4వ.ప్రశ్న- ఆత్మ యెట్టిది?
ఉత్తరము- పూర్వముండియున్నది, ఇపుడును గలదు, ముందును ఉండబోవును. దానికి వినాశము లేదు. అది శాశ్వతమైనది.
5వ.ప్రశ్న- ఈ సత్యము కొందరికి మాత్రమే అన్వయించునా?
ఉత్తరము- కాదు. పిపీలికాది బ్రహ్మ పర్యంతము సర్వులకును వర్తించును. అందఱును జననమరణ రహిత శాశ్వత ఆత్మస్వరూపులే అయియున్నారు.
6వ.ప్రశ్న- జీవికి ఎన్ని అవస్థలు? అవియేవి?
ఉత్తరము- జీవికి నాలుగవస్థలు. అవి క్రమముగ బాల్య, యౌవన, వార్ధక్య, దేహాంతర ప్రాప్తులు.
यदेतत्स्वच्छन्दं विहरणमकार्पण्यमशनं
सहार्यै सव।सः श्रुतमुपशमैकलव्रतफलम् ।
मन मन्दस्पन्दं बहिरपि चिरस्यापि विमृश-
न्न जाने कस्यैषा परिणतिरुदरस्य तपसः ॥
నీచం కానట్టి ఆహార విహారాలు, సత్సాంగత్యం, పురాణపఠన శ్రవణాదుల వల్ల జనించిన శాంతి, మనస్సును లౌకిక విషయాల్లోకి చొప్పించకుండుటవల్ల కలిగే ఫలితం ఇవన్నీ ఏ గొప్పదనానికి మార్గమో చాలామందికి తెలియదు.
Bhartruhari Vairagya satakam – 82.
This freedom to wander about this food to which no meanness attaches, the company of holy men, the cultivation of Vedic wisdom, of which (unlike other vows) the only fruit is spiritual peace, the mind also restrained in its movements towards external things. —to such a consummation, I know not after lifelong reflection, what noble austerities may lead !
[ उषशम is the cessation of the illusions, and so of the worries, of the world. This is said to be the only fruit borne by the pursuit of this vow, namely, क्ष्रुतम or study of Vedic wisdom, other vows being ordained to bear fruits in the form of worldly prosperity. ]
పశ్య — చూడుము; ఏతాం — ఈ యొక్క; పాండు-పుత్రాణామ్ — పాండురాజు పుత్రులు; ఆచార్య — గురువర్య; మహతీం — గొప్పదైన; చమూమ్ — సైన్యము; వ్యూఢాం — సైనిక వ్యూహాత్మకంగా నిలుపబడిన; ద్రుపద-పుత్రేణ — ద్రుపదుని పుత్రుడు ధృష్టద్యుమ్నుడు; తవ శిష్యేణ — మీ శిష్యుని చేత; ధీ-మతా — తెలివైనవాడు.
దుర్యోధనుడు అన్నాడు: గౌరవనీయులైన గురువర్యా! ద్రుపదుని పుత్రుడైన, ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహా సైన్యాన్ని చూడుము.
విజ్ఞానయోగః(ఏడవ అధ్యాయము)
ప్రశ్నోత్తరములు
311వ.ప్రశ్న- భగవంతుని సంపూర్ణముగ, నిస్సంశయముగ తెలిసికొనవలెననిన కావలసిన యోగ్యతలెవ్వి?
ఉత్తరము- (1) భగవంతునియందే మనస్సు ఆసక్తమైయుండుట (2) భగవంతునే ఆశ్రయించుట (3) (ధ్యానాది) యోగాభ్యాసమును శీలించుట.
312వ.ప్రశ్న- జీవుడు తరింపవలెననిన దేనిని తెలిసికొనవలెను?
ఉత్తరము- జ్ఞానమును,విజ్ఞానమును (అనుభవజ్ఞానము)
313వ. ప్రశ్న- ఆధ్యాత్మ విజ్ఞానము యొక్క మహిమ యెట్టిది?
ఉత్తరము- దానిని తెలిసికొనినచో సమస్తమును తెలిసికొనినట్లే యగును.
314వ.ప్రశ్న-దేనిని తెలిసికొనినచో సమస్తము తెలియబడినట్లేయగును?
ఉత్తరము- పరబ్రహ్మమును అనుభవపూర్వకముగ తెలిసికొనినచో సమస్తము తెలియబడినట్లేయగును.
315వ.ప్రశ్న- జనులలో మోక్షసిద్ధికొఱ కెందఱు ప్రయత్నించుదురు?
ఉత్తరము- నూటికి కోటికి ఏ ఒకానొకడో ప్రయత్నించును.
316వ.ప్రశ్న- అట్లు ప్రయత్నించువారిలో దైవమును వాస్తవముగ నెఱుంగువారెందఱు?
ఉత్తరము- ఏ ఒకానొకడో.
317వ.ప్రశ్న- భగవంతుని యొక్క అపరా ప్రకృతి యెన్ని విధములు? అవియేవి?
ఉత్తరము- ఎనిమిది విధములు.అవియేవియనిన- (1) భూమి (2) జలము (3) అగ్ని (4) వాయవు (5) ఆకాశము (6) మనస్సు (7) బుద్ధి (8) అహంకారము.
318వ.ప్రశ్న- పరాప్రకృతియొక్క స్వరూపమెట్టిది?
ఉత్తరము- (1) అది జీవరూపమైనది (2) దానిచేతనే ఈ జగత్తంతయు ధరింపబడుచున్నది (3) కావుననే ఉత్కృష్టమైనది.
319వ.ప్రశ్న- సమస్త ప్రాణికోట్లు ఎట్లేర్పడినవి?
ఉత్తరము- పరాపరప్రకృతుల వలన.
అత్ర — ఇక్కడ; శూరాః — శక్తివంతమైన యోధులు; మహా-ఇశు-ఆసాః — గొప్ప ధనుర్ధారులు; భీమ-అర్జున-సమాః — భీముడు-అర్జునుడులతో సమానమైన; యుధి — యుద్ధ విద్యలో; యుయుధానః — యుయుధానుడు; విరాటః — విరాటుడు; చ — మరియు; ద్రుపదః — ద్రుపదుడు; చ — మరియు; మహా-రథః — పదివేల మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న యోధులు;
వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి – యుయుధానుడు, విరాటుడు, మరియు ద్రుపదుడు వంటివారు గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు.
320వ.ప్రశ్న- ఈ సమస్త జగత్తుయొక్క సృష్టిస్ధితిలయములకు కారణభూతు డెవడు ?
ఉత్తరము- పరమాత్మయే (ఆ రెండుప్రకృతులద్వారా) ఈ జగత్తుయొక్క సృష్ట్యాదులను గావించుచున్నాడు.
321వ.ప్రశ్న- జగత్తుయొక్క వాస్తవ స్వరూపమెట్టిది?
ఉత్తరము- పరమాత్మకంటే వేఱుగ ఈ జగత్తునందు పదార్థమున్ను లేదు.
322వ.ప్రశ్న- జగత్తునందు పరమాత్మ యేప్రకారముగ వ్యాపించియున్నాడు ?
ఉత్తరము- మణులందు దారమువలె.
323వ.ప్రశ్న-కాబట్టి భగవద్దర్శనమునకై యేమిచేయవలెను ?
ఉత్తరము- వివేకదృష్టిని (జ్ఞానదృష్టిని) సంపాదించవలెను.
324వ.ప్రశ్న- భగవానుడు ఏ యే వస్తువులయం దేయేరూపమున నుండునో మచ్చునకు కొన్ని తెలుపుడు?
ఉత్తరము- (1) నీటియందు రుచి రూపమునను (2) చంద్రసూర్యులందు కాంతిరూపమునను (3) వేదములన్నిటియందు ప్రణవరూపమునను (4) ఆకాశమందు శబ్దరూపమునను (5) మనుష్యు లందు పరాక్రమరూపమునందు భగవానుడున్నాడు.
325వ.ప్రశ్న- సమస్త ప్రాణికోట్లకు బీజభూతు డెవడు?
ఉత్తరము- పరమాత్మయే.
326వ.ప్రశ్న- ఆతని స్వరూప మెట్టిది ?
ఉత్తరము- శాశ్వతమైనది.(సనాతనము)
327వ.ప్రశ్న- పరమాత్మ యెట్టివాడు?
ఉత్తరము- సత్త్వరజస్తమోగుణ సంజనితములగు సమస్త వస్తువులకును ఆధారభూతుడు.అవి ఆతనికి వశములై యున్నవి. ఆతడు వానికి వశుడై లేడు.
328వ.ప్రశ్న- పరమాత్మ యెట్టివాడు ?
ఉత్తరము- అవ్యయుడు. నాశరహితుడు.
329వ.ప్రశ్న- అత డెచట నుండును? అతని స్థానమెద్ది?
ఉత్తరము- త్రిగుణములకు ఆవల. (త్రిగుణములు = సత్త్వరజస్తమోగుణములు)
330వ.ప్రశ్న- జీవులేల అతనిని తెలిసికొనజాలకున్నారు ?
ఓ బ్రాహ్మణోత్తమా, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము, వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు. మీ ఎఱుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను.
350వ.ప్రశ్న- ఒకడు జ్ఞాని అగునా కాదా యని పరీక్షించుటకు ఉపాయమేమి?
ఉత్తరము- తని దృష్టిలో అంతయు వాసుదేవమయముగ నున్నదా లేదా యని తెలిసికొనిన చాలును.
351వ.ప్రశ్న- జీవునియొక్క జ్ఞానమును హరించవేయునది ఏది?
ఉత్తరము- కోరికలు,విషయాశలు.
352వ.ప్రశ్న- అవి యెట్లు కలుగుచున్నవి ?
ఉత్తరము- జన్మాంతర విషయసంస్కారములచే.
353వ.ప్రశ్న- తత్ఫలితముగ మనుజుడేమి చేయుచున్నాడు ?
ఉత్తరము-జ్ఞానమును పోగొట్టుకొని పరమాత్మను విడిచిపెట్టి ఇతరదేవతల నారాధించుచున్నాడు.
354వ.ప్రశ్న-భగవంతునిగాని,ఇతర దేవతలనుగాని ఉపాసించునపుడు ముఖ్యముగ ఉండవలసిన గుణము లేవి?
ఉత్తరము- భక్తి, శ్రద్ధ.
355వ.ప్రశ్న- అట్లు భక్తిశ్రద్ధలతో ఆ యా దేవతల నుపాసించువారికి భగవానుడెట్టి సహాయము చేయును?
ఉత్తరము- వారికి ఆయాదేవతలయందుగల శ్రద్ధాభక్తులను స్థిరపఱచును.
356వ. ప్రశ్న- ఆ యా దేవతలపై శ్రద్ధ ఇనుమడించినపుడు భక్తుడేమిచేయును?
ఉత్తరము- వారిని ఇతోధికశ్రద్ధతో నారాధించును.
357వ.ప్రశ్న- తత్ఫలితముగ నాతడేమిపొందును ?
ఉత్తరము- తన యభీష్టఫలములను వారి వలన పొందును.
358వ.ప్రశ్న- ఆ ఫలములను ఎవరు నిర్ణయించిరి ?
ఉత్తరము- దేవదేవుడగు పరమాత్మయే. కావున అతడే ఆ యా దేవతల ద్వారా వారివారి వాంఛితముల నొసంగినట్లగును.
359వ. ప్రశ్న- దేవతల నారాధించువారు పొందు ఫలమెట్టిది?
ఉత్తరము- నాశవంతమైనది (అంతము కలది).
360వ.ప్రశ్న- అట్టి నాశవంతమగు ఫలమునకై ప్రయత్నించు వారెట్టివారు?
ఉత్తరము- అల్పబుద్ధిగలవారు(అల్పమేధసామ్).
361వ.ప్రశ్న-దేవతారాధకులు దేనిని పొందుదురు? పరమాత్మను అర్చించువారు దేనిని పొందుదురు?
ఉత్తరము- దేవతారాధకులు ఆయాదేవతలను,భగవదారాధకులు భగవంతుని (ఆత్మసాక్షాత్కార రూపమోక్షమును) పొందుదురు.
362వ.ప్రశ్న- కాబట్టి విజ్ఞుడగువాడేమి చేయవలెను?
ఉత్తరము- శాశ్వత మోక్షపదవి నొసంగు పరమాత్మనే ఆశ్రయించవలెను.
363వ.ప్రశ్న- భగవంతుని వాస్తవరూపమెట్టిది?
ఉత్తరము- (1)అవ్యక్తమైనది(2)ప్రపంచాతీతమైనది(3)నాశరహితమైనది(4)సర్వోత్తమమైనది.
364వ.ప్రశ్న- భగవంతుడొక చిన్న దేహమేయని తలంచువారెట్టివారు ?
ఉత్తరము- అవివేకులు.
365వ.ప్రశ్న- భగవంతుడేల అందఱికిని కనిపించుట లేదు ?
ఉత్తరము- యోగమాయచే కప్పబడియుండుటవలన.
366వ.ప్రశ్న- భగవంతుని స్వరూపమెట్టిది ?
ఉత్తరము- (1) జన్మరహితమైనది (2) నాశవర్జితమైనది.
367వ.ప్రశ్న- భగవత్స్వరూపము నెవరు తెలిసికొనజాలకున్నారు?
ఉత్తరము- అజ్ఞానులు.
368వ.ప్రశ్న-ఎందుచేత ?
ఉత్తరము- భగవంతుని చుట్టునున్న మాయారూపమగు ఆవరణను వారు భేధింపలేదు కావున.
369వ.ప్రశ్న-కాబట్టి విజ్ఞుడగు వాడేమి చేయవలెను ?
ఉత్తరము- తనకు భగవంతునకు మధ్య అడ్డుగోడగా నిలిచియున్న మాయారూపావరణమును శీఘ్రము గ (ఈజన్మయందే) ప్రయత్నపూర్వకముగ అధ్యాత్మసాధనలచే తొలగించివేసి భగవత్సాక్షాత్కారము నొందవలయును.
370వ.ప్రశ్న- భగవానుని శక్తి సామర్థ్యములను వర్ణింపుము?
ఉత్తరము- అతడు త్రికాలజ్ఞుడు,భూతభవిష్యద్వర్తమానములందలి సమస్తప్రాణులను,పదార్థములను ఎఱింగినవాడు.
371వ.ప్రశ్న- సుఖదుఃఖాది ద్వంద్వములు వేనినుండి ప్రాదిర్భవించును?
అన్యే — ఇతరులు; చ — కూడా; బహవః — చాలామంది; శూరాః — వీర యోధులు; మత్-అర్థే — నా కోసం; త్యక్త-జీవితాః — ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు; నానా-శస్త్ర-ప్రహరణాః — అనేక ఆయుధములు కలిగినవారు; సర్వే — అందరూ; యుద్ధ-విశారదాః — యుద్దరంగంలో నిపుణులు.
ఇంకా చాలా మంది వీరయోధులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్దంగా వున్నారు. వీరందరూ యుద్ధవిద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగిఉన్నారు.
భగవద్గీత
అథ ప్రథమోధ్యాయః, అర్జున విషాదయోగః, దశమ శ్లోకః।
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్।
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం ।। 10 ।।
మన సైనిక బలం అపరిమితమైనది, మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము, కానీ, భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటుచేయబడి రక్షింపబడుచున్న పాండవసైన్యం, పరిమితమైనది.
ఆ తరువాత, పాండవ సైన్యం మధ్యలోనుండి, తెల్లని గుఱ్ఱములు పూన్చి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చుని ఉన్న, మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించారు.
పాంచజన్యం — పాంచజన్యం అని పేరు గల శంఖము; హృషీక-ఈశః — శ్రీ కృష్ణుడు, మనస్సు, ఇంద్రియముల అధిపతి; దేవదత్తం — దేవదత్తం అని పేరు గల శంఖము; ధనంజయః — అర్జునుడు, ఐశ్వర్యమును జయించేవాడు; పౌండ్రం — పౌండ్రం అని పేరుగల శంఖము; దధ్మౌ — పూరించెను; మహా-శంఖం — ఒక బ్రహ్మాండమైన శంఖమును; భీమ-కర్మా — అత్యంత కష్టసాధ్యకార్యములను చేయునట్టి; వృక-ఉదరః — భీముడు, గొప్పగా భుజించేవాడు.
హృషీకేశుడు, పాంచజన్యం అనబడే శంఖాన్ని పూరించాడు, మరియు అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. గొప్పగా భుజించే వాడు, అత్యంత కష్టసాధ్యకార్యములను చేయునట్టి భీముడు, పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించెను.
ఆ సమయంలో, తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగివున్న పాండుపుత్రుడు అర్జునుడు, తన ధనుస్సుని తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా నిలిచిఉన్న మీ పుత్రులను చూసి, ఓ రాజా, అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు.
సంజయ ఉవాచ — సంజయుడు చెప్పెను; ఏవం — ఈ విధంగా; ఉక్తః — చెప్పబడిన; హృషీకేశః — శ్రీ కృష్ణుడు, ఇంద్రియములకు అధిపతి; గుడాకేశేన — అర్జునుడి చేత, నిద్రని జయించినవాడు; భారత — భరత వంశీయుడా; సేనయోః — సైన్యములు; ఉభయోః — రెండు; మధ్యే — మధ్యలో; స్థాపయిత్వా — నిలిపి; రథ-ఉత్తమమ్ — ఉత్తమమైన రథమును.
సంజయుడు ఇలా అన్నాడు: ఓ ధృతరాష్ట్రా, ఈ విధంగా, నిద్రని జయించినవాడైన, అర్జునుడు కోరిన విధంగా, శ్రీ కృష్ణుడు ఆ వైభవోపేతమైన రథమును రెండు సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను.
68 replies on “”
హరిః ఓం
శ్రీమద్భగవద్గీత. గీతామకరందం.
ప్రశ్నోత్తరములు.
రెండవ అధ్యాయము(సాంఙ్ఖ్యా యోగము)
ప్రశ్నోత్తరములు-
1వ.ప్రశ్న- అధైర్యము, శోకము, భీతిమున్నగు అవగుణము లెట్టివి?
ఉత్తరము- (1)అవి మనస్సునందలి మురికి (2) అనార్యులచే సేవింపదగినవి (3) స్వర్గాది ఉత్తమ లోకములను కలుగజేయనివి (4) అపకీర్తిని కలుగజేయునవి.
2వ.ప్రశ్న- పండితులనగా ఎవరు?
ఉత్తరము- జీవించి యున్నవారిని గూర్చిగాని, మరణించినవారినిగూర్చిగాని, లేక మఱే వస్తువును గూర్చిగాని దుఃఖింపనివారే పండితులు.
3వ.ప్రశ్న- జీవుడెవరు?
ఉత్తరము- ఆత్మయే కానిదేహము కాదు.
4వ.ప్రశ్న- ఆత్మ యెట్టిది?
ఉత్తరము- పూర్వముండియున్నది, ఇపుడును గలదు, ముందును ఉండబోవును. దానికి వినాశము లేదు. అది శాశ్వతమైనది.
5వ.ప్రశ్న- ఈ సత్యము కొందరికి మాత్రమే అన్వయించునా?
ఉత్తరము- కాదు. పిపీలికాది బ్రహ్మ పర్యంతము సర్వులకును వర్తించును. అందఱును జననమరణ రహిత శాశ్వత ఆత్మస్వరూపులే అయియున్నారు.
6వ.ప్రశ్న- జీవికి ఎన్ని అవస్థలు? అవియేవి?
ఉత్తరము- జీవికి నాలుగవస్థలు. అవి క్రమముగ బాల్య, యౌవన, వార్ధక్య, దేహాంతర ప్రాప్తులు.
यदेतत्स्वच्छन्दं विहरणमकार्पण्यमशनं
सहार्यै सव।सः श्रुतमुपशमैकलव्रतफलम् ।
मन मन्दस्पन्दं बहिरपि चिरस्यापि विमृश-
न्न जाने कस्यैषा परिणतिरुदरस्य तपसः ॥
తపః ప్రవృత్తి ఎలాంటిదంటే….
య దేత త్స్వచ్ఛన్దం విహరణ, మకార్పణ్య మశనం,
సహార్యై స్సంవాస, శ్రుత ముపశమైకవ్రతఫలమ్।
మనో మన్దస్పన్దం బహి రపి చిస్యాపి విమృశ
న్న జానే కన్నైషా పరిణతి రుదారస్య తపసః।।
నీచం కానట్టి ఆహార విహారాలు, సత్సాంగత్యం, పురాణపఠన శ్రవణాదుల వల్ల జనించిన శాంతి, మనస్సును లౌకిక విషయాల్లోకి చొప్పించకుండుటవల్ల కలిగే ఫలితం ఇవన్నీ ఏ గొప్పదనానికి మార్గమో చాలామందికి తెలియదు.
Bhartruhari Vairagya satakam – 82.
This freedom to wander about this food to which no meanness attaches, the company of holy men, the cultivation of Vedic wisdom, of which (unlike other vows) the only fruit is spiritual peace, the mind also restrained in its movements towards external things. —to such a consummation, I know not after lifelong reflection, what noble austerities may lead !
[ उषशम is the cessation of the illusions, and so of the worries, of the world. This is said to be the only fruit borne by the pursuit of this vow, namely, क्ष्रुतम or study of Vedic wisdom, other vows being ordained to bear fruits in the form of worldly prosperity. ]
हरिः ॐ।
7వ.ప్రశ్న- ధీరుడెవడు?
ఉత్తరము- బాల్య యౌవనాదులందువలె మరణ, దేహాంతరప్రాప్తులు సంభవించినపుడును ఏ మాత్రము దుఃఖింపనివాడు.
8వ.ప్రశ్న- శబ్దస్పర్శాది విషయములయొక్క స్వభావమెట్టిది?
ఉత్తరము- అవి (1) శీతోష్ణ, సుఖదుఃఖదాయకములు (2) రాకపోకడలు కలవి (3) అనిత్యములు.
9వ.ప్రశ్న- ఆ శీతోష్ణాదులు తటస్థించినపు డేమిచేయవలెను?
ఉత్తరము- సమదృష్టితో వానిని సహించుకొని, ధైర్యముగ నుండవలెను.
10వ.ప్రశ్న- మోక్షమనగా నేమి?
ఉత్తరము- మరణరహితమగు శాశ్వత ఆనందపదవియే మోక్షము.
contd:…..
11వ.ప్రశ్న- దానినెవరు పొందగలరు?
ఉత్తరము- శబ్దస్పర్శాదివిషయములచే చలింపనివారు, సుఖదుఃఖములందు సమభావము గలిగి యున్నవారు నగు ధీరులే మోక్షము నొందగలరు.
12వ.ప్రశ్న- ధీరులనగా యెవరు?
ఉత్తరము- శబ్దాది విషయములను జయించినవారు,సుఖదుఃఖాదులందు సమభావము కలవారు ధీరులనబడుదురు.
13వ.ప్రశ్న- తత్త్వజ్ఞాను లెట్టి యనుభవమును గలిగియుందురు?
ఉత్తరము- నామరూపాత్మకమగు దృశ్యప్రపంచమును లేనిదానినిగను, సచ్చిదానందపరమాత్మను కలదానినిగను వారు చూచుచుందురు.
14వ.ప్రశ్న- ఆత్మ యెట్టిది?
ఉత్తరము- (1) సమస్త ప్రపంచమును వ్యాపించియున్నది (2) నాశరహితమైనది (3) అద్దాని వినాశము నెవడును చేయజాలడు.
15వ.ప్రశ్న- దేహముయొక్క స్వభావమేమి?
ఉత్తరము- అది నాశవంతమైనది.
11వ.ప్రశ్న- దానినెవరు పొందగలరు?
ఉత్తరము- శబ్దస్పర్శాదివిషయములచే చలింపనివారు, సుఖదుఃఖములందు సమభావము గలిగి యున్నవారు నగు ధీరులే మోక్షము నొందగలరు.
12వ.ప్రశ్న- ధీరులనగా యెవరు?
ఉత్తరము- శబ్దాది విషయములను జయించినవారు,సుఖదుఃఖాదులందు సమభావము కలవారు ధీరులనబడుదురు.
13వ.ప్రశ్న- తత్త్వజ్ఞాను లెట్టి యనుభవమును గలిగియుందురు?
ఉత్తరము- నామరూపాత్మకమగు దృశ్యప్రపంచమును లేనిదానినిగను, సచ్చిదానందపరమాత్మను కలదానినిగను వారు చూచుచుందురు.
14వ.ప్రశ్న- ఆత్మ యెట్టిది?
ఉత్తరము- (1) సమస్త ప్రపంచమును వ్యాపించియున్నది (2) నాశరహితమైనది (3) అద్దాని వినాశము నెవడును చేయజాలడు.
15వ.ప్రశ్న- దేహముయొక్క స్వభావమేమి?
ఉత్తరము- అది నాశవంతమైనది.
16వ.ప్రశ్న- దేహియగు ఆత్మ యెట్టివాడు?
ఉత్తరము- (1) నిత్యుడు(2) నాశరహితుడు(3) అప్రమేయుడు.
17వ.ప్రశ్న- ఆత్మ యెట్టివాడు?
ఉత్తరము- అతడు చంపువాడు కాదు, చంపబడువాడు కాదు (అకర్త, అవినాశి).
18వ.ప్రశ్న- ఆత్మయొక్క స్వరూపమెట్టిది?
ఉత్తరము- (1) అతడు పుట్టుక చావులు లేనివాడు (2) ఎల్లప్పుడును ఉండువాడు (3) స్థిరమైనవాడు (4) శాశ్వతుడు (5) పురాణ పురుషుడు (6) శరీరము నశించినను నశింపనివాడు.
19వ.ప్రశ్న- ఆత్మ యెట్టివాడు?
ఉత్తరము- ఛేదింపబడనివాడు, దహింపబడనివాడు, తడుపబడనివాడు, ఎండింపబడనివాడు, నిత్యుడు, సర్వవ్యాపకుడు, నిశ్చలుడు, సనాతనుడు.
20వ.ప్రశ్న- ఆత్మయొక్క లక్షణములను ఇంకను వివరించి చెప్పుడు?
ఉత్తరము- ఆతడు (1) ఇంద్రియముల కగోచరుడు (2) మనస్సుచే చింతింపనలవికానివాడు (3) నిర్వికారుడు.
21వ.ప్రశ్న- శోకనివారణమున కుపాయమేమి?
ఉత్తరము- ఈ ప్రకారముగ ఆత్మనెఱింగి, అట్టి ఆత్మానుభూతి నొందుటయే శోకరాహిత్యమునకు హేతువు.
22వ.ప్రశ్న- దేహముయొక్కయు, దేహి (ఆత్మ) యొక్కయు స్వభావములను వివరింపుము?
ఉత్తరము- దేహము వధింపబడును, నశించును, దేహియగు ఆత్మ వధింపబడడు. నశింపడు.
23వ.ప్రశ్న- శోకము తొలగుటకు ఉపాయమేమి?
ఉత్తరము- దేహముతో తాదాత్మ్యము నొందక తాను ఆత్మయేయని భావన చేయుటవలన శోకము తొలగిపోవును.
24వ.ప్రశ్న- కర్మము నెపుడాచరించవలెను?
ఉత్తరము- సుఖదుఃఖాదులందు సమబుద్ధిని బడసినవెనుక.
25వ.ప్రశ్న- కర్మము చేయుచు పాపమంటకుండ నుండుటకుపాయమేమి?
ఉత్తరము- చిత్తమందు సుఖదుఃఖాదులయెడల సమభావమును కుదుర్చుకొని కర్మచేసినచో పాపమంటదు.
26వ.ప్రశ్న- నిష్కామకర్మమను ధర్మముయొక్క ప్రాశస్త్యమును వివరింపుడు?
ఉత్తరము- (1) దానిని ప్రారంభించినచో నిష్ఫలమెన్నటికినికాదు. (2) కొంత ఆచరించి మధ్యలో నిలిపినను దోషములేదు (3) కొద్దిగ ఆచరించినను గొప్ప సంసారభయమును తొలగించును.
27వ.ప్రశ్న- సంసారభయమునుండి తప్పించుకొనుటకు ఉపాయమేమి?
ఉత్తరము- వివేకయుక్తమగు కర్మాచరణము (నిష్కామ కర్మానుష్ఠానము).
28వ.ప్రశ్న- భోగైశ్వర్య ప్రసక్తి వలన కలుగు నష్టమేమి?
ఉత్తరము- దానిచే దైవధ్యానమందు మనస్సు నిలువదు.
29వ.ప్రశ్న- ఏ ప్రకారము వర్తించవలసినదిగా శ్రీ కృష్ణు డర్జునునకు బోధించెను?
ఉత్తరము- (1) త్రిగుణములను దాటిపోవలెను (2) ద్వంద్వములు లేకుండవలెను (3) నిరంతరము విశుద్ధసత్త్వమందు (ఆత్మయందు) స్థితి గల్గియుండవలెను. (4) యోగక్షేమములదృష్టి యుండరాదు (5) ఆత్మజ్ఞానియై వర్తించవలెను.
30వ.ప్రశ్న- మనుజునకు దేనియం దధికారము కలదు?
ఉత్తరము- కర్మలు చేయుటయందే అధికారము కలదు,గాని ఫలము లాశించుటయందు గాదు.
31వ.ప్రశ్న- దేనిని త్యజించవలెను?
ఉత్తరము- కర్మఫలమును,అకర్మణ్యత్వమును(ఏపనిని చేయకుండుటను)రెండింటిని వదలవలెను.
32వ.ప్రశ్న- కాబట్టి ఫలితాంశమేమి?
ఉత్తరము- కర్మలను చేయుచు ఫలమును వదలవలెను.
33వ.ప్రశ్న- యోగమనగానేమి?
ఉత్తరము- సమత్వబుద్ధియే యోగ మనబడును.
34వ.ప్రశ్న- కర్మల నేప్రకార మాచరించవలయును?
ఉత్తరము- (1)యోగనిష్ఠయందుండి (2) సంగమును (ఆసక్తిని, అభిమానమును) వదలి (3) కార్యము సిద్ధింపకున్నను సమభావము గలిగి- కర్మల నాచరించవలెను.
35వ.ప్రశ్న- ఫలములనుగోరి చేయు కర్మయెట్టిది?
ఉత్తరము- మహానికృష్ణమైనది (నిష్కామకర్మయే సర్వోత్తమమైనది).
36వ.ప్రశ్న- మనుజుడు దేనిని శరణుబొందవలెను?
ఉత్తరము- తనబుద్ధిని సమత్వముతోను,నిష్కామభావముతోను గూడినదానినిగ జేసుకొని అట్టి బుద్ధినే శరణుబొందవలెను.
37వ.ప్రశ్న- ఫలాభిలాషతో కర్మలు జేయువా రెట్టివారు?
ఉత్తరము- అతిదీనులు (కృపణులు). వారు సంసారసముద్రమున గొట్టుకొనిపోవుచుందురు.
38వ.ప్రశ్న- యోగమనగా నేమి?
ఉత్తరము- కర్మలు చేయుటయందలి నేర్పరితనమే యోగము (అనగా నేర్పుతో అనాసక్తముగ కర్మల నాచరింపగల్గు సామర్థ్యమే యోగము).
39వ.ప్రశ్న- ప్రజ్ఞాశీలుర (బుద్ధిమంతుల) లక్షణమేమి?
ఉత్తరము- నిష్కామకర్మాచరణము.
40వ.ప్రశ్న- అట్టి నిష్కామకర్మాచరణముచే వారు దేనిని పొందుదురు?
ఉత్తరము- జన్మబంధరహితులై వారు నిరామయమగు మోక్షపదమును బొందుదురు.
41వ.ప్రశ్న- పరమాత్మపదమెట్టిది?
ఉత్తరము- (1) జన్మబంధములేనిది (2) నిరామయము (దుఃఖవర్జితము) అయినది.
42వ.ప్రశ్న- జీవబ్రహ్మైక్యరూపమగు యోగము మనుజున కెపుడు సిద్ధించును?
ఉత్తరము- బుద్ధియెపుడు నిశ్చలమై, నిర్విషయమై, ఆత్మధ్యానమందు స్థిరముగ నుండునో అపుడే జీవబ్రహ్మైక్యరూపయోగము సిద్ధించును.
43వ.ప్రశ్న- స్థితప్రజ్ఞుని ఏయే లక్షణములను అర్జునుడు తెలిసికొనగోరెను?
ఉత్తరము- (1) అతని భాష (2) ఆతని నివాసము (3) ఆతని నడవడిక- వీనిని తెలిసికొనగోరెను.
44వ.ప్రశ్న- స్థితప్రజ్ఞుని లక్షణము లెవ్వి?
ఉత్తరము- (1) మనస్సునందలి కోరికలన్నిటిని సంపూర్ణముగ విడనాడుట (2) నిరంతరము ఆత్మయందే సంతుష్టిని బొందుట.
45వ.ప్రశ్న- ప్రపంచమున పూర్ణానందమెచట లభించును?
ఉత్తరము- తన ఆత్మయందే.
46వ.ప్రశ్న- స్థితప్రజ్ఞుని మఱికొన్నిలక్షణములను పేర్కొనుము?
ఉత్తరము- (1) దుఃఖములందు క్షోభనొందకుండుట (2) సుఖములందాసక్తి లేకుండుట (3) రాగ, భయ, క్రోధములు లేకుండుట.
47వ.ప్రశ్న- స్థితప్రజ్ఞుని ఏ యే యితర లక్షణము లిచట పేర్కొనబడినవి?
ఉత్తరము- (1) సమస్త విషయములందును అభిమానము లేకుండుట (2) ప్రియాప్రియములు సంభ వించినను, సంతోషముగాని, ద్వేషముగానిలేకుండుట- అను స్థితప్రజ్ఞ లక్షణము లిచట చెప్పబడినవి.
48వ.ప్రశ్న- మనుజుడు స్థితప్రజ్ఞు డెపుడు కాగల్గును?
ఉత్తరము- ఎపుడు మనుజుడు తన యింద్రియములన్నిటిని శబ్దాది విషయములనుండి మరల్చునో, (మఱియు చిత్తమును అంతర్ముఖ మొనర్చి ఆత్మయందు స్థాపితమోనర్చునో) అపుడు స్థితప్రజ్ఞుడు కాగల్గును.
49వ.ప్రశ్న- మోక్షప్రాప్తికి ఇంద్రియములను విషయములనుండి మరల్చుటమాత్రము చాలునా?
ఉత్తరము- చాలదు. చిత్తమునగల విషయవాసనకూడ తొలగవలెను.
50వ.ప్రశ్న- ఆ వాసన తొలగుటకు ఉపాయమేమి?
ఉత్తరము- పరమాత్మను దర్శించుటయే. అనగా ఆత్మతత్త్వచింతనాదుల ద్వారా దృశ్యముయొక్క మిథ్యాత్వమును, ఆత్మయొక్క సత్యత్వమును ప్రత్యక్షముగ అనుభూతమొనర్చుకొనుటయే.
51వ.ప్రశ్న- ఇంద్రియములయొక్క శక్తి యెట్టిదో నిరూపింపుము?
ఉత్తరము- అయ్యది మోక్షమార్గమున యత్నించుచున్న విద్వాంసుని మనస్సునుగూడా బలాత్కారముగ లాగి విషయములవైపునకు బడద్రోయుచున్నది.
52వ.ప్రశ్న- మోక్షప్రాప్తికి వలసిన సాధనము లెవ్వి?
ఉత్తరము- (1) ఇంద్రియములన్నిటిని విషయములపైకి పోనీయక నిగ్రహించుట (2) మనస్సును ఆత్మ యందు స్థాపించుట.
53వ.ప్రశ్న- ఎవని జ్ఞానము స్థిరముగ నుండగలదు?
ఉత్తరము- సర్వేంద్రియ నిగ్రహము కలవానియొక్క జ్ఞానము స్థిరముగ నుండగలదు.
54వ.ప్రశ్న- జీవుని వినాశనమునకు హేతువేది?
ఉత్తరము- (దృశ్య) విషయచింతన.
55వ.ప్రశ్న- అది యే ప్రకారముగ జీవుని బడద్రోయును?
ఉత్తరము- విషయచింతనచే విషయసంగమేర్పడును. దానిచే కామము, కామముచే క్రోధము, క్రోధముచే సమ్మోహము, సమ్మోహముచే విస్మృతి, విస్మృతిచే బుద్ధినాశము, బుద్ధినాశముచే అధోగతిప్రాప్తి క్రమముగ సంభవించుచున్నవి.
56వ.ప్రశ్న- శాంతిని, నిర్మలత్వమును ఎవడు పొందగలడు?
ఉత్తరము- (1) రాగద్వేషములు లేనివాడు (2) ఇంద్రియమనంబులను స్వాధీనపఱచు కొనినవాడు పొందగలడు.
57వ.ప్రశ్న- సమస్త దుఃఖములు శమించుటకు ఉపాయమేమి?
ఉత్తరము- మనస్సును నిర్మలముగ నొనర్చుటయే.
58వ.ప్రశ్న- ఎవని బుద్ధి ఆత్మయందు నిలుకడను బొందును?
ఉత్తరము- నిర్మలచిత్తముగలవాని బుద్ధి.
59వ.ప్రశ్న- మనోనిర్మలత్వమువలన కలుగు ఫతితము లేవి?
ఉత్తరము- (1) సమస్త దుఃఖములు నశించుట (2) బుద్ధిశీఘ్రముగ ఆత్మయందు నిలుకడను బొందుట (తద్ద్వారా ఆనందప్రాప్తి సంభవించుట).
60వ.ప్రశ్న- సుఖము దేనివలన కలుగును?
ఉత్తరము- శాంతిచే.
61వ.ప్రశ్న- శాంతి దేనివలన లభించును?
ఉత్తరము- ఆత్మచింతనచే.
62వ.ప్రశ్న- ఆత్మచింతన దేనివలన కలుగును?
ఉత్తరము- నిర్మలబుద్ధిచే.
63వ.ప్రశ్న- నిర్మలబుద్ధి దేనివలన కలుగును?
ఉత్తరము- ఇంద్రియ నిగ్రహమువలన, మనస్సంయమమువలన, విషయవిరక్తివలన.
64వ.ప్రశ్న- ఇంద్రియములు, మనస్సు, విషయములయందు సంచరించినచో కలుగు హానియేమి?
ఉత్తరము- అట్లు విషయములందు ప్రీతి గల్గియున్న ఇంద్రియములు,మనస్సు మనుజుని (ప్రజ్ఞను) వివేకమును, దైవభక్తిని నశింపజేసివైచును.
65వ.ప్రశ్న- ఎవనియొక్క ప్రజ్ఞ (వివేకము) సుస్థిరమైయుండగలదు?
ఉత్తరము- ఇంద్రియములను సంపూర్ణముగ నిగ్రహించువానియొక్క ప్రజ్ఞ సుస్థిరమైయుండగలదు.
66వ.ప్రశ్న- అజ్ఞానికి, జ్ఞానికి గల భేదమేమి?
ఉత్తరము- అజ్ఞాని:- దైవవిషయమున ప్రవర్తింపకుండును. విషయభోగములందు సదా ప్రవర్తించును.
జ్ఞాని:- దైవవిషయమున సదా ప్రవర్తించుచుండును.విషయభోగములందు విరక్తి గలిగి యుండును.
67వ.ప్రశ్న- శాంతిని ఎవడు పొందగలడు?
ఉత్తరము- ఏ కోరికలేనివాడు.విషయజాలముచే వికృతముకాని హృదయముకలవాడు.సముద్రమువలె నిర్వికారుడై చెన్నొందువాడు శాంతినిపొందును. అంతియేకాని, కోరికలను కోరుచుండువాడెన్నటికిని శాంతిని బొందలేడు.
68వ.ప్రశ్న- శాంతిని ఎవడు పొందగల్గు?
ఉత్తరము-(1) కోరికలను, విషయములను అన్నిటిని విడనాడువాడును (2) దృశ్యపదార్థముల వేనియందును అభిలాష లేనివాడును (3) అహంకారమును పారద్రోలినవాడును (4) మమకారమును వదలినవాడును-అగు మనుజుడు శాంతిని పొందగల్గును.
69వ.ప్రశ్న- బ్రాహ్మీస్థితి యనగానేమి?
ఉత్తరము- ఇంద్రియనిగ్రహ, కామజయాదులచేతను, ఆత్మచింతనచేతను గలుగు బ్రహ్మానుభవ స్థితియే అది.
70వ.ప్రశ్న- ఆ స్థితిని యెప్పుడు కలిగియుండవలెను?
ఉత్తరము- బాల్యయౌవనములందును, అంత్యకాలమందుగూడ.
71వ.ప్రశ్న- దానివలన గలుగు ప్రయోజనమేమి?. ఉత్తరము- జీవుడు బ్రహ్మానందరూపమగు మోక్షమునుబడయు
కర్మయోగము (మూడవ అధ్యాయము)
ప్రశ్నోత్తరములు
72వ.ప్రశ్న- పూర్వము భగవానుడు జనులు తరించుట కెన్ని మార్గములు బోధించెను? అవి యేవి?
ఉత్తరము- రెండు మార్గములను బోధించెను. (1) జ్ఞానయోగము (సాంఖ్యుల ఉపయోగార్థము) (2) కర్మయోగము (కర్మయోగుల ఉపయోగార్థము).
73వ.ప్రశ్న- మోక్షము దేనివలన చేకూరదు?
ఉత్తరము- (చిత్తశుద్ధికొఱకై) కర్మాచరణ చేయకపోవుటచేగాని, బాహ్యసన్న్యాసముమాత్రముచేగాని మోక్షము లభించదు.
74వ.ప్రశ్న- మఱి మోక్షము దేనివలన చేకూరునని దీనివలన స్పష్టమగుచున్నది?
ఉత్తరము- నిష్కామకర్మాచరణమువలన క్రమముగ మోక్షము సంప్రాప్తించును, మఱియు అభ్యంతర సన్న్యాసము, అనగా వాసనాత్యాగమువలన మోక్షము లభించగలదు.
75 వ.ప్రశ్న- మిథ్యాచారమనగా నేమి?
ఉత్తరము- ఇంద్రియములను మాత్రము అణచిపెట్టి మనస్సుతో ముల్లోకములందును సంచరించుట, విషయములను స్మరించుట మిథ్యాచారము (డంబాచారము) అగును.
76 వ.ప్రశ్న- కర్మయోగము నెట్లు శీలించవలెను?
ఉత్తరము- ఇంద్రియమనంబులను నిగ్రహించి అట్టి నియమితేంద్రియములచే అసక్తిబుద్ధితో కర్మ యోగమును శీలించవలెను.
77 వ.ప్రశ్న- కర్మచేయుట మేలా, చేయకుండుట మేలా?
ఉత్తరము- చేయుటయే మేలు.
78 వ.ప్రశ్న- ఎట్టి కర్మ చేయవలెను?
ఉత్తరము- శాస్త్రనియతమగు కర్మ చేయవలెను.
79 వ.ప్రశ్న- కర్మచేయనిచో కలుగు హానియేమి?
ఉత్తరము- అత్తఱి (1) చిత్తశుద్ధిగలుగదు, చిత్తశుద్ధిలేనిచో జ్ఞానమంకురించదు, జ్ఞానములేనచో మోక్షము సిద్ధింపదు (2) కర్మచేయనిచో దేహయాత్రకూడా కొనసాగదు.
80 వ.ప్రశ్న- ఎట్టి కర్మ బంధనమును గలుగజేయదు?
ఉత్తరము- యజ్ఞముకొఱకైన (భగవత్ప్రీతికరమైన,పరోపకారార్థమైన) కర్మ బంధమును గలుగజేయదు. అద్దానిని సంగరహితముగ, ఫలాపేక్షలేక (నిష్కామముగ) నాచరించవలెను.
81 వ.ప్రశ్న-బ్రహ్మదేవుడు ప్రజలను సృష్టించునపుడు వారితోసహా మఱివేనిని సృష్టించిరి?
ఉత్తరము- యజ్ఞములను (సత్కార్యములను,దైవకార్యములను).
82 వ.ప్రశ్న- వానివలన ప్రయోజనమేమి?
ఉత్తరము- అవి జీవుని ఆధ్యాత్మికాభివృద్ధిని గలుగజేయును- కామధేనువు చందమున ఆతని కోరికలను (శాంతిసుఖములను, మోక్షమును) నెరవేర్చును.
83 వ.ప్రశ్న- పరమశ్రేయమగు మోక్ష మెట్లు లభించును?
ఉత్తరము- యజ్ఞముల (ఫలాభిసంధిరహిత సత్కర్మల) ద్వారా భగవంతుని, లేక, దేవతలను ఆరాధించుటచే (క్రమముగ చిత్తశుద్ధిగలుగ, దానిచే జ్ఞానమావిర్భవింప, అట్టి జ్ఞానము వలన) మోక్షము లభించును.
84 వ.ప్రశ్న- యజ్ఞములచే (ఫలాపేక్షారహిత సత్కర్మలచే) నారాధింపబడి భగవంతుడు జనుల కేమి యొసంగును?
ఉత్తరము- వారివారికి ఇష్టములైన అన్నాది భోగ్యపదార్థముల నిచ్చును.
85 వ.ప్రశ్న- అవి లభించినపుడు జీవు డేమిచేయవలెను?
ఉత్తరము- వెంటనే వానిని ఆ యా దేవతలకు, లేక భగవంతునకు నివేదన చేయవలెను.
86 వ.ప్రశ్న- అట్లుచేయక ననుభవించినచో కలుగు నష్టమేమి?
ఉత్తరము- అత్తఱి యాతడు దొంగ క్రింద పరిగణింపబడి తగు శిక్ష ననుభవించవలసివచ్చును.
87వ.ప్రశ్న- యజ్ఞశేషమును (దైవార్పితముచేసి శేషించిన దానిని) భుజించువారికి కలుగు ఫలితమేమి?
ఉత్తరము- వారు సర్వపాపములనుండి విముక్తులగుదురు.
88 వ.ప్రశ్న- అట్లుకాక, స్వార్థముకొఱకు భుజించువారికి కలుగు ఫలితమేమి?
ఉత్తరము- వారు పాపమునే పొందుదురు.పాపరూపులే యగుదురు.
89 వ.ప్రశ్న- యజ్ఞము లెందులకు పవిత్రములైనవి?
ఉత్తరము- వానియందు సర్వవ్యాపక బ్రహ్మము ప్రతిష్ఠితమై యున్నది. కావున వాని నాచరించుట ద్వారా జీవునకు క్రమముగ బ్రహ్మముయొక్క సాక్షాత్కారము సిద్ధించగలడు.
90 వ.ప్రశ్న- యజ్ఞాదిరూపమగు ధర్మచక్రము ననుసరింపనివాని జీవిత మెట్లుండును?
ఉత్తరము- (1) అతడు పాపమయజీవితము గలిగియుండును. (2) ఇంద్రియలోలుడై వర్తించును. (3) జీవితమును వ్యర్థమొనర్చుకొనును.
91 వ.ప్రశ్న- కర్మయోగమును గూర్చిన విధి యెవరికి లేదు?
ఉత్తరము- ఆత్మారాములు, ఆత్మతృప్తులు, ఆత్మసంతుష్టులు నగు మహనీయులకు కర్మను గూర్చిన విధిలేదు.
92 వ.ప్రశ్న- కర్మ నేప్రకార మాచరింపవలెను?
ఉత్తరము- (1) అసక్తమగు (ఫలాపేక్షరహితముగ, నిష్కామముగ) నాచరింపవలెను. (2) చేయదగిన, అనగా శాస్త్రనియతములగు కర్మలనే ఆచరించవలెను.
93 వ.ప్రశ్న- ఆ ప్రకార మాచరించినచో కలుగు ఫలితమేమి?
ఉత్తరము- అట్లాచరించినచో మనుజుడు సాక్షాత్ పరమపదమగు మోక్షమునే పడయును.
94 వ.ప్రశ్న- కర్మయోగముచే నిదివఱకెవరైన మోక్షమును బడసిరా ? పడసినచో వారెవరు?
ఉత్తరము- పడసిరి. వారే జనకాది చక్రవర్తులు మున్నగువారు.
95 వ.ప్రశ్న- కర్మయోగమును శీలించుటవలన ప్రపంచమునకు కలుగు ప్రయోజనమేమి?
ఉత్తరము- దానివలన అనేకులను అపమార్గమునుండి త్రిప్పి సన్మార్గమున ప్రవర్తింపజేయుటకు అవకాశము కలుగును.
96 వ.ప్రశ్న- వివేకవంతుడు కర్మల నేప్రకారము చేయవలెను?
ఉత్తరము- అసక్తుడై (ఫలాసక్తిరహితుడై) చేయవలెను.
97వ.ప్రశ్న- ఎందులకు?
ఉత్తరము- లోకక్షేమము కొఱకు.
98వ.ప్రశ్న- అజ్ఞానుల కేప్రకారము బోధించవలెను?
ఉత్తరము- తాను నిర్మలమగు ఆచరణగలిగి, అనాసక్తుడై కర్మలనాచరించుచు,దానినిచూచి వారు నేర్చుకొనులాగుల ప్రవర్తించుటయే వారియెడల గావించు ఉత్తమబోధ.
99 వ.ప్రశ్న- ప్రపంచములోని సమస్తకర్మలు దేనిచే చేయబడుచున్నవి?
ఉత్తరము- ప్రకృతిచే (ప్రకృతిజన్యములగు గుణములచే).
100 వ.ప్రశ్న- కాని అహంకారముగల మనుజు డేమని తలంచుచున్నాడు?
ఉత్తరము- తానే కర్తనని తలంచుచున్నాడు.
101 వ.ప్రశ్న- ఫలితమేమి?
ఉత్తరము- తత్ఫలితముగ జన్మపరంపరలను, దుఃఖమును అనుభవించుచున్నాడు. కాబట్టి తానాత్మ స్వరూపుడని, కర్త కాదని తలంచి దుఃఖరహితుడై బ్రహ్మానందము నొందవలయును.
102 వ.ప్రశ్న- తత్త్వవేత్త కర్మలం దెట్లు ప్రవర్తించును?
ఉత్తరము- ఆత్మానాత్మ వివేకము కలవాడగుటచే నతడు “ఆ యా గుణములు ఆ యా కార్యములందు ప్రవర్తించుచున్నవే కాని ఆత్మయగు తానేమియు లేద” ని నిశ్చయించి కార్యములందు సంగవర్జితుడై మెలగును.
103 వ.ప్రశ్న- ప్రకృతి గుణములకు దాసులై వర్తించు కర్మసంగు లెట్టివారు?
ఉత్తరము- అల్పజ్ఞులు, మందమతులు.
104 వ.ప్రశ్న- అట్టివారిని జ్ఞాను లేమిచేయవలెను?
ఉత్తరము- వారి బుద్ధిని చెడగొట్టకుండ స్వకీయ ఉత్తమాచరణ ద్వారా వారిని క్రమముగ తమదారికి తీసుకొనిరావలెను.
105 వ.ప్రశ్న- పరమశ్రేయమునకు మార్గమేది?
ఉత్తరము- ఆధ్యాత్మచిత్తముతో సమస్తకర్మములను భగవదర్పణముగావించి, ఆశామమకారవర్జితుడై నిస్సంతాపముగ స్వకీయకార్యముల నాచరించుటయే శ్రేయోమార్గము.
106 వ.ప్రశ్న- కర్మలనుండి యెవరు విముక్తులగుదురు?
ఉత్తరము- భగవానుడు బోధించిన ఈ అనాసక్త కర్మయోగపద్ధతిని శ్రద్ధావంతులై, అసూయారహితులై, సత్యము శీలించువారు కర్మబంధవిముక్తులగుదురు.
107వ.ప్రశ్న- భగవానుడు బోధించిన ఈ పరమార్థతత్త్వము ననుసరింపనివారికి, ద్వేషించువారికి కలుగు దుర్గతు లెవ్వియో వివరింపుడు?
ఉత్తరము-(1) బొత్తిగా జ్ఞానములేకుండుట (2) బుద్ధిచెడిపోవుట (3) సంసారకూపమునబడి నశించిపోవుట పోవుట .
108 వ.ప్రశ్న- ఇంద్రియముల స్వభావమేమి?
ఉత్తరము- విషయములందు రాగము,ద్వేషము కలిగియుండుట.
109వ.ప్రశ్న- మొక్షాపేక్షగలవా డాచరించవలసిన విధానమేమి?
ఉత్తరము-ఆ రాగద్వేషములకు లోబడక పురుషప్రయత్నముచే వానిని జయించివేయవలెను.అవి మనుజునకు ప్రబల శత్రువులు.
110వ.ప్రశ్న- స్వధర్మ, పరధర్మములలో ఏది శ్రేష్ఠమైనది? ఎందువలన?
ఉత్తరము- కష్టముగా తోచినను స్వధర్మమే మేలైనది.సుఖముగా తోచినను పరధర్మము భయానక మైనది. స్వధర్మము ఉన్నతిని గలుగుజేయును. స్వధర్మపాలనమధ్యమున ఒకవేళ మరణము తటిస్థించినను అది జీవునకు శ్రేయస్కరమే యగును.
111 వ.ప్రశ్న- దేనిప్రేరణచే జీవుడు తాను వలదనుకొనినను పాపమును చేయుచున్నాడు?
ఉత్తరము- కామముయొక్క ప్రేరణచే.
112 వ.ప్రశ్న- ఆ కామమెట్టిది?
ఉత్తరము- అది (1) ఎంత అనుభవించినను తృప్తినొందనిది (2) మహాపాపజనకమైనది (3)జీవునకు ప్రబలశత్రువు.
113 వ.ప్రశ్న- ఆత్మజ్ఞానము దేనిచే కప్పబడుచున్నది?
ఉత్తరము- కామాదులచే.
114 వ.ప్రశ్న- ఏ ప్రకారముగ?
ఉత్తరము- (1) పొగచే అగ్నివలె (2) దుమ్ముచే అద్దమువలె (3) మావిచే గర్భమందలి శిశువువలె.
115 వ.ప్రశ్న-( ఆత్మ) జ్ఞానము దేనిచే గప్పబడినది?
ఉత్తరము- కామముచే.
116 వ.ప్రశ్న- అది యెట్టిది?
ఉత్తరము-(1) జ్ఞానికి నిత్యశత్రువు (2) అగ్నివలె పూరింప శక్యము కానిది, అగ్నివలె దహించునది.
117 వ.ప్రశ్న- కామమున కాశ్రయములేవి?
ఉత్తరము- ఇంద్రియములు, మనస్సు, బుద్ధి, వీనిచే నది జ్ఞానమును కప్పివైచి జీవుని అజ్ఞానమున బడద్రోయుచున్నది.
118 వ.ప్రశ్న- పరమార్థరంగమున సాధకుడు మొట్టమొదట ఏమిచేయవలెను?
ఉత్తరము- ఇంద్రియములను నిగ్రహించవలెను.
119 వ.ప్రశ్న- దానివలన కలుగు లాభమేమి?
ఉత్తరము- కామము తొలగును.
120వ.ప్రశ్న- ఆ కామ మెట్టిది?
ఉత్తరము- (1) పాపజనకమైనది (2) జ్ఞానవిజ్ఞానములను నాశమొనర్చునది.
121వ.ప్రశ్న- ఆత్మయొక్క స్థానమును, శక్తిని నిరూపించుము?
ఉత్తరము- దేహమునకుపైన ఇంద్రియములు, ఇంద్రియములకు పైన మనస్సు, మనస్సునకుపైన బుద్ది, బుద్దికిపైన ఆత్మకలదు. ఇవి ఒకదానికంటె మఱియొకటి ఉత్తరోత్తర శ్రేష్ఠములై యొప్పుచున్నవి.
122 వ.ప్రశ్న- కామమును జయించుట కుపాయమేమి?
ఉత్తరము- బుద్ధికంటెను పైస్థానమున నున్న సాక్షియగు ఆత్మను తెలిసికొని అచ్చోట నిలుకడను బొందినచో కామము పలాయనము చిత్తగించగలదు.
ఓమ్ తత్ సత్
జ్ఞాన యోగము(నాల్గవ అధ్యాయము)
ప్రశ్నోత్తరములు
123వ.ప్రశ్న- నిష్కామ కర్మయోగ మెట్టిది?
ఉత్తరము- నాశరహితమైనది. శాశ్వత మోక్షఫలంబొసంగునది.
124వ.ప్రశ్న- అది లోకమున నెట్లు వ్యాపించెను?
ఉత్తరము- మొట్టమొదట భగవానుడు సూర్యున కుపదేశింప,సూర్యుడు మనువుకును, మనువు ఇక్ష్వాకువునకును దానిని బోధింప, క్రమముగలోకమున వ్యాపించెను.
125వ.ప్రశ్న- భగవాను డర్జునునకు బోధించిన పరమార్థవిద్య, నిష్కామకర్మతత్త్వము ఎట్టిది?
ఉత్తరము-(1) పురాతనమైనది (2) ఉత్తమమైనది (3) రహస్యమైనది.
126వ.ప్రశ్న- ఇట్టి విద్యను అర్జునునికే ఏల ఉపదేశింపవలెను?
ఉత్తరము- భగవానున కాతడు (1) పరమభక్తుడు(2) పరమమిత్రుడు కాబట్టి.
127వ.ప్రశ్న- భగవంతు డెట్టివాడు?
ఉత్తరము- (1) జన్మరహితుడు (2) నాశవర్జితుడు (3)జగన్నియామకుడు (ఈశ్వరుడు).
128వ.ప్రశ్న- అట్టి జన్మరహితుడు మరల యేల జన్మలెత్తుచున్నాడు?
ఉత్తరము- ప్రకృతిని స్వాధీనపఱచుకొని లోకోద్ధరణముకొఱకు మాత్రము జన్మించుచున్నాడే కాని అజ్ఞానులవలె కర్మకు వశుడై కాదు.
129వ.ప్రశ్న- భగవంతు డెపుడవతరించును?
ఉత్తరము- ధర్మము క్షయించునపుడు, అధర్మము వృద్ధినొందునపుడు.
130వ.ప్రశ్న- భగవత్సాయుజ్యమునెవరు పొందగలరు?
ఉత్తరము- భగవంతునియొక్క అప్రాకృత జన్మ, కర్మలను, తత్త్వమును వాస్తవముగ నెఱుంగువాడు.
131వ.ప్రశ్న- హృదయశుద్ధి దేనివలన కలుగగలదు?
ఉత్తరము- జ్ఞానతపస్సుచే. (దీనివివరములు పైన తెలుపబడినవి).
132.ప్రశ్న- కర్మముయొక్క ఫలితము ఏ లోకమున శీఘ్రముగ కలుగును?
ఉత్తరము- మనుష్యలోకమున.
133వ.ప్రశ్న- అశుభమగు సంసారబంధమునుండి విడివడుట కుపాయమేమి?
ఉత్తరము- కర్మయేదియో, అకర్మయేదియో బాగుగా తెలిసికొని తదనురీతి వ్యవహరించుటయే.
134వ.ప్రశ్న- మనుజులలో బుద్ధిమంతుడెవరు?
ఉత్తరము- కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను జూడగలుగువాడు.
135వ.ప్రశ్న- అట్టివా డేఫలితమును బొందును?
ఉత్తరము- క్రమముగ ఆత్మసాక్షాత్కారమును బడయుటచే నతడు సమస్తకర్మలను ఆచరించిన ఫలితమును బొందును.
136వ.ప్రశ్న- పండితుడనగా ఎవరు?
ఉత్తరము-(1) ఎవనియొక్క సమస్తకార్యములు కామసంకల్పవర్జితములైయుండో, (2) ఎవని కర్మలన్నియు జ్ఞానాగ్నిచే దగ్ధములై పోయినవో అతడే పండితుడు.
137వ.ప్రశ్న- కర్మను ఎట్లాచరించవలయును?
ఉత్తరము- కోరికలేకుండగను, దానిని గూర్చిన కర్తృత్వముతోగూడిన (అహంభావయుక్తమగు) సంకల్పం లేకుండగను ఆచరించవలయును.
138వ.ప్రశ్న- కర్మరాశియంతయు దేనిచే నశించును?
ఉత్తరము- జ్ఞానాగ్నిచే.
139వ.ప్రశ్న- అనేక కార్యముల నాచరించినను ఏమియు నాచరించనివా డెవడు?
ఉత్తరము- కర్మఫలాసక్తిని వదలినవాడు (2) నిరంతరము తృప్తిగలవాడు (3) దేనిని ఆశ్రయింపనివాడు (దృక్- వస్తువగు ఆత్మనే ఆశ్రయించువాడు).
140వ.ప్రశ్న- కర్మచేసినను పాపము నెవడుపొందకుండును?
ఉత్తరము- (1) ఆశలేనివాడు (2) ఇంద్రియమనంబులను స్వాధీనపరచుకొనినవాడు, (3) ఒరులనుండి ఏ వస్తువును పరిగ్రహింపనివాడు.
141వ.ప్రశ్న- కార్యమును జేసినప్పటికిని వానిచే నెవడు బంధింపబడకుండును?
ఉత్తరము-(1) అప్రయత్నముగ లభించినదానితో సంతుష్టినొందువాడు (2) సుఖదుఃఖాది ద్వంద్వ ములను దాటినవాడు (3) మాత్సర్యములేనివాడు (4) కార్యముయొక్క సిద్ధి, అసిద్ధులందు సమభావము కలవాడు.
142వ.ప్రశ్న- యజ్ఞములలో కొన్నిటిని పేర్కొనుము?
ఉత్తరము- (1) దైవయజ్ఞము(దేవతారాధన, దేవతోపాసన ఇత్యాదిరూప యజ్ఞము). (2) బ్రహ్మయజ్ఞము (విచారణచేతను, పవిత్రతచేతను చిత్తమును బ్రహ్మమందు (ఆత్మయందు) విలీనమొనర్చుట).
143వ.ప్రశ్న- మఱికొన్ని యజ్ఞముల నుదహరింపుము?
ఉత్తరము- (1) ఇన్ద్రియనిగ్రహము (2) విషయత్యాగము.
144వ.ప్రశ్న- మనస్సంయమనము దేనిచే వర్థిల్లును?
ఉత్తరమ- జ్ఞానముచే, తత్త్వవిచారణచే.
145వ.ప్రశ్న- యజ్ఞములనాచరించుట వలన కలుగు ఫలితమేమి?
ఉత్తరము- పాపము నశించును.
146వ.ప్రశ్న- కావున పాపము నశించుట కుపాయమేమి?
ఉత్తరము- యజ్ఞాచరణము, సత్కర్మానుష్ఠానము.
147వ.ప్రశ్న- బ్రహ్మమెట్టిది?
ఉత్తరము- శాశ్వతమైనది, నాశరహితమైనది.
148వ.ప్రశ్న- దాని నెవరు పొందుదురు?
ఉత్తరము- యజ్ఞములను (సత్కార్యములను) ఆచరించి శేషించిన యన్నమును భుజంచువారు.
149వ.ప్రశ్న- యజ్ఞముల నాచరింపనివారి కెట్టి దుర్గతి కలుగును?
ఉత్తరము- వారికి ఇహలోకసుఖముగాని, పరలోకసుఖముగాని లభించదు.
150వ.ప్రశ్న- ఈ యజ్ఞములన్నియు నెచట తెలుపబడినవి?
ఉత్తరము- వేదమునందు విస్తారముగ వర్ణింపబడియున్నవి.
151వ.ప్రశ్న- అవి దేనిచే సిద్ధించును?
ఉత్తరము- దేహేంద్రియమనంబుల వ్యాపారముచే. అంతియేకాని సోమరితనముచే గాదు.
152వ.ప్రశ్న- ఈ సత్య మెఱుగుట వలన కలుగు ఫలితమేమి?
ఉత్తరము- మనుజుడు ప్రయత్నపరుడై, యజ్ఞములను సాధించి లెస్సగా విముక్తుడగును.
153వ.ప్రశ్న- ఇంతదనుక పేర్కొనబడిన యజ్ఞములన్నియునుజేరి మొత్తమెన్ని? అవిఏవి?
ఉత్తరము- మొత్తము పండ్రెండు- అవి క్రమముగ-
శ్లోకములో- 25 (1) దైవయజ్ఞము (2) బ్రహ్మయజ్ఞము.
శ్లోకము26- (3) ఇంద్రియ సంయమయజ్ఞము (4) శబ్దాదివిషయనిరోధ యజ్ఞము.
శ్లోకము27- (5) మనోనిగ్రహ యజ్ఞము.
శ్లోకము28- (6) ద్రవ్యయజ్ఞము (7) తపోయజ్ఞము (8) యోగయజ్ఞము (9) స్వాధ్యాయ యజ్ఞము (10) జ్ఞానయజ్ఞము.
శ్లోకము29-(11) ప్రాణాయామ యజ్ఞము.
శ్లోకము30-(12) ఆహారనియమ యజ్ఞము.
ఈ యజ్ఞములన్నియు జీవుని పాపము బోగొట్టి, చిత్తశుద్ధిని గలిగించి, తద్వారా మోక్షమును బొంధింపచేయును. కావున ముముక్షవు లెల్లరు వీనిని చక్కగ నాచరింపవలయునని భగవానుడు తెలియజేయుచున్నాడు.
154వ.ప్రశ్న- యజ్ఞములన్నిటిలో ఏ యజ్ఞము శ్రేష్ఠమైనది?
ఉత్తరము- జ్ఞానయజ్ఞము.
155వ.ప్రశ్న- అయితే తక్కిన యజ్ఞములు, కర్మలు వ్యర్థములగునా?
ఉత్తరము-కావు, అవి జ్ఞానోత్పాదనమును జేసి తుదకు జ్ఞానమందు లయించిపోవును. కర్మము జీవుని జ్ఞానమువఱకు గొనిపోయి అట వదలును. అటనుండి జ్ఞానము మోక్షము వఱకు జీవుని తీసుకొనిపోయి అట చేర్చివైచును.
156వ.ప్రశ్న- జ్ఞానము ఎవరివలన లభించును?
ఉత్తరము- అనుభవజ్ఞులగు తత్త్వవేత్తలవలన.
157వ.ప్రశ్న- అట్టి సద్గురువుల యొద్ద ముముక్షు వెట్లు ప్రవర్తించవలెను?
ఉత్తరము- (1) సాష్టాంగవందనమాచరించవలెను. (2) వినయముతో సమయాసమయములుచూచి ప్రశ్నించవలెను. (3)సేవ యొనర్పవలెను.
158వ.ప్రశ్న- జ్ఞానము పొందినచో కలుగు ఫలితమేమి?
ఉత్తరము- మరల జీవుడు మోహమందు (అజ్ఞానమందు) పడకుండును (2) అత్తఱి సమస్త ప్రాణికోట్లను తనయందును, భగవంతునియందును వీక్షింపగల్గును.
159వ.ప్రశ్న- పాపమును పోగొట్టుకొనుటకు ఉపాయమేమి?
ఉత్తరము- జ్ఞానమును సముపార్జించుటయే.
160వ.ప్రశ్న- జ్ఞానముయొక్క ప్రభావమెట్టిది?
ఉత్తరము- మహాపాపాత్ముడైనను జ్ఞానమను తెప్పచే పాపసముద్రమును దాటవేయగలడు.
161వ.ప్రశ్న- కర్మసంచయ మెట్లు తొలగును?
ఉత్తరము- జ్ఞానముచే (మండుచున్న అగ్ని కట్టెలను దహించునట్లు జ్ఞానము కర్మలన్నిటిని భస్మీభూతమొనర్పగలదు).
162వ.ప్రశ్న- జ్ఞానము యొక్క మహిమను నిరూపింపుము?
ఉత్తరము- అది కర్మరాసులను నిర్మూలమొనర్చి జీవుని బంధవిముక్తునిగ జేయగలదు.
163వ.ప్రశ్న- ప్రపంచములో అన్నిటికంటెను మిగుల పవిత్రమైన వస్తువేది?
ఉత్తరము- ఆత్మజ్ఞానము.
164వ.ప్రశ్న- అది (1) ఎట్లు (2) ఎచట (3) ఎప్పుడు జీవునకు లభించును?
ఉత్తరము- (1) కర్మయోగసిద్ధిచే (2) తమయందే (3) కాలక్రమము లభించును.
165వ.ప్రశ్న- జ్ఞానము నెవడు పొందగల్గును?
ఉత్తరము- (1) శ్రద్ధగలవాడు (2) తదేకనిష్ఠతోగూడినవాడు (3) ఇంద్రియనిగ్రహము లెస్సగ గలవాడు.
166వ.ప్రశ్న- జ్ఞానప్రాప్తివలన కలుగు ఫలితమేమి?
ఉత్తరము- పరమశాంతి.
167వ.ప్రశ్న- శాంతికి మార్గమేది?
ఉత్తరము- జ్ఞానప్రాప్తి.
168వ.ప్రశ్న- ఈ ప్రపంచమున వినాశమును బొందువారెవరు?
ఉత్తరము- (1) అజ్ఞాని (2) శ్రద్ధావిహీనుడు (3) సంశయచిత్తుడు.
169వ.ప్రశ్న- సంశయాత్ముని కెట్టి దుర్గతి కలుగును?
ఉత్తరము- ఆతనికి ఇహలోకసుఖముగాని, పరలోకసుఖముగాని, మనశ్శాంతిగాని యుండనేరవు.
170వ.ప్రశ్న- కాబట్టి ముముక్షువుయొక్క కర్తవ్యమేమి?
ఉత్తరము-(1) అజ్ఞానమునువీడి జ్ఞానమును సముపార్జించవలెను.
(2) శాస్త్ర, గురువాక్యములందు అశ్రద్ధగలిగి యుండరాదు.
(3) పరమార్థసత్యములందు సంశయము కలిగియుండరాదు.
171వ.ప్రశ్న- కర్మ లెవనిని బంధింపవు?
ఉత్తరము- (1) నిష్కామకర్మయోగముచే కర్మఫలమును త్యజించువానిని, లేక ఈశ్వరార్పణము చేయువానిని (2) జ్ఞానముచే సంశయములు నివర్తించినవానిని (3) ఆత్మనిష్ఠుని కర్మలు బంధించనేరవు.
172వ.ప్రశ్న- కావున కర్మలచే బంధింపబడకుండుటకుగాను సాధకు డేమియొనర్పవలయును?
ఉత్తరము- కర్మఫలములను త్యజించివేయవలెను (2) జ్ఞానమును సంపాదించి సంశయనివృత్తి గలుగ జేసికొనవలెను. (3) ఆత్మయందు స్థితి గల్గియుండవలెను.
173వ.ప్రశ్న- సంశయ, మోహాదు లెచట కాపురముండును?
ఉత్తరము- హృదయమున.
174వ.ప్రశ్న- అవి దేనినుండి ప్రాదుర్భవించును?
ఉత్తరము- అజ్ఞానమునుండి.
175వ.ప్రశ్న- ఆ యజ్ఞాన మెటుల నశించును?
ఉత్తరము- జ్ఞానమను ఖడ్గముచే.
176వ.ప్రశ్న- అట్లు అజ్ఞానమును నశింపజేసికొనినపిదప మహనీయులు సామాన్యముగ ఏమి చేయుదురు?
ఉత్తరము- లోకోపకారార్థము నిష్కామకర్మయోగమును శీలించుదురు.
177వ.ప్రశ్న- కర్మసన్న్యాసపూర్వకమగు జ్ఞానయోగము శ్రేష్ఠమా, కర్మాచరణపూర్వకమగు నిష్మామ కర్మయోగము శ్రేష్ఠమా?
ఉత్తరము- రెండును శ్రేష్ఠములే. రెండును ముక్తిప్రదములే. అయినను సాధకునకు ప్రారంభస్థితి యందు కర్మాచరణమే శ్రేయోదాకమైనది.
178వ.ప్రశ్న- ‘నిత్యసన్న్యాసి’ ఎవరు?
ఉత్తరము- (1) దేనిని ద్వేషింపనివాడు (2) దేనిని వాంఛింపనివాడు (3) సుఖదుఃఖాది ద్వంద్వములు లేనివాడు.
179వ.ప్రశ్న- అట్టి నిత్యసన్న్యాసత్వమునకు ఫలమేమి?
ఉత్తరము- దానిచే మనుజుడు సంసారబంధమును సులభముగ దాటివేయగలడు.
180వ.ప్రశ్న- సంసారబంధమునుండి సులభముగ తప్పించుకొనుటకు మార్గమేది?
ఉత్తరము- రాగద్వేషాదులు లేకుండుట, ద్వంద్వములను పారద్రోలుట.
181వ.ప్రశ్న- జ్ఞానయోగ, కర్మయోగములు వేఱువేఱా?
ఉత్తరము- కాదు. చక్కగ నాచరించినచో రెండును ఒకే మోక్షరూపఫలమును గలుగజేయును.
182వ.ప్రశ్న- కాబట్టి మోక్షప్రాప్తికి ఉపాయమేమి?
ఉత్తరము- జ్ఞానయోగమునుగాని, కర్మయోగమునుగాని తుదివఱకు చక్కగ అనుష్ఠించవలెను. అప్పుడు రెండిటి యొక్క ఫలమగు మోక్షము లభించగలదు.
183వ.ప్రశ్న- ప్రపంచమున నిజముగ చూచువాడెవడు (వివేకవంతుడెవడు)?
ఉత్తరము- జ్ఞానయోగము, కర్మయోగము ఒకటియేయను, (ఒకే ఫలమును గలుగచేయునను) వివేకముగలవాడే నిజముగ చూచువాడగును (వివేకవంతుడగును).
184వ.ప్రశ్న- జ్ఞానయోగ మెపుడు సిద్ధించును?
ఉత్తరము- కర్మయోగమునందు చక్కగ ఆరితేరినచో మాత్రమే.
185వ.ప్రశ్న- బ్రహ్మమును శీఘ్రముగ నెవడు పొందగలడు?
ఉత్తరము- కర్మయోగము నాశ్రయించి మననశీలుడు ( క్రమముగ దానిచే చిత్తశుద్ధిని, జ్ఞానమును బడయుటవలన) బ్రహ్మమును శీఘ్రముగ బొందగల్గుచున్నాడు.
186వ.ప్రశ్న- కర్మల నాచరించినను వానిచే నంటబడకుండువాడెవడు?
ఉత్తరము- (1) నిష్కామకర్మాచరణ (2) నిర్మలహృదయము (3) మనోజయము (4) ఇంద్రియజయము (5) సర్వత్రైకాత్మదర్శనము- అను నీ యైదు సల్లక్షణములు గలవాడు కర్మల నాచరించినను వానిచే బుద్ధుడుకాడు.
187వ.ప్రశ్న- తత్త్వవేత్త ఇంద్రియములతో తినుట, త్రాగుట మొదలగు అనేక కార్యములను చేయుచున్నను ఎట్టిభావన గలిగియుండును?
ఉత్తరము- ‘నేనేమియు చేయుటలేదు’ ఆ యా ఇంద్రియములు ఆ యా కార్యములను చేసికొనుచున్నవి. నేను సాక్షిని(నిర్వికార ఆత్మను), అను భావము గలిగియుండును.
188వ.ప్రశ్న- కర్మలను జేసినను పాపముచే ఎవరు అంటబడకుందురు?
ఉత్తరము- (1) తానుచేయు కర్మలను భగవంతునకు సమర్పించువాడు. (2) సంగమును (ఆసక్తిని) వదలి కార్యములను జేయువారు ఆ కర్మలచే బంధింపబడరు, పాపమునునొందరు.
189వ.ప్రశ్న- ఏ ప్రకారముగ?
ఉత్తరము- తామరాకునీటిచే అంటబడనట్లు.
190వ.ప్రశ్న- చిత్తశుద్ధియెట్లు చేకూరగలదు?
ఉత్తరము- ఫలాసక్తిని (సంగమును) త్యజించి, అభిమానరహితములగు దేహంద్రియాదికరణములచే, కార్యములను జేయువారికి చిత్తశుద్ధి కలుగును.
191వ.ప్రశ్న- నిష్కామకర్మయోగులు కర్మ నే ప్రకార మాచరించుదురు?
ఉత్తరము- (1) సంగమును (ఫలాసక్తిని) విడనాడి (2)మమత్వాదులులేని వట్టి ఇంద్రియములచే, దేహాదులచే కర్మలను చేయుదురు.
192వ.ప్రశ్న- అట్లు చేయుట వలన లభించు ఫలితమేమి?
ఉత్తరము- చిత్తశుద్ధి.
193వ.ప్రశ్న- నిష్కామకర్మయోగి యెట్టి ఫలితమును బొందును? ఎందుచేత?
ఉత్తరము- ఆత్మనిష్ఠచే గలుగు పరమశాంతిని బొందును.ఫలాపేక్షలేని కారణముచేత.
194వ.ప్రశ్న- కామ్యకర్మలను జేయువా డెట్టి ఫలితమును బొందును? ఎందుచేత?
ఉత్తరము- సంసారబంధమున లెస్సగ తగుల్కొనును.ఫలాసక్తి వలన.
195వ.ప్రశ్న- దీనినిబట్టి బంధమోక్షములకు కారణమేమని తేలుచున్నది?
ఉత్తరము- కర్మలందు ఫలాపేక్షగలిగియుండుటయే బంధము. అది లేకుండుటయే(అనాశక్తియే) మోక్షము.
196వ.ప్రశ్న- పరమశాంతికి మార్గమేమి?
ఉత్తరము- కోరికలేకుండుట. కర్మఫలములందాసక్తిని త్యజించుట.
197వ.ప్రశ్న- బంధమునకు హేతువేమి?
ఉత్తరము- కామమే. కర్మఫలాసక్తియే.
198వ.ప్రశ్న- మనుజునకు సుఖమెట్లు చేకూరగలదు?
ఉత్తరము-(1) ఇంద్రియములను స్వాధీనపఱచుకొని (2) సమస్తకర్మలను, లేక, వాని ఫలములను మనస్సుచే త్యజించివైచినచో సుఖము కలుగగలదు.
199వ.ప్రశ్న- కర్మలను శరీరముచే త్యజించవలెనా? మనస్సుచేతనా?
ఉత్తరము- శరీరముచేగాదు. మనస్సుచేతనే.
200వ.ప్రశ్న- జీవులయొక్క ఆ యా కర్మలలో భగవంతున కెంత సంబంధముకలదు?
ఉత్తరము-జీవుల కర్మలతో భగవంతుని కేమియు సంబంధము లేదు.
201వ.ప్రశ్న- మఱి దేనివలన జీవున కవి కలుగుచున్నవి?
ఉత్తరము- ప్రకృతివలన (తమ తమ జన్మాంతర సంస్కారములవలన).
202వ.ప్రశ్న- జీవులు దుఃఖమునొందుటకు కారణమేమి?
ఉత్తరము- అజ్ఞానముచే వారి జ్ఞానము (చిన్మయ ఆత్మరూపము) కప్పబడియున్నది. అందుచే జీవులు దుఃఖమునునొందుచున్నారు.
203వ.ప్రశ్న- అజ్ఞానమెట్లు నశించును?
ఉత్తరము- ఆత్మజ్ఞానముచే.
204వ.ప్రశ్న- అత్తఱి యేమి సంభవించును?
ఉత్తరము- చిద్రూపుడగు ఆత్మ (ఆత్మభాస్కరుడు) స్వయముగప్రకాశించును (అనుభూతమగును).
205వ.ప్రశ్న- మోక్షము యొక్క స్వరూపమెట్టిది?
ఉత్తరము- పునరావృత్తిరహితమైనది- జన్మవర్జితమగు శాశ్వతానందపదవియే అది.
206వ.ప్రశ్న- అది యెవరికి లభించును?
ఉత్తరము- అజ్ఞానకల్మషము నశించినవారికి, పాపముడిగినవారికి మాత్రమే అది లభించును.
207వ.ప్రశ్న- పాప మెట్లు నశించును?
ఉత్తరము- ఆత్మజ్ఞానముచే పాప మెగురగొట్టివేయబడును.
208వ.ప్రశ్న- ఆత్మజ్ఞాన మెట్లు సంప్రాప్తించును?
ఉత్తరము- ఆత్మయందే బుద్ధినుంచి, ఆత్మనుగూర్చియే చింతనజేయుచు, ఆత్మయందే మనస్సును సంలగ్నపఱచి, ఆత్మయందే నిష్ఠగలిగి, ఆత్మపరాయణుడై యుండుటద్వారా అది లభించును.
209వ.ప్రశ్న- పండితుడనగా (జ్ఞానియనగా) నెట్టివాడు?
ఉత్తరము- (1) విద్యవినయముగల బ్రాహ్మణునియందు (2) ఆవుయందు (3) ఏనుగునందు (4) కుక్కయందు (5) కుక్కమాంసముతిను చండాలునియందు- సమభావము గలవాడే పండితుడు , జ్ఞాని.
210వ.ప్రశ్న- ఈ సంసారము నెవరు జయించుదురు?
ఉత్తరము- ఎవరి మనస్సు దోషరహితమై, సమభావము కలిగియుండునో వారు జయించగలరు.
211వ.ప్రశ్న- భవదుఃఖములను దాటుటకు కుపాయము లెవ్వి?
ఉత్తరము- (1) మనస్సునందు ఏవిధమైన పాపము, దోషము లేకుండుట (2) నిశ్చలస్థితి గలిగి, సర్వభూతములందు సమదృష్టి (ఆత్మదృష్టి) గలిగియుండుట.
212వ.ప్రశ్న- బ్రహ్మ మెట్టిది?
ఉత్తరము- (1) దోషరహితమైనది (2) సమమైనది.
213వ.ప్రశ్న- జీవులు మోక్షము నెపుడు పొందుదురు?
ఉత్తరము- ఏ క్షణమున మనస్సును నిర్మలము చేసికొందురో, మనస్సునందు సమస్థితిని కాపాడుకొని సమదృష్టిని గలిగియుందురో, ఆ క్షణముననే మోక్షమును బొందుదురు.
214వ.ప్రశ్న- బ్రహ్మవేత్తయగు మహనీయుని లక్షణము లెవ్వి?
ఉత్తరము- (1) ప్రియవస్తువు లభించునపుడు ఉప్పొంగుటగాని, అప్రియవస్తువు లభించునపుడు క్రుంగిపోవుటగాని లేకుండుట (2) స్థిరబుద్ధి గలిగియుండుట (3) మోహములేకుండుట.
215వ.ప్రశ్న- ఆత్మ సుఖమెట్టిది?
ఉత్తరము- అక్షయమైనది (నాశరహితమైనది).
ఉత్తరము- అజ్ఞానకల్మషము నశించినవారికి, పాపముడిగినవారికి మాత్రమే అది లభించును.
207వ.ప్రశ్న- పాప మెట్లు నశించును?
ఉత్తరము- ఆత్మజ్ఞానముచే పాప మెగురగొట్టివేయబడును.
208వ.ప్రశ్న- ఆత్మజ్ఞాన మెట్లు సంప్రాప్తించును?
ఉత్తరము- ఆత్మయందే బుద్ధినుంచి, ఆత్మనుగూర్చియే చింతనజేయుచు, ఆత్మయందే మనస్సును సంలగ్నపఱచి, ఆత్మయందే నిష్ఠగలిగి, ఆత్మపరాయణుడై యుండుటద్వారా అది లభించును.
209వ.ప్రశ్న- పండితుడనగా (జ్ఞానియనగా) నెట్టివాడు?
ఉత్తరము- (1) విద్యవినయముగల బ్రాహ్మణునియందు (2) ఆవుయందు (3) ఏనుగునందు (4) కుక్కయందు (5) కుక్కమాంసముతిను చండాలునియందు- సమభావము గలవాడే పండితుడు , జ్ఞాని.
210వ.ప్రశ్న- ఈ సంసారము నెవరు జయించుదురు?
ఉత్తరము- ఎవరి మనస్సు దోషరహితమై, సమభావము కలిగియుండునో వారు జయించగలరు.
211వ.ప్రశ్న- భవదుఃఖములను దాటుటకు కుపాయము లెవ్వి?
ఉత్తరము- (1) మనస్సునందు ఏవిధమైన పాపము, దోషము లేకుండుట (2) నిశ్చలస్థితి గలిగి, సర్వభూతములందు సమదృష్టి (ఆత్మదృష్టి) గలిగియుండుట.
212వ.ప్రశ్న- బ్రహ్మ మెట్టిది?
ఉత్తరము- (1) దోషరహితమైనది (2) సమమైనది.
213వ.ప్రశ్న- జీవులు మోక్షము నెపుడు పొందుదురు?
ఉత్తరము- ఏ క్షణమున మనస్సును నిర్మలము చేసికొందురో, మనస్సునందు సమస్థితిని కాపాడుకొని సమదృష్టిని గలిగియుందురో, ఆ క్షణముననే మోక్షమును బొందుదురు.
214వ.ప్రశ్న- బ్రహ్మవేత్తయగు మహనీయుని లక్షణము లెవ్వి?
ఉత్తరము- (1) ప్రియవస్తువు లభించునపుడు ఉప్పొంగుటగాని, అప్రియవస్తువు లభించునపుడు క్రుంగిపోవుటగాని లేకుండుట (2) స్థిరబుద్ధి గలిగియుండుట (3) మోహములేకుండుట.
215వ.ప్రశ్న- ఆత్మ సుఖమెట్టిది?
ఉత్తరము- అక్షయమైనది (నాశరహితమైనది).
216వ.ప్రశ్న- అది యెట్లు లభించును?
ఉత్తరము- శబ్దాది విషయములం దాసక్తి వదలి ఆత్మయందు నిష్ఠగలిగియుండుటచే (బ్రహ్మయోగముచే) లభించును.
217వ.ప్రశ్న- విషయసుఖములయొక్క స్వభావమెట్టిది?
ఉత్తరము- (1) అవి దుఃఖములోన గలిగియుండును (దుఃఖజనకములు) (2) అల్పకాల మాత్రముండును (క్షణికములు).
218వ.ప్రశ్న- కాబట్టి విజ్ఞుడగువా డేమి చేయును?
ఉత్తరము- అట్టి నశ్వరసుఖములందు రమింపక, ఆత్మసుఖమునే యన్వేషించును.
219వ.ప్రశ్న- విషయములకొఱకు పరుగిడువాడెవడు?
ఉత్తరము- వట్టి తెలివితక్కువ వాడు. అజ్ఞాని.
220వ.ప్రశ్న- బ్రహ్మసాయుజ్యమును (మోక్షమును) ఎవడు పొందగల్గును?
ఉత్తరము- (1) బాహ్యసుఖములను వదలి ఆత్మయందే సుఖమును బొందువాడు.
(2) బాహ్యక్రీడలందాసక్తిలేక ఆత్మయందే క్రీడించువాడు.
(3) బాహ్యప్రకాశములందు దృష్టిలేక ఆత్మయందే ప్రకాశముగలవాడు బ్రహ్మనిర్వాణమును (మోక్షమును) బొందును.
221వ.ప్రశ్న- బ్రహ్మసాక్షాత్కారమును (మోక్షమును) ఎవరు పొందగల్గుదురు?
ఉత్తరము- (1) పాపము నశించినవారు (2) సంశయములు, ద్వంద్వములు తొలగినవారు (3) ఇంద్రియ నిగ్రహము కలవారు (4) సర్వభూతహితమాచరించువారు, బ్రహ్మసాయుజ్యము (మోక్షము) నొందగలరు.
222వ.ప్రశ్న- ఋషలనగా నెవరు?
ఉత్తరము- పైన దెల్పిన నాలుగు సుగుణములు గలవారు.
223వ.ప్రశ్న- బ్రహ్మనిర్వాణమును (మోక్షమును) ఎవరు బొందగలరు?
ఉత్తరము- (1) కామక్రోధాదులు తొలగినవారు (2) చిత్తము స్వాధీనమునందు కలవారు (3) ఆత్మ నెఱిగిన వారు మాత్రము పొందగలరు.
224వ.ప్రశ్న- మోక్షస్థానమును సోమరులు అందుకొనగలరా?
ఉత్తరము- లేదు. యత్నశీలురు మాత్రము చేరుకొనగలరు.
225వ.ప్రశ్న- మోక్ష మెచట నున్నది?
ఉత్తరము- పైన దెల్పిన సలక్షణములుగలవా రెచటనుందురో, వారి చుట్టును మోక్షముండును.కావున మోక్షమునకై మఱియొకచోటికి బోనవసరము లేదు. తన చిత్తమును శుద్ధమొనర్చుకొనినచో మోక్షమచటికే వచ్చి చేరును.
226వ.ప్రశ్న- మోక్షప్రాప్తికి ఉపాయములెవ్వి?
ఉత్తరము- (1) శబ్దాది విషయత్యాగము (2) ఏకాగ్రధ్యానము (3) ప్రాణాయామము (4) ఇంద్రియ మనో బుద్ధుల నిగ్రహము (5) మననశీలత్వము (6) మోక్షపరాయణత్వము (7) కామక్రోధ భయ రాహిత్యము.
227వ.ప్రశ్న- శాంతిని బొందుటకు మార్గమేది?
ఉత్తరము- భగవంతుని స్వరూపమును చక్కగ తెలిసికొని, భక్తితో నతని నారాధించుటయే, ధ్యానించుటయే శాంతి మార్గము.
228వ.ప్రశ్న- భగవంతునియొక్క స్వరూపమెట్టిది? అతడెట్టివాడు?
ఉత్తరము- ఆతడు (1) సమస్తయజ్ఞములకు, తపస్సులకు భోక్త (2) సమస్తలోకములకు ప్రభువు, నియంత (3) సర్వజీవులకు ఆప్తమిత్రుడు, హితకారి.
ఓమ్ తత్ సత్
(ఆత్మ సంయమ యోగము) ఆఱవ అధ్యాయము
ప్రశ్నోత్తరములు
229వ.ప్రశ్న- సన్న్యాసి అనగా నెవడు? యోగి యెవడు?
ఉత్తరము- చేయదగిన కార్యములను ఫలాపేక్షలేకుండా చేయువాడే సన్న్యాసి. అంతియేకాని కేవలము అగ్నిహోత్రమును వదలినవాడు కాదు. మఱియు అట్టి లక్షణముగలవాడే యోగి. అంతియే కాని, కేవలము కర్మలను త్యజించినవాడు కాడు.
230వ.ప్రశ్న- సన్న్యాసము, యోగము, వేఱువేఱా?
ఉత్తరము- కాదు. రెండును ఒకటే . దేనిని సన్న్యాసమని చెప్పుదురో అదియే యోగమనియు నెఱుగవలెను.
231వ.ప్రశ్న- మనుజుడు యోగి యెపుడు కాగలడు?
ఉత్తరము- దేహాది దృశ్యపదార్థములను గూర్చిన సంకల్పములను వదలినపుడు మాత్రమే వానిని వదలమిచో నాతడు యోగిగాని, సన్న్యాసిగాని యెన్నటికిని కానేరడు.
232వ.ప్రశ్న- యోగారూఢుని లక్షణము లెవ్వి?
ఉత్తరము-(1) ఇంద్రియార్థములగు శబ్దస్పర్శాదివిషయములం దాసక్తి లేకుండుట.
(2) కర్మలయం దాసక్తుడు కాకుండుట.
(3) సమస్తసంకల్పములను త్యజించి ఆత్మమాత్రమందు స్థితిగల్గియుండుట.
233వ.ప్రశ్న- ఈ సంసారమున జీవుని ఉద్ధరించువారెవరు?
ఉత్తరము- తన్నుతానే యుద్ధరించుకొనవలెను. తన్ను అధోగతిని పొందించుకొనరాదు.
234వ.ప్రశ్న- మనుజునకు బంధువెవరు ? శత్రు వెవరు?
ఉత్తరము- తనకు తానే బంధువు (తన మనస్సును తాను జయించినచో), తనకు తానే శత్రువు (తన మనస్సును తాను జయించనచో).
235వ.ప్రశ్న- మనుజునకు బంధువెవడు?
ఉత్తరము- తనచే స్వాధీనపఱచుకొనబడిన తన మనస్సే తనకు బంధువు.
236వ.ప్రశ్న- శత్రువెవడు?
ఉత్తరము- అట్లు తనచే జయింపబడని తన మనస్సే తనకు శత్రువు.
237వ.ప్రశ్న- ఎవని యొక్క చిత్తము శీతోష్ణాది ద్వంద్వములందు నిశ్చలముగ నుండును?
ఉత్తరము- ఇంద్రియమనంబులను జయించినవానియొక్కయు, ప్రశాంతహృదయుని యొక్కయు చిత్తము ద్వంద్వములందు నిశ్చలముగ నుండును.
238వ.ప్రశ్న- కావున మనోజయమువలన కలుగు గొప్పఫలితమేమి?
ఉత్తరము- మనోజయము కలవాడు శీతోష్ణసుఖదుఃఖాది ద్వంద్వములందు చలించక, సదా పరమాత్మయందే నిలకడకలిగి యుండును. తత్ఫలితముగ పరమశాంతినే ఎల్లపు డనుభవించుచుండును.
239వ.ప్రశ్న- ఆరూఢస్థితినొందిన ఉత్తమయోగియొక్క లక్షణములెవ్వి?
ఉత్తరము-(1) శాస్త్రజ్ఞాన, అనుభవజ్ఞానములు రెండును గలిగి, వానిచే తృప్తినొందియుండుట.
(2) నిర్వికారుడై (కూటస్థుడై) యుండుట.
(3) ఇంద్రియ మనంబులను లెస్సగ జయించుట.
240వ.ప్రశ్న- మనుజులలో ఉత్తముడెవడు?
ఉత్తరము- శత్రు మిత్ర ఉదాసీనులందు సమబుద్ధికలవాడే ఉత్తముడు.
241వ.ప్రశ్న- యోగాభ్యాసి యెట్టినియమములు కలిగియుండవలెను?
ఉత్తరము- (1) ఏకాంతస్థలము నాశ్రయించవలెను (2) ఏకాకియై ధ్యానమొనర్ఫవలెను (3) దేహేంద్రి యమనంబులను స్వాధీనమందుంచుకొనవలెను. (4)ఆశ లేకుండవలెను (5) అపరిగ్రహనియమము (ఒరులనుండి దేనిని స్వీకరింప కుండుట) ను శీలించవలెను.
242వ.ప్రశ్న- ఇట్టి నియమముగల్గి సాధకు డేమి చేయవలెను?
ఉత్తరము- తన చిత్తమును నిరంతరము ఆత్మయందే లయమొనర్చుచుండవలెను. అనగా ఆత్మధ్యానమును శీలించుచుండవలెను.
243వ.ప్రశ్న- ధ్యానాభ్యాసి మొట్టమొదట శీలించవలసిన పద్ధతు లెవ్వి?
ఉత్తరము- (1) ధ్యానమునకై నిర్మలమైనచోటును ఎంచుకొనవలెను. లేక, తానుండుచోటునైన పరిశుభ్రము చేయవలెను. (2) మిగుల ఎత్తెనట్టి, లేక పల్లముగనున్నట్టి చోటునందు కూర్చొనరాదు. (3) కూర్చొనునపుడు క్రింద దర్భాసనము, దానిపై చర్మము, దానిపై వస్త్రము వేసికొనవలెను. (4) కూర్చొనుపీఠము కదలరాదు. మఱియు ఏ ఆసనముపై కూర్చొనిన తాను స్థిరముగ సుఖముగ నుండగలడో దానినే వేసికొనవలెను. (5) ఇంద్రియ, మనోవృత్తులను నిగ్రహించవలెను. (6) మనస్సును ఏకాగ్రపఱచవలెను.
244వ.ప్రశ్న- ఎందులకీ ధ్యానమును చేయవలెను?
ఉత్తరము- హృదయశుద్ధికొఱకు, అంతఃకరణముయొక్క నిర్మలత్వముకొఱకు. నిర్మలాంతః కరణముననే (శుద్ధ హృదయమున) పరమాత్మ సాక్షాత్కరించునుగదా!
245వ.ప్రశ్న- ధ్యానము చేయువాడు ఆసనముపై నెట్లు కూర్చుండవలెను?
ఉత్తరము- శరీరము, కంఠము, శిరస్సు- మూడింటిని సమముగనుంచి, ఏమాత్రము కదలక, ధ్యానము పూర్తియగు వఱకు మధ్యలో లేవక స్థిరముగా కూర్చొనవలెను.
246వ.ప్రశ్న- దృష్టిని ఎచట నుంచవలెను?
ఉత్తరము- నాసికాగ్రమందు (ముక్కుకొనయందు). దిక్కులు చూడరాదు.
247వ.ప్రశ్న- ధ్యానాభ్యాసి యెట్టి లక్షణములు కలిగియుండవలెను?
ఉత్తరము- (1) ప్రశాంతచిత్తుడై యుండవలెను (2) నిర్భయుడై మెలగవలెను (3) బ్రహ్మచర్యవ్రతము నవలింబించవలెను. (4) మనస్సును (విషయములపైకి పోనీయక) సంయమమొనర్చవలెను.
248వ.ప్రశ్న- ఇట్టి లక్షణములు గలిగి తదుపరి యేమి చేయవలెను?
ఉత్తరము- ఆత్మయందే చిత్తమును లగ్న మొనర్చి, ఆత్మపరాయణుడై, ఆత్మనే ధ్యానించుచు కేవల మాత్మరూపుడై చెన్నొందవలెను.
249వ.ప్రశ్న- ఇట్టి ధ్యానయోగమువలన కలుగు ఫలితమేమి?
ఉత్తరము- పరమశాంతిని జీవుడు పొందగల్గును.
250వ.ప్రశ్న- ఆ శాంతి యొక్క స్వరూపమెట్టిది?
ఉత్తరము- మోక్షరూపమైనది.పరమాత్మయందు ఉండునది (పరమాత్మస్వరూపమే అయినది).
251వ.ప్రశ్న- ఇట్టి అపూర్వఫలితమును బొందుటకు సాధకుడేమిచేయవలెను?
ఉత్తరము-(1) మనస్సును స్వాధీనపఱచుకొనవలెను (2) నిరంతరము ఆత్మధ్యానమును అభ్యసించు చుండవలెను.
252వ.ప్రశ్న- ధ్యానయోగి ఆహారనిద్రాదులం దెట్లు ప్రవర్తింపవలెను?
ఉత్తరము- వానిని మితముగ సేవింపవలెను. అధికాహారమును, ఆహారముయొక్క లేమిని, అధిక నిద్రను, నిద్రయొక్క లేమిని వదిలివేసి మితాహార, మితనిద్రలను ఆశ్రయించవలెను.
253వ.ప్రశ్న-(ధ్యాన) యోగము యొక్క ఫలితమేమి?
ఉత్తరము- దుఃఖరాహిత్యము.
254వ.ప్రశ్న-ఆ యోగము ఎట్టి నియమములతో నాచరించవలెను?
ఉత్తరము-(1) మితాహారము (2) మితవిహారము (3) మితకర్మ(4) మితనిద్ర (5) మితజాగరణకలిగి ప్రవర్తించవలెను. దేనియందును మితముతప్పరాదు.
255వ.ప్రశ్న- దుఃఖము తొలగుటకు ఉపాయమేమి?
ఉత్తరము- యోగము (దైవధ్యానము ఆత్మచింతన).
256వ.ప్రశ్న- జీవుడు యోగసిద్ధుడని, లేక మోక్షయుక్తుడని ఎపుడు చెప్పబడెను?
ఉత్తరము-(1) ఏ ఒక్క కోరికయులేక, (2) మనస్సును పూర్ణముగ నిగ్రహించి (3) ఆత్మయందెపు డద్దానిని స్థాపించునో అపుడే యాతడు యోగసిద్ధుడని, లేక మోక్షయుక్తుడని చెప్పబడెను.
257వ.ప్రశ్న- మోక్షప్రాప్తికి ఉపాయము లెవ్వియో వచింపుడు?
ఉత్తరము- (1) సమస్తములైనకోరికలను, ఆశలను విడనాడుట, (2) మనస్సును లెస్సగ నిగ్రహించుట (స్వాధీనపఱచుకొనుట) (3) మనస్సును ఆత్మయందుస్థాపించుట.
258వ.ప్రశ్న- ఆత్మధ్యానము శీలించు యోగియొక్క మనస్సును దేనితో పోల్చవచ్చును?
ఉత్తరము- గాలిలేనిచోట గల దీపముతో (అనగా అట్టి దీపమువలె యోగియొక్క మనస్సు నిశ్చలముగ, ప్రకాశవంతముగ (చిన్మయముగ) నుండునని భావము).
259వ.ప్రశ్న- మనస్సు ఆత్మయందు నెలకొనియుండవలెననిన, అది ఎట్లుండవలెను?
ఉత్తరము- నిగ్రహింపబడినదై, స్వాధీనపడినదై యుండవలెను.
260వ.ప్రశ్న- చిత్తము దేనిచే నిరోధించబడగలదు?
ఉత్తరము- యోగసేవచే (అభ్యాసవైరాగ్యాదులచే).
261వ.ప్రశ్న- ఎట్టి చిత్తము ఆత్మయందు లయింపగలదు?
ఉత్తరము- విషయములనుండి నిగ్రహింపబడిన చిత్తము.
262వ.ప్రశ్న- ఆత్మను దేనిచే చూడగలరు?
ఉత్తరము- శుద్ధమనస్సుచే (నిర్మలబుద్ధిచే).
263వ.ప్రశ్న- ఎచట?
ఉత్తరము- తనయందే. తన హృదయముననే.
264వ.ప్రశ్న- ఆత్మదర్శనమువలన కలుగు ఫలితమేమి?
ఉత్తరము- అత్తఱి జీవునకు అపరిమిత ఆనందము కలుగును (మోక్షము సంప్రాప్తించును).
265వ.ప్రశ్న- ఆత్మసుఖ మెట్టిది?
ఉత్తరము- ఇంద్రియముల కగోచరమైనది.
266వ.ప్రశ్న- ఇంద్రియములకు గోచరముకానిచో ఇక దానిని తెలిసికొనుట ఎట్లు?
ఉత్తరము- నిర్మలబుద్ధిచే, విశుద్ధమనస్సుచే దానిని తెలిసికొనవచ్చు. (బుద్ధిగ్రాహ్యమ్).
267వ.ప్రశ్న- ఆత్మస్థితిని బడసిన వాడేమిచేయును?
ఉత్తరము- నిరంతరము ఆత్మయందే రమించుచుండును. అచ్చోటు వీడి చనడు.
268వ.ప్రశ్న- ప్రపంచములో అన్నిలాభములకంటె గొప్పలాభమేది?
ఉత్తరము- ఆత్మలాభము (ఆత్మప్రాప్తి).
269వ.ప్రశ్న- ఆత్మస్థితియందున్నవానికి గుఱుతేమి?
ఉత్తరము- ఎటువంటి ఘోరదుఃఖములు సంప్రాప్తించినను లవలేశమైనను చలింపడు.
270వ.ప్రశ్న- కావున దుఃఖములు తొలగుట కుపాయమేమి?
ఉత్తరము- ఆత్మయందు స్థితిగలిగియుండుటయే. ఆత్మానుభవమును బడయుటయే.
271వ.ప్రశ్న- ఆత్మస్థితి యెట్టిది?
ఉత్తరము- దుఃఖసంపర్కము ఏమాత్రము లేనట్టిది.
272వ.ప్రశ్న- అది యెట్లు లభింపగలదు?
ఉత్తరము- (1) కష్టములకు జంకని మనస్సుచేతను (2) పట్టుదలచేతను లభింపగలదు.
273వ.ప్రశ్న- ధ్యానాభ్యాసి అవలంబించవలసిన నియమము లెవ్వి?
ఉత్తరము- (1) కోరికలన్నిటిని పూర్తిగ విడనాడవలెను.
273వ.ప్రశ్న- ధ్యానాభ్యాసి అవలంబించవలసిన నియమము లెవ్వి?
ఉత్తరము- (1) కోరికలన్నిటిని పూర్తిగ విడనాడవలెను.
(2) మనస్సును, ఇంద్రియములను విషయములనుండి మరలించవలెను.
(3) ధైర్యోపేతమగు బుద్ధిచే మనస్సును బాహ్యప్రపంచమునుండి మెల్లమెల్లగ మరలించి ఆత్మయందు స్థాపితము చేయవలెను.
(4) అట్లు మనస్సును ఆత్మయందుంచి ఆత్మేతరమగు దేనిని చింతింపకుండవలయును.
274వ.ప్రశ్న- కోరికలు దేనినుండి పుట్టును?
ఉత్తరము- సంకల్పమునుండి.
275వ.ప్రశ్న- సాధకుడు ఎట్టి బుద్ధి గలిగి యుండవలెను?
ఉత్తరము- ధైర్యముతో గూడిన బుద్ధి గలిగియుండవలెను.
276వ.ప్రశ్న- సాధన యెట్లు చేయవలెను?
ఉత్తరము- మెల్లమెల్లగ చేయవలెను. తొందరపాటు పనికిరాదు.
277వ.ప్రశ్న- మనస్సుయొక్క స్వభావమెట్టిది?
ఉత్తరము- చంచలమైనది, నిలుకడలేనిది.
278వ.ప్రశ్న- మనస్సు ఆత్మయందు నిలువక బయటకు పరుగెత్తినచో ఏమిచేయవలెను?
ఉత్తరము- ఎచటెచటికి అదిపోవునో, (వివేకసహాయముచే) అచటచటనుండి దానిని మరలించి తిరిగి ఆత్మయందు స్థాపించవలెను. ఆత్మకధీనము చేయవలెను.
279వ.ప్రశ్న- ప్రపంచములో అన్ని సుఖములకంటె ఉత్తమసుఖమెయ్యది?
ఉత్తరము- మోక్షసుఖము (ఆత్మానందము).
280వ.ప్రశ్న- దాని నెవడు పొందగలడు?
ఉత్తరము- (1) ప్రశాంతచిత్తుడు (2) రజోగుణ, తమోగుణరహితుడు (3) దోషవర్జితుడు అగువాడు అట్టి ఉత్తమ సుఖమును పొందగలడు.
281వ.ప్రశ్న- కాబట్టి ఉత్తమసుఖమును బడయుటకు ఉపాయములెవ్వి?
ఉత్తరము- (1) మనస్సును ప్రశాంతముగ నుంచుకొనవలెను (2) మనస్సునందలి కామాది రజోగుణ తమోగుణ వికారములను తొలగించవలెను. (3) మనస్సునందుగల వాసనామాలిన్యమును, పాపమును పారద్రోలి దానిని దోషరహితముగ జేసికొనవలెను.
282వ.ప్రశ్న- మోక్షసుఖమును సులభముగ పొందుట కుపాయము లేవి?
ఉత్తరము- (1) మనస్సునందలి పాపవాసనలు,దోషములను పోగొట్టుకొనుట.
(2) మనస్సును నిరంతరము ఆత్మధ్యానమున లగ్నమొనర్చుట.
283వ.ప్రశ్న- మోక్షసుఖమెట్టిది?
ఉత్తరము- (1) నిరతిశయమైనది (2) బ్రహ్మమును స్పృశించినది (బ్రహ్మానుభవరూపమైనది).
284వ.ప్రశ్న- (ఆరూఢుడగు) యోగి యెట్టి లక్షణములు గలిగియుండును?
ఉత్తరము- ఎల్లెడల సమదృష్టిగలవాడై సమస్తప్రాణికోట్లయందు తనను (ఆత్మను), తనయందు (ఆత్మయందు) సమస్తప్రాణికోట్లను గాంచును.
285వ.ప్రశ్న- భగవంతు డెవనికి గోచరించును? లేక, భగవద్దృష్టి కెవడు గోచరించును?
ఉత్తరము- సమస్తభూతకోట్లయందు భగవంతుని, భగవంతునియందు సమస్త భూతకోట్లను గాంచువానికి భగవానుడు తప్పక గోచరించును. మఱియు భగవద్దృష్టికిని అట్టివాడు తప్పక గోచరించును.
286వ.ప్రశ్న- (దీనిని బట్టి) భగవద్దృష్టియందు పడుటకై, లేక భగవంతునకు ప్రీతిపాత్రుడగుటకై ఏమి చేయవలెను?
ఉత్తరము- సమస్త ప్రాణులందును పరమాత్మను, పరమాత్మయందు సమస్తప్రాణులను గాంచవలెను. (మఱియు సమస్త ప్రాణులకు హిత మొనర్చుచుండవలెను).
287వ.ప్రశ్న- భగవంతు డెచట నున్నాడు?
ఉత్తరము- సమస్త చరాచరప్రాణికోట్ల యందును వ్యాపించియున్నాడు.
288వ.ప్రశ్న- భగవంతునియందు స్థితిబొందవలెననిన జీవు డేమి చేయవలెను?
ఉత్తరము- సర్వత్ర ఏకాత్మబుద్ధిగలిగి అట్టిఅద్వయపరమాత్మను సేవించవలెను. ధ్యానించవలెను.
289వ.ప్రశ్న- ఆత్మజ్ఞుడగు మహనీయుడు లోకమున వ్యవహరించినను ఆతని భగవత్థ్సితికి హాని కలుగునా?
ఉత్తరము- కలుగదు. ఆతడెట్లు ప్రవర్తించినను ఆతని భగవత్థ్సికి లోపము గలుగదు.
290వ.ప్రశ్న- యోగము దేనిచే సిద్ధించును?
ఉత్తరము- మనోనిష్చలతచే, సమత్వముచే సిద్ధించును (మనస్సు చపలముగానున్నచో యోగమందు స్థిరమగు నిలకడ కలుగదు).
291వ.ప్రశ్న- మనస్సు యొక్క స్వభావమెట్టిది?
ఉత్తరము- అది (1) చంచలమైనది (2) దేహింద్రియాదులను క్షోభపెట్టునది (3) బలవత్తరమైనది (4) దృఢమైనది.
292వ.ప్రశ్న- మనస్సు ఎట్టిది?
ఉత్తరము- (1) చంచలమైనది (2) నిగ్రహించుటకు కష్టసాధ్యమైనది.
293వ.ప్రశ్న- ఏ సాధనములచే మనస్సు నిగ్రహింపబడగలదు?
ఉత్తరము- (1) అభ్యాసము (2) వైరాగ్యము- అను నీ రెండిటిచే మనస్సు స్వాధీనపడగలదు.
294వ.ప్రశ్న- యోగసిద్ధిని (ఆత్మసాక్షాత్కారమును) ఎవడు పొందగలడు? ఎవడు పొందలేడు?
ఉత్తరము- మనోనిగ్రహముకల్గి ఉపాయములచే యత్నించువాడు పొందగలడు. అదిలేనివాడు పొందలేడు.
295వ.ప్రశ్న- మోక్షమెట్టివానికి లభ్యమగును?
ఉత్తరము- ప్రయత్నశీలుడగువానికే లభ్యమగునుగాని యత్నరహితుడగు సోమరికి కాదు.
296వ.ప్రశ్న-అర్జనుడు శ్రీకృష్ణుని యేమని ప్రశ్నించెను?
ఉత్తరము- దైవప్రాప్తికై శ్రద్ధతోగూడి యత్నించువాడును, కాని మనోనిగ్రహశక్తి లేకయుండువాడును అగు మనుజుడు, యోగసిద్ధిని బొందజాలక మరణించినచో నాత డేగతిని బడయును? అనునది అర్జునుని ప్రశ్న.
297వ.ప్రశ్న- యోగభ్రష్టున కెట్టి గతి లభించును?
ఉత్తరము- అతని కీలోకమునగాని, పరలోకమునగాని దుర్గతి యెన్నడును గలుగదు. సద్గతియే కలుగును.
298వ.ప్రశ్న- ఇట శ్రీ కృష్ణమూర్తి సిద్ధాంతీకరించిన విషయమేమి?
ఉత్తరము- “శుభకార్యములను జేయువారికెవరికిని దుర్గతి కలుగదు, సద్గతియే కలుగు” నను పరమ సత్యము నిచట వెల్లడించెను.
299వ.ప్రశ్న- యోగభ్రష్టుడు మరణించిన వెనుక ఎట్టి సద్గతిని బొందును?
ఉత్తరము- అతడు మొదట పుణ్యవంతుల లోకమునకేగి అట చాలాకాలము నివసించి తదుపరి సదాచారపరులగు శ్రీమంతుల గృహమందు జన్మించి తానిదివఱలో విడిచిపెట్టిన యోగము నచట తిరిగికొనసాగించును.
అథ ప్రథమోధ్యాయః, అర్జున విషాదయోగః, ప్రథమ శ్లోకః।
ధృతరాష్ట్ర ఉవాచ ।
ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః ।
మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ ।। 1 ।।
ధృతరాష్ట్ర ఉవాచ — ధృతరాష్ట్రుడు పలికెను; ధర్మ-క్షేత్రే — ధర్మ భూమి; కురు-క్షేత్రే — కురుక్షేత్రం వద్ద; సమవేతాః — చేరియున్న; యుయుత్సవః — యుద్ధ కాంక్షతో; మామకాః — నా పుత్రులు; పాండవా — పాండు పుత్రులు; చ — మరియు; ఏవ — నిజముగా; కిం — ఏమి; అకుర్వత — చేసినారు; సంజయ — ఓ సంజయా.
ధృతరాష్ట్రుడు పలికెను: ఓ సంజయా, ధర్మభూమి అయిన కురుక్షేత్రంలో కూడియుండి, మరియు యుద్ధ కాంక్షతో ఉన్న నా పుత్రులు మరియు పాండు పుత్రులు ఏమి చేసిరి?
300వ.ప్రశ్న- ఉత్తమతరగతి యోగసాధకులకు (యోగసాధన అధికముగజేసి లక్ష్యమును బొందక మరణించినవారికి) ఎట్టి సద్గతి కలుగునో వివరింపుడు?
ఉత్తరము- అట్టివారు ధీమంతులగు యోగుల కుటుంబములో జన్మించుదురు. (అట పుట్టుకనుండియే యోగాభ్యాసమును శీలించి తరించుదురని భావము).
301వ.ప్రశ్న- ప్రపంచమున అన్ని జన్మలకంటెను శ్రేష్ఠమగు జన్మయేది?
ఉత్తరము- ధీమంతులగు (జ్ఞానసంపన్నులగు) యోగుల కుటుంబమునందు (లేక సంప్రదాయము నందు) జన్మించుట.
302వ.ప్రశ్న- అట్లు యోగుల వంశమందు జన్మించి సాధకు డేమిచేయును?
ఉత్తరము- పూర్వముతాను అసంపూర్తిగనుంచిన యోగమును పూర్ణసిద్ధి కలుగువఱకు తిరిగి సాధించును.
303వ.ప్రశ్న- పుట్టగనే అతనికి యోగసంస్కార మెట్లు కలుగును?
ఉత్తరము- పూర్వజన్మయందలి యోగవిషయికమైన బుద్ధితో నతనికి సంయోగము కలుగును. అందుచే చక్కటి యోగసంస్కార మేర్పడును.
304వ.ప్రశ్న- యోగభ్రష్టు డీ జన్మయందు మరల యోగమువైపునకే ఏల ఆకర్షింపబడును ?
ఉత్తరము- పూర్వజన్మసంబంధమగు యోగాభ్యాససంస్కార మాప్రకారముగ నతనిని బలాత్కారముగ యోగమువైపునకే ఈడ్చుచున్నది.
305వ.ప్రశ్న- యోగముయొక్క మహిమ యెట్టిది?
ఉత్తరము- దానినిగూర్చిన జిజ్ఞాసామాత్రముచే మనుజుడు శబ్దబ్రహ్మమును (వేదోక్త కర్మానుష్ఠాన ఫలమును) దాటివైచుచున్నాడు.
306వ.ప్రశ్న- ప్రపంచములో అన్నిటికంటెను ఉత్తమగతి యేది?
ఉత్తరము- ఆత్మసాక్షాత్కారము ((బ్రహ్మానుభూతి) మోక్షము).
307వ.ప్రశ్న- అది జీవునకెట్లు లభించును?
ఉత్తరము- (1)పట్టుదలతో గూడిన ప్రయత్నముచేతను (2) బహుకాలకృత ధ్యానాభ్యాసాదులచేతను (3) పాపరాహిత్యము చేతను లభించగలదు.
308వ.ప్రశ్న- యోగి యెట్టివాడు?
ఉత్తరము- అతడు (1) తపస్వులకంటెను (2) శాస్త్రజ్ఞానులకంటెను (3) కర్మనిష్ఠులకంటెను గొప్పవాడు.
309వ.ప్రశ్న- కావున భగవాను డర్జనున కేమని దెల్పెను?
ఉత్తరము- ‘నీవు యోగివికమ్ము’ అని బోధించెను.
310వ.ప్రశ్న- యోగులందఱిలోను భగవంతునిదృష్టిలో ఎవడు సర్వశ్రేష్ఠుడు?
ఉత్తరము- (1) మిగుల శ్రద్ధతోగూడినవాడు (2) లక్ష్యమగు ఆత్మయందు,లేక శ్రీకృష్ణునియందు మనస్సును సంలగ్న మొనర్చువాడు (3) అట్టి పరమాత్మనే నిరంతరము ధ్యానించువాడు సర్వోత్తమయోగియగును.
ఓమ్ తత్ సత్.
అథ ప్రథమోధ్యాయః, అర్జున విషాదయోగః, ద్వితీయ శ్లోకః।
సంజయ ఉవాచ ।
దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ।
ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ ।। 2 ।।
సంజయ ఉవాచ — సంజయుడు పలికెను; దృష్ట్వా — గమనించిన పిదప; తు — కానీ; పాండవ-అనీకం — పాండవ సైన్యమును; వ్యూఢం — సైనిక వ్యూహ రచనతో నిలిచి యున్న; దుర్యోధనః — రాజైన దుర్యోధనుడు; తదా — అప్పుడు; ఆచార్యం — గురువు గారు; ఉపసంగమ్య — సమీపించి; రాజా — రాజు; వచనం — మాటలను; అబ్రవీత్ — పలికెను.
సంజయుడు పలికెను: సైనిక వ్యూహాత్మకంగా నిలిపి ఉన్న పాండవ సైన్యాన్ని చూచిన దుర్యోధనుడు తన గురువు ద్రోణాచార్యుడిని సమీపించి, ఈ విధంగా పలికెను.
అథ ప్రథమోధ్యాయః, అర్జున విషాదయోగః, తృతీయ శ్లోకః।
పశ్యైతాం పాండుపుత్రాణామ్ ఆచార్య మహతీం చమూమ్ ।
వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా ।। 3 ।।
పశ్య — చూడుము; ఏతాం — ఈ యొక్క; పాండు-పుత్రాణామ్ — పాండురాజు పుత్రులు; ఆచార్య — గురువర్య; మహతీం — గొప్పదైన; చమూమ్ — సైన్యము; వ్యూఢాం — సైనిక వ్యూహాత్మకంగా నిలుపబడిన; ద్రుపద-పుత్రేణ — ద్రుపదుని పుత్రుడు ధృష్టద్యుమ్నుడు; తవ శిష్యేణ — మీ శిష్యుని చేత; ధీ-మతా — తెలివైనవాడు.
దుర్యోధనుడు అన్నాడు: గౌరవనీయులైన గురువర్యా! ద్రుపదుని పుత్రుడైన, ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవుల మహా సైన్యాన్ని చూడుము.
విజ్ఞానయోగః(ఏడవ అధ్యాయము)
ప్రశ్నోత్తరములు
311వ.ప్రశ్న- భగవంతుని సంపూర్ణముగ, నిస్సంశయముగ తెలిసికొనవలెననిన కావలసిన యోగ్యతలెవ్వి?
ఉత్తరము- (1) భగవంతునియందే మనస్సు ఆసక్తమైయుండుట (2) భగవంతునే ఆశ్రయించుట (3) (ధ్యానాది) యోగాభ్యాసమును శీలించుట.
312వ.ప్రశ్న- జీవుడు తరింపవలెననిన దేనిని తెలిసికొనవలెను?
ఉత్తరము- జ్ఞానమును,విజ్ఞానమును (అనుభవజ్ఞానము)
313వ. ప్రశ్న- ఆధ్యాత్మ విజ్ఞానము యొక్క మహిమ యెట్టిది?
ఉత్తరము- దానిని తెలిసికొనినచో సమస్తమును తెలిసికొనినట్లే యగును.
314వ.ప్రశ్న-దేనిని తెలిసికొనినచో సమస్తము తెలియబడినట్లేయగును?
ఉత్తరము- పరబ్రహ్మమును అనుభవపూర్వకముగ తెలిసికొనినచో సమస్తము తెలియబడినట్లేయగును.
315వ.ప్రశ్న- జనులలో మోక్షసిద్ధికొఱ కెందఱు ప్రయత్నించుదురు?
ఉత్తరము- నూటికి కోటికి ఏ ఒకానొకడో ప్రయత్నించును.
316వ.ప్రశ్న- అట్లు ప్రయత్నించువారిలో దైవమును వాస్తవముగ నెఱుంగువారెందఱు?
ఉత్తరము- ఏ ఒకానొకడో.
317వ.ప్రశ్న- భగవంతుని యొక్క అపరా ప్రకృతి యెన్ని విధములు? అవియేవి?
ఉత్తరము- ఎనిమిది విధములు.అవియేవియనిన- (1) భూమి (2) జలము (3) అగ్ని (4) వాయవు (5) ఆకాశము (6) మనస్సు (7) బుద్ధి (8) అహంకారము.
318వ.ప్రశ్న- పరాప్రకృతియొక్క స్వరూపమెట్టిది?
ఉత్తరము- (1) అది జీవరూపమైనది (2) దానిచేతనే ఈ జగత్తంతయు ధరింపబడుచున్నది (3) కావుననే ఉత్కృష్టమైనది.
319వ.ప్రశ్న- సమస్త ప్రాణికోట్లు ఎట్లేర్పడినవి?
ఉత్తరము- పరాపరప్రకృతుల వలన.
అథ ప్రథమోధ్యాయః, అర్జున విషాదయోగః, చతుర్థ శ్లోకః।
అత్ర శూరా మహేష్వాసా భీమార్జునసమా యుధి ।
యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః ।। 4 ।।
అత్ర — ఇక్కడ; శూరాః — శక్తివంతమైన యోధులు; మహా-ఇశు-ఆసాః — గొప్ప ధనుర్ధారులు; భీమ-అర్జున-సమాః — భీముడు-అర్జునుడులతో సమానమైన; యుధి — యుద్ధ విద్యలో; యుయుధానః — యుయుధానుడు; విరాటః — విరాటుడు; చ — మరియు; ద్రుపదః — ద్రుపదుడు; చ — మరియు; మహా-రథః — పదివేల మంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న యోధులు;
వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను వీక్షించండి – యుయుధానుడు, విరాటుడు, మరియు ద్రుపదుడు వంటివారు గొప్ప ధనుస్సులను ధరించి ఉన్నారు మరియు వారు యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు.
320వ.ప్రశ్న- ఈ సమస్త జగత్తుయొక్క సృష్టిస్ధితిలయములకు కారణభూతు డెవడు ?
ఉత్తరము- పరమాత్మయే (ఆ రెండుప్రకృతులద్వారా) ఈ జగత్తుయొక్క సృష్ట్యాదులను గావించుచున్నాడు.
321వ.ప్రశ్న- జగత్తుయొక్క వాస్తవ స్వరూపమెట్టిది?
ఉత్తరము- పరమాత్మకంటే వేఱుగ ఈ జగత్తునందు పదార్థమున్ను లేదు.
322వ.ప్రశ్న- జగత్తునందు పరమాత్మ యేప్రకారముగ వ్యాపించియున్నాడు ?
ఉత్తరము- మణులందు దారమువలె.
323వ.ప్రశ్న-కాబట్టి భగవద్దర్శనమునకై యేమిచేయవలెను ?
ఉత్తరము- వివేకదృష్టిని (జ్ఞానదృష్టిని) సంపాదించవలెను.
324వ.ప్రశ్న- భగవానుడు ఏ యే వస్తువులయం దేయేరూపమున నుండునో మచ్చునకు కొన్ని తెలుపుడు?
ఉత్తరము- (1) నీటియందు రుచి రూపమునను (2) చంద్రసూర్యులందు కాంతిరూపమునను (3) వేదములన్నిటియందు ప్రణవరూపమునను (4) ఆకాశమందు శబ్దరూపమునను (5) మనుష్యు లందు పరాక్రమరూపమునందు భగవానుడున్నాడు.
325వ.ప్రశ్న- సమస్త ప్రాణికోట్లకు బీజభూతు డెవడు?
ఉత్తరము- పరమాత్మయే.
326వ.ప్రశ్న- ఆతని స్వరూప మెట్టిది ?
ఉత్తరము- శాశ్వతమైనది.(సనాతనము)
327వ.ప్రశ్న- పరమాత్మ యెట్టివాడు?
ఉత్తరము- సత్త్వరజస్తమోగుణ సంజనితములగు సమస్త వస్తువులకును ఆధారభూతుడు.అవి ఆతనికి వశములై యున్నవి. ఆతడు వానికి వశుడై లేడు.
328వ.ప్రశ్న- పరమాత్మ యెట్టివాడు ?
ఉత్తరము- అవ్యయుడు. నాశరహితుడు.
329వ.ప్రశ్న- అత డెచట నుండును? అతని స్థానమెద్ది?
ఉత్తరము- త్రిగుణములకు ఆవల. (త్రిగుణములు = సత్త్వరజస్తమోగుణములు)
330వ.ప్రశ్న- జీవులేల అతనిని తెలిసికొనజాలకున్నారు ?
అథ ప్రథమోధ్యాయః, అర్జున విషాదయోగః, పంచమ శ్లోకః।
ధృష్టకేతుశ్చేకితానః కాశిరాజశ్చ వీర్యవాన్ ।
పురుజిత్ కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః ।। 5 ।।
ధృష్టకేతు — ధృష్టకేతుడు; చేకితానః — చేకితానుడు; కాశిరాజః — కాశీరాజు; చ — మరియు; వీర్య-వాన్ — వీరోచిత; పురుజిత్ — పురుజితుడు; కుంతిభోజః — కుంతిభోజుడు; చ — మరియు; శైబ్యః — శైబ్యుడు; చ — మరియు; నర-పుంగవః — ఉత్తమ పురుషులు
అక్కడున్న పరాక్రమవంతులైన ధృష్టకేతుడు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు శైబ్యుడు – వీరందరూ ఉత్తమ పురుషులే.
అథ ప్రథమోధ్యాయః, అర్జున విషాదయోగః, షట్ శ్లోకః।
యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ ।
సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః ।। 6 ।।
యుధామన్యుః — యుధామన్యుడు; చ — మరియు; విక్రాంత — ధైర్యవంతుడైన; ఉత్తమౌజాః — ఉత్తమౌజుడు; చ — మరియు; వీర్య-వాన్ — వీరుడైన; సౌభద్రః — సుభద్ర కుమారుడు; ద్రౌపదేయాః — ద్రౌపది పుత్రులు; చ — మరియు; సర్వే — అందరును; ఏవ — నిజంగా; మహా-రథాః — పదివేలమంది సాధారణ యోధుల బలంతో సమానమైన బలం ఉన్న యోధులు
వారి సైన్యంలో ఇంకా, ధైర్యశాలి యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారుడు, మరియు ద్రౌపదీ పుత్రులు ఉన్నారు, వీరందరూ శ్రేష్ఠమైన యుద్ధ వీరులే.
330వ.ప్రశ్న- జీవులేల అతనిని తెలిసికొనజాలకున్నారు ?
ఉత్తరము- వారు త్రిగుణములకు ఈవలనుండుటచే వానిచే మోహితులై ఆవలనున్న పరమాత్మను తెలిసికొనజాలకున్నారు.
331వ. ప్రశ్న – కావున భగవంతుని తెలిసికొనవలెననిన ఉపాయమేమి?
ఉత్తరము- నిష్మామకర్మ, భక్త్యాదిసాధనలచే ఆ త్రిగుణములను దాటపోవలెను. అదియే యుపాయము.
332వ. ప్రశ్న – మాయ యెట్టిది?
ఉత్తరము- (1) దైవికమైనది (అలౌకికసామర్థ్యముకలది) (2) త్రిగుణాత్మకమైనది (3) భగవంతునకు స్వాధీనపడియున్నది. (4) దాటుటకు కష్టసాధ్యమైనది.
333వ.ప్రశ్న- అయితే అట్టి భయంకరమగు మాయను దాటుట యెట్లు?
ఉత్తరము- భగవంతుని శరణుబొందువారు,ఆశ్రయించువారు ఆ మాయాసముద్రమును అవలీలగ దాటివేయగలరు. తక్కినవారు దాటలేరు.
334వ.ప్రశ్న-భగవంతుని ఎవరు ఆశ్రయింపరు ?
ఉత్తరము- (1) పాపులు (2) మూఢులు (3) నరాధములు (4) మాయచే నపహరింపబడిన వివేకము గలవారు (5) అసురస్వభావము నాశ్రయించువారు (తత్ఫలితముగ వారు సంసారదుఃఖ సముద్రమున మునుగుచుందురు).
335వ.ప్రశ్న- మనుజుని జ్ఞానమును (వివేకమును) అపహరించివేయు దొంగ ఎవరు ?
ఉత్తరము- మాయ.
336వ.ప్రశ్న- భగవంతుని సేవించువా రెన్నిరకములు? వారెవరు?
ఉత్తరము- నాలుగు రకములు.వారు క్రమముగ (1) ఆర్తుడు (2) జిజ్ఞాసువు (3) అర్థార్థి (4) జ్ఞాని.
337వ.ప్రశ్న- పైనదెల్పిన నలుగురు భక్తులలో ఎవడు శ్రేష్ఠుడు ?
ఉత్తరము- జ్ఞాని.
338వ.ప్రశ్న- ఎందువలన?
ఉత్తరము- అతనికి (జ్ఞానికి) (1) నిత్యయుక్తత్వము (నిరంతరదైవసంబంధము) (2) ఏకభక్తి- అను విశిష్టగుణములు కలవు. అవి తక్కిన వారికి లేవు.కావున అతడు శ్రేష్ఠుడు.
339వ.ప్రశ్న- జ్ఞానికి ఈ ప్రపంచమున అందఱికంటెను మిక్కిలి ప్రియుడెవడు ?
ఉత్తరము- భగవంతుడు.
340వ.ప్రశ్న- భగవంతునకు అందఱికంటె మిక్కిలి ప్రియుడెవడు ?
ఉత్తరము- జ్ఞాని.
341వ.ప్రశ్న- కావున, జనుల యొక్క కర్తవ్యమేమి?
ఉత్తరము-‘ఏకభక్తి’ రూపమగు జ్ఞానమును సముపార్జించుటద్వారా భగవంతునకు అతిప్రియుడగుటకై యత్నింపవలెను.
342వ. ప్రశ్న- పైన దెల్పిన నలుగురు భక్తులు ఎట్టివారు?
ఉత్తరము- అందరును చాలా మంచివారే.
343వ. ప్రశ్న- అయితే అందు జ్ఞానికి ఎందుల కాధిక్యత నొసంగబడెను?
ఉత్తరము- జ్ఞానికిని భగవంతునకును భేదముండదు. జ్ఞాని సాక్షాత్తు భగవంతుడే యగుచున్నాడు అందువలన (జ్ఞానీత్వాత్మైవ మేమతమ్)
344వ. ప్రశ్న- ఏ కారణముచే జ్ఞాని అట్టి భగత్స్వరూపమును బడయును?
ఉత్తరము- అతడు తన మనస్సును చక్కగ నిగ్రహించి ఆత్మయందు స్థాపించి (యుక్తాత్మా) ఆత్మనే పరమగతిగ నెంచి అందే స్థితుడై యుండును గావున.
345వ.ప్రశ్న – జీవుడు మోక్షము నెపుడు పొందగలడు?
ఉత్తరము- జ్ఞానవంతుడైనపుడు.
346వ.ప్రశ్న- జ్ఞాన మెపుడు పొందును?
ఉత్తరము- అనేక జన్మలందలి శుభప్రయత్నముచే కట్టకడకు ఒకానొక జన్మయందు పొందును.
347వ. ప్రశ్న- జ్ఞాని యెట్టి భావము గల్గియుండును?
ఉత్తరము- అంతయు వాసుదేవమయము (భగవన్మయము, ఆత్మమయము) అను భావము గల్గియుండును.
348వ. ప్రశ్న- లోకములో ‘మహాత్ము’ డనదగినవాడెవడు?
ఉత్తరము- జ్ఞానియే.
349వ.ప్రశ్న- అట్టి జ్ఞానులు లోకములో విరివిగా నుందురా?
ఉత్తరము- ఉండరు. ఏ ఒకానొకడో అట్లుండును. వారు మహాదుర్లభులు.
అథ ప్రథమోధ్యాయః, అర్జున విషాదయోగః, సప్తమ శ్లోకః।
అస్మాకం తు విశిష్టా యే తాన్నిబోధ ద్విజోత్తమ ।
నాయకా మమ సైన్యస్య సంజ్ఞార్థం తాన్ బ్రవీమి తే ।। 7 ।।
అస్మాకం — మన; తు — కానీ; విశిష్టాః — శ్రేష్ఠమైన వారు; యే — ఎవరు; తాన్ — వారిని; నిబోధ — తెలుసుకొనుము; ద్విజ-ఉత్తమ — బ్రాహ్మణ శ్రేష్ఠుడా; నాయకాః — నాయకులు; మమ — మన; సైన్యస్య — సైన్యానికి; సంజ్ఞా-అర్థం — ఎఱుక కొరకు; తాన్ — వారిని; బ్రవీమి — తెలుపుతున్నాను; తే — మీకు.
ఓ బ్రాహ్మణోత్తమా, మన పక్షంలో ఉన్న ప్రధాన యోధుల గురించి కూడా వినుము, వీరు నాయకులుగా అత్యంత యోగ్యమైన వారు. మీ ఎఱుకకై ఇప్పుడు వీరి గురించి తెలుపుచున్నాను.
350వ.ప్రశ్న- ఒకడు జ్ఞాని అగునా కాదా యని పరీక్షించుటకు ఉపాయమేమి?
ఉత్తరము- తని దృష్టిలో అంతయు వాసుదేవమయముగ నున్నదా లేదా యని తెలిసికొనిన చాలును.
351వ.ప్రశ్న- జీవునియొక్క జ్ఞానమును హరించవేయునది ఏది?
ఉత్తరము- కోరికలు,విషయాశలు.
352వ.ప్రశ్న- అవి యెట్లు కలుగుచున్నవి ?
ఉత్తరము- జన్మాంతర విషయసంస్కారములచే.
353వ.ప్రశ్న- తత్ఫలితముగ మనుజుడేమి చేయుచున్నాడు ?
ఉత్తరము-జ్ఞానమును పోగొట్టుకొని పరమాత్మను విడిచిపెట్టి ఇతరదేవతల నారాధించుచున్నాడు.
354వ.ప్రశ్న-భగవంతునిగాని,ఇతర దేవతలనుగాని ఉపాసించునపుడు ముఖ్యముగ ఉండవలసిన గుణము లేవి?
ఉత్తరము- భక్తి, శ్రద్ధ.
355వ.ప్రశ్న- అట్లు భక్తిశ్రద్ధలతో ఆ యా దేవతల నుపాసించువారికి భగవానుడెట్టి సహాయము చేయును?
ఉత్తరము- వారికి ఆయాదేవతలయందుగల శ్రద్ధాభక్తులను స్థిరపఱచును.
356వ. ప్రశ్న- ఆ యా దేవతలపై శ్రద్ధ ఇనుమడించినపుడు భక్తుడేమిచేయును?
ఉత్తరము- వారిని ఇతోధికశ్రద్ధతో నారాధించును.
357వ.ప్రశ్న- తత్ఫలితముగ నాతడేమిపొందును ?
ఉత్తరము- తన యభీష్టఫలములను వారి వలన పొందును.
358వ.ప్రశ్న- ఆ ఫలములను ఎవరు నిర్ణయించిరి ?
ఉత్తరము- దేవదేవుడగు పరమాత్మయే. కావున అతడే ఆ యా దేవతల ద్వారా వారివారి వాంఛితముల నొసంగినట్లగును.
359వ. ప్రశ్న- దేవతల నారాధించువారు పొందు ఫలమెట్టిది?
ఉత్తరము- నాశవంతమైనది (అంతము కలది).
360వ.ప్రశ్న- అట్టి నాశవంతమగు ఫలమునకై ప్రయత్నించు వారెట్టివారు?
ఉత్తరము- అల్పబుద్ధిగలవారు(అల్పమేధసామ్).
361వ.ప్రశ్న-దేవతారాధకులు దేనిని పొందుదురు? పరమాత్మను అర్చించువారు దేనిని పొందుదురు?
ఉత్తరము- దేవతారాధకులు ఆయాదేవతలను,భగవదారాధకులు భగవంతుని (ఆత్మసాక్షాత్కార రూపమోక్షమును) పొందుదురు.
362వ.ప్రశ్న- కాబట్టి విజ్ఞుడగువాడేమి చేయవలెను?
ఉత్తరము- శాశ్వత మోక్షపదవి నొసంగు పరమాత్మనే ఆశ్రయించవలెను.
363వ.ప్రశ్న- భగవంతుని వాస్తవరూపమెట్టిది?
ఉత్తరము- (1)అవ్యక్తమైనది(2)ప్రపంచాతీతమైనది(3)నాశరహితమైనది(4)సర్వోత్తమమైనది.
364వ.ప్రశ్న- భగవంతుడొక చిన్న దేహమేయని తలంచువారెట్టివారు ?
ఉత్తరము- అవివేకులు.
365వ.ప్రశ్న- భగవంతుడేల అందఱికిని కనిపించుట లేదు ?
ఉత్తరము- యోగమాయచే కప్పబడియుండుటవలన.
366వ.ప్రశ్న- భగవంతుని స్వరూపమెట్టిది ?
ఉత్తరము- (1) జన్మరహితమైనది (2) నాశవర్జితమైనది.
367వ.ప్రశ్న- భగవత్స్వరూపము నెవరు తెలిసికొనజాలకున్నారు?
ఉత్తరము- అజ్ఞానులు.
368వ.ప్రశ్న-ఎందుచేత ?
ఉత్తరము- భగవంతుని చుట్టునున్న మాయారూపమగు ఆవరణను వారు భేధింపలేదు కావున.
369వ.ప్రశ్న-కాబట్టి విజ్ఞుడగు వాడేమి చేయవలెను ?
ఉత్తరము- తనకు భగవంతునకు మధ్య అడ్డుగోడగా నిలిచియున్న మాయారూపావరణమును శీఘ్రము గ (ఈజన్మయందే) ప్రయత్నపూర్వకముగ అధ్యాత్మసాధనలచే తొలగించివేసి భగవత్సాక్షాత్కారము నొందవలయును.
370వ.ప్రశ్న- భగవానుని శక్తి సామర్థ్యములను వర్ణింపుము?
ఉత్తరము- అతడు త్రికాలజ్ఞుడు,భూతభవిష్యద్వర్తమానములందలి సమస్తప్రాణులను,పదార్థములను ఎఱింగినవాడు.
371వ.ప్రశ్న- సుఖదుఃఖాది ద్వంద్వములు వేనినుండి ప్రాదిర్భవించును?
అథ ప్రథమోధ్యాయః, అర్జున విషాదయోగః, అష్టమ శ్లోకః।
భవాన్ భీష్మశ్చ కర్ణశ్చ కృపశ్చ సమితింజయః ।
అశ్వత్థామా వికర్ణశ్చ సౌమదత్తిస్తథైవ చ ।। 8 ।।
భవాన్ — స్వయంగా మీరు; భీష్మః — భీష్ముడు; చ — మరియు; కర్ణః — కర్ణుడు; చ — మరియు; కృపః — కృపాచార్యుడు; చ — మరియు; సమితింజయః — యుద్ధంలో విజయుడు; అశ్వత్థామా — అశ్వత్థామ; వికర్ణ — వికర్ణుడు; చ — మరియు; సౌమదత్తిః — భూరిశ్రవుడు (సోమదత్తుని కుమారుడు); తథా — ఈ విధంగా; ఏవ — కూడా; చ — మరియు.
మీరును, భీష్ముడు, కర్ణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వికర్ణుడు మరియు భూరిశ్రవుడు – వీరందరూ ఎప్పటికీ యుద్ధములో విజయులే.
అథ ప్రథమోధ్యాయః, అర్జున విషాదయోగః, నవమ శ్లోకః।
అన్యే చ బహవః శూరా మదర్థే త్యక్తజీవితాః ।
నానాశస్త్ర ప్రహరణాః సర్వే యుద్ధవిశారదాః ।। 9 ।।
అన్యే — ఇతరులు; చ — కూడా; బహవః — చాలామంది; శూరాః — వీర యోధులు; మత్-అర్థే — నా కోసం; త్యక్త-జీవితాః — ప్రాణాలు అర్పించేందుకు సిద్ధంగా ఉన్నారు; నానా-శస్త్ర-ప్రహరణాః — అనేక ఆయుధములు కలిగినవారు; సర్వే — అందరూ; యుద్ధ-విశారదాః — యుద్దరంగంలో నిపుణులు.
ఇంకా చాలా మంది వీరయోధులు కూడా నా కోసం ప్రాణాలు అర్పించటానికి సిద్దంగా వున్నారు. వీరందరూ యుద్ధవిద్యలో ప్రావీణ్యం కలవారు మరియు అనేక రకములైన ఆయుధములను కలిగిఉన్నారు.
భగవద్గీత
అథ ప్రథమోధ్యాయః, అర్జున విషాదయోగః, దశమ శ్లోకః।
అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితమ్।
పర్యాప్తం త్విదమేతేషాం బలం భీమాభిరక్షితం ।। 10 ।।
అపర్యాప్తం — అపరిమితమైన; తత్ — అది; అస్మాకం — మన యొక్క; బలం — బలము; భీష్మ — భీష్మ పితామహుడిచే; అభిరక్షితాం — సురక్షితంగా ఏర్పాటుచేయబడ్డ; పర్యాప్తం — పరిమితమైన; తు — కానీ; ఇదం — ఈ; ఏతేషాం — వారియొక్క; బలం — బలము; భీమ — భీముడు; అభిరక్షితాం — సావధానంగా రక్షింపబడుచున్న.
మన సైనిక బలం అపరిమితమైనది, మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము, కానీ, భీముడిచే జాగ్రత్తగా ఏర్పాటుచేయబడి రక్షింపబడుచున్న పాండవసైన్యం, పరిమితమైనది.
భగవద్గీత
అథ ప్రథమోధ్యాయః, అర్జున విషాదయోగః, ఏకాదశ శ్లోకః।
అయనేషు చ సర్వేషు యథాభాగమవస్థితాః ।
భీష్మమేవాభిరక్షంతు భవంతః సర్వ ఏవ హి ।। 11 ।।
అయనేషు — వ్యూహాత్మక స్థానాల యందు; చ — మరియు; సర్వేషు — అన్నీ; యథా-భాగం — మీ మీ స్థానంలో; అవస్థితాః — నిలిచివుండి; భీష్మం — భీష్మ పితామహుడిని; ఏవ — మాత్రమే; అభిరక్షంతు — రక్షించండి; భవంతః — మీరు; సర్వే — అందరు; ఏవ హి — కూడా.
కావున, కౌరవ సేనానాయకులందరికీ, మీమీ వ్యూహాత్మక స్థానాలను పరిరక్షిస్తూ భీష్మ పితామహుడికి పూర్తి సహకారం అందించమని పిలుపునిస్తున్నాను.
భగవద్గీత
అథ ప్రథమోధ్యాయః, అర్జున విషాదయోగః, ఏకాదశ శ్లోకః।
తస్య సంజనయన్హర్షం కురువృద్ధః పితామహః ।
సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ।। 12 ।।
తస్య — అతనికి; సంజనయన్ — కలిగించుచు; హర్షం — సంతోషమును; కురు-వృద్ధః — కురు వంశములో వృద్ధుడు (భీష్ముడు); పితామహః — తాత గారు; సింహ-నాదం — సింహ గర్జన; వినద్య — శబ్దం చేసి; ఉచ్చైః — పెద్ద స్వరంతో; శంఖం — శంఖమును; దధ్మౌ — మ్రోగించెను; ప్రతాప-వాన్ — తేజోవంతమైన.
అప్పుడు, కురువృద్ధుడు, మహోన్నత మూలపురుషుడైన భీష్మ పితామహుడు, సింహంలా గర్జించాడు, మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ, దుర్యోధనుడికి హర్షమును కలుగచేసెను.
భగవద్గీత
అథ ప్రథమోధ్యాయః, అర్జున విషాదయోగః, ద్వాదశ శ్లోకః।
తస్య సంజనయన్హర్షం కురువృద్ధః పితామహః ।
సింహనాదం వినద్యోచ్చైః శంఖం దధ్మౌ ప్రతాపవాన్ ।। 12 ।।
తస్య — అతనికి; సంజనయన్ — కలిగించుచు; హర్షం — సంతోషమును; కురు-వృద్ధః — కురు వంశములో వృద్ధుడు (భీష్ముడు); పితామహః — తాత గారు; సింహ-నాదం — సింహ గర్జన; వినద్య — శబ్దం చేసి; ఉచ్చైః — పెద్ద స్వరంతో; శంఖం — శంఖమును; దధ్మౌ — మ్రోగించెను; ప్రతాప-వాన్ — తేజోవంతమైన.
అప్పుడు, కురువృద్ధుడు, మహోన్నత మూలపురుషుడైన భీష్మ పితామహుడు, సింహంలా గర్జించాడు, మరియు తన శంఖాన్ని పెద్ద శబ్దంతో పూరిస్తూ, దుర్యోధనుడికి హర్షమును కలుగచేసెను.
భగవద్గీత
అథ ప్రథమోధ్యాయః, అర్జున విషాదయోగః, త్రయోదశ శ్లోకః।
తతః శంఖాశ్చ భేర్యశ్చ పణవానకగోముఖాః ।
సహసైవాభ్యహన్యంత స శబ్దస్తుములోఽభవత్ ।। 13 ।।
తతః — ఆ తరువాత; శంఖాః — శంఖములు; చ — మరియు; భేర్యః — భేరీలు; చ — మరియు; పణవ-ఆనక — డోళ్ళు మరియు ఢంకాలు; గో-ముఖాః — కొమ్ము వాద్యములు; సహసా — అకస్మాత్తుగా ఒక్కపెట్టున; ఏవ — నిజంగా; అభ్యహన్యంత — పెద్దగా మ్రోగినవి; సః — ఆ యొక్క; శబ్దః — శబ్దము; తుములః — భయానకముగా; అభవత్ — ఉండెను.
ఆ తరువాత, శంఖములు, డోళ్ళు, ఢంకాలు, భేరీలు, మరియు కొమ్ము వాయిద్యములు ఒక్కసారిగా మ్రోగినవి, మరియు వాటన్నిటి కలిసిన శబ్దం భయానకముగా ఉండెను.
భగవద్గీత
అథ ప్రథమోధ్యాయః, అర్జున విషాదయోగః, చతుర్దశ శ్లోకః।
తతః శ్వేతైర్హయైర్యుక్తే మహతి స్యందనే స్థితౌ ।
మాధవః పాండవశ్చైవ దివ్యౌ శంఖౌ ప్రదధ్మతుః ।। 14 ।।
తతః — ఆ తరువాత; శ్వేతైః — తెల్లని; హయైః — గుఱ్ఱములు; యుక్తే — కట్టబడిన; మహతి — శ్రేష్ఠమైన; స్యందనే — రథము; స్థితౌ — కూర్చొనిఉన్న; మాధవః — శ్రీ కృష్ణుడు, సౌభాగ్యదేవత అయిన లక్ష్మీదేవి భర్త; పాండవః — అర్జునుడు; చ — మరియు; ఏవ — కూడా; దివ్యౌ — దివ్యమయిన; శంఖౌ — శంఖములను; ప్రదధ్మతుః — పూరించారు.
ఆ తరువాత, పాండవ సైన్యం మధ్యలోనుండి, తెల్లని గుఱ్ఱములు పూన్చి ఉన్న ఒక అద్భుతమైన రథంలో కూర్చుని ఉన్న, మాధవుడు మరియు అర్జునుడు తమ దివ్య శంఖములను పూరించారు.
భగవద్గీత
అథ ప్రథమోధ్యాయః, అర్జున విషాదయోగః, పంచదశ శ్లోకః।
పాంచజన్యం హృషీకేశో దేవదత్తం ధనంజయః ।
పౌండ్రం దధ్మౌ మహాశంఖం భీమకర్మా వృకోదరః ।। 15 ।।
పాంచజన్యం — పాంచజన్యం అని పేరు గల శంఖము; హృషీక-ఈశః — శ్రీ కృష్ణుడు, మనస్సు, ఇంద్రియముల అధిపతి; దేవదత్తం — దేవదత్తం అని పేరు గల శంఖము; ధనంజయః — అర్జునుడు, ఐశ్వర్యమును జయించేవాడు; పౌండ్రం — పౌండ్రం అని పేరుగల శంఖము; దధ్మౌ — పూరించెను; మహా-శంఖం — ఒక బ్రహ్మాండమైన శంఖమును; భీమ-కర్మా — అత్యంత కష్టసాధ్యకార్యములను చేయునట్టి; వృక-ఉదరః — భీముడు, గొప్పగా భుజించేవాడు.
హృషీకేశుడు, పాంచజన్యం అనబడే శంఖాన్ని పూరించాడు, మరియు అర్జునుడు దేవదత్తాన్ని పూరించాడు. గొప్పగా భుజించే వాడు, అత్యంత కష్టసాధ్యకార్యములను చేయునట్టి భీముడు, పౌండ్రం అనబడే బ్రహ్మాండమైన శంఖమును పూరించెను.
భగవద్గీత
అథ ప్రథమోధ్యాయః, అర్జున విషాదయోగః, షోడశ శ్లోకః।
అనంతవిజయం రాజా కుంతీపుత్రో యుధిష్ఠిరః ।
నకులః సహదేవశ్చ సుఘోషమణిపుష్పకౌ ।। 16 ।।
అనంత-విజయం — అనంతవిజయం అని పేరు గల శంఖము; రాజా — రాజు; కుంతీ-పుత్రః — కుంతీ దేవి పుత్రుడు; యుధిష్ఠిరః — యుధిష్ఠిరుడు; నకులః — నకులుడు; సహదేవః — సహదేవుడు; చ — మరియు; సుఘోష-మణిపుష్పకౌ — సుఘోషము, మణిపుష్పకము అను పేర్లుగల శంఖములు.
ఓ భూమండలాన్ని పాలించేవాడా! యుధిష్ఠిర మహారాజు అనంతవిజయాన్ని పూరించాడు, నకుల సహదేవులు, సుఘోష మణిపుష్పకములను పూరించారు.
భగవద్గీత
అథ ప్రథమోధ్యాయః, అర్జున విషాదయోగః, సప్తదశ శ్లోకః।
కాశ్యశ్చ పరమేష్వాసః శిఖండీ చ మహారథః ।
ధృష్టద్యుమ్నో విరాటశ్చ సాత్యకిశ్చాపరాజితః ।। 17 ।।
కాశ్యః — కాశీ రాజు; చ — మరియు; పరమ-ఇషు-ఆసః — శ్రేష్ఠమైన విలుకాడు; శిఖండీ — శిఖండి; చ — మరియు; మహా-రథః — పదివేల సామాన్య యోధుల బలానికి ఒక్కరిగా సరితూగే యోధులు; ధృష్టద్యుమ్నః — ధృష్టద్యుమ్నుడు; విరాటః — విరాటుడు; చ — మరియు; సాత్యకిః — సాత్యకి; చ — మరియు; అపరాజితః — అజేయుడైన.
గొప్ప విలుకాడైన కాశీ రాజు, మహారథుడైన శిఖండి, ధృష్టద్యుమ్నుడు, విరాటుడు, మరియు అజేయుడైన సాత్యకి.
భగవద్గీత
అథ ప్రథమోధ్యాయః, అర్జున విషాదయోగః, అష్టాదశ శ్లోకః।
ద్రుపదో ద్రౌపదేయాశ్చ సర్వశః పృథివీపతే ।
సౌభద్రశ్చ మహాబాహుః శంఖాన్ దధ్ముః పృథక్ పృథక్ ।। 18 ।।
ద్రుపదః — ద్రుపదుడు; ద్రౌపదేయాః — ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు; చ – మరియు; సర్వశః — అందరూ; పృథివీ-పతే — భూగోళాన్ని పాలించేవాడు; సౌభద్రః — అభిమన్యుడు, సుభద్ర కుమారుడు; చ — మరియు; మహా-బాహుః — గొప్ప బాహువులు కలవాడు; శంఖాన్ — శంఖములు; దధ్ముః — పూరించారు; పృథక్ పృథక్ — వేరు వేరుగా.
ద్రుపదుడు, ద్రౌపది యొక్క ఐదుగురు కుమారులు, మరియు భుజబలము కలవాడు, సుభద్రా పుత్రుడు అయిన అభిమన్యుడు, వీరందరూ తమ తమ శంఖములను పూరించారు.
భగవద్గీత
అథ ప్రథమోధ్యాయః, అర్జున విషాదయోగః, నవదశ శ్లోకః।
స ఘోషో ధార్తరాష్ట్రాణాం హృదయాని వ్యదారయత్ ।
నభశ్చ పృథివీం చైవ తుములోఽభ్యనునాదయన్ ।। 19 ।।
సః — అట్టి; ఘోషః — శబ్దము; ధార్తరాష్ట్రాణాం — ధృతరాష్ట్రుని పుత్రుల యొక్క; హృదయాని — గుండెలను; వ్యదారయత్ — బ్రద్దలు చేసెను; నభః — ఆకాశము; చ — మరియు; పృథివీం — భూమి; చ — మరియు; ఏవ — నిజముగా; తుములః — భీకరమైన శబ్దం; అభ్యనునాదయన్ — ప్రతిధ్వనింపచేయుచు.
ఓ ధృతరాష్ట్రా, ఆ భీకరమైన శబ్దానికి భూమ్యాకాశములు దద్దరిల్లెను; అది మీ తనయుల హృదయాలను బ్రద్దలు చేసెను.
భగవద్గీత
అథ ప్రథమోధ్యాయః, అర్జున విషాదయోగః, వింశతిః శ్లోకః।
అథ వ్యవస్థితాన్ దృష్ట్వా ధార్తరాష్ట్రాన్ కపిధ్వజః ।
ప్రవృత్తే శస్త్రసంపాతే ధనురుద్యమ్య పాండవః ।
హృషీకేశం తదా వాక్యమిదమాహ మహీపతే ।। 20 ।।
అథ — అనంతరము; వ్యవస్థితాన్ — క్రమంగా నిలిచివున్న; దృష్ట్వా — చూసి; ధార్తరాష్ట్రాన్ — ధృతరాష్ట్రుని తనయులు; కపి-ధ్వజః — వానరమును (కోతి) జండాపై కలవాడు; ప్రవృత్తే — ప్రారంభించటానికి సిద్దంగా వున్న; శస్త్ర సంపాతే — ఆయుధములు వాడటానికి; ధనుః — ధనుస్సు (విల్లు) ను; ఉద్యమ్య — పైకెత్తి; పాండవః — అర్జునుడు, పాండు పుత్రుడు; హృషీకేశం — శ్రీ కృష్ణునితో; తదా — అప్పుడు; వాక్యం — పదములు; ఇదం — ఇవి; ఆహ — పలికెను; మహీ-పతే — రాజా.
ఆ సమయంలో, తన రథం జెండాపై హనుమంతుని చిహ్నం కలిగివున్న పాండుపుత్రుడు అర్జునుడు, తన ధనుస్సుని తీసుకున్నాడు. సమరానికి ఎదురుగా నిలిచిఉన్న మీ పుత్రులను చూసి, ఓ రాజా, అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు.
భగవద్గీత
అథ ప్రథమోధ్యాయః, అర్జున విషాదయోగః, ఏకవింశతిః శ్లోకః।
అర్జున ఉవాచ ।
సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయ మేఽచ్యుత ।। 21 ।।
అర్జున ఉవాచ — అర్జునుడు పలికెను; సేనయోః — సైన్యములు; ఉభయోః — రెండు; మధ్యే — మధ్యలో; రథం — రథము; స్థాపయ — నిలిపిఉంచు; మే — నా యొక్క; అచ్యుత — శ్రీ కృష్ణా, సంపూర్ణ దోషరహితుడా;
అర్జునుడు ఇలా అన్నాడు: ఓ అచ్యుతా (శ్రీకృష్ణా), దయచేసి నా రథాన్ని రెండు సైన్యాల మధ్యకి తీసుకువెళ్ళుము.
భగవద్గీత
అథ ప్రథమోధ్యాయః, అర్జున విషాదయోగః, ద్వావింశతిః శ్లోకః।
యావదేతాన్ నిరీక్షేఽహం యోద్ధుకామానవస్థితాన్ ।
కైర్మయా సహ యోద్ధవ్యమ్ అస్మిన్ రణసముద్యమే ।। 22 ।।
యావత్ — ఎంతవరకు అయితే; ఏతాన్ — ఈ యొక్క; నిరీక్షే — చూసి; అహం — నేను; యోద్ధు-కామాన్ — యుద్ధం కొరకు; అవస్థితాన్ — నిలిపిఉన్న; కైః — ఎవరితో; మయా — నా చే; సహ — కూడి; యోద్ధవ్యమ్ — యుద్ధం చేయవలసి; అస్మిన్ — ఈ యొక్క; రణ-సముద్యమే — మహా పోరాటంలో.
ఈ మహా పోరాటంలో, రణరంగంలో నిలిచియున్న ఎవరెవరితో యుద్ధం చేయవలసి ఉన్నదో నేను చూడాలి.
భగవద్గీత
అథ ప్రథమోధ్యాయః, అర్జున విషాదయోగః, త్రయోవింశతిః శ్లోకః।
యోత్స్యమానానవేక్షేఽహం య ఏతేఽత్ర సమాగతాః ।
ధార్తరాష్ట్రస్య దుర్బుద్ధేః యుద్ధే ప్రియచికీర్షవః ।। 23 ।।
యోత్స్యమానాన్ — యుద్ధానికి వచ్చినవారు; అవేక్షే అహం — నాకు చూడాలని వుంది; యే — ఎవరు; ఏతే — వారు; అత్ర — ఇక్కడ; సమాగతాః — కూడిఉన్న; ధార్తరాష్ట్రస్య — ధృతరాష్ట్రుని పుత్రునికి; దుర్బుద్ధేః — దుర్భుద్ధి కలవాడు; యుద్ధే — యుద్ధంలో; ప్రియ-చికీర్షవ — సంతోషపెట్టడం కొరకు.
దుర్బుద్ధిగల ధృతరాష్ట్రుని పుత్రున్ని సంతోషపెట్టడం కొరకు అతని పక్షాన యుద్ధానికి వచ్చియున్న అందరిని ఒకసారి నాకు చూడాలనిపిస్తున్నది.
371వ.ప్రశ్న- సుఖదుఃఖాది ద్వంద్వములు వేనినుండి ప్రాదిర్భవించును?
ఉత్తరము- ఇచ్ఛాద్వేషములనుండి.
372వ.ప్రశ్న- సమస్త ప్రాణులు అజ్ఞానము నెపుడు పొందుచున్నవి?
ఉత్తరము- పుట్టుకతోనే.
373వ.ప్రశ్న- భగవంతుని దృఢవతులై ఎవరు సేవింపగలరు?
ఉత్తరము- పాపము నశించినవారు.
374వ.ప్రశ్న- పాప మెట్లు నశింపగలదు?
ఉత్తరము- పుణ్యకార్యములచే.
375వ.ప్రశ్న- పాపము నశించిన కలుగు ఫలితము లెవ్వి?
ఉత్తరము- (1) ద్వంద్వ మోహవినాశనము (2) ధ్యానదృఢత్వము.
376వ.ప్రశ్న- భగవానుని ఎందుల కాశ్రయింపవలెను?
ఉత్తరము- జన్మజరామరణరూప సంసారబంధవిచ్ఛిత్తి కొఱకై.
377వ.ప్రశ్న- భగవత్ప్రాప్తి యెట్లు కలుగగలదు ?
ఉత్తరము- స్వప్రయత్నముచే,తాను సువయముగ ఆధ్యాత్మికసాధనల నభ్యసించుటచే.
378వ.ప్రశ్న- ఫలితముగ అతని కేమిలభించును?
ఉత్తరము- భగవదాశ్రయముచేతను, భగవత్సాక్షాత్కారమునకు వలసిన యత్నములచేతను అతడు బ్రహ్మప్రాప్తినొంద, సమస్తజీవుల సమస్తకర్మము అంతయు ఆ పరబ్రహ్మయే యని తెలిసికొనగల్గును.
379వ.ప్రశ్న- దేహవియోగసమయమందును ఎవరు నియమితచిత్తులై ఆత్మానుభవము గలిగి యుందురు?
ఉత్తరము- ఎవరు పెక్కు సాధనలద్వారా జీవితకాలమంతయు యత్నించి పరమాత్మనుభవమును సంపాదించుకొందురో వారు.
ఓమ్ తత్ సత్.
భగవద్గీత
అథ ప్రథమోధ్యాయః, అర్జున విషాదయోగః, చతుర్వింశతిః శ్లోకః।
సంజయ ఉవాచ ।
ఏవముక్తో హృషీకేశో గుడాకేశేన భారత ।
సేనయోరుభయోర్మధ్యే స్థాపయిత్వా రథోత్తమమ్ ।। 24 ।।
సంజయ ఉవాచ — సంజయుడు చెప్పెను; ఏవం — ఈ విధంగా; ఉక్తః — చెప్పబడిన; హృషీకేశః — శ్రీ కృష్ణుడు, ఇంద్రియములకు అధిపతి; గుడాకేశేన — అర్జునుడి చేత, నిద్రని జయించినవాడు; భారత — భరత వంశీయుడా; సేనయోః — సైన్యములు; ఉభయోః — రెండు; మధ్యే — మధ్యలో; స్థాపయిత్వా — నిలిపి; రథ-ఉత్తమమ్ — ఉత్తమమైన రథమును.
సంజయుడు ఇలా అన్నాడు: ఓ ధృతరాష్ట్రా, ఈ విధంగా, నిద్రని జయించినవాడైన, అర్జునుడు కోరిన విధంగా, శ్రీ కృష్ణుడు ఆ వైభవోపేతమైన రథమును రెండు సైన్యముల మధ్యకు నడిపించి నిలిపెను.