మీద భోజనం శాస్త్ర విరుద్ధం .

* ఆహారం భుజించు సమయం నందు అధికంగా మాట్లాడకుండా , అతిగా నవ్వకుండా మనుజుడు తన శరీరం నకు అనుకూలం అయిన మరియు తేలిక అయిన స్నిగ్ధగుణము , ఉష్ణగుణము కలిగి ద్రవప్రమాణం అయి మధుర , ఆమ్ల , లవణ, కటుతిక్త కషాయములు అను ఆరు రసములు గల ఆహారంను మిక్కిలి తొందరగా కాకుండా మిక్కిలి మెల్లగా కాకుండగా భుజించవలెను .

* ఆకలిగొన్నవారు, రోగులు , హీనులు , దరిద్రులు , బిక్షగాండ్రు వీరి యొక్కయూ కుక్క, కోడి మొదలగు వాని యొక్క దృష్టి భోజన కాలము న తగలకూడదు.కావున భొజనశాలకు వీరిని దూరంగా ఉండునట్లు చేయవలెను .

* బంగారు పాత్ర యందు భోజనం మంగళకరం మనోదోషములు పొగొట్టును. జఠరాగ్నిని వృద్ధిపరుచును. మంచి చూపుని ఇచ్చును.

* వెండిపాత్రల యందు శ్లేష్మాన్ని హరించును మూత్రరోగముని హరించును . ఆరోగ్యకరం . వెండి పళ్లెం మధ్యలో బంగారం తాపడం చేయుంచుట మంచిది .

* కంచుపాత్రలో భోజనం చేయుట నోటివెంట రక్తం పడు రోగముని నయం చేయును . శుభ్రంగా మరియు రుచికరంగా ఉండి నేత్రరోగములు హరించును . బుద్దిని పెంచును. అగ్నివృద్ధి పెంపొందించి శరీరానికి కాంతి ని ప్రసాదించును. ఎముకలు వృద్ది అగుటకు తోడ్పడును. హృదయ రోగములను నిగ్రహించును.

* స్టీల్ పాత్రలో భోజనం చేసిన పాండురోగం తగ్గును. కామెర్ల వ్యాధిని హరించును .

* అల్యూమినియం పాత్రయందు వండిన భోజనము వండుచున్న మరియు తినుచుండిన అతిసార వ్యాధి కలుగును.

* గాజు పాత్రలో ఆహారం తీసుకోవడం వలన ఉపయోగం ఏమియును లేదు . కేవలం దోషాలు మాత్రం కలగవు. ఆమ్లములు ఇందు ప్రభావం చూపించలేవు .

* అరటి ఆకు నందు భోజనం మిక్కిలి పరిశుభ్రం అయి శ్రేష్ఠంగా ఉండును. శరీరకాంతి , సంభోగశక్తిని పెంచును. ఆకలి దంతకాంతిని పెంచును. క్రిమినాశనకారి , ఉదరం నందు పుండ్లను తగ్గించును .

* మోదుగ ఆకుల యందు భుజించుటచే గుల్మరోగం , మహోదరం , క్రిమిరోగం , రక్త, పిత్త రోగాలు నయం అగును.మోదుగ చంద్రుడికి సంబందించిన వృక్షం . సాత్త్విక గుణాలు కలిగించును.

* మర్రి ఆకుల యందు భుజించటం వల్ల క్రిమిరోగం నివారణ అగును. నేత్రదోష నివారణ జరుగును.

* రావియాకు విస్తరి యందు భుజించిన పిత్త నివారణ జరుగును. అగ్నివృద్ధిని కలిగించును. జననేంద్రియ దోషాలు నివారణ అగును. విద్యార్జనకు మనస్సు పుట్టించును.

* పనస ఆకుల యందు భుజించిన అగ్నివృద్ది, పిత్తాన్ని హరించును .

* తామరాకు లో భోజనం విషహరంగ ఉండును. సరస్సులో ఉన్న తామరాకు పనిచేయదు .

మునగ ఆకు ఉపయోగాలు – సంపూర్ణ వివరణ .

మనలో చాలామందికి మునగ ఆకును ఆహారముగా తీసుకొవచ్చు అనే సంగతి చాలమందికి తెలియదు . మరికొంతమందికి మునగ ఆకు శరీరానికి వేడి చేస్తుందని అపొహ కూడా కలదు. ప్రకృతి ప్రసాదించిన అతి ముఖ్యమైన ఆహారపు విలువలు కలిగిన పదార్ధాలలో మునగాకును తప్పకుండా చేర్చాలి. మునగాకులో ఉన్న విటమిన్స్ గాని , ఖనిజ లవణాలు శరీరానికి అమితమైన మేలుని కలిగించును.

ఇప్పుడు మునగాకులోని ఆహారపు విలువల గురించి సంపూర్ణముగా వివరిస్తాను.

మునగాకులో ఆహారపు విలువలు –

16 కిలోల మాంసంలో విటమిన్ A ఎంత ఉంటుందో ఒక కప్పు మునగాకు రసంలో అంతే A విటమిన్ ఉంటుంది. అదేవిధముగా 9 గుడ్లలో గాని , 80 కప్పుల తాజా ఆవుపాలలో గానీ , అరకిలో వెన్నలో గానీ విటమిన్ A ఎంత ఉంటుందో 1 కప్పు మునగాకు రసంలో అంత ఉంటుంది.

16 అరటిపళ్ళలో గానీ , 8 ఆపిల్స్ లో గానీ , 6 కమలాలలో గానీ , రెండున్నర కిలోల ద్రాక్షలోగానీ , 6 నిమ్మకాయలలో గానీ , 20 మామిడి కాయలలో గానీ , ఏడున్నర కిలోల పుచ్చకాయలలో గానీ విటమిన్ C ఎంత ఉంటుందో అంత 1 కప్పు మునగాకు రసంలో C విటమిన్ ఉంటుంది.

900 గ్రాముల బాదంపప్పులో గానీ , 8 కమలాలలో గానీ , మూడున్నర కిలోల బొప్పాయిలోగాని , 20 కోడిగుడ్లలో గానీ , రెండున్నర కిలోల మాంసంలో గానీ ఎంత క్యాల్షియం ఉంటుందో అంత 1 గుప్పెడు మునగాకులో అంత క్యాల్షియం ఉంటుంది.

అదేవిధముగా దీనిలో ఉన్న మాంసకృత్తులు కూడా మాంసం , చేపలు , గుడ్లు , పాలు మొదలగు వాటిలో ఉన్నవాటికంటే అధికంగా ఉన్నాయి.

పైన మీకు మునగాకులో ఉన్న విలువైన విటమిన్ల గురించి పోషకాల గురించి వివరించాను. ఇప్పుడు మీకు మునగాకుతో ఔషధయోగాల గురించి సంపూర్ణముగా వివరిస్తాను .

మునగాకుతో ఔషధ యోగాలు –

* మరిగే నీటిలో గుప్పెడు మునగాకులు వేసి గట్టిగా మూతపెట్టి 5 నిమిషాలు ఉంచిన తరువాత ఆ పాత్రను చన్నీటిలో పెట్టి బాగా చల్లార్చి పాత్రలోని మునగాకు తీసివేసి మిగిలిన రసములో కొద్దిగా మిరియాలపొడి తగినంత ఉప్పు , 1 చెంచా నిమ్మరసం వేసి ప్రతిరోజూ ఉదయం సేవిస్తూ ఉంటే అజీర్తి , ఉబ్బసం , రక్తహీనత , మామూలు జలుబు , దగ్గు , నిస్సత్తువ వంటివి దరిచేరవు .

* ఒక స్పూన్ మునగాకు రసము , కొద్దిగా తేనె , ఒక గ్లాసు కొబ్బరినీటిలో కలిపి కలరా , విరేచనాలు , కామెర్ల వ్యాధులలో ఔషధాలు వాడుకుంటూ ఈ మిశ్రమాన్ని కూడా రోజుకి 2 నుంచి 3 సార్లు తీసుకుంటూ ఉంటే మంచిఫలితాలు వస్తాయి.

* ఒక కప్పు మునగాకు రసము బాగా వేడిచేసి చల్లార్చి పైపై నీటిని వంచేసి మిగిలిన పదార్ధములో పాలుపోసి కలిపి ప్రతిరోజూ పిల్లలకు తినిపిస్తుంటే పిల్లలు మంచి ఆరోగ్యముగా ఉండి చిన్నచిన్న వ్యాధులను లెక్కచేయకుండా చక్కగా ఆడుకుంటారు. వారి ఎముకలు గట్టిపడి పెరుగుదల బాగా ఉంటుంది.

* ఒక కప్పు మునగాకు రసము బాగా వేడిచేసి చల్లార్చి పైపై నీటిని వంచేసి మిగిలిన పదార్ధములో పాలుపోసి కలిపి ఆ మిశ్రమాన్ని గర్భిణీలు గర్భము ధరించిన నాటినుండి తీసుకొనుచున్న పిండము చక్కగా పెరుగుటయే కాక ప్రసవం సౌఖ్యముగా అగును. దీనిలో ఉన్న క్యాల్షియం , ఐరన్ , విటమిన్స్ బిడ్డ ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడును. కేవలం గర్భిణీ స్త్రీలు మాత్రమే కాకుండా అన్ని వయసులవారు స్త్రీపురుష బేధము లేకుండా టానిక్ లాగా వాడుకొనవచ్చు. ఈ మిశ్రమాన్ని బాలింతలకు ఇచ్చిన సమృద్దిగా పాలు ఉత్పత్తి అగును. ప్రసవానంతరం త్వరగా కోలుకుంటారు.

* బాగా మరిగించి చల్లార్చిన మునగాకు రసం ఒక చెంచా మోతాదులో తీసుకుని ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ నందు కలుపుకుని తాగిన మూత్రవిసర్జనలో మంట , కొన్ని మూత్రపిండాల వ్యాధులు , మలబద్దకం తగ్గును.

* ఒక చెంచా మునగాకు రసములో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ పడుకునే ముందు తాగుచున్న రేచీకటి తగ్గును. ఇంకా ఙ్ఞాపకశక్తి కూడా పెరుగును .

* పైన చెప్పిన మిశ్రమము నందు కొంచం నిమ్మరసం కూడా కలిపి తీసుకుంటే తలతిరుగుడు , మొలలు , ఎక్కిళ్లు , అజీర్ణం , తీసుకున్న ఆహారం శరీరానికి ఒంటబట్టకపోవడం వంటి సమస్యలు నివారణ అగును.

* మునగాకు రసము నందు నువ్వులనూనె కలిపి నీరంతా ఆవిరి అయ్యేంతవరకు మరగకాచి ఆ మిశ్రమాన్ని గజ్జి , దురద వంటి చర్మవ్యాధులకు పైపూత ముందుగా రాయుచున్న చర్మవ్యాధులు అంతరించును.

* మునగాకులను బాగా వేడిచేసి చిన్నచిన్న దెబ్బలకు , బెణుకు నొప్పుల పైన వేసి కట్టు కట్టిన నొప్పుల బాధలు తగ్గును.

* మునగాకు రసము లో కొద్దిగా నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకున్న ముఖము పైన మొటిమలు నశించి ముఖచర్మం మృదువుగా అగును.

* ఒకస్పూను మునగాకు రసములో 3 మిరియాలు పొడి చేసి కలిపి కణతలు పైన రాసుకున్న తలనొప్పి అంతరించును.

పైన చెప్పిన విధంగా ఎన్నో విలువైన యోగాలు కలవు. ఇప్పుడు మీకు మునగకాయలు మరియు మునగ పువ్వుల ఉపయోగాలు కొన్ని వివరిస్తాను .

* మునగ కాయలు , పచ్చిమామిడి కాయలు కలిపి వండిన కూర తినుచున్న వేసవిలో శరీరానికి చలవ చేకూరటయే గాక మన దేహము నందలి ఐరన్ , విటమిన్ C లోపించకుండా ఉంటాయి.

* మునగ పువ్వులను పాలలో వేసి కాగబెట్టి తాగుచున్న తాత్కాలిక నపుంసకత్వం తగ్గును.

* ఒక స్పూన్ మునగ పువ్వుల రసమును ఒక గ్లాసు మజ్జిగలో కలిపి తాగుచున్న ఉబ్బసానికి , అజీర్తికి మంచి ఔషధముగా పనిచేయును .

* మూత్రపిండాల వ్యాధిలో సంబంధిత మందులతో పాటు లేత కొబ్బరినీటిలో ఒక చెంచా మునగపువ్వుల రసము కలిపి తాగుచున్న మంచి ఫలితాలు కలుగును.

ఉల్లిపాయతో ఉపయోగాలు –

* సిగిరెట్లు , పాన్ పరాగ్ లు అధికంగా వాడటం వలన cancer లు వంటి వ్యాధులకు అద్బుతంగా విరుగుడుగా పనిచేస్తూంది .

* పిల్లలు బాగా పుష్టిగా ఆరోగ్యంగా ఎదగడానికి నీరుల్లి బెల్లం కలిపి తినిపిస్తూ ఉండాలి.

* రాత్రి పూట నిద్రపట్టక అవస్తలు పడే వాళ్లు పచ్చి నీరుల్లి పాయల రసం 20 గ్రా , పంచదార 10 గ్రా కలుపుకుని పూటకు ఒక మోతాదుగా రెండు పూటలా తాగుతూ ఉంటే పైల్స్ వ్యాధులు ఆశ్చర్య కరంగా తగ్గుతాయి .

* మేహా వాత నొప్పులు తో బాధపడే రోగులు ఆవాల నూనె , నీరుల్లిగడ్డ రసం సమాన బాగాలుగా కలిపి మర్దన చేస్తూ ఉంటే వాతనోప్పులు మాయం అయిపోతాయి .

* కుక్క కరిచినప్పుడు వెంటనే ఉల్లిపాయని తేనేతో కలిపి మెత్తగా నూరి కాటు వేసినచోట పట్టువేస్తే విషం హరిస్తుంది .

* నీరస రోగంతో బాధపడేవారు ప్రతిరోజు క్రమం తప్పకుండా 10 గ్రా నీరుల్లి రసం 10 గ్రా తేనే కలిపి తాగుతూ ఉంటే మంచిబలం , వీర్యవ్రుద్ది కలుగుతుంది.

* స్థనాల వాపు , పోట్లుతో బాధ పడే స్త్రీలు ఒక నీరుల్లి గడ్డని కుమ్ములో పెట్టి ఉడికించి స్థనాల మీద వేసి కట్టుకడుతూ ఉండాలి. ఇలా రెండు మూడు సార్లు చేయగానే వాపు , పోటు పోతాయి .

* మూర్చ వచ్చినపుడు నీరుల్లి రసం 4 చుక్కలు ముక్కులో వేసి నీరుల్లి రసాన్ని అరికాళ్ళకు మర్దన చేస్తే వెంటనే మూర్చ నుండి తేరుకుంటారు.

* కలరా సోకినపుడు వెంటనే 10 గ్రా నీరుల్లి రసం 10 గ్రా నిమ్మకాయ రసం కలిపి అందులో కొంచం పంచదార వేసి తాగుతూ ఉంటే చాలా తొందరగా కోలుకోవచ్చు .

* వాంతులు విపరీతంగా అవుతుంటే నీరుల్లి గడ్డని చితగ్గొట్టి వాసన చుస్తూ ఉండాలి.

* మూత్రాశయం లొ గాని , మూత్రపిండాల్లో గాని రాళ్లు ఏర్పడిన వాళ్లు ప్రతిరోజు నీరుల్లి రసం 10 గ్రా తీసుకుంటూ ఉంటే రాళ్లు కరిగిపోతాయి. బొట్టుబొట్టుగా పడే మూత్రవ్యాది కూడా పొతుంది.

* ముక్కునుండి చెడు నీరు , రక్తం ధారాపాతంగా కారుతూ భాద పడేవాళ్లు నీరుల్లి రసాన్ని రెండు ముక్కు రంద్రాల్లో రెండు చుక్కలు వేస్తే వెంటనే రక్తం , నీరు ఆగిపోతుంది .

* తేలు కాటుకి నీరుల్లిపాయ రసాన్ని రుద్దితే వెంటనే విషం విరుగుతుంది.

* చెవిపోటు వచ్చినపుడు నీరుల్లిపాయల రసం నువ్వుల నూనెలో కలిపి కొంచం గోరువెచ్చ చేసి గోరువెచ్చటి ద్రవాన్ని నాలుగు చుక్కలు చెవిలొ వేస్తే పోటు తగ్గును .

* కంటి రోగాలు ఉన్నవాళ్ళు నీరుల్లిరసం తేనే సమబాగాలుగా కలిపి కళ్ళలో రెండు చుక్కలు వేస్తూ ఉంటే కంటి కలకలు , కంటి ఎరుపులు , కంటి మంటలు , కంటి శుక్లాలు హరించి పోతాయి .

PV SANDEEP TO DR KISHORE Mahodaya: Are there medicines equivalent to antibiotics of Allopathy in Ayurveda

Question: Dr. Kishore, My son, 11 yrars old , getting frequent elergy of rashes on the body …. when ever, it happens, We r using Avil tab and Caladryl……. Can U pl enlighten why it is coming, is there any permanent cure and if so, what medication in Ayurveda. Pl do you advise us

It usually happens because of low immunity power at the age of 11, ilayachi,ie.Cardamom,pepper clove,turmeric, along with dilute milk to be taken thrice daily after food

DR KISHORE MAHODAYA
ARE THERE PROCESS OF DOING SURGERYK IN AYURVEDA…..IF SO, WHETHER KNEE REPLACEMENT SURGERY CAN BE DONE IN AYURVEDA TOO….. IN CASE OF KNEE REPLACEMENT, AS PER AYURVEDA PROCEDURE , WHETHER ORIGINAL “GOD GIVEN” KNEE REPLACED BY WHAT OR WILL BE ADJUSTED IN SOMEOTHER WAY SO THAT IT WILL STORE THE FLUID FOR FLEXIBILITY OF LEG . please clarify

Knee replacement is an allopathic procedure, however if the patient is not obese and quite cooperative in terms of diet and lifestyle and accommodative to panchakarma therapy and little medications they quality of life can definitely be improved and the original me be restored… It depends on the total damaged caused heather to the joints… And since how long is the patient suffering from this condition…. Many other parameters also do matter for the patient to recover naturally without surgery… For further details you may contact 80500 10100

గాయాలలో రక్తం ధారగా పోతున్నప్పుడు –

ఏదన్నా ప్రమాదాలలో గాయాల పాలు అయినప్పుడు రక్తస్రావం తీవ్రంగా ఉంటుంది. ఆ స్థితిలో పత్రబీజం ఆకులను ముద్ద చేసి గాయం పైన వేసి కట్టుకట్టి మరుక్షణమే పత్రబీజం ఆకులు మెత్తగా దంచి 10 నుండి 20 గ్రాములు మోతాదుగా ఒక చెంచా పటికబెల్లం పొడి కలిపి లొపలికి తాగించాలి.వెంటనే గాయాలు నుండి రక్తం కారడం ఆగుతుంది . రక్తస్రావం త్వరగా ఆగకపోతే మరో రెండు మూడు మోతాదులు గా కూడా ఒక గంట వ్యవధిలో లొపలికి ఇవ్వవచ్చు. అప్పుడు తప్పకుండా రక్తం ఆగి ప్రాణాలు దక్కుతాయి.

ప్రమాదాలు జరిగినప్పుడు దెబ్బలు తగిలి ఆయా అవయవాలు పిప్పిపిప్పిగా నలిగిపోయినప్పుడు వైద్యులు ఈ అవయవాలను సరిచేసి వాటిపైన ఈ పత్రబీజం ఆకులు కట్టేవారు . చితికిపోయిన మాంసం ముద్ద యధాస్థితికి వచ్చి అతి త్వరలోనే ఆ అవయవం ఆరోగ్యాన్ని పుంజుకొని మామూలుగా పనిచేస్తుంది .

గమనిక –

దీనిని సామాన్య పరిభాషలో “రణపాల ” అని పిలుస్తారు .

కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు

9885030034

KISHORE FORMULA (किशोर सूत्रा) = 1
_____________________________________

**INDIGESTION (अजीर्ण)**
====================

Fast lifestyle always relates to fast diseases… Going in Accord with the nature is always the best rather than working late nights or sleeping during mornings… Stress is always and self induced factor so better be away from the same.. good periodical physical exercises is a must to all at all ages.. meditation helps to a great extent. . As a part of other remedies to the complaints mentioned Hingu or asafoidita seasoned with ghee and rock Salt to be mixed with rice and to be consumed in the first morsal of food

అజీర్ణం పోగొట్టే ఆయుర్వేద సాంబారు –

కావలసిన వస్తువులు –

* ఇంగువ – 100 గ్రా .

* మిరియాలు – 100 గ్రా .

* వాము – 100 గ్రా .

పైన చెప్పిన వస్తువులు అన్ని కలిపి మెత్తని చూర్ణం గా తయారు చేసుకోవాలి . ఈ చూర్ణం ని పప్పుచారుల్లో , రసంలో , కంద మొదలయిన దుంప కూరల్లో తగినంత వేసుకుంటూ ఉంటే కూరలకు మంచి సువాసన , రుచి ఏర్పడతాయి .

దీనిని ఆహారంగా వాడటం వలన సమస్త అజీర్ణ వ్యాధులు హరించి నోటికి రుచి , ఆకలి కలుగుతాయి . గ్యాస్ , తేపులు , కడుపుబ్బరం తగ్గిపోతాయి . శరీరంలోని సమస్త ధాతువులకు పుష్టి కలిగించి ఆరోగ్యం చేకూరుతుంది .

కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034

గుండెజబ్బు నివారించే అద్బుత యోగం –

మంచి గోధుమలను శుభ్రపరచి రవ్వగా పట్టించి ప్రతిరోజు ఒక చిన్న గ్లాస్ రవ్వని నాటు ఆవునెయ్యిలో వేయించి నాటు ఆవు పాలలో పాతబెల్లం కలిపి పాయసం లా చేసుకొని ప్రతిరోజు భుజిస్తుంటే కొద్దికాలం లోనే గుండెజబ్బు నివారణ అగును.

గోధుమలు , మద్దిచెక్క చూర్ణం ని మేకపాలు లొ కలుపుకొని గాని , ఆవునెయ్యి వేడి చేసి దానిలో ఈ చూర్ణం ని వేసి దానికి చెక్కర కలిపి త్రాగినచో హుద్రోగం హరించును .

కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034

ప్రాచీన సూచి ( ఇంజక్షన్ ) వైద్య విధానం –

మన ప్రాచీన ఆయుర్వేదం నందు ఔషధాలను నోటి ద్వారా కాకుండా ఒక సూది ద్వారా లొపలికి ఇచ్చే వైద్య విధానం ఒకటి ఉన్నది. కొన్ని పరిస్థితులలో రోగి నోటి ద్వారా ఔషధాన్ని గ్రహించలేకున్నప్పుడు అనగా అపస్మారము , మూర్చ , సన్నిపాతము , పాముకాటు , మెదడు వ్యాధి , యాక్సిడెంట్స్ , మెదడు ని తినే ensplosis ఉన్మాదము వంటి వ్యాధుల యందు , స్మృతి లేని పరిస్థితుల యందు (COMA) రోగి రక్తం నందు ఔషధము ను ప్రవేశింప చేయుట . 1906 వ సంవత్సరంలో మద్రాస్ గవర్నర్ గా ఉన్న జార్జ్ ఏప్రెల్ గారు భారతీయ మెడికల్ అసోసియేషన్ ముందు ఉపన్యాసం ఇస్తూ ” టీకా “( వాక్సినేషన్) మరియు ఇంజక్షన్ విధానం మున్నగు పద్ధతులు డాక్టర్ జన్నర్ మహాశయుని కంటే పూర్వమే భారతీయులు వైదిక యుగము నుండియే టీకా విధానం వాడుచున్నారు అని డాక్టర్ కర్నల్ గారు నిరూపించారు అని సూచించిరి. డాక్టర్ కర్నల్ గారు ఋగ్వేదం , యజుర్వేదం , అధర్వణ వేదం నందలి ఒక మంత్రం ఈ విధంగా తెలియచేసారు .

మస్త్వాజ్జః ప్రసర్పఖంగా మంగం పరుశ్పరూహ్
తతో యక్షం వివాద్య స ఉగ్రో మధ్యమ శిఖి

దీనిలో ” ప్రసర్పన్ ” ” ప్రవిశ్యా ” ” అంతః ” శిరాముఖ వ్యాపనోచి అంజనా గల శీలద్రవ్యం అంగ ప్రత్యంగం లో ప్రవేశించుగాక . ఈ భావమునే వైజ్ఞానికులు తెలుపుతున్న వాక్సినేషన్ మరియు ఇంజక్షన్ పద్దతులను తెలుపుతుంది. ఈ సూచీ విధానం గురించి ఈ క్రింది గ్రంథాలలో వివరణ కనిపిస్తుంది.

* ధన్వంతరి సంహిత.

* రస కామధేనువు.

* రసరాజ వసంతము.

* బృహన్నిఘంటు రత్నాకరం .

* రసేంద్ర చింతామణి.

* యోగ చింతామణి.

* రసప్రకాశ సుధాకరము .

* శారంజ్గాధర సంహిత.

* బృహత్ యోగ తరంగిణి.

* రససైకత , కామ్కా ఉల్లాసం .

రక్త భేషజ విధానం అనగా ఔషద విశేషమును రక్తం నందు ప్రవేశింప చేసి వ్యాధిని నిర్మూలించే విధానం . మీకు కొన్ని ఉదాహరణలు వివరిస్తాను .

* సన్నిపాత ( typoid ) రోగి సృహ తప్పి పళ్ళు బిగించుకు పొయిన దశలో ఔషధమును నోటి నుండి గాని ముక్కుపుటము నుండి కాని లొపలికి పంపుటకు వీలుకాని దశలో కపాలమును పదునైన కత్తితో చీరి సిద్ధ ఔషధములు ను సూదిమొనకు వచ్చినంత మాత్రమే అందులో వేసి రుద్ది రక్తంతో కలిసిన వెంటనే మస్తిష్క నాడీకేంద్రం చేతనం పొంది వారు లేచి మాట్లాడతారు.

* తేలు కుట్టిన వెంటనే ఆ విషం పైకి ఎక్కకుండా గట్టిగా బిగించి కట్టి కుట్టినచోట బ్లేడుతో కాని కత్తితో కాని చీరినప్పుడు రక్తంతో పాటు విషం కూడా కారిపోవును . రక్తం తీయలేని వారు పొటాషియం పర్మాన్గానేట్ ఆ చోట వేసి చింతపండు నీటిలో తడిపి ఆ గుజ్జుని దానిపైన వేసిన కుతకుతమని పొంగి విషముని కాల్చివేయును. లేదా తెల్ల ఉల్లిగడ్డ మెత్తగా దంచి దానిపై వేసి కట్టు కట్టాలి. లేదా ఉత్తరేణి ఆకు రసముని గంటె లొ వేసి ఆవిరి పట్టేది.

* ప్రాచీన కాలంలో కొన్ని రకాల చెట్ల పసర్లుని సూదులు గుంపుగా కట్టి మొండి కీళ్ల నొప్పుల పైన ముసలివాళ్లు పచ్చ పోడిపించుకునే వారు . అడివి జాతుల యందు ఈ విధానం ఇప్పటికి అలవాటు ఉంది.

* పాము కరిచినప్పుడు రావిఆకులు తో చికిత్స చేస్తారు . రావిఆకుల చిన్న మండ తీసుకొచ్చి ఆకులు తుంచిన పాలు వచ్చును. పాము కాటువేసిన వ్యక్తి యెక్క రెండు చేతులు వెనకకి విరిచి కట్టి పాలుకారే ఆకు యెక్క తోడిమని కదలకుండా ఒక చెవ్వు రంధ్రములో కొంతవరకే దూర్చవలెను . చెవిలొ కర్ణ బేరికి తగలకుండా ఉండునట్లు జాగ్రత్త వహించవలెను. రెండొవ ఆకు తోడిమని మరొక చెవి రంద్రములో జాగ్రత్త వహించవలెను. అలా ఆకులని దూర్చగానే రోగి మూర్చ నుండి లేచి భాధతో కేక వేయును.అతనికి పూర్తిగా విషం దిగినదా లేదా అని తెలుసుకొనుటకు వేపాకు రోగిచే నమిలి తినిపించవలెను . పూర్తిగా చేదు ఉన్నట్లయితే విషం దిగిపోయినట్లు గుర్తించవలెను. లేనిచో మరియొక సారి చేయవలెను .

* తేనెటీగల కొండిలోని విషముతో కూడా వైద్యం చేయవచ్చు . శరీరాంగములు లో పొట్ట ఊది నీరు నిండి మెరుస్తూ ఉంటుంది. దానిలో పూర్తిగా నీరు నిండి ఉంటుంది. దీనినే జలోదరం అంటారు. ఇది చాలా కష్టసాద్యం అయిన వ్యాధి . శరీరం పై చర్మం మైనం లాగా అయిపొతుంది. మూత్ర పిండాలు పనిచేయవు . అట్టి సందర్భాలలో ఈ చికిత్స అధ్బుతంగా పనిచేస్తుంది . ఇది ప్రయోగించగానే మూత్రం అధికంగా వచ్చి శరీరం అంతా నీరు వాపు దిగి పొతుంది.

చిన్నపిల్లలకు వచ్చు మెదడు క్షయ లొ పిల్లవాడు తెలియకుండానే పడిపోతాడు. తల అటుఇటు కదల్చ లేడు కేకలు పెడతాడు. లేచి పడతాడు , తలనొప్పితో ఏడుస్తాడు , శరీరం ఒక పార్శ్వం చచ్చు పడుతుంది. పక్షఘాతం అర్ద భాగం లొ కొట్టుకుంటాడు , కండ్లు తిరుగుతూ దృష్టి ఉండదు. నాడి వేగముగా కొట్టుకుంటుంది. మూత్రం తక్కువై మెదడులో నీరు చేరుట చేత తెలివిహీనుడు అగును. అట్టివారికి ఈ మందు పనిచేయును .

తేనెటీగల కొండి చికిత్సా విధానం –

తేనెటీగల కొండి విషాన్ని ప్రత్యేకమైన సిరంజి ద్వారా చర్మము క్రింద ఇంజెక్ట్ చేస్తారు . మనకు కావలసినప్పుడు ప్రకృతి సిద్ధముగా తేనెటీగలు వచ్చి ఆయాభాగముల యందు కుట్టవు.కావున ప్రత్యేక పద్ధతుల ద్వారా ఆ విషమును సేకరించి ఈ సూచి చికిత్స ద్వారా పంపుదురు. దీనివలన బ్లడ్ ప్రెషర్ , గుండె , చర్మవ్యాదులు , కీళ్ళనొప్పులు , ముద్ద కీళ్ళనొప్పులు , ఉదరవాతం , గాయాలు మున్నగునవి నివారించ బడును.

కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034

శ్రీశైల పర్వతం మీది రహస్య మూలికా విశేషాలు –

ఇప్పుడు మీకు నేను వివరించబోయే విశేషాలు అన్నియు నిత్యసిద్ధనాధుడు రచించిన రసరత్నాకరం అనే ఒక ప్రాచీన గ్రంధం నుంచి తీసుకోవడం జరిగింది.

శ్రీశైల పర్వతంలోని చెట్లు, మన్ను, దుంపలు , నీరు , రాళ్లు , ఖనిజాలు మొదలయిన వాటితో అతిశీఘ్రంగా కాయసిద్దని పొందే మార్గాలు పరమ శివునిచేత చెప్పబడి భారతీయ రసశాస్త్రాలలో మహా గోప్యంగా ఉన్న వాటిని మాత్రమే సాధకులకు భక్తులకు ముక్తి, భక్తి ప్రధములుగా వివరిస్తున్నాను అని నిత్యనాధుడు తన ముందు మాటలో వివరించాడు.

ప్రస్తుత పరిస్థితులలో నిత్యనాద సిద్ధుడు తన గ్రంధంలో వివరించిన ప్రకృతి పరిసరాలు చాలా మారిపోయాయి. ప్రయత్నిస్తే కొంతవరకు కనుక్కోవచ్చు.

* శ్రీ మల్లిఖార్జున స్వామి సన్నిధికి ఎదురుగా ఏనుగుతో సమానం అయిన శిల ఒకటి ఉన్నది. అది రాత్రి సమయంలో ఎల్లప్పుడు గుగ్గిలం వంటి పదార్థాన్ని స్రవిస్తుంది. దానిని ముట్టుకోనుకుండా బ్రహ్మవ్రుక్షం అయిన తెల్ల మోదుగ కొయ్యతో గీకి ఎండబెట్టిన సొరకాయ బుర్రలో నిలువ చేసుకోవాలి ఆ గుగ్గిలం తో సమాన తూకంగా శుద్దిచేసిన గంధకం కలపాలి. ఆ మిశ్రమాన్ని రొజూ ఒకపూట విష్క మెత్తు మోతాదుగా భక్షిస్తూ ఉండాలి.ఇలా ఒక నెలరోజులు భక్షిస్తూ ఉంటే ఆ వ్యక్తి జరామరణాలు లేనివాడై ఆచంద్రార్కం జీవిస్తాడు.

అదే గుగ్గిలాన్ని కరిగిన తామ్రంతో కోటికొక వంతు చొప్పున వేస్తే అది దివ్యమైన బంగారం అవుతుంది.

* మల్లిఖార్జున స్వామికి ఎడమ దిక్కున ఘంటా సిద్దేశ్వరుని ఆలయం ఉంది. దాని ద్వారం నందు గల ఒక కుండములో ఒక గంట వ్రేలాడుతూ ఉంటుంది. కృష్ణ చతుర్దశి నాటి రాత్రి యందు ఉపవాసమున్న ముగ్గురు సాధువులు నిరంతరంగా నిర్వికల్పంగా చేయవలసిన సాధన ఇది. అదేమంటే ముగ్గురు సాదువుల్లో ఒకడు నిరంతరంగా శివుడిని అభిషేకం చేస్తూ ఉండాలి. రెండోవాడు అలసిపోకుండా రాత్రి అంతా అభిషేకానికి నీరు అందిస్తూ ఉండాలి. మూడోవాడు విరామం లేకుండా గంట వాయిస్తూ ఉండాలి. ఇలా చేస్తూ ఉంటే తెల్లవారేసరికి ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యి ఆ ముగ్గురికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు.మరియు అదృశ్య శక్తిని కూడా ప్రసాదిస్తాడు.

* ఘంటా సిద్దేశ్వరుని ఆలయానికి దక్షిణభాగంలో క్రోసేడు దూరంలో నేలలో తవ్వితే గోరోజనం వంటి మట్టి లభిస్తుంది. ఆ మట్టిని తులం ప్రమాణంలో పాలలో కలిపి పంచదార కలుపుకుని తాగితే 7 దినాలలో ఆ వ్యక్తికీ అమరత్వం సిద్ధించి మృత్యువుని జయించగలడు.

* మల్లినాదునికి పశ్చిమ దిక్కులో చంద్రోదకం అనే పేరు గల ఒక తీర్ధం ఉంది. విశాక పౌర్ణమి నాడు సాధకుడు దాని సమీపంలో ఉండి సిద్ధిని సాధించాలి. రాత్రిపూట ప్రతిరోజూ జపం చేస్తూ ఉండాలి. అర్ధరాత్రి పూట ఏ సమయంలో చంద్రుడు ఆ నీటిని తాకుతాడో అదే సమయంలో ఆ నీటిని దోసిలి పట్టుకొని తాగాలి. దానివల్ల వజ్రకాయం , శరీర పటుత్వం కలుగుతాయి. జరామరణాలు లేనివారై జీవిస్తారు.

కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు

9885030034

మధుమేహం లో పనిచేసే ప్రధాన మూలికలు –

* పొడపత్రి ఆకు –

దీన్నుంచి తీయబడ్డ ఒక ఎంజైమ్ కు గ్లూకోజ్ ద్రావణాన్ని బలహీనపరిచే గుణం ఉన్నట్లుగా కనుగొన్నారు. దీన్ని తిన్న తరువాత తీపి రుచిని కొంతసేపటి వరకు కనిపెట్టలేక పోవడం ఈ మొక్కకి ఉన్న ప్రత్యేకత . దీని ఆకుల నుంచి తీయబడిన జిమ్నిమిక్ ఆసిడ్ కి ఇన్సులిన్ ఉత్పత్తికి కారణం అయిన బీటా కణాలను బలోపేతం చేసే నైజం ఉన్నట్లుగా కనుగొన్నారు .

* కాకర –

కాకర కాయల నుంచి విత్తనాలు నుంచి తీసే పాలి పెప్టైడ్ కు బోవైన్ ఇన్సులిన్ తో సమానం అయిన గుణ ధర్మం ఉన్నట్టుగా భావిస్తున్నారు. ఇది రక్తంలోని గ్లూకోజ్ ని శరీర కణాలు గ్రహించేలాగా చేస్తుంది .

* పెద్దేగి –

ప్రయోగశాలల్లో జాగిలాలకు ఎల్లోక్సాన్ అనే పదార్ధంతో కృత్రిమంగా మధుమేహాన్ని కలిగించి పెద్దేగి సారాన్ని ఇచ్చినప్పుడు బ్లడ్ ప్రెషర్ గణనీయంగా తగ్గినట్లు గుర్తించారు. అలాగే ఎలుకల మీద ప్రయోగించినప్పుడు వాటి అన్నవాహిక నుంచే గ్లూకోజ్ శరీరంలోకి వెళ్ళకుండా ఆగిపోవడం గమనించారు.

పెద్దేగి మూలిక విషయంలో ఇంకా ఆసక్తి గొలిపే విషయం ఏమిటంటే ఇది ఇన్సులిన్ కి అవసరం అయిన ప్రో ఇన్సులిన్ నిర్మాణంలో సహాయపడగలదు అని కనుగొన్నారు . ఇది కొలెస్ట్రాల్ ని సమర్ధవంతంగా నియంత్రిస్తుంది.

* నేరేడు –

నేరేడు పండ్లకు , విత్తనాల చూర్ణం కి మధుమేహానికి వ్యతిరేకంగా పనిచేసే గుణం ఉన్నట్లు కనుగొన్నారు .

* తులసి –

ప్రయోగశాలల్లో ఎలుకలకు streptojotosin అనే పదార్థంతో మదుమేహాన్ని కలిగించి తులసి సారాన్ని ఇథనాల్ సహయంతో తీసి ప్రయోగించి చూసినప్పుడు రక్తంలో షుగర్ నిలువలు గణనీయంగా తగగినట్లు గుర్తించారు.

* శిలాజిత్ –

అష్టాంగ హృదయం అనే ఆయుర్వేద గ్రంధం శిలాజిత్ ని మదుమేహ నివారణకి ప్రముఖ ఔషధంగా చెప్పింది. దీనిని ప్రతిరోజూ 500 మిల్లి గ్రాముల చొప్పున రెండు పూటలా తీసుకుంటూ ఉంటే వ్యాధి శమించడమే కాకుండా ధాతు స్థిరత్వం ఏర్పడి వృద్ధాప్య చాయలు రాకుండా కాపాడుకోవచ్చు అంటుంది. ఈ గ్రంథరాజం.

అదే విధంగా మదుమేహంలో స్వర్ణమాక్షిక భస్మాన్ని గూర్చి కూడా ప్రముఖంగా చెప్పారు. అయితే మదుమేహానికి శిలజిత్ ని కాని , స్వర్ణమాక్షిక భస్మాన్ని గాని తీసుకుంటున్నప్పుడు జీవితాంతం ఉలవలు, పావురం మాంసాన్ని వాడకూడదు అని షరతు విధిస్తుంది. శాస్త్రం .

మధుమేహం పైన పనిచేసే కొన్ని ప్రయొగాలు –

* వసంత కుసుమాకరం 100 మి.గ్రా , శిలాజిత్తు 500 మి.గ్రా , పొడపత్రి చూర్ణం 500 మి.గ్రా , తేనేతో కలిపి రోజుకీ రెండు సార్లు భోజనం చేసిన తరువాత తీసుకోవాలి . ఇక్కడ తేనే అన్నప్పుడు మదుమేహంలో తీసుకోవచ్చా అన్న సందేహం కలగవచ్చు. తేనే సహజమైనంత వరకు దాని మోతాదు 5 మి.లి మించనంత వరకు తేనే ని తీసుకోవడాన్ని శాస్త్రం సమ్మతిస్తుంది.

* నాగభస్మం 125 మి.గ్రా , శిలజిత్ 250 మి.గ్రా , తేనేతో రోజుకి మూడు సార్లు తీసుకోవాలి . ఇది తీసుకున్న తరువాత , తిప్పతీగ నుంచి తీసిన రసాన్ని తాగితే మంచిది.

* జాతీపలాది వటి 100 మి.గ్రా మాత్రలని పొడపత్రి ఆకుల చూర్ణం తో సహా తీసుకోవాలి .

* అష్టాంగ హృదయం ప్రమేహంలో పచ్చిపసుపు , ఉచిరికవలపు కాంబినేషన్ ని అత్యంత గుణకారిగా చెప్పింది. ఈ రెండింటిని పొడి చేసుకోని డబ్బాలో భద్రపరచుకొని ప్రతిరోజూ భోజనానికి ముందు చెంచాడు చొప్పున తీసుకుంటే సరిపోతుంది.

మధుమేహ చూర్ణం కొరకు నన్ను సంప్రదించగలరు.

ఫొన్ నంబర్ – 9885030034 .

కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు

తీవ్రమైన గ్యాస్ సమస్య నివారణ కొరకు అద్భుత యోగం –

ప్రస్తుత కాలంలో చాలామంది తీవ్రమైన గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం సరైనటువంటి ఆహారం సరైనవేళల్లో తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం . ఇప్పుడు నేను చెప్పబోవు ఈ అద్భుత చిట్కా మిమ్మల్ని గ్యాస్ సమస్య నుంచి మిమ్మల్ని అద్భుతంగా బయటపడవేయును.

వాము 250 గ్రాములు .

జీలకర్ర 250 గ్రాములు .

ధనియాలు 250 గ్రాములు .

మూడింటిని వేరువేరుగా నూనె కాని నీరు కాని వేయకుండా కడాయిలో ఒక నిమిషంపాటు సన్నటి సెగ మీద వేయించి మూడింటిని కలిపి మెత్తటి చూర్ణంగా చేయవలెను . ఆ చూర్ణమును ఒక డబ్బా యందు గాలి పోకుండా నిలువ చేసుకొనవలెను . ఒక గ్లాసు నీటిని బాగా మరిగించి పొయ్యి మీద నుంచి కిందకి దింపిన తరువాత 2 స్పూనుల చూర్ణాన్ని మరిగించిన నీటిలో వేసి మూత పెట్టవలెను కొంచం ఆగి గోరువెచ్చగా అయినతరువాత వడకట్టుకొని తాగవలెను. ఇలా ప్రతి ఉదయం బ్రష్ చేసిన వెంటనే మరియు సాయంత్రం ఆహారానికి గంట ముందు మరలా చేసుకుని తాగవలెను.

పైన చెప్పిన యోగం 40 రోజులపాటు చేసినచో మీ గ్యాస్ సమస్య సంపూర్ణంగా పోవును . అలాగే ఆహారం తీసికొనుటకు అర్థగంట ముందు చిన్న అల్లం ముక్క కు ఉప్పు అద్ది నోటి యందు ఉంచుకుని రసం మింగుతూ ఉండవలెను . దీనివలన జీర్ణక్రియ మెరుగుపడి ఆహారం సంపూర్ణంగా జీర్ణం అగును.

అజీర్ణరోగముతో బాధపడువారు పాటించవలసిన ఆహార నియామాలు –

పాటించవలసిన నియామాలు –

తేలికయిన పాతబియ్యపు అన్నం . పాతబియ్యపు నూకల జావ , బార్లీ జావ , పెసలు , పేలాలు , పెసరకట్టు , మేక మాంసం , చిన్న చేపలు , అల్లం , ఉప్పు , తక్కువ కారం , లేత ముల్లంగి , వెల్లుల్లి , ఉల్లిపాయ , లేత అరటికాయలు , లేత మునగ కాయ , పొట్లకాయ , బీరకాయ , లేత వంకాయ , కాకరకాయ , నక్క దోసకాయ , చుక్కకూర , పెరుగు తోటకూర , పొన్నగంటి కూర , మెంతికూర , ఉశిరికాయ , దానిమ్మ , నారింజ పండు , బత్తాయి , మజ్జిగ , పలచని మిరియాల చారు , తాంబూలం , వేడినీరు , తేనె , చేదు , నూనె పలచటి పదార్దాలు , వగరు , చేదుగల పదార్దాలు తీసికొనవలెను . వ్యాయమం చేయవలెను .

పాటించకూడనివి –

కొత్త బియ్యపు అన్నం , పెద్ద చేపలు , బచ్చలికూర , అధికంగా నీరు తాగరాదు , ఆలస్యముగా జీర్ణం అయ్యే పదార్ధాలు . కంద , పెండలం , చామ , ఆలుగడ్డ , నేరేడు పండ్లు , గోధుమలు , పాలు , పాలతో చేసిన పదార్థాలు , చారపప్పు , జీడిపప్పు , నూనె అధికంగా ఉపయోగించి చేసే పదార్దాలు , వేపుళ్లు , పాతపచ్చళ్లు , ఉడకని పదార్దాలు , ముందు తినిన ఆహారం జీర్ణం కాక మునుపే మరలా తినరాదు . అమిత భోజనం , నిద్ర మేలుకుని ఉండటం , మలమూత్ర నిరోధం . టీ మరియు కాఫీ నిషిద్దం

పైన చెప్పిన ఆహారనియమాలు పాటిస్తూ నేను చెప్పిన యోగాన్ని పాటించుచుండిన అతి త్వరగా మీ సమస్య నుంచి విముక్తి పొందగలరు.

కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు

9885030034

కుంకుమ పువ్వు – సంపూర్ణ వివరణ – ఔషధోపయోగాలు .

కుంకుమ పువ్వుని సంస్కృతము నందు కాశ్మీరజము , కుంకుమము , బాహ్లీకము , శోణితము , సంకోచము , పీతనకము అనే పేర్లతో పిలుస్తారు . భావప్రకాశము అనే ప్రాచీన ఆయుర్వేద గ్రంథము నందు కుంకుమపువ్వు యొక్క నాణ్యత మరియు ఔషధగుణములు ఆయా దేశ వాతావరణ పరిస్థితుల పై ఆధారపడి ఉంటుంది అని తెలియచేయబడినది. వానిలో కాశ్మీర దేశము నందు పుట్టెడు కుంకుమపువ్వు చిన్నచిన్న కేశరములు కలిగి కొంచం అంత ఎరుపురంగుతో కూడుకుని కమలం వంటి పరిమళము కలిగి ఉండును అనియు ఇదే అత్యంత శ్రేష్టం అని రాయబడినది.

ద్రవ్యకోశము అనే వైద్యగ్రంధము నందు లేత ఎరుపురంగుతో , మంచి పరిమళముతో , చేతితో నలిపిన చేతికి అంటుకొని రంగువీడక యున్నచో అట్టి కుంకుమ పువ్వు శ్రేష్టం అయినది అనియు , బాగా ఎరుపు రంగుతో ఉండి నోటియందు వేసుకొనిన మిక్కిలి చేదుగా , పసుపుపచ్చ రంగుతో ఉన్నచో అట్టి కుంకుమపువ్వు తక్కువరకము అని తెలుసుకొనవలెను .

కుంకుమపువ్వు సాధారణముగా కొంచం చేదు కలిగి ఉండి నాలుకకు తిమ్మిరి కలిగించునదిగా మెత్తగా ఉండును. ఇది జిగటగా ఉండును. కొంతమంది ఈ కుంకుమపువ్వుని చందనంతో అరగదీసి పైపూతగా వాడుదురు . మరికొంతమంది తాంబూలముతో లోపలికి సేవించెదరు. శరీరం నందు వేడిని పుట్టించి వీర్యవృద్ధిని , కాంతిని , బలము , ఆయుర్వృద్దిని కలిగించి విషము , శోష , మదప్రకోపము , నేత్రవ్యాదులు , శిరోవ్యాధులు , గొంతుజబ్బులు , శరీరము నందలి మచ్చలు , దురదలు , కుష్టు , చిడుము , గజ్జి మున్నగు చర్మరోగములు , రసదోషములు , మేధోరోగములు మొదలైనవానిని హరించును . రక్తశుద్ది కలిగించి శరీర దుర్బలత్వము హరించును . గడ్డలను కరిగించును . చర్మరోగములు మాన్పును . కస్తూరి వలే ఏ ఔషధమునకు అయినను అనుపానంగా ఇచ్చిన ఔషధం త్వరగా పనిచేయును . టైఫాయిడు జ్వరము , ఉన్మాదరోగము , అపస్మారము , ప్రసవించు సమయంలో సంభవించు వాతరోగములు , ఋతురక్తబద్ధం , సమస్త నేత్రరోగములు ( కంటి పైన పట్టు వేయవలెను ) , ఓడలలో ప్రయాణము చేయువారికి వచ్చు జబ్బులు , మనోచాంచల్యములు పోగొట్టును .

గమనిక –

మితిమీరిన మోతాదులో తీసుకున్నచో రక్తము విరిచి అమితమగు వేడి పుట్టించి దౌర్బల్యము కలిగించును. కొన్నిసార్లు స్త్రీల గర్భకోశము పాడుచేయును . కుంకుమపువ్వు పుచ్చుకోదగిన ప్రమాణము 5 మొదలు 15 గోధుమగింజల ఎత్తు మాత్రమే .

మరింత సమాచారం కోసం నేను రచించిన గ్రంథాలు చదవగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు

9885030034

ముక్కు తెగినప్పుడు సుశ్రుతాచార్యుడు శస్త్రచికిత్స చేసిన విధానం –

చెట్టుయొక్క ఆకుని తీసి తెగియున్న ముక్కుభాగమును సరిగ్గా కొలతపెట్టి అంతప్రమాణం గల చర్మమాంసములు తో కూడిన పోరని దగ్గరగా ఉండు చెక్కిలి భాగం క్రిందనుండి మీదకి కోసి మీదభాగం పట్టు ఉండునట్లు ఉంచి ఆ పొరని ముక్కు యొక్క మొదలు వరకు పదునైన అంచుతో శస్త్రం తో గీచి రక్తం స్రవించునట్లు చేసి దానితో అంచులని అతికించి నాసారంధ్రములకు రెండింటికి తేలికైన గలగడ్డితో చేసిన గొట్టములని దూర్చి పైన ముక్కుయొక్క ఆకారంనకు సరిగ్గా ఆ కండపోరని సర్ది అప్రమత్తముగా , శీఘ్రముగా మీదకి ఎత్తి సూత్రాదులతో ( దారాలతో ) చక్కగా బంధనం చేసి దానిపైన రక్తచందనం , యష్టిమధూకం , రసాంజనం వీని చూర్ణంని చల్లి ఆ పైన తెల్ల దూదిపింజతో కప్పి నువ్వులనూనెని మాటిమాటికి వేసి తడుపుచుండవలెను . మరియు ఆ రోగికి జీర్ణం అయ్యేంత తగినంత నెయ్యిని త్రాగించి కొంచం స్థిమితపడిన తరువాత శాస్త్రానుసారం విరేచనం చేయించవలెను.

ఇలా చేయుచూ చక్కగా ఆ పోర అతుకుకున్న తరువాత అంతకు ముందు కొంచం పట్టు ఉంచిన కండ భాగాన్ని ఛేదించవలెను . ఇలా చక్కగా అతుకుకొనిన తరువాత కొంచం కృశించి ఉన్నచో ఆ భాగం నకు వెనక చెప్పిన తైలాది చికిత్సలను అనుసరించి ఆ భాగం పెరుగునట్లు చేయవలెను . ఒకవేళ అక్కడ మాంసం ఎక్కువుగా వృద్ధిచెంది యున్నచో సమముగా ఉండునట్టి ఉపాయం జూచి తగ్గించి సరిచేయవలెను . ఒక్కోసారి లలాటభాగం నందలి మాంసపుపొర కూడా కోసి అతకవలసి యుండును.

ఈ విధముగా సుశ్రుతాచార్యుడు శస్త్రచికిత్సలు కడు ఉపాయంతో సులభంగా చేసేవారు.

మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు

9885030034

తీవ్రమైన గ్యాస్ సమస్య నివారణ కొరకు అద్భుత యోగం –

ప్రస్తుత కాలంలో చాలామంది తీవ్రమైన గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రధాన కారణం సరైనటువంటి ఆహారం సరైనవేళల్లో తీసుకోకపోవడమే దీనికి ప్రధాన కారణం . ఇప్పుడు నేను చెప్పబోవు ఈ అద్భుత చిట్కా మిమ్మల్ని గ్యాస్ సమస్య నుంచి మిమ్మల్ని అద్భుతంగా బయటపడవేయును.

వాము 250 గ్రాములు .

జీలకర్ర 250 గ్రాములు .

ధనియాలు 250 గ్రాములు .

మూడింటిని వేరువేరుగా నూనె కాని నీరు కాని వేయకుండా కడాయిలో ఒక నిమిషంపాటు సన్నటి సెగ మీద వేయించి మూడింటిని కలిపి మెత్తటి చూర్ణంగా చేయవలెను . ఆ చూర్ణమును ఒక డబ్బా యందు గాలి పోకుండా నిలువ చేసుకొనవలెను . ఒక గ్లాసు నీటిని బాగా మరిగించి పొయ్యి మీద నుంచి కిందకి దింపిన తరువాత 2 స్పూనుల చూర్ణాన్ని మరిగించిన నీటిలో వేసి మూత పెట్టవలెను కొంచం ఆగి గోరువెచ్చగా అయినతరువాత వడకట్టుకొని తాగవలెను. ఇలా ప్రతి ఉదయం బ్రష్ చేసిన వెంటనే మరియు సాయంత్రం ఆహారానికి గంట ముందు మరలా చేసుకుని తాగవలెను.

పైన చెప్పిన యోగం 40 రోజులపాటు చేసినచో మీ గ్యాస్ సమస్య సంపూర్ణంగా పోవును . అలాగే ఆహారం తీసికొనుటకు అర్థగంట ముందు చిన్న అల్లం ముక్క కు ఉప్పు అద్ది నోటి యందు ఉంచుకుని రసం మింగుతూ ఉండవలెను . దీనివలన జీర్ణక్రియ మెరుగుపడి ఆహారం సంపూర్ణంగా జీర్ణం అగును.

అజీర్ణరోగముతో బాధపడువారు పాటించవలసిన ఆహార నియామాలు –

పాటించవలసిన నియామాలు –

తేలికయిన పాతబియ్యపు అన్నం . పాతబియ్యపు నూకల జావ , బార్లీ జావ , పెసలు , పేలాలు , పెసరకట్టు , మేక మాంసం , చిన్న చేపలు , అల్లం , ఉప్పు , తక్కువ కారం , లేత ముల్లంగి , వెల్లుల్లి , ఉల్లిపాయ , లేత అరటికాయలు , లేత మునగ కాయ , పొట్లకాయ , బీరకాయ , లేత వంకాయ , కాకరకాయ , నక్క దోసకాయ , చుక్కకూర , పెరుగు తోటకూర , పొన్నగంటి కూర , మెంతికూర , ఉశిరికాయ , దానిమ్మ , నారింజ పండు , బత్తాయి , మజ్జిగ , పలచని మిరియాల చారు , తాంబూలం , వేడినీరు , తేనె , చేదు , నూనె పలచటి పదార్దాలు , వగరు , చేదుగల పదార్దాలు తీసికొనవలెను . వ్యాయమం చేయవలెను .

పాటించకూడనివి –

కొత్త బియ్యపు అన్నం , పెద్ద చేపలు , బచ్చలికూర , అధికంగా నీరు తాగరాదు , ఆలస్యముగా జీర్ణం అయ్యే పదార్ధాలు . కంద , పెండలం , చామ , ఆలుగడ్డ , నేరేడు పండ్లు , గోధుమలు , పాలు , పాలతో చేసిన పదార్థాలు , చారపప్పు , జీడిపప్పు , నూనె అధికంగా ఉపయోగించి చేసే పదార్దాలు , వేపుళ్లు , పాతపచ్చళ్లు , ఉడకని పదార్దాలు , ముందు తినిన ఆహారం జీర్ణం కాక మునుపే మరలా తినరాదు . అమిత భోజనం , నిద్ర మేలుకుని ఉండటం , మలమూత్ర నిరోధం . టీ మరియు కాఫీ నిషిద్దం

పైన చెప్పిన ఆహారనియమాలు పాటిస్తూ నేను చెప్పిన యోగాన్ని పాటించుచుండిన అతి త్వరగా మీ సమస్య నుంచి విముక్తి పొందగలరు.

మరిన్ని సులభ ఆయుర్వేద చిట్కాలు మరియు ఆయుర్వేద ఔషధాల వివరణాత్మకమైన సమాచారం కొరకు నేను రచించిన గ్రంథములు చదవగలరు .
కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు

9885030034

పండ్ల రసాలు వాటి ఉపయోగాలు – 1 .

* ఆపిల్ జ్యూస్ –

పిల్లల్లో వచ్చే అతిసార వ్యాధి విషయంలో ఈ పండు చాల ఉపయోగపడుతుంది. ఇందులోని పెక్ టిన్ విరోచనాలను అరికడుతుంది. ఇది ఉదరం , ప్రేగులకు డిస్ ఇన్ఫెక్ టెంట్ గా పనిచేస్తుంది . కామెర్లు , మూత్రపిండాలు , కాలేయ సంబంధ సమస్యలతో బాధపడేవారికి బాగా ఉపయోగపడును. ఇది గౌట్ మరియు కీళ్లవాపులతో బాధపడేవారికి మంచి ఔషధముగా పనిచేయును .

తాజా ఆపిల్ రసముతో పాటు తేనె కూడా కలిపి తీసుకోవడం ఆరోగ్యదాయకం . నరాల బలహీనత, మూత్రపిండాలలో రాళ్లు , ఆమ్లత్వము , అజీర్ణం, తలనొప్పి, పైత్యం , ఆస్తమా, రక్తవిరేచనాలు మొదలగువాటి నుండి విశ్రాంతి కలిగిస్తుంది. ఆపిల్ రసములో ఉండే కొంచం ఆమ్లం కూడా నోరు , పళ్ల మీద యాంటిసెప్టిక్ గా పనిచేస్తుంది . ఇది అన్నిరకాల దంతసమస్యలకు మంచిది .

* బీట్రూట్ జ్యూస్ –

బీట్రూట్ జ్యూస్ క్యాన్సర్ మీద బాగుగా పనిచేయును . ఈ రసాన్ని తాగడం వలన శరీరానికి మంచి బలం వచ్చును. శరీరపు బరువు తక్కువుగా ఉన్నవారు ఈ జ్యూస్ తీసుకోవడం వలన శరీరం బరువు పెంచుకోవచ్చు. ఈ బీట్రూట్ రసాన్ని క్యారెట్ , క్యాబేజి , మామిడి, బొప్పాయి , రసముతో కలిపి వాడవచ్చు .

* మారేడు పండు జ్యూస్ –

మారేడు పండు జ్యూస్ జీర్ణసంబంధ సమస్యలు , దీర్ఘకాల విరేచనాలు వంటి సమస్యలకు అద్భుతమైన ఔషధముగా పనిచేయును .

ప్రేగుల్లో సమస్యలు ఉన్నవారికి , కలరా సమస్య ఉన్నవారికి ఈ పండు రసం చాలా గొప్పగా పనిచేయును . ఈ పండు రసం మంచి పోషకాలను కలిగి ఉండి రక్తాన్ని శుద్దిచేయును . 50 మిల్లీగ్రాముల మారేడు పండు రసాన్ని వేడినీరు , పంచదారతో కలిపి రోజుకు రెండు నుంచి మూడుసార్లు తీసుకొనుచున్న రక్తంలో మలినాలు నిర్మూలించబడతాయి.

ఈ పళ్ళ రసాలు ఎప్పటికప్పుడు తయారు చేసుకుని తాగడం మంచిది .

కాళహస్తి వేంకటేశ్వరరావు .
అనువంశిక ఆయుర్వేద వైద్యులు .
9885030034

లక్షణాలని బట్టి మన శరీరతత్వం తెలుసుకునే ప్రాచీన వైద్య విధానం –

* శరీరపు లక్షణం –

వాతరోగి శరీరం నల్లగా ఉండును. పైత్యరోగి శరీరం పచ్చగా కాని , ఎర్రగాకాని ఉండును. శ్లేష్మరోగి శరీరం తెల్లగా ఉండును. ఏవైనా రెండురకాల తత్వాలు కలిగినటువంటి వారియొక్క శరీరం మిశ్రమ వర్ణంగా ఉండును.సన్నిపాత రోగి ( Typhoid ) శరీరం పాలిపోయినట్లు ఉండును.

* శబ్ద లక్షణం – (నాడి లక్షణం ).

వాత నాడి కలిగినవాడు నెమ్మదిగా మాట్లాడును . పైత్యనాడి కలిగినవాడు నవ్వుచూ
తుళ్ళుతూ ఉండును. శ్లేష్మ నాడి కలిగినవాడు సన్నటి , వినివినపడనట్టు గా మాట్లాడును .

* నేత్ర లక్షణం –

వాతరోగి కనులు నల్లగా కాని మబ్బుగా ఉండి నీరు కారుచుండును. పైత్యరోగి కన్నులు పచ్చగా కాని ఎర్రగా కాని ఉండును. శ్లేష్మరోగి కనులు పుసిగట్టి తెల్లగా ఉండును. సన్నిపాత రోగి కనులు పచ్చగా కాని ఎర్రగా కాని ఉండును. కామెర్ల రోగి కనులు పచ్చగా ఉండును.

* మల లక్షణం –

వాతరోగి మలము నల్లగా గట్టిగా మేక పెంటికలు వలే ఉండును. పైత్య రోగి మలము పచ్చగా కాని , ఎర్రగా కాని ఉండును. శ్లేష్మరోగి మలము తెల్లగా , బంకగా నురుగు కట్టి ఉండును. రెండురకాల తత్వాలు కలిసి ఉన్న రోగి మలము మిశ్రమ వర్ణంగా ఉండును.

* ముత్ర లక్షణం –

వాతరోగి మూత్రం తెల్లగా ఉండును. పైత్యరోగి మూత్రం కొంచం ఎరుపుగా ఉండును. కామెర్ల రోగి మూత్రం పచ్చగా ఉండును. శ్లేష్మరోగి
మూత్రం తెల్లగా నురుగు కట్టి ఉండును. రెండురకాల తత్వాలు పెరుగుట వలన రోగం కలిగిన రోగి మూత్రం మిశ్రమంగా ఉండును.

ఉదయాన్నే నిదుర లేచిన వెంటనే వెడల్పాటి తెల్లని పాత్రలో రోగి మూత్రమును పట్టి అందు నూనెచుక్క వేసిన అది వేగముగా మూత్రం అంతా పాకిన వాతరోగం అనియు , మూత్రం రక్తవర్ణంతో ఉండి మూత్రం వేచిన కదలక ఉండిన పైత్యరోగం అనియు , నూనెవేసిన వెంటనే ఆ నూనె చుక్క యందు బుడగలు లేచి మూత్రం పచ్చగా ఉండిన శ్లేష్మరోగం అనియు , మూత్రంలో వేసిన నూనె చుక్క తెల్లటి నురుగు కట్టిన సన్నిపాతరోగి అనియు , నూనె చుక్క వేసిన వెంటనే ఆ నూనె చుక్క ఏనుగు ఆకారంలో రావడం లేదా మనిషి ఆకారం వలేగాని తమలపాకు ఆకారం రావటం కాని లేక వేసిన వెంటనే మునిగిపోవడం గాని జరగడం లేదా మూత్రం నల్లగానో , ఎర్రగానో , పచ్చగానో ఉండిన ఆ రోగి యొక్క రోగం నయంచేయుట అసాధ్యం .

నూనెబొట్టు పద్మాకారం గాని , శంఖచక్రాకారం గాని , వీణ ఆకారంగాని , సింహాసన ఆకారం కాని మల్లెమొగ్గ వలే ఉండిన ఆ రోగి యొక్క రోగం నయం చేయుటకు సాధ్యం అగును.

* నాలిక యొక్క లక్షణం –

నాలిక పగిలి పైన పోర పచ్చగా ఉండిన వాతరోగం అనియు నాలిక పైన ద్రవం కలిగి తెల్లగా ఉండిన శ్లేష్మరోగి అనియు నాలిక పైపొర రేగి నల్లగా ఉండి అసలు తడి లేకుండా ఉన్నచో సన్నిపాత రోగి అనియు మిశ్రమవర్ణం కలిగి ఉన్న రెండురకాల తత్వాలు ప్రకోపించుట వలన కలిగిన లక్షణం అని తెలుసుకొని చికిత్స చేయవలెను .

పైన చెప్పిన లక్షణములు అన్నియు గమనించవలెను. ఒక్క నాడిని పట్టుకొని మాత్రమే రోగ నిర్థారణ చేయడమే కాకుండా రోగి యొక్క లక్షణాన్ని బట్టి వైద్యం చేయడం ప్రతి వైద్యుడు నేర్చుకోవలసిన ప్రధమ లక్షణం . నేను మీకు వివరించిన ప్రతిలక్షణాన్ని జాగ్రత్తగా పరిశీలించి గుర్తుపెట్టుకొన్న యెడల సమస్య ఉత్పన్నం కాకుండా మునుపే తగినజాగ్రత్తలు తీసుకొనచ్చు.

కాళహస్తి వేంకటేశ్వరరావు .
అనువంశిక ఆయుర్వేద వైద్యులు .
9885030034

మలబద్ధకం గురించి వివరణ – నివారణా యోగాలు .

మలబద్దకం అనేది సమస్తరోగాలకు మొదటి మెట్టు . మలం గాని ఆమం ( సరిగ్గా జీర్ణం కాని పదార్ధం ) వాతం వలన శుష్కించి ఉండలుగా గట్టి మలమార్గము నుండి సునాయాసంగా బైటకు వెడలకున్న యెడల ఆ వ్యాధిని మలబద్దకం అంటారు. ఆయుర్వేదం నందు ఈ వ్యాదికి “ఆనాహము” అని పిలుస్తారు .

మలబద్దకం సమస్య వలన నడుము , వీపు నందు పట్టుకొని ఉండటం , కడుపునొప్పి , ఆయాసము , వాంతి వంటి లక్షణాలు వస్తాయి. దప్పిక , జలుబు , శిరస్సు నందు మంట , రొమ్ము పట్టినట్లు ఉండటం , తేన్పులు పైకి రాకుండా ఉండటం వంటి లక్షణాలు కొందరిలో కనపడతాయి. మలబద్దకం సమస్య పెరుగుతున్న కొలది మనిషి వాతరోగాలు వస్తాయి.

ఇప్పుడు మీకు మలబద్దకం నివారణాయోగాలు వివరిస్తాను .

నివారణాయోగాలు –

* రాచ ఉశిరికాయ తినుచున్న సుఖవిరేచనం అగును.

* కాకరకాయ కూరను తరచుగా తీసుకొనుచున్న సుఖవిరేచనం అగును.

* ఎండిన ఎర్రరేగుపళ్ళు తినుచుండవలెను .

* చింతపండు చారు అద్బుతముగా పనిచేయును . అతిగా తీసుకున్న విరేచనాలు కలుగచేయును .

* బాగా పండిన అరటిపండు తినుచుండవలెను .

* నాగజెముడు , బొంతజెముడు , ఆకుజెముడు రసము 10 చుక్కలు తీసుకొనుచున్న సుఖవిరేచనం అగును. శరీర బలమును అనుసరించి 5 నుంచి 10 చుక్కలు తీసికొనవలెను .

* విరేచనం ఇబ్బందిగా ఉన్నప్పుడు 4 చెంచాల ఆముదం కొంచం వేడిచేసి లోపలికి తీసికొనవలెను . ఆముదం తీసుకోవడం ఇబ్బందిగా ఉన్నచో ఒక కప్పు గొరువెచ్చని పాలలో ఆముదం కలిపి తీసికొనవలెను .

* రోజూ నిద్రపోయే ముందు రాత్రి సమయములో రెండు గ్లాసుల నీరు తాగుచున్న ఉదయం సుఖవిరేచనం అగును. ఇలా తాగడం మొదలుపెట్టిన మొదటి రోజు నుంచే అవ్వొచ్చు లేదా రోజూ తాగుచున్న 4 రోజుల తరవాతి నుంచి వరస క్రమంలోకి వచ్చి సాఫీగా జరుగుతుంది.

* సునాముఖి చూర్ణం చెంచాడు తీసుకొనుచున్న సుఖవిరేచనం అగును.

మలబద్దకం సమస్య అనేది మనం తీసుకునే ఆహారాన్ని బట్టి ఉంటుంది. ప్రస్తుత కాలంలో జంక్ పుడ్ తీసుకోవడం ఎక్కువ అయ్యింది . ఇది అత్యంత ప్రమాదకరమైన ఆహారం . వీలైనంత వరకు అటువంటి వాటి దూరంగా ఉండవలెను . ఋతువు మారినప్పుడల్లా కడుపును శుభ్రం చేసుకొనుటకు విరేచనం కలిగించే ఔషధాలు తీసుకొనుట అత్యంత ప్రధానం అయింది.

చాలా మంది ఉదయాన్నే విరేచనముకు వెళ్ళి తమకు సుఖవిరేచనం అవుతుంది . అనే అపోహలో ఉంటారు. రోజుకి రెండుసార్లు విరేచనమునకు వెళ్ళినప్పుడే ఆరోగ్యకరమైన మనిషిగా భావించవలెను . మనం తీసుకునే ఆహారం కూడా మలబద్దకం సమస్య రాకుండా ప్రధానపాత్ర పోషిస్తుంది. ముఖ్యముగా నీరుని తీసుకోవడం , లేత ముల్లంగి , మునగ ఆకులు , మునగకాయ , కాకరకాయ , పొన్నగంటి కూర , ద్రాక్ష , వెల్లుల్లి , ఆవుపాలు , ఆముదము , ఉలవకట్టు , పాతబియ్యం , నెయ్యి , వెన్న తరచుగా ఆహారం నందు తీసుకోవాలి. పీచుపదార్ధాలు అధికముగా తీసికొనవలెను . పళ్లరసాలు కంటే పళ్లు తినటం మంచిది .

శరీరము నుండి వ్యర్థపదార్థాలు ఎప్పటికప్పుడు బయటకి వెళ్లినప్పుడే శరీరం నందు టాక్సిన్స్ పోగుపడవు . శరీరం ఆరోగ్యకరంగా ఉండును.

కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు 9885030034

మెదడు రోగాలు – నివారణా యోగాలు .

మెదడు చెడిపోవడానికి గల కారణాలు –

* మత్తు పదార్దాలు ఎక్కువుగా సేవించడం వలన.

* మానసిక శ్రమ ఎక్కువుగా చేయడం వలన.

* ఎక్కువ ఆందోళన , భయం , ఒత్తిడికి గురి అవ్వడం వలన .

* సంవత్సరాల తరబడి తలకు, పాదాలకి నూనె రాయకపోవడం వలన.

* విరుద్ధమైన ఆహారపదార్ధాలు సేవించడం వలన.

* మధువు, మాంసం ఎక్కువ తీసుకొవడం వలన.

మొదలయిన కారణాల వలన మెదడుకు రక్తం తీసుకుని పోయే రక్తనాళాలు అస్వస్థత చెంది మెదడు వ్యాదులు సంక్రమిస్తాయి.

మెదడు వ్యాధుల లక్షణాలు –

* ఏ పని చేయాలన్న ఉత్సాహం లేక పోవడం.

* తరచుగా తలనొప్పి రావడం.

* తలదిమ్ము,, తలతిప్పు కలగడం.

* జ్ఞాపకశక్తి తగ్గిపోవడం.

* అస్పష్టమైన భావాలు , ఆలోచనలు ఏర్పడటం .

* బుద్ధి మందగించడం.

* నరముల బలహీనత .

* పక్షవాతం రావడం .

ఇటువంటి లక్షణాలు అన్ని మెదడు వ్యాధి సంబంధ లక్షణాలుగా పేర్కొనవచ్చు.

నివారణా యోగాలు –

మెదడు మోద్దుబారితే –

* సునాముఖి ఆకు చూర్ణం పూటకు అర టీ స్పూన్ మోతాదుగా వెన్నతో కలిపి రెండు పూటలా తీసుకోవాలి.

* జాజికాయ చూర్ణం రెండు వేళ్ళకు వచ్చినంత రెండు పూటలా మంచినీళ్ళతో వాడాలి.

* తమలపాకు ల తాంబూలాన్ని రెండు పూటలా వేసుకోవాలి.

మెదడు లొ అతివేడి అనుగుటకు –

* ఆవనూనేలో ఉశిరిక పండ్లను ఒక వారం రోజుల పాటు నానబెట్టి తరువాత ఆ నూనేని తలకు మర్దన చేస్తూ ఉంటే మెదడులోని అతివేడి అనిగిపోతుంది.

* బాదం నూనెతో తలకు మర్దన చేసుకుంటూ ఉంటే తలలోని పోటు , వేడి , వికారం తగ్గిపోతాయి

* పెద్ద బచ్చలి ఆకుని నూరి రెండు కనతలకు పట్టు వేస్తే వెంటనే తలలోని దుష్ట వేడిమి తగ్గిపోయి హయిగా నిద్ర పడుతుంది.

మెదడు శుభ్రపడటానికి –

* గంజాయి ఆకుని నీడలో ఎండబెట్టి మెత్తటి చూర్ణంగా చేసుకొని కొద్దికొద్దిగా ముక్కు పోడుములాగా పీలుస్తూ ఉంటే మెదడు శుభ్రపడుతుంది.

కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034

వడదెబ్బ నివారణా యోగాలు –

* ఉల్లిపాయ రసమును వంటికి పట్టించిన వడదెబ్బ నివారణ అగును.

* వేసవి ఎండలో నడవవలసి వచ్చినపుడు ఒక ఉల్లిపాయ టోపిలో గాని రుమాలులో గాని నడినెత్తిన పెట్టి కట్టుకొని నడిచిన వడదెబ్బ తగలదు.

* నీరుల్లిపాయ రసం రెండు కణతలకు , గుండె ప్రదేశములో పూసిన వడదెబ్బ తగలడం వలన కలిగిన బాధలు తగ్గును.

* వడదెబ్బ తగిలిన ముఖము పైన , శరీరము పైన నీళ్లు చల్లుతూ తలపైన మంచుగడ్డలు ఉంచి తాగుటకు నిమ్మరసంలో ఉప్పు కలిపి ఇవ్వవలెను.

* కుమ్మున ఉడికించిన మామిడికాయ రసములో ఉప్పు , జీలకర్ర కలిపి భోజనం నందు తాగుచుండిన వడదెబ్బ తగలదు.

* విశ్రాంతిగా పడుకోనిచ్చి ఆ తరువాత కాఫీ ఇచ్చిన వడదెబ్బ నుంచి తేరుకొందురు.

* 48 గ్రాముల చన్నీటిలో ఒక తులము తేనె కలిపి ఇచ్చిన వడదెబ్బ నివారణ అగును.

* వడగళ్ళు పడినపుడు ఆ ఐస్ గడ్డలను ఏరి విభూతిలో వేసి నిలువ ఉంచి జాగ్రత్తగా దాచి ఆ విభూతిని మూడువేళ్ళకు వచ్చినంత తీసుకుని మంచినీటిలో వేసి వడదెబ్బ తగిలిన వారికి ఇచ్చిన వడదెబ్బ నివారణ అగును.

* తరువాణి తేటలో ఉప్పును చేర్చి ఇవ్వవలెను.

* తాటిముంజలు పంచదారతో కలిపి తినిపించవలెను.

* నాలుకకు పాత ఉశిరిక పచ్చడి రాసి పుల్లని ఆవుమజ్జిగ లో ఉప్పువేసి అన్నంలో పోసి పిసికి పిప్పిని పారవేసి ఆ రసమును తాగించవలెను .

* చన్నీటితో స్నానం చేయించవలెను .

* వేడివేడి పలచటి గంజిలో ఉప్పు వేసి తాగించవలెను .

వడదెబ్బ తగిలినప్పుడు పైన చెప్పిన యోగాలలో మీకు వీలైనవి పాటించి సమస్య నుంచి బయటపడండి . ప్రస్తుత పరిస్థితుల్లో ఎండలు చాలా ఎక్కువ అవుతున్నాయి. వీలున్నంతవరకు బయటకి పోకుండా ఉండటం మంచిది . వెళ్ళవలసి వస్తే పైన చెప్పిన యోగాలు పాటిస్తూ జగ్రత్త వహించండి.

మీకు తెలిసినవారందరికి ఈ విషయం షేర్ చేయండి .

కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034

పక్షవాతానికి ఆయుర్వదంలో పూర్తి చికిత్స
(Peralsis Full treatment)

Tadhkal Rahul Kumar
9989834020

భోజనం చేయుటకు ఉపయోగపడే ఆకులు – వాటిలోని ఔషధ గుణాలు –

కొంతకాలం క్రితం ఒక గ్రామము నందలి బాలురు తీవ్రమైన అతిసార వ్యాధితో బాధపడుతున్నారు. వారికి ఎంత మంచి చికిత్స అందించినను వ్యాధి తీవ్రత తగ్గటం లేదు . వారిని పరిశీలించుటకు వచ్చిన శాస్త్రవేత్తలు వారు ఆహారం తీసికొనుటకు ఉపయోగించుచున్న అల్యూమినియం పాత్రలను ప్రయోగశాలకు పంపినప్పుడు వారి రోగానికి కారణం వారు భుజించు ఆహారం కాదు వారు ఆహారాన్ని వండటానికి ఉపయోగించుచున్న అల్యూమినియం పాత్రలే కారణం అని నిర్దారణకు వచ్చారు. ఈ అల్యూమినియం పాత్ర యందు వండబడిన ఆహారం విషపూరితం అగును. అది శరీరం పైన ఒక్కసారిగా తన ప్రభావాన్ని చూపించదు. కొంచం కొంచంగా మనిషి యొక్క ఆరోగ్యాన్ని దెబ్బ తీయును .

అల్యూమినియం పాత్ర యందు ఆహారాన్ని ఉడికించడం మూలాన ఆహారం నందలి ఆమ్లములు , అల్యూమినియం లోహము పైన ప్రభావం చూపి అనేక విషసంభంధ రోగాలకు ప్రధానకారణం అగును. ముఖ్యంగా చర్మ సంబంధ , నరాల సంబంధ సమస్యలు అధికంగా వచ్చును. శరీరం నందు కేన్సర్ కూడ వృద్ధిచెందును.

పైన చెప్పినటువంటి సమస్యలు రాకుండా ఉండుటకు ముందుగా మనం ఆహారాన్ని వండే వంట పాత్రలను మార్చవలెను. అదేవిధముగా మనం ఆహారాన్ని భుజించుటకు విస్తరాకులు వాడటం ఎంతో మంచిది . ఇప్పుడు మీకు ఎటువంటి ఆకులతో చేసిన విస్తరాకులలో తింటే ఎటువంటి ఫలితాలు వస్తాయో వివరిస్తాను.

* అరటి ఆకు –

ఇందు భుజించటం మిక్కిలి శ్రేష్టం. కఫవాతములను హరించును . బలమును , ఆరోగ్యమును పెంచును. శరీరకాంతిని , సంభోగ శక్తిని పెంచును. ఆకలిని , దంతకాంతిని కలిగించును. పైత్యశాంతిని కలుగచేయును . శ్లేష్మ సంబంధ దోషాలు పోవును . శరీరం నొప్పులు తగ్గించును . ఉదరము నందలి పుండ్లు అనగా పెప్టిక్ అల్సర్ ను నయం చేయును .

* మోదుగ విస్తరి –

ఇందులో భుజించుటచే గుల్మరోగం , మహోదరం , క్రిమిరోగం , రక్తసంబంధ రోగాలు , పిత్తరోగములు నశించును. బుద్దిని పెంచును.

* మర్రి ఆకు విస్తరి –

దీని యందు భుజించిన క్రిమి రోగ నివారణ , జఠరాగ్ని వృద్ది , కుష్ఠు వ్యాధి నివారణ అగును. నేత్రదోష నివారణ అగును. వీర్యవృద్ధి కలుగును.

* పనస –

దీని విస్తరి యందు భుజించిన అగ్నివృద్ధి , పిత్తహర గుణములు ఉండును.

* రావి –

ఇది పిత్తశ్లేష్మ నివారణ , అగ్నివృద్ది కలిగించును. వీర్యవృద్ధి కలుగచేయును . విద్యార్జనకు మనసు కలుగచేయును .

* వక్క వట్ట –

ఇది అగ్నివృద్ధిని కలుగచేయును . వాత,పిత్త రోగాలని హరించును .

పైన చెప్పిన ఆకులలో భోజనం చేయడం వలన ఆయా ఆకులలో ఉండు ఔషధ గుణాలు అన్నియు మన శరీరం నందు చేరి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చును.

కాళహస్తి వేంకటేశ్వరరావు
అనువంశిక ఆయుర్వేద వైద్యులు
9885030034

శరీర దోషాలు తొలగించి చర్మవ్యాధులు హరించే దివ్యమైన సున్నిపిండి –

కావలసిన పదార్దాలు –

* పచ్చ పెసలు – 1 కిలొ .

* బావంచాలు – 100 గ్రాములు .

* వట్టి వేళ్లు – 100 గ్రాములు .

* కచ్చురాలు – 100 గ్రాములు .

* మంజిష్ట – 100 గ్రాములు .

* మంచి పసుపు – 100 గ్రాములు .

* కస్తూరి పసుపు – 100 గ్రాములు .

* ఉలవలు – 100 గ్రాములు .

* బత్తాయి తొక్కలు – 100 గ్రాములు .

* కరక్కాయ బెరడు – 100 గ్రాములు .

* ఉసిరికాయ బెరడు – 100 గ్రాములు .

* తానికాయ బెరడు – 100 గ్రాములు .

* ఎండు ఖర్జూరాలు – 100 గ్రాములు .

* కుంకుడు కాయ పెచ్చులు – 100 గ్రాములు

* సుగంధపాల వ్రేళ్లు – 100 గ్రాములు .

* తుంగ గడ్డలు – 100 గ్రాములు .

* దానిమ్మ పండ్ల బెరడు – 100 గ్రాములు .

* ఎండు గులాబీ రేకులు – 100 గ్రాములు .

* మరువము – 100 గ్రాములు .

* ధవనము – 100 గ్రాములు .

* జాపత్రి – 100 గ్రాములు .

* యాలుకలు – 100 గ్రాములు .

* కురువేరు – 100 గ్రాములు .

* తులసి ఆకులు – 100 గ్రాములు .

తయారీ విధానం –

పచ్చ పెసలు చిన్న మంట పైన కళాయిలో
పోసి కొద్దిగా నెయ్యివేసి దోరగా వేయించి దించి విసిరి బరక బరకగా పిండి తయారుచేసుకోవాలి . దానిలో పైన చెప్పిన పదార్దాలను శుద్ది చేసుకుని సరైన మోతాదుల్లో విడివిడిగా చూర్ణాలు మెత్తగా చేసుకుని పెసరపిండిలో కలుపుకోవాలి.

వాడేవిధానం –

స్నానానికి అరగంట ముందు ఈ సున్నిపిండిని తగినంత తీసుకుని పుల్లటి మజ్జిగతో కలిపి మెత్తగా పిసికి శరీరం అంతా రుద్దుకోవాలి . ఆరిన తరువాత ఒక్కో భాగాన్ని రుద్దుతూ స్నానం చేయాలి . ఈ సున్ని పిండి రాసుకోవడానికి అర్ధ గంట ముందు నువ్వులనూనెని శరీరముకి పట్టించి ఈ సున్నిపిండి రుద్దుకొని స్నానం ఆచరించిన అద్బుత ఫలితాలు వస్తాయి. స్నానానికి గోరువెచ్చటి నీటిని వాడిన చాలా మంచిది .

ఉపయోగాలు –

* ఈ సున్నిపిండి ఉదయం , సాయంత్రం వాడటం వలన శరీరం నందలి 7 పొరలు శుద్ది చెందును .

* శరీరం లోపలి భాగంలోని మలినాలు బహిష్కరించబడతాయి .

* చర్మం పైన మచ్చలు , చారలు , పగుళ్లు , పుండ్లు , దురదలు , దద్దుర్లు , వాపులు హరించును .

* మృత చర్మ కణాలు నిర్మూలించబడతాయి .

* చర్మానికి సహజకాంతి వృద్ది చెందును .

* శరీర నల్లధనం , మొటిమల సమస్యలు నివారించబడును.

* శరీరానికి మంచి తేజస్సు కలుగును.

* సోరియాసిస్ వంటి చర్మ వ్యాధులు కలవారికి అద్బుతంగా పనిచేయును .

గమనిక –

పైన చెప్పిన విధానంలో చేసిన సున్నిపిండి కావలసిన వారు నన్ను సంప్రదించగలరు. క్రింద ఇచ్చిన నంబర్ కి ఫొన్ చెయ్యగలరు

కాళహస్తి వేంకటేశ్వరరావు

అనువంశిక ఆయుర్వేద వైద్యులు

9885030034

Mahodaya

My grand son is 4 years old.
He stays in USA. He frequently suffers from cold. Can you pl suggest some remedies?

Can you suggest any weight gaining ideas also for him?

స్వర్ణ ప్రాశన మంచి ఉపాయం. వివరాలకు మీరు 9490284325 డా. పల్లవి జి. (ప్రొఫెసర్, శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల) గారిని సంప్రదించండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *