- aaditya hRidayam in association with Kovidanam vani
- PIETAS in association with Mythology Corner
- Aruna Prashna in association with Kovidanam Vani
Book on Sanaatana Dharma – First Edition
వేద సంస్కృతి సమితి ప్రారంభించిన “సనాతన ధర్మము” పుస్తక ప్రచురణలలో ప్రథమ సంపుటి ఆవిష్కరణ వేద సభలు నిర్వహించ బడుతున్న సందర్భంలో సాంబసదాశివుని అనుగ్రహంతో ఇవాళ 11.2.2023 వ తేదీన జ్ఞాన సరస్వతీ అమ్మవారి ఆలయంలో పరమహంస పరివ్రాజక శ్రీశ్రీశ్రీ బ్రహ్మానంద స్వామివారి కరకమలముల మీదుగా జరిగింది.
వేద సంస్కృతి సమితి అధ్యక్షులు శ్రీ ఆకెళ్ళ హేమకాంత ప్రభాకర రావుగారి సంకల్పంతో శ్రీ చవ్వా బాలమోహన రావుగారు దాతగా ముందుకు వచ్చి ప్రచురించిన, డా.సోమంచి (తంగిరాల)విశాలాక్షి గారు వ్రాసిన షోడశ సంస్కారములలోని నాలుగు సంస్కారముల పుస్తకమును గురించి, రచయిత గురించి బ్రహ్మశ్రీ డా.రేమెళ్ళ అవధానులు గారు ప్రసంగించారు.
డా.విశాలాక్షి గారు ప్రప్రథమంగా పరమాత్మకు ఆత్మ సమర్పణ నమస్కృతులనర్పించి, పరమహంస పరివ్రాజక శ్రీశ్రీశ్రీ బ్రహ్మానంద స్వామి వారికి ప్రణిపాత నమస్కారములు తెలియజేశారు. ఈ పుస్తకం బహిర్గతమవటానికి వెనక ఉన్న కారణాలను గురించి ప్రస్తావిస్తూ, అంచెలంచెలుగా సనాతన ధర్మములోని వివిధ అంశముల ప్రసంగములు పుస్తకములుగా ప్రచురింపబడతాయని చెప్పారు. వేద సంస్కృతి సమితికి, శ్రీ ఆకెళ్ళ హేమకాంత ప్రభాకర రావుగారికి, శ్రీ సి.బి.రావుగారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేశారు. శ్రీ రేమెళ్ళ అవధానులు గారికి కృతజ్ఞతలు తెలియజేశారు.