Categories
OM

Chanikya Neeti

23 replies on “Chanikya Neeti

पठन्ति चतुरो वेदान् धर्मशास्त्राण्यनेकशः ।
आत्मानं नैव जानन्ति
दर्वी पाकरसं यथा ॥

పఠంతి చతురో వేదాన్ ధర్మశాస్త్రాన్యనేకశః।
ఆత్మానం నైవ జానంతి
దర్వీ పాక రసం యథా।।

చతుర్వేదాలు, అనేక ధర్మశాస్త్రాలు చదివినా ఆత్మజ్ఞానం తెలియనివాడు – రుచిగల వంటల్లోని గరిటె వంటివాడు. (ఆరుచిని , సారాన్ని గరిటె ఆస్వాదించలేదు కదా )

Chanakya Niti – 15/12.

Those who do not know the ātmā (Self) (after having) read all the 4 Vedas and dharmaśāstrās (scriptures) galore, (they are) just like the ladle (that) doesn’t know the flavor of the food.

A clever person may be versatile in his knowledge about the all the 4 Vedic scriptures and dharmaśāstrās. He may have them all memorized too. But if he has not understood or known the ātmā, or never seen the Self, then all his knowledge is futile!

A ladle is dipped and stirred in the food constantly. It is in contact with the food from the beginning of the cooking, until the minute it is served. But still, it has never enjoyed the flavors of the food that it assisted in cooking! Similarly, is the knowledge of scriptures associated with a person who has never experienced the ātmā within himself.

हरिः ॐ।

Chanting multitudes of verses and earning multiple degrees only makes one learned, but not realized!

स्वयं कर्म करोत्यात्मा
स्वयं तत्फलमश्नुते ।
स्वयं भ्रमति संसारे
स्वयं तस्माद्विमुच्यते॥

స్వయం కర్మ కరోత్యాత్మా
స్వయం తత్ఫలమశ్నుతే।
స్వయం భ్రమతి సంసారే
స్వయం తస్మాత్ విముచ్యతే।।

ఆచార్య చాణక్యుడు ఈ శ్లోకంలో జీవుడు కర్మ (మంచి చెడు పనులు) చేయడానికి స్వతంత్రుడైనప్పటికీ, దాని ఫలాన్ని అనుభవించడానికి మాత్రం స్వతంత్రుడు కాదు ఎందుకంటే చేసిన కర్మఫలాన్ని అనుభవించి తీరాలి. జీవుడు ఇచ్ఛాపూర్వకంగా సంసారబంధాలలోనికి ప్రవేశిస్తాడు (బంధాలలో చిక్కుకుంటాడు). దృఢనిశ్చయం ఉంటే ఆ బంధాలను ఉండి బయటపడేందుకు కూడా! పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితమే ఈ జన్మలో సుఖ-దుఃఖాలంటారు. అందువలన వాటినుండి బయటపడడానికి కూడా ఆ జీవుడే బాధ్యుడు.

Chanakya Niti – 6/9.

The spirit soul goes through his own course of karma and he himself suffers the good and bad results thereby accrued. By his own actions he entangles himself in samsara, and by his own efforts he extricates himself.
हरिः ॐ।

हरिः ॐ।
[8:59 pm, 16/02/2023] SB ISN Murthy Vijag Adyakshah: 🕉️🕉️शुभदयः।🕉️🕉️

आतुरे व्यसने प्राप्ते
दुर्भिक्षे शत्रुसङ्कटे ।
राजद्वारे श्मशाने च
यस्तिष्ठति स बान्धवः ॥

ఆతురే వ్యసనే ప్రాప్తే
దుర్భిక్షే శత్రు నిగ్రహే।
రాజద్వారే స్మశానైచ
యత్తిష్ఠతి సబాంధవ:।।

అనారోగ్యముతో బాధపడుతున్నప్పుడు కష్టములు సంప్రాప్తించినపుడు, కరువు ఏర్పడినపుడు, శత్రువులను ఓడించవలసి వచ్చినపుడు, ప్రభుత్వముతో వ్యవహారం నడుచుచున్నప్పుడు రాజనిగ్రహం ఏర్పడినపుడు అనగా శిక్షపడినపుడు, అలాగే కావాల్సిన వారు మరణించినపుడు వారిని స్మశానమునకు తీసుకొని పోవుటకు వెంటవచ్చువారు నిజమైన మిత్రులు, బంధువులు అవుతారు.

Chanakya Niti -1/12

He is a true friend who does not forsake us in time of need, misfortune, famine, or war, in a king’s court, or at the crematorium (smasana).

हरिः ॐ।

प्रणम्य शिरसा विष्णुं त्रैलोक्याधिपतिं प्रभुम् ।
नानाशास्त्रोद्धृतं वक्ष्ये राजनीतिसमुच्चयम् ।।१।।

Humbly Bowing Down Before the Almighty Lord Vishnu, The Lord of the Three Worlds, I Humbly Bowing down before the Almighty of the three realms, Lord Vishnu, I Recite Maxims of the Science of Politics & Political Ethics (Niti) Selected from the Various Shastra.

ప్రణమ్య శిరసా విష్ణుం త్రైలోక్యాధిపతిం ప్రభుమ్ ।
నానాశాస్త్రోద్ధృతం వక్ష్యే రాజనీతిసముచ్చయం ॥ 01 ॥

అతను మూడు లోకాలకు అధిపతి అయిన విష్ణువుకు శిరస్సు వంచి నమస్కరించాడు. వివిధ గ్రంథాల నుండి ఉల్లేఖించిన రాజకీయాల సమితిని నేను మీకు చెప్తాను.

🕉️🙏शुभोदयः।🙏🕉️

न विप्रपादोदककर्दमानि,
न वेदशास्त्रध्वनिगर्जितानि।
स्वाहा-स्वधाकार-विवर्जितानि, श्मशानतुल्यानि गृहाणि तानि।।

న విప్ర పాదోదక కర్దమాని
న వేదశాస్త్ర ధ్వని గర్జితాని |
స్వాహా స్వధాకార వివర్జితాని
శ్మశాన తుల్యాని గృహాణి తాని |

బ్రాహ్మణుల పాదములు కడిగిన నీరు పారనట్టివి , వేదశాస్త్ర పాఠపఠనాధ్వనులచే ఘోషిల్లనట్టివీ , యజ్ఞమంత్రముల చివర పలికెడు స్వాహా అను శబ్దములు , పితరులకీయబడిన భోజనమును పొగడునట్టి శబ్దములు (స్వధ) లేనట్టివియగు గృహములు శ్మశాన భూములతో సమానములు అని ఆచార్య చాణక్యుడు ఈ సుభాషితంలో వివరించేరు. అంటే గృహంలో బ్రాహ్మణ సత్కారాలు, వేదఘోష, శాస్త్ర చర్చ, యజ్ఞ యాగాదులు జరుగుతూ ఉంటేనే అది గృహమనిపించుకుంటుంది.

Chanakya Niti – 12/10.

Those houses where Brahmins are not respected by washing their feet, where Veda mantras and sastras are not recited loudly, where yagnas are not performed regularly, such houses are not houses but are like the Shmasan (cremation ground).

In other words, in a house, there should be respect for Brahmins, there should be discourses of Veda, and sastras, there should be homas and yagnas to qualify for being a gruham.

हरिः ॐ।

🕉️🙏शुभोदयः।🙏🕉️

जन्म-जन्मन्यभ्यस्तं
दानमध्ययनं तपः ।
तेनैवाऽभ्यासयोगेन
देही चाभ्यस्यते पुनः । ।

జన్మ-జన్మన్యమభ్యస్తం
దానమధ్యయనం తపః ।
తేనైవాऽభ్యాసయోగేన
దేహీ చాభ్యస్యతే పునః ।।

ఆచార్య చాణక్యుని అభిప్రాయం ప్రకారం జన్మ జన్మాంతర అందులో జీవి దాని ధర్మాలు, శాస్త్రాధ్యయనం, తపస్సు అనేవి చేస్తూ ఉంటే, కొత్త శరీరం దొరికినప్పుడు (నూతన జన్మలో) ఆ సాధన (పూర్వజన్మల అభ్యాసం) కారణంగా సత్కర్మలు (మంచిపనులు) చేయాలనే ప్రవృత్తి కలుగుతుంది. అకారణంగా మానవుడు ముందు ముందు జన్మలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలి అవకాశం ఉంటుంది. అందువలన ఈ జన్మలో మంచి పనులు చేయడంపై దృష్టి పెట్టి అనుష్టానం అభ్యాసం చెయ్యాలి అని చెప్పేరు.

Chanakya Niti – 16/19.

In this Subhashitam, Acharya Chanakya says that practising charity, studying shastras and doing penance by the prani in one birth leads to his having the zeal to do good deeds, studying sastras and doing penance in his subsequent birth. This cycle of habitual nature of repeatedly doing in birth after birth makes his future births. Therefore, Acharya says that one should strive to do good things,vstudying sastras and penance with a view to improve his next birth

हरिः ॐ।

🕉️🙏शुभोदयः।🙏🕉️

यौवनं धन संपत्तिः प्रभुत्वमविवेकता |
एकैकमप्यनर्थाय
किमु यत्र चतुष्ठयम् ||

యౌవనం ధన సంపత్తిః ప్రభుత్వమవివేకతా |
ఏకైకమప్యనార్థాయ
కిము యత్ర చతుష్ఠయం ||

యువత, సంపద, అధికారం (అధికారం) మరియు విచక్షణ లేకపోవడం వీటిలో ఏ ఒక్కటైనా కూడా విపత్తును ప్రేరేపించగలదు.
ఈ నాలుగు లక్షణాలూ మనిషిలో ఉంటే అక్కడి పరిస్థితి ఎలా ఉంటుంది ?
అది వెంటనే వినాశనానికి దారితీస్తుంది. అందువలన యౌవనంలో ధన సంపత్తి అధికారం కలిగినప్పుడు వినమ్రంగా వివేకంతో వ్యవహరించాలి.

Chanakya Niti – 17/22.

Youth, wealth, power (authority) and indiscretion , even any one of these is capable of triggering a disaster.
If all these four traits are present in a person , then what will be the situation there ? That will lead to disaster. Hence one should be obedient and act wisely in case of youth having wealth and power with discretion.

हरिः ॐ।

शुभोदयः।🙏🕉️

किं जातैर्बहुभिः पुत्रैः शोकसन्तापकारकैः ।
वरमेकः कुलालम्बी
यत्र विश्राम्यते कुलम् ॥

కింజాతైర్బహుభిః పుత్రైః శోకసంతాపకారకైః |
వరమేకః కులాలంబీ
యత్ర విశ్రామ్యతే కులం ||

దుఃఖాన్ని, విసుగును కలిగించే అనేకమంది పుత్రులను కలిగి ఉండడం వల్ల ప్రయోజనం ఏమిటి? కుటుంబ గౌరవాన్ని పెంచి, కులానికి సుఖ సౌఖ్యాలను కలిగించే ఒకే ఒక్క కొడుకు మాత్రమే ఉండటం మంచిది.

Chanakya Niti – 3/17.

What is the use of having many sons if they cause grief and vexation? It is better to have only one son from whom the whole family can derive support and peacefulness.

हरिः ॐ।

🙏🕉️ शुभोदयः।🕉️🙏

वरं प्राणपरित्यागो
मानभंगेन जीवनात्।
प्राणत्यागे क्षणं दुःखं
मानभंगे दिने दिने ।।

వరం ప్రాణపరిత్యాగో మానభంగేన జీవనాత్ ।
ప్రాణత్యాగే క్షణం దుఃఖం మానభంగే దినే దినే ॥

ఈ శ్లోకంలో ఆచార్య చాణక్యుడు మాన మర్యాదలతో జీవించడం విషయంలో ఇలా చెబుతున్నారు – అవమానం భారంతో జీవించడం కన్నా మరణమే ఉత్తమం అన్నారు. మరణం కారణంగా దుఃఖం క్షణకాలం మాత్రమే, కానీ అవమానంతో జీవించడం వలన కలిగే దుఃఖం జీవన పర్యంతం ఉంటుంది. సమ్మానకరమైన జీవనమే జీవించడానికి యోగ్యమైనది, అదే నిజము.

Chanakya Niti – 16/16.

In this Subhashitam, Acharya Chanakya says death is better than living with insults. The grief of death is momentary whereas living with insults give grief through out the life.

हरिः ॐ।

🕉️🙏शुभोदयः।🙏🕉️

यौवनं धन संपत्तिः प्रभुत्वमविवेकता |
एकैकमप्यनर्थाय
किमु यत्र चतुष्ठयम् ||

యౌవనం ధన సంపత్తిః ప్రభుత్వమవివేకతా |
ఏకైకమప్యనార్థాయ
కిము యత్ర చతుష్ఠయం ||

యువత, సంపద, అధికారం (అధికారం) మరియు విచక్షణ లేకపోవడం వీటిలో ఏ ఒక్కటైనా కూడా విపత్తును ప్రేరేపించగలదు.
ఈ నాలుగు లక్షణాలూ మనిషిలో ఉంటే అక్కడి పరిస్థితి ఎలా ఉంటుంది ?
అది వెంటనే వినాశనానికి దారితీస్తుంది. అందువలన యౌవనంలో ధన సంపత్తి అధికారం కలిగినప్పుడు వినమ్రంగా వివేకంతో వ్యవహరించాలి.

Chanakya Niti – 17/22.

Youth, wealth, power (authority) and indiscretion , even any one of these is capable of triggering a disaster.
If all these four traits are present in a person , then what will be the situation there ? That will lead to disaster. Hence one should be obedient and act wisely in case of youth having wealth and power with discretion.

हरिः ॐ।

🕉️🙏शुभोदयः।🙏🕉️

निर्धनं पुरुषं वेश्या
प्रजा भग्नं नृपं त्यजेत्।
खगाः बीतफलं वृक्षं
भुक्त्वा चाऽभ्यागतो गृहम् ।।

నిర్ధనం పురుషం వేశ్యా
ప్రజా భగ్నం నృపం త్యజేత్ ।
ఖగా వీతఫలం వృక్షం
భుక్త్వా చాऽభ్యాగతో గృహమ్ ॥

ఏ విధంగా వేశ్య ధనహీనుని, ప్రజలు ఓడిపోయిన రాజును
పక్షులు పండ్లులేని చెట్లను విడిచి పెడతారో(యో), అదేవిధంగా
అతిథులు భోజనం చేసిన తరువాత గృహ యజమానికి శుభాకాంక్షలు (సాధువాదాలు చేసి ఆ ఇంటిని విడిచిపెట్టడంలోనే వారి గౌరవానికి భంగం కలుగదని
భావం అని ఆచార్య చాణక్యుడు తెలియ జేసేరు.

Chanakya Niti – 2/17.

In this Subhashitam, Acharya Chanakya says that just as a prostitute (veshya) deserts the person without money, people deserting a defeated King and the bird deserting a dried up tree having no fruits, a guest has to leave the house of the host after thanking him to protect his own respect.

हरिः ॐ।

🕉️🙏शुभोदयः।🙏🕉️

कान्तावियोगः स्वजनापमानो ऋणस्य शेषं कुनृपस्य सेवा । दरिद्रभावो विषमा सभा च विनाग्निमेते प्रदहन्ति कायम् ।।

కాన్తావియోగః స్వజనాపమానో
ఋణస్య శేషం కునృపస్య సేవా।
దరిద్రభావో విషమా సభా చ
వినాగ్నిమేతే ప్రదహన్తి కాయమ్।।

ఆచార్య చాణక్యుడు ఈ సుభాషితంలో అగ్నిలేకుండానే శరీరాన్ని దహించేసే ఐదు దుఃఖాలగురించి ఇలా చెప్పేరు — భార్యావియోగం, స్వజనులచే (తన దగ్గర బంధువుల చేత) అవమానించబడడం, చేసిన అప్పు తీర్చలేక పోవడం, చెడ్డయజమానివద్ద పనిచేయవలసి రావడం, బీదవాడిగా మూర్ఖుల సమాజంలో నివసించవలసి రావడం అనే దుఃఖాలు మానవులు సాధారణంగా మరచిపోలేనటువంటివి, మరియు సహించలేనటువంటివి.

Chanakya Niti – 2/14.

Acharya Chanakya says that there are five types of sad happenings which virtually be burning the body of an individual without fire. They are – separaruin from wife, insults from near and dear, inability to return the debts, serving a bad master, residing in a society of fools while in poverty are really painful and a man will not be able to forget or bear.

हरिः ॐ ।

🕉️🙏शुभोदयः।🙏🕉️

लोभश्चेदगुणेन किं पिशुनता यद्यस्ति किं पातकैः,
सत्यं चेत्तपसा च किं शुचि मनो यद्यस्ति तीर्थेन किम् ।
सौजन्यं यदि किं गुणैः सुमहिमा यद्यस्ति किं मण्डनैः,
सद्विद्या यदि किं धनैरपयशो यद्यस्ति किं मृत्युना ।।

లోభశ్చేదగుణేన కిం పిశునతా
యద్యస్తి కిం పాతకైః,
సత్యం చేత్తపసా చ కిం శుచి మనో యద్యస్తి తీర్థేన కిమ్।
సౌజన్యం యది కిం గుణైః సుమహిమా యద్యస్తి కిం మణ్డనైః
సద్విద్యా యది కిం ధనైరపయశో యద్యస్తి కిం మృత్యునా।।

ఆచార్య చాణక్యుడు ఈ సుభాషితంలో అమూల్యమైన విషయాలను ఇలా తెలియజేసేరు –
ఈ ప్రపంచంలో లోభత్వం(పిసినారితనం) అన్నిటికన్నా పెద్ద అవగుణం, చాడీలు చెప్పడం అన్నిటికన్నా పెద్ద పాపం, సత్యనిష్ఠ తపస్సు కన్నా గొప్పది, మనస్సు యొక్క పవిత్రత అన్ని పుణ్యక్షేత్రాలను సేవించడం కన్నా గొప్పది, సజ్జనత అన్ని గుణాల కన్నా గొప్పది, కీర్తి (యశస్సు) అన్ని ఆభూషణాలకన్నా గొప్పది, చెడ్డపేరు మృత్యువుతో సమానమైన కష్టదాయకమైన విషయము.

Chanakya Niti – 17/4.

In this Subhashitam, Acharya Chanakya says that in this world, miserliness is the worst demerit, back-biting is the worst sin, truth is the greatest penance and keeping pure mind is greater than pilgrimage, nobility is the best virtue, fame is the best ornament, best education is the greatest wealth and getting bad name is the most painful thing equal to death.

हरिः ॐ।

🕉️🙏शुभोदयः।🙏🕉️

दानार्थिनो मधुकराः यदि कर्णतालैर्-
दूरीकृताः करिवरेण मदान्धबुद्ध्या ।
तस्यैव गण्डयुगमण्डनहानिरेषा भृङ्गाः पुनर्विकचपद्मवने वसन्ति ।।

దానార్థినో మధుకరాః యది కర్ణతాలైర్-
దూరీకృతాః కరివరేణ మదాన్ధబుధ్యా।
తస్యైవ గణ్డయుగ్మణ్డనహానిరేషా
భృంగాః పునర్వికచపద్మవనే వసన్తి।।

యాచకులైన భ్రమరాలు మదించిన ఏనుగు గండస్థలం మీద వాలి మదాన్ని తాగుతోంటే ఏనుగు కోపంతో చెవులను ఊపుతూ వాటిని దూరంగా తోలుతుంది. దీనివలన భ్రమరాలకు ఏమీ నష్టం కలుగదు. ఎందుకంటే అవి అక్కడినుండి తిప్పుకొని వికసించిన కమలాలలోని తేనెను సులభంగా తాగుతాయి. కాని, ఏనుగు గండస్థల శోభ తగ్గిపోతుంది.
ఈ సుభాషితంలో ఆచార్య చాణక్యుని అభిప్రాయం ఏమిటంటే దాత యాచకులను పారద్రోలితే యాచకులకేమీ నష్టం కలుగదు ఎందుకంటే వారు దానమిచ్చే వేరేవారి ఆశ్చర్యాన్ని పొందుతారు. కాని ఇవ్వకపోవడం వలన వారికే నష్టం – యాచకులు మళ్లీ రారు. అందువలన యాచకులను తిరస్కరించకుండా సంతుష్టపరిస్తే వారి కీర్తి దూరదూరాలవరకు వ్యాపిస్తుంది.

Chanakya Niti – 17/18.

Acharya Chanakya in this Subhashitam warns people involved in charity not to refuse any one who comes for help. To cite an example, he says that when the Bhramars come to a rut elephant and start drinking at the gandasthal of the elephant drives them away with his ears. Acharya Chanakya says that there is no harm for the Bhramars as they go to lotus oond and enjoy the honey available in abundance. Elephant loses its pride and fandasthal Shobha as no bhramar approaches.
Taking this as an example, Acharya Chanakya says that if a Daata (दाता) refuses to give any alms or help, the याचका (needy) will find some one else to fulfil his need. But, the दाता loses his name and fame and none would approach him thereafter. Acharya, therefore, advises not to refuse and by giving to the needy, his name and fame will spread to far off places.

हरिः ॐ।

🕉️🙏शुभोदयः।🙏🕉️

राजा वेश्या यमश्चाग्निस्तस्करो बाल याचको।
परदुःखं न जानन्ति अष्टमो ग्रामकण्टकाः ।।

రాజా వేశ్యా యమశ్చాగ్నిస్తస్కరో బాల యాచకో।
పర దుఃఖం నజానన్తి అష్టమ గ్రామం కణ్టకః।।

ఆచార్య చాణక్యుని అభిప్రాయంలో రాజు, వేశ్య, యముడు, అగ్ని, దొంగ, బాలుడు, యాచకుడు మరియు గ్రామంలో ప్రజలను పీడించే వాడు, ఈ ఎనిమిది మందీ ఇతరుల దుఃఖాన్ని (ఇబ్బందులను)అర్థం చేసుకోరు (పట్టించుకోరు).

Chanakya Niti – 17/19.

According to Acharya Chanakya, the following eight people do not understand the problems/difficulties of others. They are – the king, prostitute (vesya), Yama (king of death), Agni, thief, child, beggar and the Grama-Kantaka (person who harasses villagers).

हरिः ॐ।

🕉️🙏शुभोदयः।🙏🕉️

न देवो विद्यते काष्ठे
न पाषाणे न मृण्मये ।
भावे हि विद्यते देव
स्तस्माद्भावो हि कारणम् ।।

న దేవో విద్యతే కాష్టే న పాషాణో న మృణ్మయే।
భావేహి విద్యతే దేవ
స్తస్మాద్భావో హి కారణమ్ ।।

ఆచార్య చాణక్యుడు ఈ సుభాషితంలో భగవంతుడు భావం వలన మాత్రమే అన్నింటా ఉంటాడు. సామాన్యమైన కర్రలో, రాతిలో, లోహంలో భగవంతుడు సాధారణంగా వశించడు కానీ మనం ఆ ప్రతిమలలో భగవంతుడున్నాడని భావించడం వలన, ఆ ప్రతిమలకు దైవత్వం కలుగుతుంది.

Chanakya Niti – 8/11.

In this Subhashitam Acharya Chanakya says that wooden, stony or metallic statues do not possess the qualities of God on their own but it is the feeling of the devotee which brings in godliness to the statues.

हरिः ॐ।

🕉️🙏शुभोदयः।🙏🕉️

हस्ती स्थूलतनुः स चांकुशवशः किं हस्तिमात्रोऽङ्कुशः
दीपे प्रज्वलिते प्रणश्यति तमः किं दीपमात्रं तमः ।
वज्रेणापि हताः पतन्ति गिरयः किं वज्रमात्रं गिरिस्
तेजो यस्य विराजते सः बलवान् स्थूलेषु कः प्रत्ययः । ।

హస్తీ స్థూలతనుః స చాంకుశవశః కిం హస్తిమాత్రోఽంకుశః
దీపే ప్రజ్వలితే ప్రణశ్యతి తమః కిం దీపమాత్రం తమః ।
వజ్రేణాపి హతాః పతంతి గిరయః కిం వజ్రమాత్రం గిరి-
స్తేజో యస్య విరాజతే స బలవాన్స్థూలేషు కః ప్రత్యయః ॥

విశాలకాయం కలిగిన ఏనుగును అంకుశం తో వశపరుచుకోవచ్చును. పరిణామంలో అంకుశం ఏనుగు కన్నా చాలా చిన్నది. అలాగే గాఢమైన విశాలమైన దగ్గరలోఉన్న చీకటిని ఒకచిన్న దీపంతో పారద్రోలవచ్చును. పెద్దపెద్ద పర్వతాలను సుత్తి ఉలిలతో పడగొట్టవచ్చును. ఆచార్య చాణక్యుడు ఈ ఉదాహరణలద్వారా చిన్నచిన్న వస్తువులతో పెద్దపెద్ద వాటిని వశపరుచుకోవచ్చును కారణం ఆవస్తువుల పదును, తేజస్సు కారణమనిచెబుతూ, శరీరం పెద్దదైన మాత్రాన దానిని బలంగా పరిగణనలోకి తీసుకోరాదని విజయానికి తేజస్సు, వేగమే కారణాలని ఈ సుభాషితంలో తెలియజేస్తున్నారు.

Chanakya Niti – 11/3.

In this Subhashitam, Acharya Chanakya says that size or body does not determine the strength and sharpness and seed determine the control or victory. In support of this view, Acharya cites the examples of an elephant, although huge in size gets controlled with Ankusam, one small lamp drives away darkness (which is thick and large in a room) and mountains big in size are cut with nail and hammer.

हरिः ॐ।

🕉️🙏शुभोदयः।🙏🕉️

सद्यः प्रज्ञाहरा तुण्डी
सद्यः प्रज्ञाकरी वचा।
सद्यः शक्तिहरा नारी
सद्यः शक्तिकरं पयः ॥

సద్యః ప్రజ్ఞాహరా తుణ్డి
సద్యః ప్రజ్ఞాకరీ వచా ।
సద్యః శక్తిహరా నారీ
సద్యః శక్తికరం పయః ॥

ఈ శ్లోకంలో ఆచార్య చాణక్యుడు దొండకాయ త్వరితంగా బుద్ధి నశింపజేస్తుందనీ, అయితే వచా శీఘ్ర మేధస్సును వృద్ధి చేస్తుందనీ, స్త్రీ సంభోగం తక్షణ శక్తిని నాశనము చేస్తుందనీ పాలు తక్షణ శక్తిని కలిగిస్తుందని తెలియజేసేరు.

Chanakya Niti – 17/14.

In this Subhashitam, Acharya Chanakya says that while use of kundru (ivy gourd) immediately destroys the mind, use of vacha sharpens the brain.
While sex with woman reduces the strength, taking of milk gives immediate strength.

हरिः ॐ।

🕉️🙏शुभोदयः।🙏🕉️

व्यालाश्रयापि विफलापि सकण्टकापि
वक्रापि पंकिलभवापि दुरासदापि।
गन्धेन बन्धुरसि केतकि सर्वजन्तो –रेको गुणः खलु निहन्ति समस्तदोषान्।।

వ్యాలాశ్రయాపి విఫలాపి సకణ్టకాపి
వక్రాపి పంకిలభవాపి దురాసదాపి ।
గంధేన్ బంధురసి కేతకి సర్వజన్తో –
రేకో గుణః ఖలు నిహంతి సమస్తదోషాన్।।

ఆచార్య చాణక్యుడు ఈ సుభాషితంలో ఏ వ్యక్తికైనా ఒక మంచి గుణం ఉంటే ఆ గుణం కారణంగా ఆవ్యక్తి కున్న మిగిలిన దుర్గుణాలు కప్పవేయబడతాయి అని చెబుతూ మొగలి పువ్వును
ఉదాహరణగా ఇలా చెబుతున్నారు –
ఓ మొగలి పువ్వా,

నీ చుట్టూ తాచుపాము లు నివసిస్తూ ఉంటాయి, తినే ఫలాలు కూడా ఉండవు, నీ ఆకులకు ముళ్లు ఉంటాయి, పైకి ఎదగలేదు, ఎప్పుడూ బురదలోనే ఉంటావు, ఎవ్వరికీ తేలికగా అందుబాటులో ఉండవు, అయినా, నీ అద్భుతమైన పరిమళం కారణంగా అందరూ నిపట్ల ఆకర్షితులవుతారు.

అందువలన ఒక మంచి గుణం కలిగి ఉంటే ఆ గుణానికి లోకం ఆకర్షితమౌతుంది అని భావము.

Chanakya Niti – 17/21.

Acharya Chanakya says that even if a person possesses one good quality, all other bad qualities in him will be hidden just as Ketaki flower and says as follows :
O ketki flower! Serpents live in your midst, you bear no edible fruits, your leaves are covered with thorns, you are crooked in growth, you thrive in mud, and you are not easily accessible. Still for your exceptional fragrance you are as dear as kinsmen to others. Hence, a single excellence overcomes a multitude of blemishes.

हरिः ॐ।

🕉️🙏शुभोदयः।🙏🕉️

अधः पश्यसि किं वृद्धे !
पतितं तव किं भुवि ।
रे रे मूर्ख ! न जानासि
गतं तारुण्यमौक्तिकम्।।

అధఃపశ్యసి కిం వృద్ధే!
పతతిం తవ కిం భువి।
రే మూర్ఖ! న జానాసి
గతం తారుణ్యమౌక్తికమ్।।

ఆచార్య చాణక్యుడు ఈ సుభాషితంలో మానవులకు ఏమని బోధిస్తున్నారు వృద్ధావస్త అందరికీ వస్తుంది కానీ కొందరు యువకు(తు)లు వృద్ధులను అపహాస్యం చేస్తూ పరాచికములు ఆడుతారు.అది తగదని చెబుతూ ఒక యువకుడు ఒక వృద్ధ మహిళతో చేసిన సంభాషణను ఇలా వివరించేరు –
వంగిన నడుము, సుష్కించి వేలాడుతున్న ముఖమునూ చూసి యువకుడు వృద్ధమహిళను ఓ ముసలిదానా! ఏం పడిపోయింది క్రిందికి చూస్తూ వెతుకుతున్నావు అని అడిగేడుట. అప్పుడు తెలివైన ఆ ముసలిది ఇలా సమాధానమిచ్చిందిట- ఓరీ మూర్ఖుడా! నీకు తెలియదా నా అమూల్యమైన యవ్వన రూప మౌక్తికం పడిపోయింది దానినే వెతుకుతున్నాను అని.

భావము – వృద్ధులను హేళన చేయవద్దు. వృద్ధాప్యం మనకి కూడా వస్తుంది.

Chanakya Niti – 17/20.

In this Subhashitam, Acharya Chanakya advises youth not to make fun of old people as old age phase is bound to happen to everyone.
One youth finding an old lady with bent back and hanging face asks her “He old one, what is lost that you are seeing downwords searching? The old woman being intelligent, replies, hey fool, don’t you know that my invaluable pearl named youth was lost, which I am searching.

Meaning – Everyone one day or other becomes aged, so do not make fun of aged people.

हरिः ॐ ।

🕉️🙏शुभोदयः।🙏🕉️

इक्षुरापः पयो मूलं
ताम्बूलं फलमौषधम्। भक्षयित्वापि कर्तव्यः स्नानदानादिकाः क्रियाः ॥

ఇక్షురాపః పయో మూలం తాంబూలం ఫలమౌషధమ్।భక్షయిత్వాపి కర్తవ్యః స్నానదానాదికాః క్రియాః ॥

నీరు, చెరకు, పాలు, దుంపలు, పాన్, పండ్లు మరియు ఔషధాలను పవిత్ర గ్రంథాలలో వర్ణించారని చాణక్యుడు ఈ శ్లోకంలో చెప్పాడు. అందుకే వాటిని తిన్న తర్వాత కూడా ఒక వ్యక్తి మతపరమైన పని చేయవచ్చు. సాధారణంగా భారతీయులకు నీరు, పాలు, పండ్లు మరియు మందులు పూజ చేసిన తర్వాత మాత్రమే తినాలని నమ్ముతారు, అయితే అనారోగ్యం లేదా మరేదైనా స్థితిలో పాలు, నీరు, పండ్లు, దుంపలు, తమలపాకులు, చెరకు వంటివి తీసుకోవాలని చాణక్యుడు చెప్పాడు. ముందు వీటిని తినడం ద్వారా ఒక వ్యక్తి అపరాధ భావాన్ని పొందలేడని చాణక్యుడు చెప్పాడు. ఒక వ్యక్తి ఈ ఏడు వస్తువులను సేవించిన తరువాత పూజలు మరియు మతపరమైన పనులు చేయవచ్చును.

Chanakya Niti – 8/2.

Acharya Chanakya says that for those who are patients, taking sugar cane, sugar cane juice, water, milk, herbs, pan, fruits and medicines are allowed before taking bath and before performing puja and other rituals and such acts are nottreated as sin and dharma sastras permit such exemptions.

हरिः ॐ।

मनोज पब्लिकेषन्स् ७६१, मेन रोड, बुराड़ी, दिल्ली-८४says:

वह चणक का पुč होनेके नातेचाण·य था।
उसकɥ चालƺशčुकɥ पकड़ मƺनहƱ आती थƱ, अȵत
कुȴटल थƱ, इसीȷलए उसेलोगdž नेनाम ȴदया था—
कौȴटÒय।
वह ȴदखने मƺȹजतना कठोर था, उतना ही
सƗदय भी था। राजनीȵत कɥ ȵबसात पर टेढ़ɣ-मेढ़ɣ
चालdž का Ⱥखलाड़ी होनेपर भी वह स¼चा महाÆमा
था। उसके ȷलए सुख-वैभव, पद आȴद महÆवपूणµ
नहƱ थे
, महÆवपूणµथा देश का अखंड गौरव। अखंड
भारत के उस ×वȈ को साकार करनेकेलिये वह न
कहि रुका, न कहि झुका।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *